Home » Kommuri venugopala rao » Mahaapravaaham

                                   
    శకుంతల విజయవాడకు చేరుకుని సత్యనారాయణపురంలో చిన్న యిల్లు అద్దెకు తీసుకుంది. పిల్ల లిద్దర్నీ స్కూల్లో చర్పించింది. తన పిల్లలు బాగా చదవాలి. పైకి రావాలి. పెద్దపెద్ద ఉద్యోగాలు చెయ్యాలి.


    " పేపర్ల నిండా విద్యాసంస్థల గురించి పెద్దపెద్ద ఎడ్వర్ టాజ్ మెంట్లు ఊరినిండా వీధికి వొప్పునగకొన్ని వందల పాంప్లెట్లు.


    యూనిఫాంలు ,అట్టహాసాలు, ఫీజులు, ఎడ్వాన్స్ లు, డబ్బు, ఒక చిన్న యింట్లో నలభయి ఏభయిమంది పిల్లలతో ఓ స్కూల్ స్టార్ట్ చేసి దానికి కాన్వెంట్ అని పేరు పెడతారు. పాఠలు చెప్పడానికి టీచర్లు కూడా సరిగ్గా వుండరు. ఫీజులు మాత్రం ధారాళంగా వుంటాయి. చేరినప్పట్నుంచీ ఫీజులకోసం ప్రాణాలు కొరుక్కుతింటూ వుంటారు.


    పాఠాలు  బాగా చెప్పే పెద్దపెద్ద  పబ్లిక్ స్కూల్స్ వున్నాయిగానీ, అంతంత మాత్రం వాళ్ళకి అక్కడ సీట్లు దొరకవు.


    శకుంతల యీ పరిస్థితులన్నీ చూసింది. ఏదో ఓ మాత్రం స్కూల్లో చేర్పించి అవకాశనున్నప్పుడల్లా ఇంట్లోనే తాను ప్రయివేట్ చెప్పసాగింది.


                           *    *    *    *

        
    శకుంతల వుంటోన్న ఇంటి యజమాని వైకుంఠంగారు. ఆయనకు అరవైఏళ్లు దాటాయి. పిల్లలందరికీ పెళ్ళిళ్ళయిపోయి ఎవరిదార్న వారన్నారు.కొడుకులు వేరే వూళ్ళలో ఉద్యోగాలు చేసుకొంటున్నారు. ప్రస్తుతానికి యిక్కడ ఆయన, భార్య యిద్దరే వుంటున్నారు రిటైరయాక వచ్చిన డబ్బుతో యిప్పుడుంటోన్న యిల్లు నాలుగయిదు పోర్షన్లు వుండే ఇల్లుగా కట్టించాడు. పదిహేను వందలదాకా  అద్దెలు వస్తూంటే, వాటితో కాలక్షేపం చేస్తున్నారు.


    వైకుంఠంగారు సౌమ్యుడు . పరోపకారిబుద్ధి కూడా వుంది.  ఎందుకో శకుంతలకు ఆయన నమ్మబుద్ధికల మనిషిగా కనిపించాడు. ఒక రోజు ఆయన్తో తన భవిష్యత్ గురించీ, తన ఆలోచినలూ కూలంకషంగా చర్చించింది.


    వైకుంఠంగారు కూడా చాలా  చిత్తశుద్ధితో మాట్లాడాడు.


    "ఏ బిజినెస్ అయినా  పూర్వంలా లేదమ్మా." అన్నాడు "ప్రతి వ్యాపారాస్థుడ్నీ దొంగల్లా చూస్తోంది ప్రభుత్వం .అడుగడుక్కీ అనుమా నిస్తూ ఆంక్షలు విధిస్తూ ఊపిరి సలపనివ్వకుండా పీల్చి పిప్పి చేస్తోంది. అసలే- వ్యాపారస్థులంటే లక్షలకు   లక్షలు సంపాదించేవాళ్ళనీ,డబ్బు సంపాదన కోసం ఎంత గడ్డయినా తింటారనీ ప్రజల్లో ఓ దురభిప్రాయముంది. వాళ్ళు మొదలుపెట్టిన పెట్టుబడి గురించీ, ఆ  పెట్టుబడి పెట్టటానికి వాళ్లు పడిన యిబ్బందుల గురించీ, చేసిన అప్పుల గురించి ఎవరూ ఆలోచించరు  ఓ చిన్న షాపు తల తాకట్టు పెట్టి ఆవలంభిస్తే లేబరాఫీసువాళ్లు , మునిసిపాలిటీవాళ్ళు , కమర్షియల్ టాక్స్ వాళ్లు యింతమంది అడుగుక్కీ వచ్చి జబర్దస్తీచేస్తూ వుంటారు. వాళ్ళ మామూళ్ళు , లంచాలు- ఎప్పుడూ యి టెన్షన్ తోనే సరిపోతుంది. పైగా కాంపిటేషన్ .ఒకడు కొంచెం బాగుపడుతున్నాడనిపిస్తే వెంటనే ఆ ప్రక్కనే దానికి సంబంధించిన దుకాణమే వెలుస్తుంది. ఏ దిక్కులేని ఆడదో ఓ రుబ్బుడు మిషన్ పెట్టుకుని రోజుకి పాతికో, ముఫ్పైయ్యో సంపాదించుకుంటూన్నదనుకొంటే వెంటనే ప్రక్కనే యింకో  రుబ్బుడు మిషన్ వాడూ బాగుపడడు.యింకోడ్ని బాగుపడనివ్వడు. దానికితోడు యి కస్టమర్స్ వున్నారే- వినియోగదారుల హక్కుల అంటూ అయిదు పైసలు తేడావస్తే ఆసహ్యంగా మాట్లాడి నానా గొడవా చేస్తారు. ప్రతి కస్టమరూ తాను చాలా గురవుతున్నావనీ అనుకుంటాడు. అసలు లాభం లేకుండా వ్యాపారమెందుకు చెయ్యాల్సిన అవసరమేముంది అని ఆలోచించడు ప్రతి వినియోగదారుడూ చేస్తోన్నవాడే. తన సొంత సమస్యలే సమస్యలు అనుకుంటాడుగానీ, ఎదుటివార్ని కూడా సమదృష్టితో తీసుకోవాలన్న దృష్టి అతని కుడందు. పైగా తప్పు లెంచటానికి ప్రయత్నిస్తూ వుంటాడు. ఒక అంశంమిద అతనికున్న అవగాహన- యితరుల్లో తప్పు లెంచటానికి ఉపయోగిస్తాడు గానీ, సహనంతో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడు."


    "కాని నేనేదో ఒకటి చెయ్యాలి బాబాయిగారూ!చెయ్యక తప్పదు."


    వైకుంఠంగారు చాలా దీర్ఘంగా ఆలోచించాడు.


    "అలా గేనమ్మా. తప్పకుండా ఏదో ఒకటి నాతో చేయి స్తాను" అన్నాడు.


                         *    *    *    *

            
    శకుంతల ఓ అగ్ని పర్వతం రగుల్తోంది. ఏదో ఒకటి  చెయ్యాలి . పైకి కావాలి.


    జీవితాన్ని సాధించాలి.


    వైకుంఠంగారు చెప్పిన మాటలన్నీ ఆమె మనసులో మెదల్తున్నాయి.


    బయటకుపోయి ఎవరెవరు ఏమేమీ చేస్తున్నారో గమనించసాగింది.


    మొదట చిన్న స్కూల్ గాని, ట్యూటోరియల్ స్కూల్ గానీ పెడదామా అనుకుంది. వెంటనే స్కూల్స్ గురించి తాను చెడ్డగా ఆలోచించిన సంగతి గుర్తుకొచ్చి నవ్వుకుంది. ఒక మనిషి దూరంగా నిల్చుని చూస్తున్నప్పుడూ, అవసరమొచ్చి రంగంలోకి దిగినప్పుడూ ఎంత తేడాగా ప్రవర్తిస్తాడు!  ఈస్కూల్స్ గురించి కొన్నిరోజుల క్రితమే తాను చెప్పగా ఆలోచించింది. తనవరకూ వచ్చేసరికి - ఓ స్కూల్ పెడితే తప్పేమిటన్న ధోరణిలోకి వచ్చింది."


    డబ్బంటే ఏమిటో ఆమెకు క్రమక్రమంగా తెలిసి వస్తోంది.


    కొన్ని సంవవత్సరావల క్రితం వరకూ మనిషికి తాను సంపాదించుకునే ది సరిపోయేది.అప్పుడు ధరలూ, టాక్సులూ దైనందిన అవసరాలకు సంబంధించిన అవసరాలు ఓ పరిధిలో వుండి- మనిషికి వ్యాపారదృష్టి ముఖ్యమయేది కాదు. ఇప్పుడు ప్రతీదీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.ఎంత సంపాదించినా మనిషి కనీసపు అవసరాలకి కూడా సరిపోవటంలేదు. పాలు పంచదార,బియ్యం, పప్పుదినుసులు, నూనె, పెట్రోలు, ఇవ్వవలసిన జీతాలూ అన్నీ శక్తిమించి పెరిగిపోయాయి. అందుకనిబ్రతకాలంటే వ్యాపారదృష్టి అవసరమై తీరిక రోజులొచ్చే శాయి. శ్రీరంగనీతులూ, పనికిమాలిన వ్యర్ధపు టాలో చనలూ- మనిషిని వెనక్కిలాగి  కష్టాల ఊబిలో కి పడెయ్యటమే తప్ప వాటివల్ల ప్రయోజనమేమి లేదని అర్ధం చేసుకుంది.


    మనిషి  బ్రతకడానికి ఎన్ని  అవస్థలు పడుతున్నాడు? రోజుకు ఏడుగంటలు పనిచేస్తే అతని పొట్ట గడవదు. పధ్నాలుగు గంటలు పనిచేస్తే గాని కొంతవరకూ అతని అవసరాల దరిదాపుల్లోకి రాలేకపోతున్నాడు.


    ఒక వ్యక్తీ రుబ్బుడు మిషనో , రోకళ్ళ మిషనో పెట్టుకున్నందంటే, రోడ్డు ప్రక్కన కూచుని అట్లు పోసుకుంటూన్నదంటే మానసికంగా ఆర్థికంగా ఎంత మ్రగ్గిపోతే ఆపని చేస్తుంది?


    కిల్లీ కొట్ల మిద కూచున్న ఆడవాళ్ళని , సోడా నిషన్ పెట్టుకుని ,ఎండల్లో మొహాలకు చట్రకం అడ్డు పెట్టుకొని గ్యాస్ ఎక్కించే ఆడవాళ్ళని... వాళ్ళ విషాదచరిత్రల్ని, పొట్టలు గడవటం కోసం వంటలు చేయటానికి బయల్దేరిన ఆడవాళ్ళని.... ఎవరు సానుభూతిగా చూడగలుగుతున్నారు?


    అసలింతకీ తానేం చెయ్యాలి?


    ఏ వ్యాపారం పెట్టాలి?


    రోడ్డుమిదికి వెడితే టి.వి.లూ. రేడియోలూ, బట్టలు కొట్లూ- కళ్లు మిరుమిట్లు గొల్పుతూ ఎన్నో రకాల దుకాణాలు దర్శన మిస్తాయి. శకుంతల ఒక సత్యం  అర్థం చేసుకుంది. మనిషికీ ఏం వున్నా లేకపోయినా  తిండిమిద వ్యామోహం, బట్టలమిద మమకారం- యీ రెండూ తప్పించుకోలేడు. తిండికి సంబంధించిన ఏ వ్యాపారంగానీ, అది పళ్ళకొట్టో , రకరకాల చిరుతిళ్ళు అమ్మేతోపుడుబండినో , మిఠాయికొట్టో, కాఫీ హోటల్ అయితే అది సక్రమంగా సాగిపోతూండటం గమనించింది.


    ఆ సాయంత్రం వైకుంఠంగారితో చర్చించింది.


    " నీ పరిశీలన కరక్టే అమ్మా. మనిషి తిండికోసం  వున్నదాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టటానికి వెనుదియ్యడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra