Home » D kameshwari » Sikshaw


    "ఊరుకో రజియా" అంటూ ఓదార్పుగా దగ్గిరికి వెళ్ళబోయాను. ఒక్కక్షణంలో జరిగిన ఈ సంఘటనని ఆశ్చర్యంగా రజియా అన్న తెలివితెచ్చుకుని "రజియా లోపలికి వెళ్ళు" అన్నాడు కఠినంగా రజియా అన్న కోపానికి కాస్త బెదురుతూ నన్ను చూసి ఏదో అనబోయింది "పట్నంలో వేసిన వేషాలు చాలు చదవువంకతో చేస్తున్నపని యిదన్న మాటయింక యింట్లోకినడు." రజియా కలవరపడ్తూ నాకు అవమానం జరుగుతుందన్న భయంతో నావంక అన్న వంక చూస్తూ భయ్యా అంటూ ఏదో అనబోయింది" అయ్యా తమరెవరో యింక వచ్చినపని అయింది వెళ్ళండి రజియాని చూశారుగా యింక కదలండి" అన్నాడు కరకుగా లేచి నిలబడి. రాజియనై లోపలికి తోసి సిగ్గు ఎగ్గు లేకుండా మగవాళ్ళముందు నిలబడ్తావేం యింక, అసలు నిన్నుకాదు అనాల్సింది అమ్మను అనాలి, ఊ లోపలికి వెళ్ళు అంటూ తోశాడు రజియా బిక్కచచ్చిపోయి నిస్సహాయంగా నావంక చూసి వణుకుతున్న చేతులతో నాకు నమస్కారంచేసి ఉబుకుతున్న కన్నీళ్ళతో లోపలికి పరిగెత్తింది. అంతటి నిస్సహాయస్థితిలో రజియాని యీ కసాయివాడికి అప్పగించి ఎలా వెళ్ళను అన్పించింది యింకేం ఆలోచించకుండా మొండిధైర్యంతో "రజియా ఒక్కక్షణం వుండు నీతో మాట్లాడాలి" అంటూ రజియా వెంట గబగబలోపలికి వెళ్ళాను రజియా అన్న విసురుగా 'ఏయ్-ఆగు' అంటూ నా వెనక రావడం చూసి రజియాగది తలుపు గడియ పెట్టేశాను. రజియా విస్తుపోతూ భయ వికృతయి నోటిమాట రాకచూస్తూ వుండిపోయింది. రజియా అన్నపైనించి తలుపులు బాదసాగాడు రజియా తేరుకుని" ఇదేమిటి, తలుపులుతీయండి ముందు లేకపోతే మా అన్నయ్య నన్ను, మిమ్మల్ని చంపేస్తాడు అంది గాబరాగా "ఫరవాలేదు, ఒక్కమాట చెప్పనీ రజియా నీగురించి రమ అంతా చెప్పింది. మీ అన్న ఎలాంటివాడో చూస్తూ నిన్నింక నిస్సహాయస్థితిలో వదిలి వెళ్ళలేదు. నీ చదువుకయ్యేఖర్చు నేను భరిస్తాను. నీవు మీ అన్నతో వెళ్ళొద్దు. నాతో వచ్చేయి చదువుకుంధువుగాని, నీకేం భయంలే నిన్ను ఆ మాత్రం ఆదుకోగలను పద వెంటనే నిన్నీ నరకంనుంచి తీసికెడతాను" అన్నాను తొందర తొందరగా రజియా తెల్లపోతూ అర్ధంగానట్టు చూసింది. పైనించి తలుపులు బాదడం ఎక్కువయింది.
    "రజియా, ఆలోచించేందుకు టైమ్ లేదు. పద, మీ అన్నతో చెప్పి తీసికెడతాను."
    "వద్దు వద్దు మా అన్న వప్పుకోడు నా ఖర్మానికి నన్ను వదలండి మీరు సహాయంచేద్దామన్నా మా అన్నయ్య అంగీకరించడు నా మూలంగా మీకీ బాధఎందుకు? వెళ్ళిపోండి. చూడండి తలుపులు విరగొడుతున్నాడు నన్నెలాగూ వదలడు మీరయినా అవమానం పొందక ముందే వెళ్ళిపోండి" భయంగా అంది అంత భయంలోనూ రజియా కళ్ళు నా పట్ల కృతజ్ఞతని చూపించాయి. "అరె బద్మాష్ తలుపుతీయి బయటికి రా నిన్ను జైల్లో పెట్టిస్తా ఊ అరే లుచ్చా ఆడవాళ్ళ గదిలో జొరపడ్తావా' రజియా అన్న బండబూతులు తిడుతూ తలుపులు బాదుతున్నాడు బయట చాలామంది చేరారని గోల తెలియ చెపుతుంది .......రజియాకి భయంతో చెమటలుపట్టాయి. "ఏం పని చేశారు మీరు ..... యిప్పుడు ఇంక అన్న నన్ను బతకనీయడు రజియా ఏడవసాగింది కరిగిపోయాను. దగ్గరికి వెళ్ళి భుజంమీద చెయ్యివేశాను ......... రజియా కళ్ళెత్తి చూసింది. 'రజియా ...... నీకేం భయంలేదు - నేనున్నాను నా వెంట తీసికెడతాను'
    "మీరు ....... మీరెవరని నన్ను ఆదుకుంటాఋ అంతా ఏం అంటారు? అన్నయ్య మాత్రం మీవెంట పంపడానికి ఎలా వప్పుకుంటాడు. మీకు నేనేం అవుతానని నా మీద యింతదయచూపిస్తారు. వద్దు వెళ్ళిపొండి నాఖర్మకి నన్ను వదలండి" అంటూ ఏడవసాగింది. రజియా అలా ఏడుస్తుంటే సహించలేకపోయాను. రజియా భుజం మీద వున్న నా చెయ్యి నాకు తెలియకుండానే రజియా భుజం చుట్టూ తిరిగి ఆమెనిదగ్గరకు లాక్కుని రజియా ....... యిటు చూడు నీకు నేనేం కానా నాకళ్ళల్లోకి చూచిచెప్పు ఆ మాట. "ఏం చేస్తున్నానో, ఏం అంటున్నావో తెలియని ఆవేశంతో రజియాని గుండెలకి హత్తుకుని రజియా నీవు నాకుకావాలి రజియా నీవులేని లోకం నాకులేదు-నీకోసం ఏమయినా చేస్తాను నిన్ను నరకంలో వదిలి నేనెలా నిశ్చింతగా ఉంటాననుకున్నావు. పద ఇద్దరము వెళ్ళిపోదాం" అన్నాను ఆవేశంగా రజియా ఆశ్చర్య చకితురాలై 'మీరు మీరు' అంది నా చేతుల మధ్య వణికిపోతూ "అవును రజియా ఇన్నాళ్ళుగా నా మనసులో మెదిలేమాట చెప్పే సందర్భం యిలా ఈ సందర్భంలో జరపబడుతుందని అనుకోలేదు అంతే. నిన్ను పెళ్ళి చేసుకుంటాను రజియా" అన్నాను రజియా కళ్ళనించి టపటప నీళ్ళు జారిపడ్డాయి అవి ఆనందభాష్పాలా! చటుక్కున నా గుండెలమీదికి వరిగిపోయింది 'రజియా' అదేసమయంలో తలుపు విరిగిపడింది రజియా అన్న, ఇంట్లో వాళ్ళు యిరుగుపొరుగు అంత గుమ్మిగూడి, వాళ్ళందరూ మమ్మల్ని చూసి ఒక్కక్షణం నిశ్చేష్టులై ఉండిపోయారు. రజియా అన్న తేరుకుని బుసలుకొడ్తూ ముందుకు వురికాడు. ఎదుర్కోబోయే యుద్దానికి సన్నిద్దన్నవుతూ రజియా భుజం చుట్టూ చేయి వేశాను ధైర్యం చెప్తూ రజియా భయంతో వణికిపోతుంది 'బద్మాష్, పుండాకోర్- నీకెంత ధైర్యం మాయింట్లో చేరి మా ఆడవాళ్ళమీద చెయ్యివేస్తావురా చూడు నిన్నేం చేస్తానో," అంటూ ముందుకు వురికి రజియాని నా నుంచి మోటుగాలాగి బండబూతులు తిడ్తూ రజియా జుట్టు పట్టుకుని" అసలు దీన్ని చంపలి ముందు చదువుపేరుతో చేస్తున్నపని యిదన్నమాట అన్నాడు. వెంటనే నేను ముందుకు వరిగి రాజియాని నా వైపుకు లాక్కుని "ఆగండి, రజియాని ఏమి అనద్దు- ఏమన్నాచేస్తే మాటదక్కదు. జాగ్రత్త" గంభీరంగా అన్నాడు.
    "ఎవడివి రా నీవు రజియా మొగుడివా నన్నే బెదిరిస్తున్నావు."
    "అవును - రజియాని నేను పెళ్ళి చేసుకుంటాను. రజియా ఇప్పుడు నాతో వస్తూంది. స్థిరంగా అని - పద రజియా వెడదాం" అన్నాను గంభీరంగా రజియా అన్న ఏమిట్రా పెళ్ళి చేసుకుంటావా- ఎవడ్రానీవు రజియా ఎవరో తెలుసా- నాచెల్లెలు ఇంట్లోంచి కదిలిందోపళ్ళు విరగ్గొడతా - పద లోపలికి నీపని చెపుతా -అంటు మళ్ళి కలియబడ్డాడు - ఏయ్ మిష్టర్ ఇందాకటినుంచి చూస్తున్న చదువుకున్న వాడిలా ప్రవర్తించటం లేదు. కాస్త మర్యాద యిచ్చి మాట్లాడు- రజియా నీ చెల్లెలు అవచ్చు గాని రజియా నా కాబోయే భార్య కూడా అన్న విషయం మరిచిపోకు రజియా మైనారిటీకాదు. ఆమె ఇష్టంవచ్చిన పెళ్ళి చేసుకొనే హక్కు ఆమెకుంది. ఇద్దరం రిజిష్టర్ ఆఫీసులో పెళ్ళిచేసుకుంటాం. మాపెళ్ళి కాదనే అధికారం నీకు లేదు. అనవసరంగా గొడవచేస్తే పోలీసులను పిలిచి ఆమెని హింసిస్తున్నావని చెప్పి జైల్లో తోయిస్తా జాగ్రత్త నాదారికి అడ్డు రాకు - మర్యాదయిచ్చి పుచ్చుకో, నీచెల్లెలి మీద, ఆమె భవిష్యత్తుమీద అంత శ్రద్దా శక్తులువుంటే వచ్చి పెళ్ళి జరిపించి ఆశీర్వదించి వెళ్ళు-అంతకంటే రజియా మీద నీకూ హక్కులేదు. దారివదులు-తీక్షణంగా అన్నాను-రజియా అన్న కోపంతో ఏదో అనబోతుంటే బంధువు కాబోలు ఎవరో ముసలి అతను ముందుకు వచ్చి అతని భుజంపట్టుకుని ఆపుతూ "ఆగు నసీర్, తొందరపడకు అసలుసంగతి తెల్సుకుందాం,' అంటూ శాంతపరిచాడు. నా వంక తిరిగి అసలు నువ్వెవరు "రాజియాకి నీకు సంబంధం' ఏమిటి నీ వూరు పేరు అన్నీ చెప్పు" అన్నాడు ముసలతను. నేను క్లుప్తంగా నా గురించి నా చదువు, రాజియాతో పరిచయం చెప్పి రజియా నేను ప్రేమించుకున్నాం, పెళ్ళి చేసుకుంటాం అని చెప్పాను. ముసలతను అంతా విని రజియా ముస్లిమ్ నీవు హిందూ ఈ పెళ్ళి జరుగుతుందనుకున్నావు నీ వాళ్ళు ఒప్పుకుంటారా అసలు రజియాని నీవు పెళ్ళి చేసుకుంటావని మాకేం నమ్మకం?" అనుమానంగా అడిగాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra