Home » D kameshwari » Jeevitham Chejaraneeyaku

    'ఏమయినా నా మటుకు నేను నిర్మల ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను - నేనా పరిస్థితిలో ఉంటే చచ్చినట్లు సహించేదాన్నేమోగాని విడిపోయి వచ్చేసే ధైర్యం వుండేది కాదు.' సుప్రియ అంది.   
    "ఆ.... ఈ ధైర్యం అమ్మ నాన్నల్ని చూసుకుని. వాళ్ళు దాటిపోయాక అప్పుడు అర్థం అవుతుంది ఈవిడకి. అయినా పెద్దవాళ్ళయి వుండి కూతురికి నచ్చ చెప్పాల్సింది పోయి వాళ్ళూ ఈవిడగారితో ఎగిరిపడటం ఏమిటో!" వరలక్ష్మి హేళనగా అంది.   
    నిర్మల ఇంకా వింటూ నిలబడలేకపోయింది - ఆమె మొహం ఎర్రబడిపోయింది. ఛ ఛా.... తన గురించి అందరూ ఎంతలా మాట్లాడుతున్నారు..... పైకి నవ్వుతూ మాట్లాడే వీళ్ళంతా లోపల ఇంత కుళ్ళు దాచుకున్నారు. మళ్ళీ అంతా చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. తోటి స్త్రీని ఇంత చులకన చేస్తారా? స్త్రీకి స్త్రీయే శత్రువు. మగవాళ్ళు మారాలి అని ఏడ్చే ముందు ఇలాంటి ఆడవాళ్ళు మారాలి. ఓ ఆడది భర్త దగ్గిర బాధలు, అవమానాలు సహిస్తూ పడివుంటే సానుభూతి చూపుతారు కాని, ధైర్యంగా తన బతుకు తాను బతికితే ఎవరూ చూడలేరు..... హర్షించలేరు. తోటి స్త్రీని స్త్రీలే అర్థం చేసుకోలేకపోతే ఈ స్త్రీజాతికి పురోగమనం ఎప్పుడు?- ఆవేశంగా విసురుగా రూంలోకి అడుగు పెట్టింది. నిర్మలని చూడగానే అందరి నోళ్ళు ఠక్కున మూత పడ్డాయి మొహాలు చూసుకున్నారు. నిర్మల మాడిపోయిన మొహం చూసి తమ మాటలు విందని గ్రహించారు. మాధవి తడబడి "అదేం, క్లాసు లేదా మీకు ఇప్పుడు?" అంటూ పలకరించింది.  
    "ఏం, అలా వున్నారు? మొహం ఏమిటి అలా వాడిపోయింది?" సుప్రియ ఏదో అనబోతుంటే నిర్మల అందరివంకా ఒకసారి చూసి "వంట్లో బాగోలేదు. ఇంటికి వెళ్ళిపోవాలని వచ్చాను. పర్మిషన్ తీసుకుని ఇలా రావడం మంచిదయింది. మీకు నా గురించి వున్న అభిప్రాయాలు తెలిశాయి. థేంక్స్..... వస్తాను' అంటూ వడివడిగా వెళ్ళిపోయింది.   
    ఆ తరువాత కాలేజీలో తన పని తాను చేసుకుంటూ ముభావంగా గడపడం అలవాటు చేసుకుంది నిర్మల. దాంతో లైఫ్ మరీ డల్ గా అనిపించడం మొదలుపెట్టింది. క్లాసులు లేనప్పుడు కామన్ రూంలో సరదాగా తోటి లెక్చరర్లతో గడిపేది ఇదివరకు. ఇప్పుడు ఏదో పుస్తకం పట్టుకుని కూర్చుంటుంది. ఎవరన్నా ఏదన్నా అడిగితే సమాధానం చెప్తుంది.
    ఓ రోజు మాధవి నొచ్చుకుంటూ - "నిర్మలా, ఆ రోజు మామాటలు విని కోపం తెచ్చుకొన్నట్లున్నావు. ఇది వరకులా సరదాగా మాట్లాడ్డం మానేశావు" అంది.
    "సారీ నిర్మలా, నిన్ను విమర్శించాలని కాకపోయినా ఇలాంటి విషయంలో అందరికీ కుతూహలం ఉంటుంది. ఏం జరిగిందో తెల్సుకోవాలన్న ఆరాటంతో పాటు, తమకులేని ధైర్యం ఇంకొకరికుందని మెచ్చుకునే వాళ్ళతోపాటు, విమర్శించే వాళ్ళూ ఉంటారు కదా? దానికోసం నీవింత హార్ట్ అవడం బాగులేదు" అంది. మరికాసేపాగి.
    "మాధవీ!..... నేనేం నా విషయాలు మీ దగ్గిర దాచలేదు. మీరూ చదువుకున్నారు. ఏ ఆడదీ సుఖంగా, సంతోషంగా వుంటే కాపురం వదులుకునిరాదు. భర్తతో మనస్పర్థలు వస్తే, ఆ ఇంట్లో, ఆ కాపురంలో తనకింక సుఖశాంతులు దొరకవు అని నిశ్చయంగా తెల్సుకున్నాకే గడప దాటుతుంది. ఇదివరకటి స్త్రీ అయితే గడపదాటి వచ్చే సాహసం వుండేది కాదు. కాని కాస్త చదువుకుని, ఆర్ధిక స్వాతంత్ర్యం ఉన్న స్త్రీ కూడా ఆ నరకంలో మగ్గాలని మీరంతా ఇంకా ఆశిస్తున్నారంటే నాకు బాధ అన్పించింది. అంత తేలిగ్గా ఇంకో ఆడదాన్ని విమర్శించే ముందు మనమూ అదే స్థితిలో ఉంటే? అని ఒక్క క్షణం ఆలోచిస్తే అంత సుళువుగా మాటలు జారరు" ఆవేశంగా అంది నిర్మల.
    "సారీ నిర్మలా! ఫర్ గెట్ ఇట్ ప్లీజ్..... మనందరం ఒక ఫామిలిలా ఇక్కడ పనిచేస్తున్నాం. నీవలా మొహం మాడ్చుకుని వుంటే నేను చాలా గిల్టీగా ఫీలవుతున్నా" అంది, స్నేహపూర్వకంగా చెయ్యిపట్టుకుని.
    అయినా ఆ తరువాత నలుగురితో మాట్లాడినా, పూర్వంలా అందరితో కలివిడిగా గడపలేకపోయింది నిర్మల.
    ఇంట్లో కూడా నిర్మల మాట్లాడటం తగ్గిపోయింది. పూర్వంలా చలాకీగా తిరగని కూతుర్ని చూసి శివశంకరంగారు మథనపడటం మొదలుపెట్టారు. ఎలాగైనా సరే కూతురికి రెండో పెళ్ళి చెయ్యాలన్న ఆరాటం మొదలైంది ఆయనలో. రెండేళ్ళయింది కనక అల్లుడే మన్నా కాస్త మెత్తబడి డైవోర్స్ ఇవ్వడానికి అంగీకరిస్తాడేమో? అతను మాత్రం ఎన్నాళ్ళు వంటరిగా వుంటాడు? ఈ పాటికి ఆ ఆవేశం తగ్గి వుంటుంది అనిపించింది.  
    తండ్రికాక లాయరుగా తన క్లయింట్ విడాకులు కోరుతోందనీ విడాకులు ఇష్టం లేకపోతే పరస్పర అవగాహనతో సెపరేషన్ అయి ఇద్దరూ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోడానికి పర్మిషన్ తీసుకోవడానికి తన క్లయింట్ ఇష్టపడుతుందని లాయరు నోటీసు పంపించారు. పదిహేనురోజుల తర్వాత అల్లుడి తరపు లాయరు "తన క్లయింట్ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా లేడనీ, మీ క్లయింట్ కి కావలిస్తే కోర్టు కెక్కి తీసుకోవచ్చనీ" జవాబు పంపాడు.  
    అల్లుడి పగ, ప్రతీకార వాంఛ శివశంకరంగారికి అర్థమయింది. ఇదంతా ఆయన కూతురికి చెప్పక తప్పలేదు ఈసారి. అల్లుడిని ఏ విధంగా లొంగదీసుకోవాలా అని ఆయన రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉన్నాడు. తనామాట చెప్పగానే కూతురి మొహం కళ తప్పడం చూసి ఆయన మరింత దిగులుపడ్డారు.
    "అల్లుడికి ఓ ఉత్తరం రాయండి. ఎన్నాళ్ళిలా పంతాలు పట్టింపులు? దాని మొహం చూస్తున్నారా..... కళా, సంతోషం ఏం లేవుదాని మోహంలో" అంది శారదాంబ ఓ రోజు.
    "ఏం రాయమంటావు - నా కూతుర్ని తీసుకెళ్ళి మళ్లీ ఏలుకో అని బతిమిలాడుతూరాయమంటావా?" ఉరిమారు ఆయన.
    "అయ్యోరాత. మాటకి ముందు గయ్య్ మంటారు. ఆడపిల్లని కన్నాక ఇంత పంతం, పట్టింపు వుండకూడదు. రెండేళ్ళయింది. అతను కాస్త మారి వుంటాడు. ఎవరన్నా పెద్దవాళ్ళని తీసుకెళ్ళితే సంధి కుదురుతుందేమో......"      
    "సంధీ లేదు, ప్రేలాపనాలేదు, నీవు మాట్లాడకు. అతనికెంత పొగరో నీకేం తెలుసు? విడాకులు ఇస్తే అది ఎక్కడ మళ్ళీ పెళ్ళి చేసుకుని సుఖపడిపోతుందోనని పగతో విడాకులు ఇవ్వకుండా కూర్చున్నాడు. ఎన్నాళ్ళు పెళ్ళి చేసుకోకుండా తనూ ఉంటాడో నేనూ చూస్తాను. అప్పుడు వాడి ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు."
    "అతనికేం మగవాడు! ఆడది కావాలంటే పెళ్ళే అక్కరలేదు అతనికి. మన అమ్మాయి అలాకాదుగా? అతను ఒప్పుకున్నా రెండో పెళ్ళి ఈ దేశంలో అంత సుళువనుకుంటున్నారా? పెళ్ళయి ఆరునెలలు కాపురం చేసిన దాన్ని చేసుకోడానికి ఎవరొస్తారు? వచ్చినా అది మీరిచ్చే లక్షలకోసం రావాలి. అలా వచ్చేవాడితో పెళ్ళి ఎంత సంబరంగా వుంటుందో మీకూ తెలుసు."              

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra