Home » Chandu harshavardhan » ది బ్లడ్


    "ఈ శాఖలో ఎవరికైనా సరే ముందు అంకితభావం అనేది ప్రధాన ప్రధమ లక్ష్యంగా వుండాలి. నేర్పరితనం, నిపుణత్వంతోపాటు అవసరమైతే ఆత్మత్యాగానికి సయితం అతను సిద్దమవాలి. ముఖ్యంగా అతనిలో వ్యక్తిగత బలహీనతలు వుండకూడదు. త్రాగుడు, జూదం, వ్యభిచారం అదిగా గల వ్యసనాలకు ఆమడ దూరంగా వుండాలి. అలా అని మందబుద్దితో వున్నా, అటువంటి వ్యక్తి కేవలం లెక్కకు వున్నాననిపించుకోవడానికే ఉపయోగపడతాడు. కాని, వృత్తి నిర్వహణలో ఎందుకూ కొరకాడు. ఒకానొక సందర్భంలో మాహానాటక రచయిత జార్జి బెర్నార్డ్ షా అన్నట్టు సెక్యూరిటీ ఆఫీసరు "టాక్ట్ ఫుల్" అయివుండాలి. అంటే ఆయన మాటలోనే 'presence of mind and absence of body' అన్నమాట!"

    వి.వి.ఐ.పి. సెక్యూరిటీ గురించి జరుగుతున్న సెమినారులో నేషనల్ పోలీస్ అకాడమీ డైరక్టరు శ్రీమురళీధరన్ అనర్గళంగా చెప్పుకుపోతుంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్లు, పత్రికా ప్రతినిధులేకాక, ప్రత్యేక ఆహ్వానితులైన వివిధ ప్రజాహిత జీవన రంగాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా మంత్రముగ్దులై వింటున్నారు.

    అయితే, వారందరిలో ఏకాగ్రత చెదరి, అసహనంగా అటు ఇటు కదలుతున్నది ప్రధానికి పర్సనల్ సెక్రటరీగా వున్న ఐ.ఎ.ఎస్. ఆఫీసరు కుమారి రీతు! ఆమెకు ముళ్ళమీద కూర్చున్నట్టు వున్నది. ఆమె మనసు అక్కడ లేదు!

    అదే సదస్సులో, ప్రధానికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరుగా (పి.ఎస్.ఒ) వున్న ఐ.పి.ఎస్. ఆఫీసరు రవితేజ అకాడమీ డైరక్టరు ప్రసంగాన్ని ఎంతో శ్రద్ధగా, ఏకాగ్రతతో వింటున్నాడు.

    అకాడమీ డైరక్టరు మురళీధరన్ తన ప్రస్థావనా ప్రసంగం అయిపోయాక, సదస్సులను ఒకసారి కలయజూసి, "మిష్టర్ రవితేజ! మీరేమైనా సూచనలిస్తారా?" అంటూ మర్యాదగా ఆహ్వానించాడు.

    రవితేజ! ఆ పేరు వినగానే వంటిమీద తేళ్లు, జెర్రెలు పాకినట్టు అయింది కుమారి రీతూకు. అతనిని చూడవలెనంటేనే అసలు అసహ్యం వేస్తున్నది. ఇందాకటి నుంచి ఆమె అసహనంగా కదలడానికి కారణం అదే!

    ఆమె దృష్టిలో - అతని నడవడిక మంచిదికాదు. జీవితం గురించిన అవగాహనే అసలు అతనికి లేదు. జీవితంలో అతను ఆటలాడుకుంటాడు. వృత్తిపట్ల నిర్లక్ష్యం...

    రవితేజ సాటి ఉద్యోగి. తను తన బాధ్యతలను నిర్వర్తిసున్నట్టే అతనూ అతని ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు. మరి, అతనిని తప్పుపట్టడంలో తన ఉద్దేశం ఏమిటి...?

    రవితేజ, స్టడీస్ లో యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్టు. ఐ.పి.ఎస్.లో- నేషనల్ పోలీస్ అకాడమీ ట్రయినింగులో__ఆల్ రౌండ్ బెస్ట్ కేండిడేట్ గా బంగారు పతకాన్ని అందుకున్న యువకుడు!

    అతనిపట్ల ఆమెకు ఏర్పడిన అభిప్రాయాన్ని ఇవేమీ మార్చలేక పోతున్నాయి.

    ముస్సోరీలో బేసిక్ ట్రయినింగ్ కాలం నుంచే రవితేజ అంటే ఎలర్జీని పెంచుకుంది రీతు. అప్పుడు ఒక రోజున అతని ప్రవర్తన చాలా ఎబ్బెట్టుగా అనిపించింది తనకు.

    "డియర్ ఫ్రెండ్స్! ఇవ్వాళ మా జూలీకి కవల పిల్లలు పుట్టారు. అందుకే అందరికీ పార్టీ ఇస్తున్నాను. బై ద బై- మీ మీ టేస్ట్ లకు సరిపోయే బార్ గాని, కాంటినెంటల్ హోటల్ గాని- ఎంత ఖరీదైనా ఫరవాలేదు - ఐయాం ప్రిపేర్డ్ అండ్ ఐయాం హేపీ టు ఎరేంజ్ వాట్ ఎవర్ యు లైక్...!" సరాసరి డయాస్ నుంచి అనౌన్స్ చేశాడు రవితేజ.

    క్లాస్ తీసుకోవడానికి అప్పటికి ఇంకా ఎవరూ రాలేదు!

    "రవీ! ఇంతకూ, జూలీ ఎవరో చెప్పనే లేదు! నీ గర్ల్ ఫ్రెండా?" ఒక పోకిరీ కుళ్లుజోకు వేశాడు. వేసి, ఆడపిల్లలవైపు తిరిగి వెకిలిగా ఇకిలించాడు.

    "ఓ! చెప్పడం మరచా__జూలీ మా పెట్ డాగ్! గత ఐదేళ్ళుగా దానికి పిల్లలు పేరు. ఇటీవలే ఒక డాగ్ స్పెషలిస్టు ఏమి చేశాడో ఏమో, కవలలను కనేసింది." పకపకానవ్వాడు రవితేజ. అతని నవ్వుతో మగరాయుళ్ళంతా శృతి కలిపారు.

    రీతూ ముఖం కంది కందగడ్డ అయింది. ఆమెతోపాటే మిగిలిన ఆడపిల్లలంతా చీదరించుకుని క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేశారు.

    "మిస్ రీతూ! ప్లీజ్ ... సాయంత్రం పార్టీకి రావడం మరచిపోకండి...!" వెనుక నుంచి ప్రాధేయపడుతున్నాడు రవితేజ...

    "ఎంత పొగరు! ఎన్ని కోట్ల ఆస్తి వుంటే మాత్రం మరీ అంత మిడిసిపాటా? పెంపుడు కుక్కకు పిల్లలు పుడితే మనుషులకు విందులు చేస్తాడా? బ్లడీ స్కౌండ్రల్! వీడికి తగు గుణపాఠం నేర్పాలి!" అంటూ రీతు, మిగిలిన ఆడపిల్లలందరు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.  

    కాని, అతని అదృష్టం బాగుండి, కొన్ని రాష్ట్రాలలో శాంతి - భద్రతల పరిస్థితి బాగా లేకపోవడంతో, బేసిక్ ట్రైనింగును కుదించి, ఐ.పి.ఎస్. కేడెట్స్ ను నేషనల్ పోలీస్ అకాడమీకి పంపివేశారు.

    అలా తప్పుకుపోయిన రవితేజ ఆ తరువాత ట్రైనింగ్ పూర్తి కావడంతోనే సరాసరి ప్రధానికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరుగా ఊడిపడి తనకు తారసించాడు.

    'అసలు ఇతని బుద్ధి, గుణగణాలు, సంస్కారం, పద్ధతులు, నడవడిక తెలుసుకునే ఇంటలిజెన్స్ శాఖలోకి తీసుకున్నట్టా లేక పొరపాటున కొరివిలో తల గోక్కుంటున్నట్టా? చెబుతా...చెబుతా...!' ఈ విధంగా ఆలోచిస్తున్నది రీతు. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra