Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 21


    చదువు మానను. యశోద కూడా మానదు. కొన్ని కంపెనీలు బాక్సింగ్ పెర్ ఫార్మెన్స్ కండక్ట్ చేస్తున్నాయి. వాటిల్లో పార్టీసిపేట్ చేస్తే మంచి రెమ్యూనరేషన్ ఇస్తారు"
    ప్రసూన చిన్నకేక పెట్టింది. ఆర్తనాదం లాంటిది. దేవిశంకర్ బింకమూ కోపమూ మంచులా కరిగిపోయాయి.

    "వెధవ్వేషాలు వెయ్యకు! నీకు కావలసిన డబ్బు అమ్మ నడిగి తీసుకో. చదువు ఆశ్రద్ధ చెయ్యకు. బాక్సింగ్ లో తిరక్కు. డిగ్రీ తీసుకోగానే నా బిజినెస్ లోకి వచ్చేయ్యాలి" కోపంగా అంటున్నట్లుగా మాట్లాడి విసురుగా వెళ్ళిపోయాడు దేవిశంకర్.
    యశోదకి కన్ను కొట్టి నవ్వాడు వివేక్.
                                     * * *
    "గుడ్ మార్నింగ్! డాక్టర్"
    చిరునవ్వుతో విష్ చేసింది యశోద. తన కన్సల్టింగ్ రూంలో టేబిల్ మీద రకరకాల కేసెట్స్, ఫైల్స్. టేప్ రికార్డర్ పరుచుకొని ఉన్నాయి. వాటితో సతమతమవుతూ వున్న అనంత పద్మనాభస్వామి ఉలిక్కిపడినట్లయ్యాడు.
    "గుడ్ మార్నింగ్! గుడ్ మార్నింగ్..... మీరు....."
    "అయామ్ మిసెస్ వివేక్!"  
    కుర్చీ ముందుకు లాక్కుని కూచుంది. "కూచో!" అని మర్యాదలు చేసే మూడ్ లో కనపడలేదు.

    "మిసెస్ వివేక్? ఓ! మిసెస్ వివేక్!"ఏదో అర్థం కాని విషయం డైజెస్ట్ చేసుకుంటున్నట్లు అన్నాడు.    

    "వివేక్! మీ పేషెంట్........"
    "నాకు తెలుసు! నాకు తెలుసు!" కంగారుగా అన్నాడు.
    తన పేషెంట్స్ ని మరిచిపోయినట్లు ఎవరైనా అనుకోవటం ఇష్టం ఉండదు. అన్ని విషయాలూ గుర్తుంటాయని అతని నమ్మకం.
    చెప్పాడు. పెళ్ళీ చేసుకుంటున్నానని కంగ్రాట్స్."
    "నేను వివేక్ ప్రోబ్లం మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను"
    "వివేక్ ప్రోబ్లం......" ఆగాడు యశోద అందిస్తుందేమోనని. వెంటనే చెప్పలేకపోయింది యశోద....
    "అన్నట్లు అడిక్ట్ కదూ!......" అన్నాడు ఉత్సాహంగా.
    ఇటీవలి అతడి పేషెంట్స్ లో అడిక్ట్స్ ఎక్కువగా ఉన్నారు.
    "కాదు!"
    "అవును. కాదు.... అతడు.... అతడికి....."
    డాక్టర్ చెయ్యి ఫైల్స్ వైపుకి వెళ్ళింది.  
    అతడు అతడికి...... శారీరకంగా ఏ లోపమూ లేదు. అయినా దాంపత్యజీవితంలో..... సంసారమంటే భయపడుతున్నాడు.
    ఎలాగో ముగించి వెంటనే గుర్తుకొచ్చింది అతడికి. వెంటనే తనదగ్గరున్న కేసుల్లో ఒక కేసుల్లో అలాంటి ప్రత్యేకత ఉన్నది ఈ కేసు ఒక్కటే.
    "అవునవును!" అని ఆగిపోయాడు. ఆ తర్వాత మాట్లాడడానికి డాక్టర్ సహితం నర్వస్ గా ఫీలయ్యాడు.   

    "అయ్ హప్ నౌ, యూ బోత్ ఆర్ హాపీ" అన్నాడు.  
    "వియ్ ఆర్ హాపీ! బట్ ద ప్రోబ్లం ఈజ్! నాట్ సాల్వ్ డ్ !" అంది నవ్వుతూనే.

    "ఓ! అంటే. ఓ! ఓ!" అన్నాడు నర్వస్ గా. కొన్ని సెకండ్లు మౌనంగా గడిచాయి.
    "డాక్టర్! అతనికి ఆ సమయంలో సలసల కాగుతున్న నూనె మూకుడు, కణకణమండుతున్న అగ్ని స్థంభం, అగ్నిజ్వాలల్లో మనసు ముందుకొస్తున్నాయట! అంచేత మనసువశం తప్పుతోంది."

    "వ్వాట్!" నిజంగా ఆశ్చర్యపోయాడు. గబగబా వివేక్ ఫైలు తీసి దాదాపు అరగంట అతడి కేసుకు సంబంధించిన వివరాలన్నీ చూశాడు. సహనంగా కూచుంది యశోద.
    ఈ విషయం అతను నాకు ఎప్పుడు చెప్పలేదు. ట్రాన్స్ లో మాట్లాడించినప్పుడు కూడా నాకు ఇవి బయటికి రాలేదు" అన్నాడు డాక్టర్.  
    "ఆశ్చర్యంగా ఉంది."
    "బహుశః బహుశః మరే అమ్మాయితోనూ అతడు ఇంతవరకూ వచ్చి ఉండకపోవచ్చు. ఇలాంటి దృశ్యాలు అతడి మనసు ముందుకి రావటం కూడా ఇదే మొదటిసారి కావచ్చు."
    మాట్లాడలేదు యశోద. మరికొన్ని సెకన్లు మౌనంలో గడిచాయి.


    "వివేక్ చాలా మంచివాడు!" డాక్టర్ అన్నాడు.


    "ఆ విషయంలో నాకు సందేహం లేదు!"


    "వెరీ బ్రేవ్ బోయ్!"


    అతనికి కొంచం కో-ఆపరేషన్ కావాలి అంతే!"


    ఆ ఆపరేషన్ చెయ్యటానికి నేను సిద్ధంగా ఉన్నాను.....!"    


    "థాంక్యూ!"


    "మీరు నాకు థేంక్స్ చెప్పక్కరలేదు డాక్టర్!. ఇది నా సమస్య కూడా! అయామ్ లవ్ హిమ్"


    డాక్టర్ మొహంలో సంతృప్తి కనిపించింది.


    "అతడి మనసు ముందుకు వచ్చిన దృశ్యాల గురించి ఆలోచించారా?"


    "గతంలో ఎప్పుడైనా...... అలాంటివి ఏమైనా......" నవ్వాడు డాక్టర్.


    "అదికాదు! ఆ దృశ్యాలన్నీ హిందూ ఫిలాసఫీ ప్రకారం పాపులకి నరకంలో విధించే శిక్షలు!. సలసల మరుగుతున్న నూనెలో పారెయ్యటం, కణకణ మండే స్థంభాన్ని కౌగిలించుకోమనటం..... వగైరా. అంటే ఇది పాపమనే భావనవల్ల."  
 

    "ఓగాడ్! ఈ ఆధునిక కాలంలో ఇప్పటికీ? ఇంకా.... పోనీ. ఇది పాపం కాదని నచ్చజెప్తే...."


    ఏమి ప్రయోజనం ఉండదు. మెంటల్ డిస్టర్బెన్స్ కి లింక్ అంత డైరెక్ట్ గా ఉండదు. డైరెక్ట్ గా ఉండే డిస్టర్బెన్స్ ని ఎవరివివాళ్లే సర్దుకోగలరు. కాస్త వివేకం ఉంటే... వివేక్ సెక్సువల్ ఎమోషన్స్ కి అతని మనసులో అజ్ఞానంగా ఉన్న పాపభీతికే ఏదో ముడి ఉంది. అది తెలుసుకోగలిగితే సమస్య విడిపోతుంది.

    సాధారణంగా ఇవి పూర్తిగా జ్ఞానం వచ్చీరాని బాల్యదశకి సంబంధించి ఉంటాయి. ఈలోగా మీరు అతడిని 'ట్రెడిషనల్ ఇన్హిబిషన్స్' నుంచి విముక్తుడ్ని చెయ్యటానికి ప్రయత్నించండి."

 Previous Page Next Page