Home » Chalam » శశిరేఖ

ఆ పడవ షికారు వెళ్ళిన సాయంత్రము ముందు తనకును కృష్ణునకును శాశ్వతమగు ప్రేమబంధన మేర్పడినధనియు,కృష్ణుడు తనయం ధవతారమేత్తుననియును ఇద్దరును ఒక్కరినే ఒకరికోరకొకరు ప్రేమించేదరానియను, ఎన్నో  అనుకొనెను.అట్టి  బంధన  మేర్పడిన,అది శాశ్వతమ్తె  యుండెడిది.కానీ యిప్పడేమి కలదు? ఆ సాయంత్రము నీళ్ళలో పడుట   తోడనే ఆశలన్నియు అడుగంటేను. ఆ స్వప్నములు మాయమయ్యెను. ఆ నాటిపాటుతో కృష్ణుడు,తన ప్రియురాలిని సంతానమునుగూడ  గోల్పోయెను.
దుఃఖమంతయు  కృష్ణుని కోఱకే.అతడు తనను  వద్ధనిన, తన పై ప్రేమలేదనిన ఇంకొక బాలికను వలచిన,  తానెంత సంతోషముగా అతనిని వదలియుండును. అయినను తాను వెళ్ళిన తరువాత సంతోషమున నుండు నేమోలే,అతని స్వల్ప సౌఖ్యము  కొరకు తన జీవితము నంతను ఎట్లు పాడుచేసికోనగలదు?  ఇక తప్పదు,విధి తనను రమ్మని పిలుచుచుండెను.తాను పోకతప్పదు. కృష్ణునికి శలవు!అయ్యో!అతనినింక చూచుటపడదు కాబోలు. తన క్రుతఘ్నతనువ్ విని   అతని ముద్దు ముఖ మెట్లగునోకదా! ఆ ముద్దు కన్నులనుండి ఎంత నిరు కారునోకదా? ఎంత విలపించునో, పొరలి పొరలి దుఃఖము వచ్చెను.                                    
                                                           *        *        *                                          
కృష్ణుడు సాయంత్రము నాలుగు గంటలకు తన కుటిరము వాకిట నిటునటు నశాంతితో తిరుచుండెను. మాటిమాటికి ఆస్పత్రివ్తేపు శశిరేఖ వచ్చుచున్నదేమోనని చూచుచుండెను. ఇన్ని దినములేన్నాడు  నతడు శశినివిదిచియుండలేదు.ఒక్కసారి ఆమెను వెంటనే చూడవలేననేడి  తృష్ణనాతని నవరించెను. ఇంటివద్ద పరిచర్యచేయుట కాతడుగాక ఇంకేవ్వరును లేరు. ఎంతో ఆశతో, ఏమియును తోచక, ఇంకను రాలేదేమని యశ్చర్యపడుచుండెను.ఇంతలో ఆస్పత్రి నౌకరాతని కొక యుత్తరము తెచ్చి యిచ్చేను.ఇంక ఏమి యటంకములు వచ్చినవో కదాయని, కలవరపడు హృదయముతో,దానిని తెరిచి చదివేను.
నా ముద్దుల కృష్ణా,
శశిరేఖయనుదాని నేన్నడును  కలిసికోనలేదను కొనుము. నిన్నాన్ని కష్టముల నష్టములందించిన శని యీ నాటితో తొలగి పోయినదని సంతోషించుట నేర్చుకోనుము. నీమీద ప్రేమ నా కేన్నడును మరపునకు రావు.నీనుండియెడబాటు నా కతికష్టముగా నున్నది. నన్ను,లాకులను, చెట్లను, వనమును పూర్ణముగ మరచిపోమ్ము. నీవంటి సుచారిత్రునకు  నావంటి దాని సంపర్కము తగదు. నాహృదయం బ్రద్ధలగుచున్నది. నీవెంత దుఃఖించేదవో నేనెరుంగుదును.కాని ఏమి చేయగలను  ?  నేను మరనించితినను కొనుము. కృష్ణా,శలవు,నీ పటమేల్లప్పుడు యీ మలిన హృదయమున శాశ్వతముగ నుండును.నన్ను  మరచుటకు  ప్రయత్నింపుము.నీ ముద్దు  ముఖమును, ముద్దుమాటలను, యీ జన్మమున మరవను.
నిన్న రాత్రి నేను ....
కృష్ణు డింతవరకే వెలవెలబారు  ముఖముతో చదివేను. నోటమాట లేదు. కన్నీరు బొట్టులేదు. నరికిన వృక్షమువలె , మరణించిన వానివలె క్రింధబడిపోయెను.                     
                                                                                   8
నెలదినములు  సుందరరావు శలవు పుచ్చుకోనేను. ఇరువురు ననేక పట్టణముల   విహరించిరి . మళయాళమున,బోంబాయిరాజధాని యందును తిరిగిరి. సుందరరావుకు  బళ్ళారిజిల్లాలో జిరగానహళ్లి యందు పనిలో చేరవలసివచ్చెను .సుంధరరావునుండి  మహా ప్రేమను, గాడమగుయుద్రేకము ననుభవించి శశిరేఖ సంతస్దురాలయ్యేను. సుంధరరావును శశిరేఖా సౌందర్యమును తనివితీరయనుభావించెను.కాని సుంధరరావుది కృష్ణుని దానివలె  సరళమును నిర్మలమునునగు మనసు కాదు.ఎల్లప్పుడు నెడతెగని అశాంతగ్నిలో సౌఖ్యముతరువాత  సౌఖ్యమును గోరుచుండును.కృష్ణుడు శశిరేఖ కెట్లు ఆనందము కలిగింతునాయని యలోచించుటచేయామె యనందించినపుడెల్ల తానును   తోషించుచుండెను. సుందరరావు శశిరేఖ   నుండి తానెంత యనంధమును పోందుదునాయని ప్రయత్నించుటచే  ఆ యానంద  మును నల్గుదినములలో  కోల్పౌఎను.ఒరుని సోత్తయినంతకాలము  దానిని సంపాదించుటే అవదిగాకల్గి తను జయము పొందిన  కొలధిని  మహాదానందము పొందెను. ఇంక వేరు స్వర్గము లేదనుకోనేను.కాని యది తనది యగుటతోడనే దానిలో    నుండు  విలువపోయినది.స్త్రి తన సమస్తమును తన హస్తములోనుంచిన కృతజ్ఞత చూపు పురుషులు మిక్కిలి యడదు.స్త్రి పురుషుని  తన శక్తిచే  యజ్ఞయందుంచుకోనవలెను లేదా పురుషుడామెను నిచముగ లోబరుచుకోనును అందువల్లననే స్త్రి పురుషులు  ప్రతి  విషయమునసు సమానుల్తేనగాని ప్రేమ యుండదు. ఒకరి పై నోకరాదారపడిరా యాప్రేమ నశించినదే. శశిరేఖ యింకొకరి  యధినమందుండి, తనది కానన్నాళ్ళు సుందరరావామెకు బానిసయ్తే యుండెను.ఆమె కృష్ణునిదగ్గరున్నాను, లేక స్వతంత్రముగ జీవించుచున్నను  సుందరరావామెకు  యింకను బానిసయ్తే యుండేడివాడే కాని వేరు దిక్కులేక, అతని పైతన  జీవనమునకు  తన పై నాధారపడుటతోడనే శశిరేఖ అతనికి మహాభారమమయ్యెను. ఆమె యందమెంత  ఎక్కువగనున్నను, ఎంత   కొత్తగ  కాన్పించుచున్నను, ఏమిచేయుటకైన తనదేయని  నిశ్చయ   మగుటతోడనే, ఎందునకును  కోరగానిదయ్యేను.సౌందర్యము  నితరులయందు  చూచి  యానందింపగల స్వభావములు యరుదు. సుందరరావువంటి వారు సౌందర్యమును చూచుటతోడనే తా మనుభావింపనిది  శాంతినొందరు. శశిరేఖ సొవమ్ధర్యమును౭ చూచి కృష్ణుడు పూజించెను.తానా సౌందర్యమును   కేమి   యివ్వగలనా యని యోచించెను. కాని సుందరరావు దాని నెప్పడనుభావింతునాయని తోందరపడెను. సౌందర్యము ననుభావించుట స్వార్ధపరుల కెట్లు సాధ్యమగును? భౌతిక శరిరముచే,ఇంద్రియములచే, శరీరము ననుభవింప గలుగుదురు.గాని  ఆ నిర్మలమును, భౌతికాతితమునగు సౌందర్యము నెవ్వడు తనది మాత్రముగచేసికోనగలడు ? ఎంతయో ప్రయత్నించియు   విఫలుడ్తె తన కామాగ్నిచేతనే  దహింపబడి, యామె  యత్మనార్ధము చేసికోనలేక అంధకారమున నిరాశచెంది అతడు క్రూరత్వమును వహించెను.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra