Home » Yandamuri veerendranath » దుప్పట్లో మిన్నాగు


    అతడెవరో తెలియగానే నా మొహంమీద నవ్వు మాయమైంది. భయంతో బిర్రబిగుసుపోయాను. నా భయాన్ని గమనించి, అతడు మిగతావారు చూడకుండా నావైపు చూసి నవ్వాడు. అయినా నా భయం తగ్గలేదు. అతడు చొరవగా కుర్చీ లాక్కొని నా పక్కన కూర్చున్నాడు. ఇక తప్పదన్నట్టుగా నా స్నేహితులకి పరిచయం చేయవలసి వచ్చింది.
    "ఈయన శ్రీరామ్. డాక్టర్ శ్రీరామ్" అని తప్పు పేరుతో పరిచయం చేశాను.
    నా స్నేహితులు ఒక్కొక్కరే పట్నాయక్ తో కరచాలనం చేశారు. "డాక్టర్ శ్రీరామ్ ది ఈ వూరే. ఈయన  'రక్త ప్రసరణం- దానిలో హెచ్చుతగ్గులు' అన్నవిషయానికి, మనిషి మానసిక స్థితికీ వున్న సంబంధం మీద ప్రయోగంచేసి డాక్టరేట్ సంపాదించారు. దానిమీదే ఈయన కనిపెట్టిన యంత్రం 'ట్రూత్ టెల్లర్' ప్రస్తుతం శాస్త్రజ్ఞుల పరిశీలనలో వుంది.
    "కొన్నాళ్ళ క్రితం ఇదే పరికరాన్ని ప్రొఫెసర్ పట్నాయక్ కనుక్కున్నారటగా" అన్నాడు విజ్జి. వీడి జ్ఞాపకశక్తి మండిపోను అనుకున్నాను. పట్నాయక్ మాత్రం ఆ మాటలకి ఏ మాత్రం  బెదరకుండా నవ్వి, అవునన్నాడు.
    అక్కడున్న నలుగురిలో అకస్మాత్తుగా ఉత్సాహం పెరిగింది. "డాక్టర్! మీరు  కనుక్కున్న పరికరం శాస్త్రజ్ఞులు ఓ.కే. చేస్తే, ఇక కోర్టుల అవసరం వుండదా?" అని అడిగాడు శేషు.
    "ఉంటుంది" అన్నాడు పట్నాయక్. "మనిషికి తాను అబద్ధం చెప్తున్నానని తెలుస్తేనే, తిరిగి ఆ విషయం రెట్టించి అడిగినప్పుడు అతడి రక్త ప్రసరణం హెచ్చి ఆ విషయం మనకి తెలుస్తుంది. దాయాదుల మధ్య గొడవలూ, అన్నదమ్ముల ఆస్తి గొడవలూ వీటి గురించి కోర్టులు ఎలాగూ వుండాలి తప్పదు. అదీగాక మనిషి తను తప్పు చేయలేదని గాఢంగా నమ్మితే 'ట్రూత్ టెల్లర్" ఆ విషయాన్ని కనుక్కోలేదు".
    "తన  రక్తప్రసరణ మీద, మానసిక సంచలనం మీదా తనకి కంట్రోలున్న మనిషి అయితే.....?" అడిగాడు విజ్జీ.
    "ఎంతస్థిరత్వం వున్న మనిషి అయినా, అబద్ధం చెప్పేటప్పుడు ఆటోమాటిక్ గా కొంచెం బెదురుతాడు. అది చాలా నా మిషన్ కి" అని చేతిలో బి.పి. ఆపరేటస్ లా  వున్న దాన్ని బల్లమీద పెట్టి నావైపు చూసి నవ్వాడు. నా మొహంలో ఇప్పుట్లో నవ్వు కనబడే జాడలు లేవు అని గ్రహించి నా మిత్రుల వైపు తిరిగి విజ్జీతో "మీ వయసు మీకు తెలుసు కదా" అన్నాడు.
    విజ్జీ తలూపాడు.
    "అదికూడా వుండేటట్టు మూడు అంకెలు ఏవైనా చెప్పండి."
    "45, 46 , 48" అన్నాడు విజ్జీ.
    "మీ చెయ్యి ఇలా ఇవ్వండి."
    విజ్జీ చెయ్యి అందించాడు. దాన్ని అందుకుని "మీ వయసు 45. అవునా? కాదా?" అని అడిగాడు.
    "అవును."
    "మీరు అబద్ధం చెపుతున్నారు."
    విజ్జీ నవ్వి తలూపాడు. పట్నాయక్ ఇంకా కొనసాగించాడు.
    "మీ వయస్సు 46. అవునా? కాదా?"
    "కాదు"
    "మీరు అబద్ధం చెపుతున్నారు. మీ వయసు 46."
    "కరక్టే"
    ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొట్టారు. నా స్నేహితులు అతడివైపు ఆరాధనా పూర్వకంగా చూడటం నాకు ఆనందం కలిగించింది.
    "ఇంత గొప్ప విషయం కనుకున్నా కూడా మీ పేరు ఎక్కడా పేపర్లో రాలేదేమిటి సార్?" అని అడిగాడు శివ.
    "నా కన్నా ముందు దీన్ని పట్నాయక్ కనుక్కున్నాడుగా" నవ్వాడు.
    "అవును. దానిమీద ఆ రోజుల్లో చాలా గొడవ అయింది. పేపర్లో చదివాము. అసలు ఆ పరికరాన్ని పట్నాయక్ కనుక్కోలేదనీ, తనే కనుక్కున్నానని మరో వ్యక్తి...... ప్రొఫెసర్  రామన్ వెల్లడించడంతో అన్ని వర్గాల్లోనూ సంచలనం  చెలరేగింది."
    "అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎవరైనా ఒకరు ఒక గొప్ప విషయం కనుక్కున్నా, ఒక కొత్త అధ్యాయం తెరిచినా, అది సొంతం కాదనీ తాము సాయం చేశామనీ, ఆ ఆలోచన తమదేననీ మరికొందరు వ్యక్తులు కుక్కగొడుగుల్లా లేవటం  వున్నదేగా? ఈ విషయంలో పట్నాయక్ చేసిన తప్పేమిటంటే, తను కనుక్కున్న రీసెర్చి తాలూకు రిపోర్టు రామన్ కి చూపించి అతడి సలహాలు తీసుకోవటం! దాంతో రామన్ ఇదంతా తనదే అని అనటం ప్రారంభించాడు."
    "కానీ అలా రామన్ వెల్లడించగానే పట్నాయక్ అతడిని హత్య చేసేశాడుగా" అన్నాడు వెంకూ.
    నేను వూపిరి బిగపట్టాను. పట్నాయక్ విషయం వీళ్ళందరికీ తెలుసునన్న మాట. పేపరులో చదివే వుంటారు. అతడి ఫోటో చూడక పోవటం, చూసిన గుర్తుపెట్టుకోకపోవటం నా అదృష్టం.
    పట్నాయక్ అన్నాడు- "సైంటిస్టులూ, కళాకారులూ చిన్న పిల్లల్లాటివాళ్ళు, వాళ్ళ సెంటిమెంట్ కు ఏ మాత్రం  భంగం వాటిల్లినా తల్లడిల్లిపోతారు. అహోరాత్రాలూ కష్టపడి తయారు చేసుకున్న తాన్ ధీసెస్ 'రచన' ని ఎవరో ఇంకో అనామకుడు వచ్చి  అది తనదే అంటే పిచ్చేక్కక ఏమవుతుంది? అందుకే ఆ ఉక్రోషంలో హత్య చేశాడూ అంటే అది అతడి తప్పుకాదు......అలాంటి ద్రోహులు చస్తున్నా కూడా నోటిలో తలుసిదళపు తీర్థం పొయ్యకూడదు".
    అతడి మాటల్లో రామన్ పట్ల వున్న కసి గోచరమయింది. నా భయమల్లా అతడు ఈ ఆవేశంలో తనే పట్నాయాక్  అని ఎక్కడ చెప్పేస్తాడో అని. అదృష్టవశాత్తూ అలా జరగలేదు.
    "డాక్టర్ శ్రీరామ్!" అన్నాడు వెంకూ...... "కేవలం ఈ భయంతోనే మీరు కనుక్కున్నా ఈ విషయం గురించి ప్రపంచానికి తెలియజెప్పటం లేదా?"
    "అవును. ముందు శాస్త్రజ్ఞలు దాన్ని చూడాలి. నా పేటెంట్స్ రిజిష్టరు చేయించాను. పట్నాయక్ చేసిన తప్పు నేను చేయదల్చుకోలేదు."
    "పట్నాయక్ కనుక్కున్న ఆ మిషన్ సంగతి ఏమైంది?"
    "రామన్ ని హత్య చేశాక పట్నాయక్ దాన్ని ఎత్తుకుని అడవుల్లోకి పారిపోయాడు. తరువాత అతడిని పట్టుకున్నా అతడు చెప్పలేదు."
    "ఇప్పుడు చరిత్రలో ఈ మిషనుని కనుక్కున్నది ఎవరని వస్తుంది? మీరా? పట్నాయకా?"
    నాకు నవ్వు వచ్చింది. తమతో తీరిగ్గా కబుర్లు చెపుతున్న వాడు పట్నాయక్కే అని తెలిస్తే నా మిత్రుల పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకుంటే గమ్మత్తుగా వుంది. అటూ ఇటూ చూశాను. అదృష్టవశాత్తూ ఆ తెల్లవారుజామున ఆ రెస్టారెంట్ లో పోలీసులు ఎవరూ లేరు.
    పట్నాయక్ నన్ను చూపిస్తూ "ఇతడు నా కులంవాడే. నాకు బాగా కావలసినవాడు" అన్నాడు. అతడు ఈ సమయంలో కులం ప్రసక్తి తీసుకురావటం ఇబ్బందికరంగా వుంది. మేమిద్దరం ఒకే కులానికి సంబంధించిన వారం అయితే అయి వుండవచ్చు. అది వేరే సంగతి. నేను ఇబ్బందిగా కుర్చీలో కదిలాను. కాని నన్ను పట్టించుకోకుండా పట్నాయక్ అన్నాడు, "ఇతని స్నేహితులు కాబట్టి మీరూ నా స్నేహితులే. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే మీ నలుగురూ కలిసి నా స్నేహితుడిని మోసం చేశారు."
    ఉలిక్కిపడ్డాను. నాకేమీ అర్థంకాలేదు. నా ఎదురుగా కూర్చున్న నలుగురూ ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం గమనించాను.... నా వెనుక రహస్యంగా కుట్ర జరిగిందా? ఏమిటది?
    విజ్జీ కోపంగా...... "మేమేం మోసం చేశాం?" అని అడిగాడు.
    "హోటల్ బిల్లు ఇచ్చే విషయంలో కథలకి మార్కులు వెయ్యటం గురించిన మోసం."
    "మేమందరం కలిసే వున్నాం. మోసం గురించిన ప్రసక్తే లేదు."
    "అయితే మీ నలుగురూ మీ స్నేహితుడిని మోసం చెయ్యలేదంటారు."
    'లేదు."
    పట్నాయక్ తన మిషనుమీద ఒక చెయ్యి, విజ్జీ చేతిమీద మరొక చెయ్యీ వేసి తనే ఒక ఎలక్ట్రిక్ కండక్టర్ లాగా, "ఇపుడు చెప్పండి" అన్నాడు.
    "మేం నలుగురం కలిసి మా స్నేహితుడిని మోసం చెయ్యలేదు" అన్నాడు విజ్జీ, ఆ మిషన్ లో ఏ మార్పూ లేదు.
    "పోనీ నలుగురూ కాకపోతే, ఇద్దరిద్దరు....."
    "లేదు" అన్నాడు విజ్జీ. అతడు నిజమే చెపుతున్నట్లు మిషనులో మార్పులేదు కానీ పట్నాయక్ వదిలిపెట్టలేదు. "పోనీ మీరూ, మీ ఇంకో మిత్రుడూ కలిసి ఈ బిల్లు  ఎగగొట్టడానికి ప్రయత్నించారు" అన్నాడు.
    "లేదు" అన్నాడు విజ్జీ స్థిరంగా. కానీ అంతలో మిషను ముల్లులో సంచలనం కలిగి, అతడు అబద్ధం చెప్తున్నట్టు సూచించింది. విజ్జీ మొహం పాలిపోయింది.
    "అవున్నిజమే. నేనూ, శేషూ కలిసి టాయిలెట్ కి వెళ్లినప్పుడు మాట్లాడుకున్నాం" అన్నాడు.
    "అలాగే వెంకూ, శివా విమానం గురించి ఎంక్వయిరీ చెయ్యటం  గురించి వెళ్ళినప్పుడు వాళ్ళూ మాట్లాడుకున్నారు. ఆ విషయం మీకు తెలియదు కాబట్టి అది అబద్దమైనా, ఈ మిషన్ దాన్ని పట్టుకోలేకపోయింది. మొత్తానికి నలుగురూ కలిసి రెండు వేర్వేరు బాచీలుగా మీ  మిత్రుడ్ని మోసం చేశారు."
    నాకు అర్థంగాక "అసలేం జరిగింది" అని అడిగాను. పట్నాయక్ శివవైపు తిరిగి, "అసలేం జరిగిందో మీరు చెప్తారా, ఈ  మిషన్ సాయంతో చెప్పించ మంటారా?" అని అడిగాడు.
    శివ పాలిపోయిన మొహంతో "చెప్తాను" అన్నాడు.
    "నీ  కథ చాలా బావుంది శివా!" అన్నాడు వెంకూ. ఇద్దరూ ఎయిర్ పోర్టు ఎంక్వయిరీవైపు నడుస్తున్నారు. "చివరికి ఆ 'దుప్పట్లో మిన్నాగు' ఏమైందో చెప్పనేలేదు. కామాక్షమ్మగారి చీరలో దూరిందా? ..... డాక్టరేం చేశాడు? అంతా సస్పెస్నే."
    "నీ కథకూడా సస్పెన్సే. పెట్టెలో దూరిన 'మానవాతీత వ్యక్తి' అక్కడే చచ్చాడా, బ్రతికి బైట పడ్డాడా అన్నది చెప్పనే లేదు."
    "నీ సస్పెన్సు నువ్వు విప్పు, నా సస్పెన్సు నేను విప్పుతాను" అంటూ నవ్వాడు వెంకూ.
    అదే సమయానికి టాయిలెట్ వైపు నడుస్తున్న మరో ఇద్దరి మధ్యా ఇదే సంభాషణ జరుగుతూంది.
    "సముద్రంలో దూకిన దైవాధీనం ఏమయ్యాడు? నా ఒక్కడికీ చెప్పవా ప్లీజ్" అని అడుగుతున్నాడు శేషూ.
    "వరండా కుర్రాడి" లో నీ పాత్ర ఏమిటో చెప్తే నేనూ నా కథ ముగింపు చెప్తాను అంటున్నాడు విజ్జీ.
                        *    *    *
    "పెట్టెలోదూరిన మానవాతీత వ్యక్తి ఎవరో కాదు శివా, నేనే....." అన్నాడు వెంకూ.
    శివ అదిరిపడి "వ్వాట్?" అన్నాడు.
    "అవును. నాకు తెలిసిన చిన్న చిన్న ట్రిక్కులతో ఇలాగే మోసం చేసేవాడిని. మనుష్యుల్ని ఇబ్బంది పెట్టేకొలదీ సాడిస్టిక్ ఆనందం కలుగుతూ వుండేది. ఆపాప ఫలితంగా చివరికి ఆ పెట్టెలో అంతిమశ్వాస తీసుకునే పరిస్థితుల్లో ఇరుక్కున్నాను. ఎక్కడో ఏదో అదృష్టం బావుండబట్టి బ్రతికి బట్టకట్టాను. అప్పట్నుంచీ బుద్ధోచ్చింది. మజిక్కులు మానేశాను."
    శివ అనుమానం తీరక "అసలు గడుపుకి ముందే పెట్టె ఎలా తెరిచారు?' అని అడిగాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra