Home » Yandamuri veerendranath » దుప్పట్లో మిన్నాగు


    "కొంచెం సేపయ్యాక వాళ్ళకి అనుమానం వచ్చి లోపల ఏం జరుగుతుందో చూద్దామని తెరిచారట. నా అదృష్టం బావుంది."
    "మరి పందెం?"
    వెంకూ మాట్లాడకుండా చెయ్యి పైకి ఎత్తాడు. అతడి కుడి చెయ్యికి చూపుడు వేలు లేదు.
    శివ స్థాణువయ్యాడు.
    చాలా సేపటి వరకూ ఆ షాక్ నుంచి తేరుకోలేదు.
    వెంకు తన వేలువైపు చూసుకుంటూ, "నేను కథ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినివుంటే మీకే అనుమానం వచ్చి వుండేది. ఉత్తమ పురుషలో చెప్పిన కథలో, నేను  వేరే వ్యక్తిని అయివుంటే, మానవాతీత వ్యక్తి పెట్టెలోకి వెళ్ళిన తరువాత ఏం చేశాడో నాకేం తెలుస్తుంది?" అంటూ పేలవంగా నవ్వి, "నేనే మానవాతీత వ్యక్తిని. అది  చెప్పడానికి నామోషీ వేసి ఇలా కొద్దిగా మార్చాను" అన్నాడు.
    "అరుణ ఏమయింది?"
    "శుభ్రంగా పెళ్ళి చేసుకుని ఎక్కడో పిల్లల్ని కంటూ వుండి వుంటుంది. ఎప్పటి సంగతి అది! అయినా నేను ఆ పాత జీవితాన్నే వదిలేశాను. ఇప్పుడా  జీవితాన్ని తలచుకుంటూ ఉంటేనే రోతగా వుంటుంది. చిన్న చిన్న చౌకబారు ట్రిక్స్ ద్వారా ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నించడం. అందుకే ఈ వేలు పోయినా  బాధ పడటం లేదు."
    "నాకింకా కొన్ని అనుమానాలున్నాయి."
    "ఏమిటి?"
    "మానవాతీత వ్యక్తివి నువ్వే అయిన పక్షంలో, ఇంకో ట్రిక్ కూడా ఎలా చేశావో చెప్పాలి?"
    "ఏ ట్రిక్కు?"
    "కళ్ళుకు గంతలు కట్టుకుని కాగితంలో ఏం వ్రాయబడి వుందో చెప్పగలగడం! అరుణ తన కాగితం మీద ఏం వ్రాసిందో నీకెలా తెలిసింది? మొహం మీద ముసుగు వేసుకుని, అరుణ తన తండ్రిపేరు వ్రాసిందని ఎలా చెప్పగలిగావు?"
    వెంకూ నవ్వి- "చాలా చిన్న ట్రిక్ ఇది. కళ్ళకు గంతలు కట్టుకుని లెక్కలు చేయడం, మోటారు సైకిలు నడపటం......ఇవన్నీ ఒకే విధమైన ట్రిక్కులు! కళ్ళకి గంతలు కట్టుకున్నప్పుడే మేము కనురెప్పలు తెరిచి ఉంచుతాం. ముక్కుకీ, బుగ్గలకీ మధ్య వున్న రంధ్రంనుంచి, కింద అంతా కనబడుతూనే వుంటుంది."
    "కానీ పైన నల్లటి ముసుగు వేసుకుంటారుగా?"
    "అక్కడే వుంది అసలైన ట్రిక్కు. ఆ ముసుగేకానీ లేక పోతే మేం తల కాస్త పైకెత్తటం, అడుగునుంచి అంతా చూడటం ప్రజలకి తెలిసిపోతుంది."
    "కానీ నేనా ముసుగును పరీక్షించాన్ర్రా వెంకూ! అది రెండు పొరలతో దట్టంగా వుంది. నేను  కప్పుకుంటే బైట అసలేమీ కనబడలేదు."
    "పరీక్ష కిచ్చినప్పుడు మేము మీదా ముసుగును తొడుగుతాం కాబట్టి మీకేం కనబడదు. కానీ ముసుగుకి రెండు పొరలుంటాయి. మీకు తొడిగినప్పుడు రెండు పోరలూ మొహం ముందుకొచ్చేటట్టు తొడుగుతాం. మేం తొడుక్కునేటప్పుడు ఒక పోర వెనక్కి వెళ్ళేటట్లు తొడుక్కుంటాం."
    "నువ్వు నా కింత దగ్గర  స్నేహితుడవై వుండి ఇవన్నీ చెప్పలేదేం".
    "దగ్గర వాళ్ళ దగ్గర ఈ ట్రిక్కులు చెయ్యం. కాన్వాసింగ్ మాకు ఇష్టం వుండదు. ఏమీ తెలియని వాళ్ళను స్పెల్ బౌండ్ చెయ్యటంలో థ్రిల్ వేరు."
    "నీ కథకి కాదుగానీ, నీ  ట్రిక్కులు రహస్యానికే నిన్ను బిల్లు ఇవ్వటం నుంచి తప్పించవచ్చురా. నా ఓటు నీకే."
    "దుప్పట్లో మిన్నాగు ఏమైందో చెబితే నా ఓటు నీకే."
    శివ చప్పున తలెత్తాడు. వెంకు గుంభనంగా నవ్వాడు.
    "కామాక్షమ్మగారి చీరలో దూరింది మిన్నాగా, కాదా అన్నా సమస్య అంత తొందరగా తేలలేదు."
    వెంకు విభ్రమంతో చూసి, "మరి?" అని అడిగాడు.
    "కాళ్ళమీద ఏదో కదుల్తుందని గమనించగానే కామాక్షమ్మగారు ఫిట్స్ వచ్చి డబ్బున పడిపోయింది. గుర్రపువాతం వచ్చినదాన్లా బిగుసుకుపోయింది. నిజంగా లోపల పామేగానీ వుంటే అదురుపాటుకి అది ఆమెను కాటు వెయ్యటమో, పడినప్పుడు స్థంభాల్లాంటి ఆమె కాళ్ళక్రింద పచ్చడయి చావటమో జరిగి వుండాలి. మేము అదే అనుకున్నాం. భద్రం భార్యని కామాక్షమ్మగారి చీర సంగతి చూడమని మొగవాళ్ళం బైటకు వెళ్ళబోయాం. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. 'అమ్మో నాకు భయం' అంది. 'అది చచ్చే వుంటుంది?' అని అనునయించబోయాం. ఎంతకీ ఆవిడ ఒప్పుకోలేదు. మాకేమి చెయ్యాలో తోచలేదు. అలా చూడటానికి సాహసం చెయ్యగల ఏకైక వ్యక్తి, ఆవిడ భర్త అక్కడ లేకపోవటం మా దురదృష్టం. అమంగళం అప్రతిహతమవుగాక! ఆమె వయసు నలభై అయిదు తక్కువ కాకపోయినా, ఆమె కనీసం అంత స్థూలంగా లేకపోయినా, మేము అంతగా తటపటాయించి ఉండేవాళ్ళం కామనే చెప్పాలి. చివరికి మాలో డాక్టరే ఆ ఆపని చెయ్యడానికి ముందుకు వచ్చాడు. నెమ్మదిగా అరికాళ్ళ చెయ్యివేసి, చీర పైకి మడవటం ప్రారంభించాడు. అరగంట క్రితం ఎలా భద్రం ఒంటిమీద నుంచి దుప్పటి పైకి  లాగాడో, అలాగే అతి జాగ్రత్తగా ఆమె చీర మోకాళ్ళవరకూ మడిచాడు. జాగ్రత్తతో న్యూరోసర్జన్ చేసే ఆపరేషన్ లాగా ఒక్కొక్క అంగుళమే పైకి తీయసాగాడు.
    సిగ్గుతోనో, భయంతోనో తెలియదు కానీ నేను కళ్ళు మూసుకున్నాను. భద్రం పరిస్థితి కూడా అలానే వుంది. భద్రం భార్య ఏదో పని వున్నట్టూ అక్కణ్ణుంచి వెళ్ళిపోబోయి, మళ్ళీ మనసు రాక ఆగిపోయింది.
    ఇంతలో హఠాత్తుగా చీర మడతలనుంచి క్రిందపడింది పురికొస ముక్క!" అంటూ కథ పూర్తిచేశాడు.
    వెంకూ పడి పడి నవ్వి "నేనూ అలాగే అనుకున్నాను" అన్నాడు.
    శివ నవ్వకుండా, ఏమిటి అలా అనుకున్నావూ?" అన్నాడు.
    "ఇంత హడావుడి చేసింది ఏదో తాడు ముక్క అయి ఉంటుందని, అదే  కథకి కొసమెరుపు అనీ."
    "ఊహూ- అది కాదు మెరుపు. నిజంగా మిన్నాగు గదిలో వుంది."
    వెంకూ మొహంలో నవ్వు మాయమైంది.
    "మరి?" అన్నాడు.
    "కామాక్షమ్మగారి చీరలో దూరింది మిన్నాగు కాదని తెలియగానే అందరమూ ఒక్కసారి రిలాక్స్ అయ్యాం. అందరం భద్రాన్ని తిట్టాం కూడా. వాడు చాలాసేపు వాదించాడు. తాను నిజంగా చూశానని, తనమీద నుంచే అది ప్రాక్కుంటూ వెళ్ళితన కడుపుమీద తిష్ట వేసిందనీ నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పాడు. మేము వినలేదు. అనవసరంగా మమ్మల్ని అంతసేపు టెన్షన్ లో పెట్టినందుకూ, కామాక్షమ్మగారికి అనవసరంగా ఫిట్స్ తెప్పించినందుకూ వాడిని కసిరి, నేను  వెళ్ళి పక్కమీద  కూర్చుని, విసనకర్రతో విసురుకోసాగాను. సరిగ్గా అప్పుడే, పక్కమీద వేచివున్న మిన్నాగు నన్ను కాటువేసింది."
    వెంకూ అదిరిపడి, "వ్హాట్?" అని అరిచాడు.
    "అవును. అదృష్టవశాత్తూ గుడ్డ లోపల్నుంచి కాటువెయ్యడంతో అంత ప్రమాదం జరగలేదనుకో, డాక్టరు కూడా పక్కనే ఉన్నాడు కాబట్టి అప్పటికప్పుడు కత్తితో గాటుపెట్టి రక్తం తీసేశాడు. ఈ లోపులో ఆ మిన్నాగు మళ్ళీ తప్పించుకుంది. మేము దాని గురించి వెతికే ప్రయత్నం చెయ్యక, ఆ దంపతుల్ని ఆ రాత్రి వేరే ఇంటికి మార్చాం......" అంటూ ఫాంటు కొద్దిగా క్రిందికి జరిపి చూపించాడు- నడుముక్రింద పెద్ద గాటు వుంది.
    "మైగాడ్!" అన్నాడు వెంకూ.
    "చూశావా! వాస్తవంకన్నా కథ బావుంటుంది. ఈ ముగింపు కన్నా నేను ఆపినచోట ముగింపే గొప్ప థ్రిల్ కలగజేస్తుంది."
    "అవును" అన్నాడు వెంకూ.
                          *    *    *
    "నిశ్చయంగా నువ్వు రాధ భర్తవి కావు. నువ్వు 'వరండా కుర్రాడి'వే కదూ. నాకు చెప్పవా.....ప్లీజ్ " అన్నాడు విజ్జూ.
    "ఎందుకు అలా అనుకుంటున్నావు?"
    "నీ కథలో రాధకి ఒక కల వస్తుంది. అందులో దాదాపు వరండా కుర్రాడు ఆమెను అనుభవించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నువ్వు వ్రాసిన వాక్యాలు ఏమిటి? ఆ క్షణం ఆమె ప్రతి అంగానికీ దాని ఉనికి తెలుస్తుంది. ప్రతీ అంగమూ ఆమె మెదడుకి తరంగాలు తరంగాలుగా కమ్యూనికేషన్ పంపుతుంది అని అన్నావ్. ఆఫ్ కోర్స్....... ఆ తరువాత అతడిని విదిలించుకుంటుంది అనుకో. కానీ ఏ భార్యా భర్తకి ఆ విషయం చెప్పదు కదా. అందులోనూ తనకి వచ్చిన అంత దారుణమైన కల గురించి."
    "పోనీ నువ్వేమనుకుంటున్నావు?"
    "వరండా కుర్రాడివి నువ్వే మా సంతృప్తి కోసం నువ్వా ముగింపు ఇచ్చావు తప్ప, అసలు ముగింపు ఆదికాదు. లేదు. నీకూ, రాధకి స్నేహం ముదిరి ఉంటుంది. తరువాత ఏకాంతంలో ఎప్పుడో నీకు తన కల గురించి చెప్పి ఉంటుంది౦ ఇద్దరూ నవ్వుకొని వుంటారు."
    "నీ లాజిక్  బాగానే వుందికానీ, నేను వరండా కుర్రాణ్ణి కాదు."
    "మరి? విశ్వానాధానివా?"
    "ఉహు కాదు."
    "మరి?"
    "పరంధామయ్యని."
    విజ్జూ అదిరిపడి "వ్వాట్" అన్నాడు.
    "అవును. పరంధామయ్యని. నాకు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. తను నమ్మిన సిద్ధాంతాన్ని నిర్భయంగా అసలు జరపగలిగేవాడు వరండా కుర్రాడు. ఎన్ని కాంట్రడిక్షన్లున్నా చివరికి బలహీనతను జయించగలిగింది రాధ. పైకి ఏమీ తెలియనివాడుగా కనిపించినా, అన్నీ తెలుసుకోగలవాడు ఆమె భర్త. అందర్లోలో అతి మంచి వాడుగా కనపించేది నేనే. ఎదురింటిలో వుంటూ, వాళ్ళ కుటుంబంతో స్నేహం ఏర్పరచుకుని, ఆమె డైరీలు రహస్యంగా చదువుతూ సాడిస్టిక్ గా సంతోషాన్ని పొందేవాడిని. చెప్పుకుంటే సిగ్గుచేటు." 
    చాలాసేపటి వరకూ విజ్జూ మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా షాక్ ని జీర్ణించుకుని నవ్వుతూ అన్నాడు, "కనీసం ఈ విషయం ధైర్యంగా చెప్పినందుకు నీకు పూర్తి మార్కులు ఇవ్వవచ్చు."
    "నీ సంగతి చెప్పు..... దైవాధీనం నువ్వేనా?"
    "ఉహ్హూ, నేను కాదు. ది బ్రూగడ్ లో పని చెయ్యడానికి ముందు నేను నేవీలో పని చేసేవాణ్ణి తెలుసుగా."
    "తెలుసు".
    "దైవాదీనాన్ని మేమే రక్షించాం! అతడు సముద్రంలో దూకిన ఇరవై ఆరు గంటల తర్వాత చచ్చిపోతున్న స్టేజిలో అతడిని మేము అదృష్టవశాత్తు పట్టుకోగలిగాము ఇంకొద్దిసేపు ఆలస్యం అయి వుంటే అతడు చచ్చిపోయి వుండేవాడు."
    "యాభైవేల డబ్బుకోసం అంత సాహసం చేసిన వాడిని నిజంగా అభినందించవలసిందే."
    "అంతకన్నా ఎక్కువే ముట్టింది అతడికి."
    "ఎలా?"
    "ఏ ఆధారమూ లేకుండా నది సముద్రంలో రాత్రీ- పగలూ ఇరవై ఆరు గంటల పాటూ ఈదుతూ ఉండగలగడం వరల్డ్ రికార్డ్! గిన్నీస్ పుస్తకం దీన్ని ప్రచురించింది. అతడి కథ విన్నాక చందాల రూపంలో వివిధ ప్రాంతాల నుంచీ లక్షరూపాయలదాకా ముట్టింది!"
    "అన్ని కథలకన్నా ఈ కథ ముగింపు బావుంది. దీనికి పూర్తి మార్కులు ఇవ్వచ్చు."
    "నా కథకి నువ్వు ఇస్తే, నీ కథకి నేను ఇస్తాను."
    "ఈ అగ్రిమెంటేదో బావున్నట్టుందే" అన్నాడు శేషూ. ఏదో స్ట్రెయిక్ అయినట్టు తలెత్తి. అవును. మనిద్దరం పరస్పరం సహాయం చేసుకుంటే ఈ బిల్లు బారినుంచి బయటపడవచ్చు".
                        *    *    *
    (కథ కోసం బుక్ ఆఫ్ వరల్డ్ లో 'ఇరవై ఆరు గంటలు సముద్రంలో ఉండటం' అన్నది సృష్టించబడిందే తప్ప- అది నిజానికి ఫాంటసీ. దీనికీ వాస్తవానికీ ఏ సంబంధమూ లేదు.
    గిన్నీస్ పుస్తకం ప్రకారం నీళ్ళలో ఎక్కువసేపు వున్నది జమ్మీ అనే అమెరికన్. ఇతడు హనలులూ దగ్గర ఒకనీటి మడుగులో 1941 ఫిబ్రవరి 17 నుండి 24 వరకు (166 గంటలు) ఉన్నాడు. ఇతడికి కాళ్ళు రెండూ లేకపోవడం యాదృచ్చికం.
    పోతే ఎక్కువ దూరం ఈదింది న్యూటన్ అనే వ్యక్తి! ఇతడు 1826 మైళ్ళు మిసిసిపీలో ఈదాడు. మొత్తం742 గంటలు నీళ్ళలో వున్నాడు. నీరు దాదాపు గడ్డ కట్టుకుపోయే స్టేజిలో పెట్రోలియంజెల్లీ ఉపయోగించి శరీర ఉష్టోగ్రతను కాపాడుకుంటూ ఈదటం కొనసాగించాడు.
    అయితే పైన చెప్పిన వాళ్ళందరూ మధ్యలో మంచినీళ్ళు తాగుతూ తిండి తింటూ ఈదినవాళ్ళు. ఇవేమీ లేకుండా ఎవరైనా నీటి మధ్యలో ఉంటే వాళ్ళ రికార్డు ఏమిటో నాకు తెలియదు. అందుకే 'ఇరవై ఆరు గంటలు' అని కథలో వాడాను. సరి అయిన రికార్డు ఎవరికైనా తెలిసి నాకు తెలియజేస్తే, ఈ నవమాలిక వచ్చే ఎడిషన్ లో సరిదిద్దుకుంటాను..... రచయిత.)
    సరిగ్గా అదే సమయానికి అక్కడ వెంకూ కూడా శివతో అదేమాట అంటున్నాడు.
    ఆ తరువాత రెండు జంటలూ నేను కూర్చున్న టేబిల్ దగ్గరికి చెరోవైపునుంచీ గుంభనంగా వచ్చారన్నమాట.
    అలా వాళ్ళు నలుగురూ అలా ఒకరి తరువాత ఒకరు నా వెనుక జరిగిన కథ చెపుతూంటే నా మొహం తెల్లగా పాలిపోయింది. నా మిత్రులందరూ ఎంత తేలిగ్గా నన్ను పూల్ ని చేశారో అర్థమయింది. అందరికీ పదిహేను మార్కులు ఎలా వచ్చాయో కూడా తెలిసింది.
    ఎవరికీ హాని చెయ్యకూడదనుకుని నేను అందరికీ సరిసమానంగా మార్కులు వేశాను. తలోకరూ తమకి తాము అయిదు మార్కులు వేసుకున్నారు. అదీగాక, కథ ముగింపు విన్న మిత్రడు మరో అయిదు మార్కులు వేశాడు- మొత్తం పదిహేను. లా నాకు వేసినవాడు గానీ , నా పట్ల జాలిపడ్డ వాడుగానీ లేకపోవటంతో నాకు కేవలం అయిదు మార్కులే వచ్చినయ్.
    ఇప్పుడేం చెయ్యాలీ అన్నట్టు మిగతావారివైపు చూశాను. తేలుకుట్టిన దొంగల్లా వాళ్ళు మాట్లాడలేదు. ఎదురుగా ప్లేట్లో బిల్లు రాక్షసిలాగా కనపడుతూంది.
    మా అందరి ఇబ్బంది గమనించినట్టు పట్నాయక్ గొంతు సర్దుకుని అన్నాడు- "మీకు అభ్యంతరం లేకపోతే నా మిత్రుడి తరపున నేను పందెం కడతాను"
    "ఎలా?" అడిగాడు విజ్జి షార్ప్ గా రియాక్ట్ అయి.
    "నేనో కథ చెపుతాను. మీ నలుగురి కథలకన్నా నాడి బావుంటే మీరు బిల్లు ఇద్దురుగానీ, నా కథకన్నా మీలో ఏ ఒక్కరి కథ బావున్నా నేను మొత్తం  బిల్లు ఇస్తాను సరేనా?"
    నా మిత్రులందరూ మొహమొహాలు చూసుకున్నారు.
    పట్నాయక్ కొనసాగించాడు. "ఇందులో మన మిత్రుడిని వదిలిపెడదాం. ఎందుకంటే అతడు మీకూ, నాకూ మిత్రుడే కాబట్టి."
    "కానీ మనలో  ఏ కథ  బావుందో ఎవరు నిర్ణయిస్తారు?"
    పట్నాయక్ నావైపు చూపిస్తూ "మన మిత్రుడు" అన్నాడు. వాళ్ళు వెంటనే చెప్పలేదు. అందర్లోకి ముందు కదిలింది వెంకూ.
    "అతడిని మేము మోసం చేశాము. అది దృష్టిలో పెట్టుకుని మా నలుగురికీ తక్కువ   మార్కులు వేస్తే?" అన్నాడు.
    పట్నాయక్ నవ్వి, "నా ట్రూత్ టెల్లర్ వుందిగా" అన్నాడు. అందరూ సంతృప్తి చెందినట్లే కనిపించారు. సంతృప్తి చెందకేం చేస్తారు? తమ కథల్లో ఏ ఒక్కటైనా నిశ్చయంగా అతడి కథకన్నా గొప్పగా వుంటుందని వాళ్ళ నమ్మకం అదీగాక నేను మోసం చెయ్యడానికి కూడా వీల్లేదు. నా మనసులో ఏ మాత్రం వాళ్ళ  కథే బావుందని అనిపించినా దానికి ఫస్టుమార్కు వెయ్యకపోతే- వెంటనే ట్రూత్ టెల్లర్ ఆ విషయాన్ని పట్టుకుంటుంది.
    "సరే, ఈ పందెం మా కిష్టమే" అన్నాడు శేషు.
    ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత పడింది. ఇంతకుముందు నాలుగు కథలూ ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేసి అందరికీ సమానంగా మార్కులు వేసేశాను. ఇప్పుడలా కాదు, నాలుగు కథలూ తిరిగి మననం చేసుకోవాలి. ఇప్పుడీ కథని జాగ్రత్తగా వినాలి. ఆపైన జడ్జి చేయాలి. చాలా కష్టం. అందులోనూ పక్కన ఈ ట్రూత్ టెల్లర్ ని పెట్టుకుని.
    నా ఆలోచన్లతో సంబంధం లేకుండా పట్నాయక్ చెప్పటం ప్రారంభించాడు.
                                                       *శుభం*
    (109 ఎపిసోడ్ నుంచి పట్నాయక్ చెప్పిన కథ : ట్రూత్ టెల్లర్ వస్తుంది)

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra