Previous Page Next Page 
ఋషి పేజి 19



    కుమార్ నవ్వి-"అడుగు" అన్నాడు.

    ఇంతలో  డాన్సర్ వీళ్ళ టేబిల్ దగ్గరకొచ్చింది. ప్రకాశం పక్కగా నిలబడి, వాయిద్యానికి అనువుగా నాట్యం చేస్తూ చేతుల్లో వున్న వ్తేలాన్ గుడ్డని ప్రకాశం  తలమీదుగా జార్చి, ఏం జరుగుతూ వుందో  తెలుసుకొనే లోపులోనే  తనూ ఆ ముసుగులోకి జారి అతని పాలబుగ్గల  మీద సుతారంగా పెదవులు అన్చి, చటుక్కున తెరతీసేసి పక్క టేబిల్ దగ్గరకు  వెళ్ళిపోయింది.

    క్షణంపాటు ప్రకాశానికి మ్తెకం కమ్మేసింది. తన చుట్టూ ఏం  జరుగుతుందో, తనే స్ధితిలో వున్నాడో గ్రహించలేకపోయేడు. నుదురంతా  చెమట పట్టేసింది. ఉద్విగ్నతవల్ల అతని పెదవులు వణకసాగేయి.

    కుమార్ చుట్టూ చూసెడు. ఎవరూ తమని గమనించటం లేదని  నిశ్చయించుకొన్నాక నెమ్మదిగా "ప్రకాశం" అన్నాడు. ప్రకాశం  మాట్లాడలేదు.

    "ప్రకాశం-" ఈసారి కొంచెం బిగ్గరగా అన్నాడు. ప్రకాశం  ఉలిక్కిపడి "పిల్చేవా" అన్నాడు.

    కుమార్ నవ్వేడు. "ఏమిటా పరధ్యానం?" ప్రకాశం సిగ్గుపడ్డాడు.

    "నివేలా వున్నావో తెలుసా! అంతవరకూ పురుష స్పర్శ ఎరుగని అమ్మాయి మొదటిరోజు తెల్లవారు ఝామున __రాత్రి తాలూకు స్మృతులు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఎలా సిగ్గుపడుతుందో__ని మొహం ఇపుడు అలా రాగరంజితమ్తె వుంది."

    ప్రకాశం మొహం సిగ్గుతో మరింత ఎర్రబారింది.

    "ఏ  వయసులో అనుభవించవలసింది ఆ వయసులో అనుభవిస్తేనే  అందులో ఆనందం వుంటుంది" కుమార్ కంఠంలో  అకస్మాత్తుగా  విచారం  ధ్వనించింది. "ఈ  విషయంలో నేను చాలా దురదృష్టవంతుడిని. ఈ అనుభవం నా పదమూడో ఏట లభించింది" అని కొంచెం ఆగి_

    "పదమూడేళ్ళ వయసులో- నలబ్తే ఏళ్ళ ముసల్ది నన్ను సేద్యూ చేస్తూంటే" ఆగేడు "నా తప్పు ఏవి లేదు ప్రకాశం. ఏది మంచో, ఏ చేడో తెలుసుకోలేని స్ధితి. ఏదో తెలుసుకోవాలనే తపన-అంతే."

    కొంచెం సేపు ఎవరూ మాట్లాడలేదు. మౌనాన్ని చేదిస్తూ "ఏమీ ఏదో ప్రశ్న అడుగుతున్నావ్?"

    "ఏది?" అర్ధంకానట్టు అడిగేడు ప్రకాశం.

    "ఇప్పడే అన్నావ్ కదా-" అన్నాడు కుమార్.

    "ఒహే- అదా" జ్ఞాపకం వచ్చినట్టు ముందుకు వంగి-

    "నాకు భయం, నే నందుకు రాను. నికా భయం లేదు__ డబ్బు కొదవలేదు, మరి నువ్విక్కడికి ప్రతిరోజూ వస్తావా?"

    కుమార్ నవ్వి "రాను" అన్నాడు.

    "ఎందుకు?"

    "ఈ ప్రశ్నకి సమాధానం చాలా పెద్దది బహుఅశా నేను  చెప్పాలే నేమో! అయినా టై చేస్తాను" అంటూ జేబులోంచి పర్సుతిసి రెండు నోట్లు ప్లేటులో వేసేడు. వెయిటర్ వచ్చి ప్లేటు తీసుకెళ్ళేడు.

    "పోదాం పద" అన్నాడు ప్రకాశం.

    "ఒక్క క్షణం " ప్రకాశం అర్ధంకానట్టు చూసేడు. అది గ్రహించేడు కుమార్ "చిల్లర తేవాలిగా " అన్నాడు.

    అతను సరిగ్గా బిల్ చూడలేదేమోనని "మనకెంతో రాదు. రూపాయో  రూపాయిన్నారో అంతే" అన్నాడు ప్రకాశం.

    "రూపాయి పావలా_"

    "మరి వెయిటర్ కి టిఫ్ ఇవ్వోద్దూ."

    "కొన్ని బార్లలో అది కంపల్సరి - ఈ బార్లో కాదు" అని అతను అంటూ వుండగానే వెయిటర్ ప్లేట్ లో  చిల్లర  తెచ్చి పెట్టేడు కుమార్  చిల్లరా నోటూ  తీసుకొని జేబులో వేసుకొని బ్తేటకు నడిచేడు. వెయిటర్  మొహాన్ని చూద్దామని ప్రకాశం ప్రయత్నించాడు కానీ ఆ వెళ్తుర్లో సరిగ్గా కనిపించలేదు.

    ఇద్దరూ బ్తేటకోచ్చేరు. అంత చలిలో బయట గుమ్మం దగ్గిర నిలబడ్డ గూర్ఖా చేతిలో రూపాయి పెట్టి కారు స్టార్టు చేశాడు.

    చల్లటి గాని  నెమ్మదిగా విస్తూంది. కారు మెత్తగా సాగిపోతూంది. కుమార్ చెప్పటం ప్రారంభించాడు.

    "చెడిపోవటం గురించీ వచ్చింది కాబట్టి__ నా గురించీ చెప్తాను ముందు. చిన్నప్పటినుంచి నేను చాలా నికృష్టమ్తెన వాతావరణంలో పెరిగెను. ప్రకాశం, ముఖ్యంగా నా తండ్రి యెంత నికృష్టుడంటే.... నా చెల్లె లికోసం వచ్చే స్నేహితురాళ్ళని కూడా వదిలి పెట్టకుండా...ఛి__ తల్చుకుంటే అసహ్యం వేస్తుంది... ఇక నా తల్లి -ఆవిడ మాటల్లో లేకితనం, మనసులో కుత్సితత్వం__ ప్రవర్తనలో అనుక్షణం తోణికిస లాడే గర్వం .... ఆవిడ గుణాల్నే పుణికిపుచ్చుకున్న నా చెల్లెలు... వీళ్ళం దరి మనస్తత్వాలని చిన్నప్పటినుంచే గమనించేవాడ్ని ఈ గమనించే గుణం లేకపోయుంటే ఎంత  అదృష్టవంతుడ్ని.

    మా యింట్లో వున్న  ఈ వాతావరణాన్ని వ్యక్తుల్ని బయట ప్రపంచానికి అన్వయించుకొని.... దానిమీద కూడా అసహ్యాన్ని  పెంచుకొన్నాను__ ఈ స్ధితిలో  నా స్నేహితులు కూడా నాన్నలాంటి వాళ్ళేదొరి కెరు. నా పదమూడో యేట సిగరెట్  తాగెను. పధ్నాలుగో యేట___ కొంచెం సేపు  క్రితం  చెప్పానే- ఓ ముసల్ది సేడ్యూస్ చేసింది. పదహారో యేట తాగుడు ____పేకాట-

    కానీ ఇవేవి  అలవాట్లుగా మారకపోవటానికి  కారణం  బహుశ చిన్నప్పుడు ణ మీదపడిన నా యింటి వాతావరణం ____ విరిపట్ల  అంతర్గ తంగా పేరుకుపోయిన కసి....

    "మరి అంత అసహ్యవూ , కసి ఉన్నప్పుడు వీటిని పూర్తిగా  వదిలివేయొచ్చుగా?" అన్నాడు ప్రకాశం.

 Previous Page Next Page