Home » Kommuri venugopala rao » Mahaapravaaham

                   
    సూర్య చంద్ర పాపను ఆమె యింటికి దగ్గర్లో కారులో దిగవిడిచి వెనక్కి వెళ్ళిపోతోంటే ఆమె  యీ ప్రకృతిలో వంటరిగా మిగిలిపోయినట్లు, ప్రపంచమమంతా శూన్యమావహించినట్లు.... గుండె బరువెక్కిపోయి కొంతసేపలా నిలబడి పోయింది. తర్వాత  నెమ్మదిగా కదిలి యింటివైపు అడుగులు వేసింది.

    
    అప్పటికి చీకటి పడింది. వరదరాజు యింటిముందే మంచం మిద కూచుని కూతురికోంస చూస్తున్నాడు.ట పాప దగ్గరకొచ్చి 'నాన్నా'  అని ఏదో అనుబోతూండగా  "ఎవరతను?" అన్నాడు గర్జుస్తూన్నట్లుగా.


    "నాన్నా" అంది పాప ఉలికిపాటుగా.


    " చెప్పు. ఎవడు వాడు? ఇంతసేపూ కారులో వాడితో ఎక్కడెక్కడ కులికివస్తున్నావు?"


    "  నాన్నా! ఆయన గురించి  వాడూ  వీడూ  అనొద్దు బాబూరాగు."


     వరదరాజు మంచంమిద నుంచి లేచి నిబడ్డాడు. కళ్లు ఎర్రబడ్డాయి. మనిషి వుద్రేకంతో ఊగిపోతున్నాడు.

    
      " ఎవడే ఆ  బాబుగారు?  లం..... ఇన్నాళ్ళూ నువ్వు  బుద్ధి మంతురాలివనుకున్నాను. నువ్వుకూడా తిరుగుళ్ళు నేర్చావన్నమాట."


    పాపకా మాటలు వింటూంటే వొళ్ళంతా  జలదరించి నట్లయింది.

    
     "నాన్నా! అలా అసహ్యంగా మాట్లాడకు..."


    "వెధవ పనిచేసింది చాలక నన్నే ఎదురిస్తున్నావా లం.... చూడు  నిన్నేం చేస్తానో" అంటూ ముందుకొచ్చి ఆమె జట్టుపట్టుకుని యీడ్చాడు.అటూ యిటూ కుదిపి క్రిందపడే శాడు. కాళ్ళతో తన్నాడు. అలా కొడుతున్నంతసేపూ పచ్చి బూతులు తిడుతూనే వున్నాడు.


    దెబ్బలు తిని తిని చివరకు పాపసొమ్మసిల్లిపడిపోయింది.

    
                                        11


    సూర్యచంద్ర రెండు మూడు రోజులు చాలా అశాంతితో బాధపడ్డాడు. అతన్లోని కళాకారుడు తికమక పడుతూ. ఏదో చెప్పాలని ఆరాటపడుతూ- ఊపిరాడనివ్వటం లేదు. రాయాలి. రాస్తేనే  తనకు ఉపశాంతి.ఏం రాయాలి? ఈ ప్రపంచంలో ఎవరికో ఎక్కడో నిరంతరం అన్యాయం జరుగుతోంది. ? అదేమిటి? ఈ విశ్వరహస్య  మెక్కడుంది?


    మొదట్నుంచీ తల్లీ తండ్రినీ తమ యింటికొచ్చే విలాస వంతుల్నీ, వాళ్ళ జీవితపు పోకడలూ, వాటిలోనివికృతా లనీ గమనిస్తూన్నాడు.  అందదని, కనిపించని ప్రరంచం వేరొక్కడో వుంది. అందులోనిబాధల్నీ , వేదనల్నీ , మూగరోదనల్నీ వెలికి తియ్యాలి. ఈ అరాచకపు అట్టహాసాల బాహ్యాడంబరాల కృత్రిమ పొరల్ని ఛేదించాలి.    


     రాత్రింబవళ్లు ఆలోచించి ఓ యితివృత్తం తయారు చేశాడు.  ఆ తర్వాత మూడు నాలుగు రోజుల్లో ఓ కథ రాసేశాడు.

    
     అది తీసుకుని ఊళ్ళోని ఓ ప్రముఖ వారపత్రిక ఆఫీసు కెళ్ళాడు.    


    ఆ పత్రిక ఎడిటర్ అరవై ఏళ్లు దాటినవాడు. ఇంత వరకూ జీవితమంతా పత్రికా రంగంలోనే గడిపేశాడు. మారుతోన్న పాఠకుల అభిరుచులూ , సాహిత్యపు విలువలు,ఎప్పటి కప్పుడు జాగ్రత్తగా ఆకళింపు చేసుకుంటూ, తదనుగుణంగా పత్రిక రూపురేఖల్ని మారుస్తూ సర్క్యులేషన్ వీలయితే పెంచుతూ , లేకపోతే పడిపోకుండా జాగ్రత్తపడుతూ నెట్టుకువస్తున్నాడు.

    
     సూర్యచంద్ర ఆయన నమస్కారం చేసి తాను రాసినకథ టేబిల్ మిద వుంచాడు.

    
    ఆ సంపాదకుడు ఒక రకంగా చాలా అహంభావి. సాహిత్యం గురించి ప్రపంచంలో తనకు తప్ప ఇంకెవరికీ తెలీదనుకుంటాడు.


    " ఏమిటిది?" అన్నాడు.


    "కథ."


     చేతిలో తీసుకొని ఓ నారి పేకజీలన్నీ తిరిగేశాడు .ఆఖరికి కథపేరు,రచయితపేరు చూశాడు.


    "ఇదేమిటి మంజరి అని వుంది. మంజరి అంటే ఎవరు?"


    "నేనే" అన్నాడు సూర్యచంద్ర సిగ్గుపడుతూన్నట్లుగా


    "ఓహో! పెన్ నేమ్ గావును" అన్నాడు.  అతని మాటల్లో కొంచెం వ్యంగ్యముంది. సూర్యచంద్రఏమి జవాబివ్వలేదు.


    "కొంతమందికి అదో మేనియా.ఇదివరలో 'శారద'  అని ఓ రచయిత వుండేవాడు. అసలు పేరు నటరాజన్. తమిళుడు అఫ్ కోర్స్ ఆంధ్రాలో సెటిల్ అయిపోవటంవల్ల; తెలుగువాడి క్రిందే లెక్క  అనుకోండి. ఇప్పుడు మనం  అజహరుద్దీన్ ని తెలుగువాడని చెప్పుకుంటూన్నట్లు , హైదరాబాద్ లో వుంటే తెలుగువాడనే లెక్క. ఆ మధ్య గగన మండలంలో దిగ్విజయంగా రాకెట్ యాత్రచేసి వచ్చిన రాఖేష్ శర్మని మన వాడని చెప్పుకున్నట్లు... ఇప్పుడెవరి గురించి చెబుతున్నానూ? ఆశారద  గురించి తెనాలిలో హోటల్ సర్వర్గా పనిచేసే వాడు. ఆరోజుల్లో అతని నవలవేసి వంద రూపాయిలిచ్చాం. అతని కథలు, నవలలూ చాలా ప్రచురించాను నేను. వారానికీ, పదీ రోజులకి వచ్చి నాదగ్గర కాఫీకని రూపాయీ, రెండూ తీసుకెడుతూ వుండేవాడు . తర్వాత పాపం.... టి.బి.తో చచ్చిపోయాడు.


     సూర్యచంద్రకు ఏం చెప్పాలో తెలీక మౌనంగా వూరుకున్నాడు.

    
     "సరే. ఆ సంగతలా వుంచండి. ఇప్పుడేమన్నారూ?కథ రాశానంటారా?"    


    " అవునండీ"


    " ఊహు. అయితే కథ రాశానంటారు."


    "అవునండీ."


    " దేనిమిద రాశారు?"


    సూర్యచంద్ర మొహమాటపడుతూ కథ చెప్పాడు.


    " ఊహు. మికు కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నట్లున్నాయే. సరేసరే. వుంటే తప్పేమిలేదుకాని- యివన్నీ పాతమెడల్ కదా. ఇప్పుడు కొత్తగా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కదా యువరచయితలు, మిలాంటి కుర్రాళ్ళు అలాంటి ప్రయోగాలు చెయ్యుచ్చుకదా."


    " చెయ్యవచ్చు. కాని వాస్తవికంగా రాయాలని..."


    " వాస్తవికంగా రాయటంవల్ల ప్రయోజన మేమిటి?"


    " పాఠకులముందు నిజజీవితాన్ని పర్చాలని... "


    "ఓహో! అలానా?అయితే యిక్కడో పాయింటుంది గమనించారా మేస్టారూ? వాస్తవికతలోంచి వచ్చేవి పాత కథలే కాని కొత్తవి రావు. మిరెంత అవస్థపడినా, ఎంత శ్రమించినా వాస్తవికత  జోలికి పోయారంటే వెనక్కి పోతున్నారన్నమాటే. ఓఎడిటర్ ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని ఆశ్చర్యంగా వుందా? నేనెప్పుడూకొత్తగా వెతుకుతూంటాను. వెరైటీ, ప్లాష్, నూతనత్వం థ్రిల్- ఇవి కావాలి కొత్త సాహిత్యానికి. అసలు సంప్రదాయం కోసం కొన్ని కథలు వెయ్యాలని వేస్తున్నాం కాని యీ రోజుల్లో  కథలెవరు చదువుతున్నారండీ? సీరియల్స్, సీరియల్స్ యుగమిది.ఆ సీరియల్స్ లో కూడా పరిశోధనాత్మక మవలలు. మికు కావాలంటే అద్భుతమైన విషయాలిస్తాను.ఆడవాళ్ళ జాకెట్ల మిద పరిశోధించి ఆరొందల పేజీలు ఎడా పెడా రాయొచ్చు. షేపు జాకెట్లు, స్లీన్ లెస్ జాకెట్లు , పొడవు చేతులున్న జాకెట్లు.... యిలా జాకెట్స్ మిద, లేకపోతే ఎగ్జిబిషన్ అనేదున్నందనుకోండి. అది ఎలా కండక్ట్ చేస్తారు? దాని నిర్వాహకులు చేసే మోసాలు , ఇక్కడ మోసాలు చేస్తారా లేదా అన్న ప్రశ్న అవసరం నెగిటివ్ సెన్స్ నే పాఠకులు రిసీవ్ చేసుకుంటారు.  ఒకరు మంచివాడు అంటే అందులో థ్రిల్ లేదు.  మంచివాడుగా కనిపించే ఒకడ్ని చెడ్డవాడిగా నిరూపిస్తే అది గొప్పగా  రిసీవ్ చేసుకుంటారు. అందుకని నిర్వాహకులు మోసం చేస్తారు అని రాసి పారెయ్యాలి. దానిమిద చాలా పరిశోధనలు చేసినట్లు పోజు పెట్టాలి. అందులో రంగుల రాట్నామెలా తిరుగుతుందో, జయింటే వీల్ ఎలా పనిచేస్తుందో, ఆ జయింట్ వీల్ ఎంత ఎత్తుకు లేచి తిరుగుతుందో, స్టాల్స్ ఏ యే అద్దెలకు ఎంత కమిషన్ మిద యిస్తారో, ఎగ్జిబిషన్ లో అమ్మేపచ్చిమిరపకాయ బజ్జీలకూ, బయట అమ్మేవాటికి తేడా ఏమిటో ,యిలా ఎన్నిటిమిదయినా యిన్ వెస్ట్ గేట్ చెయ్యెచ్చు. ఇంజన్ డ్రైవర్, ఫైలెట్ ఆఫీసర్, హోటల్ సర్వర్, కాలేజి లెక్చరర్... దేనిమిదయినా ముప్ఫయి వారాలు రాయెచ్చు. ముప్ఫాయి వారాలు. ముఫ్పయి ట్విస్ట్ లు... అంతే ...కనుక అబ్బాయీ! యీకథ తీసుకెళ్లు. నేను చెప్పి న యాంగిల్స్ నుంచీ పెద్ద నవలొకటి రాసి పట్టుకురా."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra