Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 20


    డబ్బుతో ఏ వ్యవస్థనైనా అదుపుచేయొచ్చన్న సత్యాన్ని యేనాడో గ్రహించిన మిత్ర ఇలాంటి  ఆపరేషన్స్ ని అద్భుతంగా ఆర్గనైజ్ చేయడంలో అప్పటికే చాలా అనుభవాన్ని సంపాదించాడు. కాని తమ ఓ పథకంలో చిక్కుకుంటున్నాడని ఊహించలేకపోయాడు.
    

     పడవలు ఇక ఒడ్డున చేరుకుంటున్నాయనగా హఠాత్తుగా హోరుమంటూ ముందు ఓ రొద  వినిపించింది.ఒకటి కాదు, రెండుకాదు, సుమారు  నాలుగు పోలీస్ వేన్స్ దూసుకురావడంతోపాటు, అతను చూస్తుండగా సాయుధులయిన పోలీసులు  ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

 

     డైరెక్టరేట్ రెవిన్యూ దృష్టి కన్ సైన్ మెంచ్ మీద లేదు. ఇలాంటి వ్యవహారాలలో ముందు తప్పించుకోవాల్సింది వ్యక్తులు ఓ చిన్న  ఆధారం చాలు తానున్న వ్యవస్థ కూలిపోవడానికి.    

 

    "రన్ ఎవే!" ఆదేశం అందచేసిన మిత్ర ఓ మూల వున్న కాంటెస్సాని  చేరుకోబోయాడు.
    


     తుపాకీ తూటాల మోతతో నిశ్శబ్దం చెదిరిపోయింది. అరుపులు, కేకలు... కమోషన్ తో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది.    

 

     కారును చేరుకునే అవకాశమివ్వకుండా పోలీసులు అటుగా పరుగెత్తుకొస్తున్నారు.

 

    రెండుపక్కలా తూటాల మోత ఉధృతమైంది.ఎన్ కౌంటర్ లో గాయపడిన ఓ అనుచరుడు పోలీసులకి చిక్కాడు.అదే ఇసుకతిన్నెమాటునుంచి మిత్ర చివరగా చూసింది.    

 

      తొలిసారి దారుణంగా ఫెలయ్యాడు. దానికి తన ముఠాలోని   ఓ   వ్యక్తి ముందు అందించిన ఇన్ ఫర్మేషన్ అన్న వాస్తవం అతనికి తెలీదప్పటికి.
    


     ఆ ప్రదేశం నుంచి తప్పించుకున్న మిత్ర వూహించలేదు. ' డీ. ఆర్ .ఐ. అధికారులతోపాటు ఎ.ఎస్.పి.  మేనక  తన బలగంతో అక్కడకు రావడం మాత్రమేకాక ఆ  కారుని గుర్తించింది. అంతే! ఆమెకు  మిస్సయిన ఓ లింకు దొరికుపోయింది.

 

    పగిలిన అద్దాలనో కనిపిస్తున్న కాంటెస్సా చిట్లిన ఆమె మనసు పొరలకి అద్ధం పడుతున్నట్టుగా ఉంది.

 

    ఇది నిజం కాకూడదు. కాకపోతే బాగుండును- అనుకుంటూనే దొరికేకా  అనుచరుణ్ని కసితో గుండెమీద తన్నింది.

 

    " చెప్పు.... ఎవరు... ఎవడు   నీ బాస్?"

 

    ముందు పెదవి  విప్పలేదు.    

 

     ఆమె పిచ్చిదైపోయింది.అరనిముషం పాటు ఇసుకలో ఉన్మాదంగా బాదేసింది.


    
     "మిత్ర.... "  చెప్పాడు  నీరసంగా.

 

     గుండెనుంచి  ఎగజిమ్మిన రక్తం ఇప్పుడు   నీటిబాటై ఆమె కనుకొలనుల్లో నిలిచింది.

 

    "ఎందుకు మిత్రా,ఇన్నాళ్ళు తర్వాత  నాకెందుకిలా పరిచయమయ్యావు? అర్థంకావడం లేదని నీ గురించి భయపడుతున్న నాకు ఇలా ఎందుకు అర్థమయ్యావు?"
    


     ఆ రాత్రి మేనక నిద్రోపోలేదు .ఎన్నో నిద్రరాని కాళరాత్రులకిది తొలిరాత్రి అని ఆమెకు తెలీదు.

 

    కళ్ళనుంచి నీళ్ళూ రక్తాశ్రువులై చింది, మనసుని మెలిపెడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోయింది.బ్రతుకు అధ్యాయం ఓ ఊహించని మలుపు తిరిగిపోయింది.

 

    ఒకనాడు న్యాయం, చట్టం అంటూ  మాట్లాడి తననూ ఆ పునాదులపైన నడిపించి నిలబెట్టిన మహోన్నతడనుకున్న వ్యక్తి ఇప్పుడు నేరస్థుడుగా తన ముందు నిలబడ్డాడు.
    


    మోకాళ్లపైన  తలానించుకువి నేలపైన మెరుస్తున్న అశ్రుబిందువుల్ని  చూసుకుంటూ ఉండిపోయింది.

 

    " ఒక నిశ్సబ్దం ప్రపంచాన్నై బ్రతుకుతున్న నాలోకి  ప్రవేశించి సంధ్యా గగనం పైన ఎర్రని ఆందోళనలా నన్ను చైతన్యవంతురాల్ని చేసిన  మిత్రుడా! ఇప్పుడు నేనేం చేయాలి? చెదిరి విరిగిన సముద్ర కెరటంగా నన్ను మార్చి, నీ ఉనికిని ఓ మధుర  కాశ్మీరాంబరంగా కప్పుకోవాలనుకున్న నాకెందుకిలాంటి శిక్ష విధించావు? ఉత్తర ధ్రువాన ఒక పాదాన్నీ, దక్షిణ  ధ్రువాన మరో పాదాన్నీ ఉంచి,  నువ్వు నేర్పిన ఆదర్శంతో నీపైన గెలిచి ఓడనా? లేక కోరని రత్నాల వెంపర్లాటలో ఈదలేని పసిఫిక్ లోతుల్లో కి దూకి బ్రతుకునుంచి పారిపోనా?"

 

    తెల తెలవారుతుండగా లేచింది.

 

     నిలుపుటద్దంలోని రూపం దారుణంగా తనను పరిహసిస్తుంటే మూల రోబా లోని యూనిఫారం తవన విధిని గుర్తు చేస్తూంది.

 

    ఖాకీ షర్టుపైన ఐ.పి.ఎస్. బేడ్జి, వెబ్ లేన్యార్డా్ రిబ్బన్స్ . ఓమూల ఐ.పి.ఎస్. లో అత్యధిక మార్కులు సాధించిన గుర్తుగా ఇచ్చిన బియస్సెఫ్ ట్రోఫీ.

 

     అయిదే అయిదు నిముషాల్లో తయారైంది.

 

     టిఫిన్ చేయమని అడగబోయిన అన్నపూర్ణ ఆగిపోయింది  కూతురికళ్ళలో ఎరుపుజీరలు చూస్తూ.

 

                      *    *    *    *
        


     " వెల్ కం!"

 

     "పేలెస్ లా ఉన్న ఇంట్లో అడుగు పెట్టిన  ఏ. ఎస్. పి.  మేనకని చూస్తూ సాదరంగా ఆహ్వనించాడు మిత్ర."

 

     డిస్టెంబరు చేసిన గోడలు, నేల  కనబడని తినాచీలు, గోడలమీద ఖరీదైన చిత్రాలు, మోడర్న్ గా డిజైన్ చేసిన స్టెయిర్ కేస్, రూఫ్ కున్న షాండ్లియర్ ఆమె ఊహించనంత స్థాయిలో ఉన్నాయి. ఏ స్మగ్లర్ ఇల్లయినా ఇలా ఉంటుందేమో అనిపించేటంత  ఆశ్చర్యం ఆమె కళ్ళలో.

 

     మేనక ఓ పోలీసాఫీసరుగా అడుగు పెట్టిందే తప్ప తన స్నేహితురాలిగా కాదని అతనూహించలేకపోయాడు.

     పరిశీలనగా ఆమెచుట్టూ చూస్తుంటే " అయినా అత్తవారింట తొలిసారి అడుగు పెట్టే  అమ్మాయి సలక్షణంగా చీర కట్టుకుని  రావాలి తప్ప, యూనిఫారమేమిటి?" అన్నాడు ముందు.


    
     ఆమెలో చలనంలేదు.

 

    " ఇల్లు చూద్దువుగాని రా. "

 

    " అవసరం లేదు. చూశాను."

 

    " గుడ్ ... మొత్తానికి మంచి పోలీసాఫీసరువనిపించుకున్నావు విషయాన్ని ఎలా చూడాలి. ఎందుకు చూడాలి అన్నది మీకు ఫీల్డ్ క్రాప్ట్ లో నేర్పు తారనుకుంటా కదూ?"

 

    "దగ్గరలో నిలబడి దూరాన్ని  కొలవడమూ నేర్పుతారు."

 

    "దాన్ని జడ్జింగ్ ది డిస్టెన్స్ అంటారనుకుంటాను."

 

    " అబ్డర్వేషన్ బై డే అండ్ నైట్ అన్న సబ్జెక్టు కూడా టీచ్ చేస్తారు మాకు."

 Previous Page Next Page