Home » Mainanpati bhaskar » The Editor


    "మా నాన్నగారు డిస్ట్రిక్ట్ జడ్జ్! మీకు తెలిసే వుంటుంది." అంది హరిణి కామ్ గా నిశ్శబ్దంగా బాంబ్ పేలుస్తున్నట్లు" ఓ ఐ సి......." అన్నాడు ఎడిటరు. ఈ అమ్మాయి ఒక లీడింగ్ లాయర్ గారికి చెల్లెలు. ఇంకో జడ్జిగారికి కూతురు! ఆమె పేరుతొ ఎవరో కధ రాసి పంపితే అది అచ్చు వేశారని నోటీసు!
    తమ మీద పరువు నష్టం దావా. లక్ష రూపాయలకు!
    దీసీజ్ ట్రబుల్! మీనింగ్ లెస్ ట్రబుల్.
    ఇందాక తన మీద దావా వేసానన్న ధనుర్భాణుడనే ఆసామిని సమయస్పూర్తితో చాకచక్యంగా నోరు మూయించి పంపెసినంత సులభం కాకపోవచ్చు ఈ కేసు.
    అసలు ఈ తప్పు ఎలా జరిగింది?
    మనసులోనే పాత సంచికలు తిరగేశాడు ఎడిటరు. అతని ఫోటో గ్రఫిక్ మెమొరీ రెండు వారాల క్రితం ప్రింటైన ఆ కధను అతని మనోఫలకం మీద ప్రాజెక్ట్ చేసింది.
    అవును మంచి మలుపు ఉన్న కధ అది. మంచి నేరేషన్! అందుకనే పబ్లిష్ చేశాడు తను.
    కానీ అప్పుడే సబ్ కాన్షస్ లో సన్నగా ఒక అనుమానం.
    ఒక ఆడపిల్ల ఇలాంటి కధ రాయగలడా అని.
    ఆ అనుమానం ఇవాళ పెనుభుతంలా నిజమై నిలుస్తోంది తన ఎదుట.
    ఈ అమ్మాయి హరిణి లాయర్ల ఫ్యామిలిలో నుంచి వచ్చింది.
    బహుశా తనూ లాయరే అవుతుందేమో.
    చీమ చిటుక్కుమంటే అలర్టుగా అయిపోయే ఆ చూపులు సిరియస్ గా ఇంటలిజెంట్ గా కనబడే మొహం మాటల్లో చేతల్లో ఆత్మవిశ్వాసం........ప్రమోడంతో ప్రమాదాలని వెతుక్కుంటూ వెళ్ళే ప్రమిదలా కనబడుతోంది తను. చాలెంజింగ్ అడ్వెంచర స్ సార్ట్! అంతే గానీ అమ్మ కొంగుచాటున దాక్కునే అమ్మాయిలా కనబడటం లేదు.
    "యా! దిసీజ్ రియల్ ట్రబుల్!"
    అప్పుడు ----------
    "మే ఐ కమిన్" అని వినబడింది ఒక గొంతు.
    ఆ గొంతు వినగానే చటుక్కున తలుపు వైపు చూశాడు ఎడిటర్.
    ఎడిటర్ ఊహించని విధంగా అక్కడ నిలబడి వున్నది!
    
                                                          7

    అంతకు గంట క్రితం ---
    గేటు తెరిచి తన మోపెడ్ బయటకు తీశాడు అభిషేకన్.
    దూరం నుంచి ఒక స్త్రీ స్కూటర్ మీద రావడం కనబడింది అతనికి. తక్షణం కలుగులోకి ఎలుక దూరిపోయినట్లు తన ఇంట్లో దూరిపోయాడు అభిషేకన్. కాసేపయ్యాక తొంగి చూసి, స్కూటర్ లీడీ వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసుకున్నాక, బయటకు వచ్చి తన మోపెడ్ ఎక్కాడు. అతనికి స్కూటర్ నడపడం రాదు. తను చెయ్యలేని పనులు ఇంకెవరన్నా చేస్తే అతనికి రక్తకన్నీరు వచ్చేస్తుంది, విపరీతమైన ఇన్ ఫీరియరిటీ కాంప్లెక్స్ ఉంది అతనికి. ఆ ఇన్ ఫియారిటీ కాంప్లెక్స్ జేలసీగా మారి బయటకు ఉబుకుతూ వుంటుంది. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి అతను కేరెక్టర్ అసాసినేషన్ కి పాల్పడుతూ ఉంటాడు . అందరి మీద అపనిందలు వేస్తూ ఉంటాడు.
    నిందలు మోపి , నిలువునా పరువు తీసెయ్యడానికి అక్రమ సంబంధాలు అంటగట్టడం కంటే అనువైన పని ఏముంది?
    దానిలో ఎక్స్ పర్టు అతను.
    స్కూటర్ మీద దూరమైపోతున్న స్త్రీ ని ఈర్ష్యతో చూసి "మొగరాయుడిలా స్కూటర్ మీద సవారీ చేస్తోంది. డిఫనేట్ గా దీందీ బేడ్ కేరెక్టర్ అయి వుండాలి" అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత అతని ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ కాస్త సద్దు మణిగింది.
    ఉదయార్కర్ ఉన్న నర్సింగ్ హోమ్ చేరుకున్నాడు అభిషేకన్. పొద్దున్న అతని కేకలు విని కారు ఆపిన పుణ్యత్ముడే తెలివి లేకుండా పడివున్న ఉదయార్కర్ ని నర్సింగ్ హోమ్ లో చేర్చాడు. జేబులో నుంచి పర్సు బయటకు తియ్యవలసిన సీను వచ్చేసరికి ఫేడ వుట్ అయిపోయిన అభిషేకన్ , మళ్ళీ యిప్పుడు ఫ్రేం లోకి జొరబడ్డాడు.
    రిసెప్షన్ లో అడిగి, ఉదయార్కర్ మొదటి అంతస్తులో ఉన్నాడని తెలుసుకున్నాడు అభిషేకన్.
    "ఐయామ్ క్రేజీ అబౌట్ టామిల్,
    షీ ఈజ్ క్రేజీ అబౌట్ టామిల్,
    టామిల్, ది జింగ్ థింగ్'
    అని గోల్డ్ స్పాట్ అడ్వర్ టేయిజ్ మెంట్ పాట బాణీలో కూనిరాగం తీస్తూ చెంగుచెంగున మెట్లేక్కేశాడు అభిషేకన్.
    బెడ్ మీద నీరసంగా పడుకుని ఉన్నాడు ఉదయార్కర్. అతని తరపు వాళ్ళు గది బయట వేసి వున్న ఫైబర్ గ్లాస్ కుర్చీలో దిగాలుగా కుర్చుని వున్నారు.
    "ఎట్లా ఉన్నారు సార్!" అని మాట వరసకు ఉదయార్కర్ ని అడిగి, దానికి అతను చెప్పిన సమాధానం వినకుండానే "దండగండీ! ఇక్కడి హాస్పిటల్సు, ట్రీట్ మెంటు- అబ్బే లాభం లేదండీ --------ఇదే టామిల్ నాడులో అయితేనా ------అబ్బ! ఎంత బావుంటుందో!" అని బుర్రున ఎగశ్వాస పీల్చి, "లెట్రిన్ లో నుంచా వాసనా! ఛీ! ఛీ! అబ్బ టామిల్ నాడులో అయితేనా! లేట్రిన్లలో సెంటు వాసన వస్తూ ఉంటుందండీ" అన్నాడు ఉత్సాహంతో వళ్ళు మర్చిపోయి.
    ఫినాయిల్ తో లెట్రిన్స్ క్లీన్ చేసి బయటకు వచ్చిన స్వీపరు అతని మాటలకు కిసుక్కున నవ్వింది.
    వెంటనే మూతి చుంచులా పెట్టి చూశాడు అభిషేకన్. అవమానాన్ని కవర్ చేసుకోవడానికి ఏమనాలా అని అలోచించి "ఇక్కడ డాక్టర్లూ, నర్సులూ, ఎవరూ లేరా? చూశారా! నే చెప్పలేదూ! దండగండీ! ఇదే టామిల్ నాడులో అయితే ప్రతి పది నిమిషాలకి డాక్టరు వచ్చి చూస్తూనే ఉంటారు. అబ్బే యిక్కడివాళ్ళకి లాభం లేదండి చూస్తూ ఉండండి! మిమ్మల్ని నెలరోజులపాటు మంచంమీదే ఉంచేస్తారు. ఈలోగా మీరు శవంలా మారకపోతే" అన్నాడు శకునపక్షిలా.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra