అతడు ఆమె అతడినుంచి విడివడి సాలోచనగా "ఏదో శబ్దం రావటంలేదూ అనడిగింది.

 

    అంతలో చెవులు రిక్కించి విన్నాడు. అంతా నిశ్శబ్దంగా వుంది. ఇద్దరూ ఒకర్నొకరూ చూసుకున్నారు. కొంచెం సేపు మౌనంగా వుండి అతడు ఆమెవేపు కదలబోయాడు. అప్పుడు వినిపించింది... ఈసారి ప్రస్ఫుటంగా...

 

    ఊఊఊమ్ అని...

 

    సన్నటి మూలుగు.

 

    ఇద్దరూ వడివడిగా పక్కగదిలోకి వెళ్ళారు. ప్రార్థన నిద్రలోనే మూలుగుతుంది. భార్గవ ఆమె వంటి మీద చేయివేసి చటుక్కున తీసేసేడు.

 

    వళ్ళు కాలిపోతూంది.

 

    ముందు ఏదయినా ఇంజెక్షన్ చేద్దామా అనుకుని, మళ్ళీ ఆ ప్రయత్నం విరమించుకుని జ్వరం తగ్గటానికి మాత్ర వెతికాడు. ఈ లోపులో వసుమతి ప్రార్థనని నిద్రలేపింది. టాబ్లెట్ వేసీ వేయగానే నిద్రలోకి జారుకుంది. ప్రార్థనకి ఇలా వున్నట్టుండి జ్వరం వచ్చి తిరిగి తగ్గిపోవటం మాటిమాటికీ జరుగుతున్నా ఇప్పుడొచ్చినంత తీవ్రంగా అంతకు ముందెన్నడూ రాకపోవటంతో ఆమె కంగారుపడింది.

 

    "పదిరోజులయి పోయిందప్పుడే. మనం డాక్టర్ దగ్గిరకి తీసుకువెళ్ళనే లేదు" అంది.

 

    "ఏ డాక్టర్ దగ్గిరకి?"

 

    "రాబర్టుసన్ చెప్పారుగా?"

 

    "ఎందుకు? తగ్గిపోతుంది!" అంటూ కూతురి మీద మళ్ళీ ఇంకొకసారి చెయ్యివేశాడు. మునుపటంత తీవ్రత లేదుగానీ, ఇంకా వేడిగానే వుంది. వసుమతి మంచం దగ్గరగా కుర్చీలాక్కుని వేసుకుంటూ... "నేనిక్కడ వుంటాను" అంది. భార్గవ ఏదో అనబోయి ఆమె మొహాన్ని చూసి "సరే" అన్నట్టూ తల పంకించి వెనుతిరిగేడు.    

 

    అతడు పడుకున్నాడన్న మాటేగానీ నిద్ర పట్టలేదు. గంటో రెండు గంటలో గడిచి వుంటాయి. లేచి గడియారం చూస్తే మూడైంది. ప్రార్థన గదిలోకి వచ్చాడు. వసుమతి కుర్చీలో కోర్చునే ఒక చేతిని ప్రార్థన చేతిమీద వేసి నిద్రపోతూంది. అతడు కూతుర్ని మరోసారి స్పృశించాడు. టెంపరేచర్ తగ్గిపోయింది. వసుమతిని లేపి సరిగ్గా పడుకొమ్మని చెపుదామనుకుని మళ్లీ మనసు మార్చుకుని ఆ గదిలోంచి బయటి కొచ్చేసేడు.

 

    అతడు తిన్నగా తన గదికి వెళ్ళలేదు. లోపల పూలు ఇబ్బంది పెడుతున్నాయి. తలుపు తెరుచుకుని బయటకొచ్చాడు. విశాలమయిన కాంపౌండులో విసిరేసినట్టున్న పురాతనమైన ఇల్లు.

 

    అతడు ఆ చీకటిలో అలానే చాలాసేపు నిలబడ్డాడు. ఆకాశం మేఘావృతమై వుంది. చల్లటిగాలి రివ్వున వీస్తూంది, ఏ క్షణమైనా వర్షం మొదలయ్యేలా వుంది. ఎందుకో అతడికి సోమశేఖరం గుర్తొచ్చాడు ఆ క్షణాన.

 

                                               4

 

    'డాక్టర్ అన్నాజీరావు హెమటాలజిస్టు'

 

    అన్న బోర్డుకి ఎదురుగా కూర్చుని ఉన్నారు ఇద్దరూ. టైము పదకొండు కావొస్తూంది. ఆ ఆస్పత్రి వరండా నానా గందరగోళంగా వుంది. ఒక తల్లి పిల్లాడ్ని తీసుకుని బయటకు వచ్చింది. వరండాలో దూరంగా తల్లులూ, పిల్లలూ, పెద్దవాళ్ళూ కూర్చుని వున్నారు. రోగులు ఎవరో, తీసుకొచ్చిన వాళ్ళెవరో తెలియటంలేదు. పావుగంట తర్వాత వాళ్ళకి పిలుపు వచ్చింది. ప్రార్థన చెయ్యి పట్టుకుని ఆమె లోపలికి ప్రవేశించింది.

 

    విశాలమైన గది మధ్యలో తెల్లటి టేబుల్ వెనుక కూర్చుని వున్నాడు డాక్టర్. అతడిని చూడగానే ఎవరికయినా సదభిప్రాయం కలుగుతుంది. తెల్లటిజుట్టు, విశాలమయిన నుదురు- ఎత్తుగా బలంగా వున్నాడు.

 

    ప్రార్థనని చూడగానే 'ఓ నువ్వా' అన్నాడు చిర్నవ్వుతో.

 

    "మొన్న నీ డాన్సుకి వచ్చాను. నా మనవరాలు నీ క్లాసే. పట్టుపట్టి నీ డాన్సుకి తీసుకొచ్చింది. మమ్మల్నందర్నీ! తెలుసుగా రజిత"

 

    వసుమతి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. డాక్టర్ తెలిసిన వాడవటం ఆమెకు రిలీఫ్ నిచ్చింది.

 

    "కంగ్రాట్స్ పాపా! నీ డాన్స్ చాలా బావుంది" పక్కనున్న కుర్చీ మీద కూర్చోబెడుతూ అన్నాడు అన్నాజీరావు. తర్వాత తల్లి వేపు తిరిగి "రాబర్ట్ సన్ వెళ్ళిపోతూ కేసు పూర్తిగా స్టడీ చెయ్యమని చెప్పాడు. ప్రార్థన అంటే ఎవరో అనుకున్నాను" అని ఆగి "మొత్తం అరగంటసేపు పట్టవచ్చు. మీరు కాస్త బయట కూర్చుంటారా" అని ఇంగ్లీషులో అన్నాడు మర్యాదగా. "ఎంతోసేపు అక్కర్లేదు- అరగంట".

 

    వసుమతి క్షణం తటాపటాయించింది. పరీక్ష జరిగినంతసేపూ తను పక్కనే వుండవచ్చు అనుకుంది. అయినా ఏమీ మాట్లాడకుండా బయటి కొచ్చేసింది.

 

    అన్నాజీరావు ప్రార్థనవేపు తిరిగి నవ్వేడు. "నువ్వు చేసిన అన్ని ఐటమ్స్ లోకి అదే బావుందమ్మాయ్- ఏమిటది- వేవ్? అదే... అలో కెరటమో - ఏది ఏమిటది? అనడిగాడు తల గోక్కుంటూ.

 

    ప్రార్థన నవ్వేసి 'తరంగం' అంది.

 

    లోపల ఈ సంభాషణ జరుగుతూ వుంటే బయట వసుమతి నర్సుని 'ఐసోలేషన్ సెల్' గురించి వాకబు చేసింది. మోహన్ లాల్ కపాడియా పేరిట వచ్చిన డొనేషన్లతో ఆ ఆస్పత్రిలోనే ఐసోలేషన్ సెల్ నిర్మించబడింది. మామూలు ప్రపంచానికి 'దూరంగా' వుంచవలసిన పేషెంట్లని అక్కడ వుంచుతారు. ఆరోగ్య నిరోధకశక్తి బలహీనమైనప్పుడు చిన్న సూక్ష్మక్రిములు చాలా సులభంగా రోగిని స్వాధీనం పర్చుకుంటాయి. దాన్ని నిరోధించటం కోసం రోగిచుట్టూ కృత్రిమ వాతావరణం సృష్టించాలి. అదే ఐసోలేషన్ సెల్.

 

    అక్కడ అన్ని తలుపులూ వేసి వున్నాయి. వరండాలు నిర్మానుష్యంగా వున్నాయి. వసుమతి నర్సు దగ్గరకెళ్ళి 'ఏసుపాదం' గురించి వాకబు చేసింది.

 

    "సెల్ నెం. 12" అంది నర్సు డెస్క్ మీద రిజిష్టర్ చూడకుండానే.

 

    లోపల ఒక దోమతెర కప్పిన పక్క లాంటిది వుంది. దానికి కొద్దిదూరంలో అద్దం కిటికీ పక్క స్టూల్ మీద మరియమ్మ కూర్చుని బైబిల్ చదువుకుంటూంది. ఆ ముసలామె కూర్చున్న ఆ భంగిమలోనే విషాదం వుంది. ఆ గది నిశ్శబ్దం భయం కొల్పేలా వుంది.

 

    అలికిడికి మరియమ్మ తలతిప్పి "ఎవరూ" అని అడుగుతూ లేచి నిలబడింది.

 

    'నేను వసుమతిని' అంది సన్నటి స్వరంతో, అడుగు ముందుకు వేసి! ఇప్పుడు తెరలోపల్నుంచి ఏసుపాదం కనిపిస్తున్నాడు. చూసి ఆమె ఉలిక్కిపడింది. తన స్టూడెంటేనా ఇతడు? నెలరోజుల  క్రితం వరకూ క్లాసులో ఫస్ట్ వచ్చిన వాడేనా మసక కాంతిలా, పచ్చగా పాలిపోయిన అతడి శరీరం తెల్లటి పక్కకి అతుక్కుపోయి అస్థిపంజరంలా కనపడుతూంది. సన్నటి హిస్ మన్న ఆక్సిజన్ శబ్దం వస్తూంది. అతడి కళ్ళు తెరలోంచి చూస్తూనే వున్నాయ్. కానీ కనురెప్పల్లో కదలిక లేదు. కనుగుడ్లు మాత్రం కొద్దిగా కదిలినయ్.

 

    "ఈ కసువు వూడ్చే పనిమనిషిని చూడటానికి ఇంత కాలానికి నువ్వన్నా వచ్చావమ్మా, సంతోషం" అంది మరియమ్మ. ఆ వృద్ధురాలి కళ్ళు ఏడ్చీ ఏడ్చీ ఎర్రబడ్డాయి, మొహంలో ముడతలు మరింత ఎక్కువయ్యాయి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra