Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 19


    రెండోవైపు చాలా సమస్యలున్నాయి.

    ప్రపంచంలో చాలామంది బయోకెమిస్టులు  వున్నారు. కానీ తననే ఎందుకు ఎన్నుకున్నారు? తాను స్త్రీ కాబట్టి..... తాను 'మిస్' కాబట్టి.... తాను ఒకసారి వివాహమూ, విడాకులూ పొంది, జీవితపు రెండో భాగంలో వుంది కాబట్టి.

    అనూహ్య తెలివైంది. ఒకటికి ఒకటి కలిపి ఆలోచించగలదు.

    ఈ ప్రయాణం కొన్ని దశాబ్దాలపాటు జరుగుతుంది కాబట్టి అంతరిక్షయానంలో రెండోతరం ప్రయాణీకుల్ని తయారుచేయటమే వీళ్ల ఉద్దేశ్యమైనా తను ఆశ్చర్యపోదు. ఎక్కువమంది సభ్యుల్ని పంపటం ఎలానూ సాధ్యంకాదు కాబట్టి నిశ్చయంగా ఒక జంట అయినా కనీసం వుండేట్టూ చూసి వుంటారు. ఇప్పుడు తను వెళ్ళను అంటే మరో  బయోకెమిస్టుని అడుగుతాను.

    ఆమెకి వెంటనే వాయుపుత్ర గుర్తొచ్చాడు. టీమ్ లో తను వెళ్తూందని అతడికి తెలిస్తే..... ఆ షాక్ తట్టు కోగలడా?.... పార్క్ లో రోజు అంతా  ఎదురు చూసినవాడు జీవితాంతం తనకోసం ఎదురుచూస్తూ వుంటాడా? అలా వుండి పోతాడా?

    యశ్వంత్ తో తన జీవితం అయిపోయింది.

    వాయుపుత్రతో జీవితం పంచుకోవాలనుకుంది కానీ, ఇప్పుడు విధి మరో కోణంలోకి తనని తోసివేస్తోంది. వెళ్ళటం అంటూ వస్తే టీమ్ లో తను ఎవర్నో ఒకర్ని ఎన్నుకోవాలి. కంపేనియన్ గా వుండాలి! వీళ్ళు దీన్ని పైకి చెప్పారు. కాని ఆ  విషయం తనకు తెలుసని వీళ్ళకు తెలుసు. వీళ్లు ఇరవై ఒకటో శతాబ్దం మనుష్యులు. సెంటిమెంటు కన్నా  మెటీరియలిజం ముఖ్యం వీళ్ళకి.

    తను వెళ్ళనని అనొచ్చు. కారణం కూడా అడగరు. కానీ భయపడిందని ప్రసారం చేస్తారు. ప్రపంచాన్ని రక్షించే అవకాశం వచ్చినప్పుడు తప్పించుకుందని అనుకుంటారు. పార్టీల కెళ్ళినపుడు అటు తిరిగి నవ్వుకుంటారు. పైకి అందరూ మామూలుగా వుంటారు. ఎవరూ బయటపడరు.

    ఇలాటి మనుష్యుల్ని రక్షించడం కోసం తను వెళ్ళాలి.

    ఆమె అలా తటపటాయిస్తున్న తరుణంలో ఆమెతో డైరెక్టర్ అన్నాడు. "తొందరేమీ లేదు అనూహ్యా! మీరూ ఆలోచించి చెప్పండి. రేపటివరకూ టైం వుంది."

    ఆమెకి అదే మంచిదనిపించింది.

    కొంచెం టైం కావాలి.

    దానికన్నా ముఖ్యంగా......

    వాయుపుత్రని సంప్రదించాలి.

    ఆ సాయంత్రం వాయుపుత్రని కలుసుకుంది.


                                                          *    *    *

    "నిజమా" అడిగాడు నిఖిల్. అతడి మొహం వాడిపోయింది.

    అతడు ఆ వార్తకి ఎలా స్పందిస్తాడా అన్నట్టు చూస్తూ "అవును. నిజం" అన్నది  శ్రీజ. చాలాసేపు నిశ్శబ్ధం. అతడు అంత మౌనంగా దాన్ని స్వీకరించడం ఆమె భరించలేక-"ఈ వార్త చెప్పగానే నువ్విలా నిశ్సబ్దంగా వుండిపోతావను కోలేదు" అంది నిష్ఠూరంగా.

    "మరి."

    "ఎగ్జయింట్ మెంటుతో ఏదైనా చేస్తావనుకున్నాను. తండ్రివి కాబోతున్నాని తెలియగానే కనీసం ఏదైనా వెంటనే మాట్లాడతావనుకున్నాను."

    అతడు నెమ్మదిగా తలెత్తి "నేనేం మాట్లాడాలో తెలియటం లేదు" అన్నాడు.

    ఆమె కోపంతో "తెలియటంలేదా? ఇంత మంచి వార్త చెప్పినపుడు ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదా?" అని అంది. అతడి మౌనం ఆమెని భయపెట్టింది. రవ్వంత అనుమానం కూడా వచ్చింది. "నిఖిల్! నువ్వు తండ్రివి కాబోతున్నావన్న వార్త నీకు సంతోషంగా లేదూ?" అని మళ్ళీ అడిగింది తీవ్రంగా.

    "మామూలు పరిస్థితుల్లో అయితే ఎగిరి గంతేసేవాణ్ణి శ్రీజా" ఎటో చూస్తూ అన్నాడు  అతడు. "మన వివాహం వెంటనే జరిగేలా చూసి వుండేవాడిని. నా ఈ నిర్లిప్తత చూసి నీకు అనుమానం కూడా కలుగుతూ వుండి వుండవచ్చు. ఈ వ్యవహారాన్నంతా దాటవేయటానికి నేను ఆలోచిస్తున్నానా అనికూడా అనిపిస్తూ వుండవచ్చు. కాని జరిగింది ఏమిటో నీకు చెప్పాలి. నువ్వు  గర్భవతిని అయ్యావన్న విషయం కనీసం ఒక్కరోజు ముందు తెలిసివుంటే నేను వారికి నా ఒప్పందం తెలిపి వుండేవాడిని కాదు. నేను వెళ్ళనని నిరాకరించి వుండే వాడిని-"

    "ఒప్పందం ఏమిటి? నిరాకరించి ఏమిటి?......ఎవరికి?"

    "స్పేస్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వారికి"

    "వెళ్ళను అంటున్నావ్? ఎక్కడికి?"

    ఆమెకి అదే మంచిదనిపించింది.

    కొంచెం టైం కావాలి.

    దానికన్నా ముఖ్యంగా.....

    వాయుపుత్రని సంప్రదించాలి.

    ఆ సాయంత్రం వాయుపుత్రని కలుసుకుంది.


                            *    *    *

    "నిజమా" అడిగాడు నిఖిల్. అతడి మొహం వాడిపోయింది.

    అతడు ఆ వార్తకి ఎలా స్పందిస్తాడా  అన్నట్టు చూస్తూ "అవును. నిజం" అన్నది శ్రీజ. చాలాసేపు నిశ్శబ్దం. అతడు అంత మౌనంగా దాన్ని స్వీకరించడం ఆమె భరించలేక-" ఈ వార్త చెప్పగానే నువ్విలా నిశ్శబ్దంగా  వుండిపోతావను కోలేదు" అంది నిష్ఠూరంగా.

    "మరి."

    "ఎగ్జయిట్ మెంటుతో ఏదైనా చేస్తావనుకున్నాను. తండ్రివి కాబోతున్నాని తెలియగానే కనీసం ఏదైనా వెంటనే మాట్లాడతావనుకున్నాను."

    అతడు నెమ్మదిగా తలెత్తి "నేనేం మాట్లాడాలో తెలియటం లేదు" అన్నాడు.

    ఆమె కోపంతో "తెలియటంలేదా? ఇంత  మంచి వార్త చెప్పినపుడు ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదా?" అని అంది. అతడి మౌనం ఆమెని భయపెట్టింది. రవ్వంత అనుమానం కూడా వచ్చింది. "నిఖిల్! నువ్వు తండ్రివి కాబోతున్నావన్న వార్త నీకు సంతోషంగా లేదూ?" అని మళ్ళీ అడిగింది తీవ్రంగా.

    "మామూలు పరిస్థితుల్లో అయితే ఎగిరి గంతేసేవాణ్ణి శ్రీజా" ఎటో చూస్తూ అన్నాడు అతడు. "మన వివాహం వెంటనే జరిగేలా చూసి వుండేవాడిని. నా ఈ  నిర్లిప్తత చూసి నీకు అనుమానం కూడా కలుగుతూ వుండి వుండవచ్చు. ఈ  వ్యవహారాన్నంతా దాటవేయటానికి నేను ఆలోచిస్తున్నానా అనికూడా అనిపిస్తూ వుండవచ్చు. కాని జరిగింది ఏమిటో నీకు చెప్పాలి. నువ్వు గర్భవతిని అయ్యావన్న విషయం కనీసం ఒక్కరోజు ముందు తెలిసివుంటే నేను వారికి నా ఒప్పందం తెలిపి వుండేవాడిని కాదు. నేను వెళ్ళనని నిరాకరించి వుండే వాడిని-"

    "ఒప్పందం ఏమిటి? నిరాకరించి ఏమిటి?.....ఎవరికి?"

    "స్పేస్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వారికి"

    "వెళ్ళను అంటున్నావ్? ఎక్కడికి?"

    "అంతరిక్షంలోకి-"

    "ఓహ్ అంతేకదా- ఆ వెళ్ళటం కొత్తేంముంది? వెళ్ళిరా- వచ్చేకే వివాహ విషయం ప్రకటిద్దాం" అందామె మామూలు అంతరిక్ష ప్రయాణాల్ని తల్చుకుంటూ.

    "నేను వెళ్తూన్నది గ్రహాంతరాలు దాటి గాలక్సీ నడిభాగంలోకి శ్రీజా! తిరిగి వచ్చే ప్రసక్తి లేదు."

    గ్రహాంతరాలు దాటి గాలక్సీలోకి..... గాలక్సీలోకి....గాలక్సీలోకి....

    ఆమె  నిరత్తురాలైంది. ఆ మాటలు ఆమెకి విద్యుద్ఘాతాల్లా తగిలాయి. గ్రహాంతర యాత్రకి ఒక టీం వెళ్తూందని తెలుసుకానీ, అందులో నిఖిల్ కూడా వుంటాడని ఆమె కలలో కూడా వూహించలేదు. ఆ యాత్ర పర్యవసానం ఎలా వుంటుందో ఆమె ఆలోచించగలదు. తిరిగి భూమ్మిదకు వచ్చే ఛాన్సు నూటికి ఒక పాలు మాత్రమే. అదీ ఎన్నో దశాబ్దాల తర్వాత.

    ఆమెకి ఏం మాట్లాడాల్లో తోచలేదు.

    అతడు ఆమెవైపే చూస్తూ వుండిపోయాడు.


                         *    *    *


    వాయుపుత్ర బలవంతంగా నవ్వటానికి ప్రయత్నం చేశాడు. కానీ అందులో జీవంలేదు. అతడు అలా వుండటం ఆమె ఎప్పుడూ చూడలేదు. సరదాగా నవ్విస్తో, కవ్విస్తో వుండేవాడు. ఇతడికి 'బాధ' అనేది లేదా  అన్నట్టు మాట్లాడేవాడు. అటువంటివాడు ఈ వార్తా వినగానే స్థబ్దుడైపోయాడు. మొహంలో కదిలే బాధని బయటకు కనిపించనివ్వకుండా వుండటానికి చాలా ప్రయత్నం చేస్తున్నట్టు ఆమె గ్రహించింది. అతడు సర్దుకోవటానికి కొద్ది క్షణాలు పట్టింది.

    "ఇప్పుడయినా నేనింకా నా  నిర్ణయం చెప్పలేదు. నేను కాదంటే ఇంకెవర్నయినా పంపిస్తారు. నాకో రోజు టైమ్ కావాలని అడిగాను." ఆమె అతడివైపు చూసింది. అతడు వద్దంటాడేమో అన్నట్టు ఆశగా.

    "ఇంకా ఎవరెవరు వెళ్తున్నారట?"

    "నేను కనుక్కోలేదు. బహుశ దేశానికి ఒక్కొక్కరిని పంపుతారేమో అనుకుంటున్నాను."

    "మనం దేశం తరపున నువ్వు?"

    "తెలీదు. వారు చెప్పిందేమిటంటే-టీమ్ లో ఒకబయోకెమిస్టు వుండాలని అనుకున్నారట."

    ఆమె సమాధానం చెపుతోందేగానీ, అతడి ప్రశ్నా విధానం ఆమెకి అసంతృప్తి వుంది. తనీ వార్త చెప్పగానే "వెళ్ళొద్దు" అని వెంటనే అనేస్తాడనుకుంది. అతడీ  విధంగా ప్రశ్నలు అడుగుతూ అసలు విషయం చెప్పకపోవటం నిరాశ కలిగించింది. అందులోనూ వాయుపుత్ర ఇటువంటి విషయాల్లో మనసులో భావాల్నిదాచుకోడు. "మొత్తం ప్రపంచం నాశనమైపోనీ, మనుష్యజాతి నశించిపోనీ, బ్రతికినంతకాలం ఇద్దరమూ కలిసే బ్రతకాలి. ఐ కేర్  ఎపిన్ ఫర్ దిస్ వరల్డు" అంటాడనుకొంది. అతడి రియాక్షన్ గమ్మత్తుగా వుంది.

    "నేను నీ సలహా తీసుకుందామనే ఒకరోజు టైమ్ అడిగాను. చెప్పు ఏం చేద్దాం?" అతడివైపు ఆత్రంగానూ,ఆందోళనగానూ చూస్తూ అంది అనూహ్య.

    అతడో క్షణం కళ్ళు మూసుకుని, ఏదో ఆలోచనల్లోంచి విచ్చుకున్నట్టు నెమ్మదిగా "నీవు వెళ్ళు అనూహ్య" అన్నాడు.

                             *    *    *

    "నాకు వెళ్ళాలనిలేదు" అన్నాడు నిఖిల్....."ఒకప్పుడు నేను చాలా నీతిపాఠలు వల్లించాను శ్రీజా! యుద్ధంలో సైనికుడు భార్యా పిల్లల్ని వదిలేసి మరణాన్ని ఆహ్వానిస్తూ యుద్ధరంగానికి వెళ్ళటం లేదా అని వారించాను. కానీ  థియరీకి ప్రాక్టికాలిటీకి  ఎంత తేడా వుందో ఇప్పుడు అర్థమవుతూంది. ప్రేమని మనసులో శాశ్వతంగా వుంచుకుని, నన్ను మర్చిపోయి నేను వెళ్ళిపోయాక ఇంకెవర్నైనా పెళ్ళిచేసుకోమనీ సలహా ఇద్దామనుకున్నాను. ఈ రోజుల్లో శారీరక సంబంధాలకేముంది? చాలా మామూలే గదా  అనుకున్నాను. కానీ నా రూపు నీలో రూపుదిద్దుకోబోతుందని తెలిసి ఇక నిన్ను వదలి పెట్టలేను."

    ఆమె అతడి చేతిమీద చెయ్యివేసింది. ఆమె కూడా ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. తమ వివాహం జరగకుండా పోవటానికి ఒక్క  కారణమైనా వుంటుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. అటువంటిది బయటనుంచి వచ్చిపడిన ఈ ప్రమాదం ఆమె ఆశల్ని. భవిష్యత్ కోరికల్ని నిలువునా కూల్చేసింది.

    అయితే ఆ పరిస్థితుల్లో కూడా ఆమె తమ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోలేదు.

    తను చెప్పాలనుకున్నది హృదయంనుంచి మాటల రూపంలోకి రావటానికి ముందే, బాధ కన్నీటి రూపంలో  కనుల్లోంచి వచ్చింది. అది అతడికి కనపడకుండా వుంచడం కోసం మొహం పక్కకి తిప్పుకుని స్వరాన్ని మామూలుగా వుండటానికి ప్రయత్నం చేస్తూ "నువ్వెళ్ళు నిఖిల్".......అంది.


                              *    *    *

    "ఏమిటి నువ్వంటున్నది?" అంది అనూహ్య విస్తుబోతూ.

    వాయుపుత్ర ఈ కొద్ది సమయంలోనూ తేరుకున్నాడు. తన వాదనకి కావాల్సిన మానసిక స్థయిర్యం సమకూర్చుకున్నాడు. "నేను ఆలోచించే చెపుతున్నాను అనూహ్యా. నా గురించి నువ్వు ఆగిపోనవసరం లేదు. అలా అని నా ప్రేమను శంకించవద్దు కూడా! పైకి ఆడుతూ పాడుతూ అన్నీ తేలిగ్గా తీసుకునేలా కనిపించే ఈ వాయుపుత్ర నిన్ను చాలా సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటే చాలు. ఆ భావంతో నువ్వెళ్ళితే-ఆఫ్ట్రాల్ జీవితాంతం నేనిక్కడ  బ్రతికెయ్యగలను."

    అతడంత తేలిగ్గా ఈ సమస్యని యిలా పరిష్కరిస్తాడని ఆమె అనుకోలేదు. వెళ్ళొద్దు అంటాడనుకుంది.

    "నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అనూహ్యా! ఇంతకాలం యిన్ని ప్రేమ పాఠాలు పలికినవాడు ఇప్పుడు యిలా  ప్లేటు మారుస్తున్నాడేమిటి అనుకుంటున్నావు కదూ."

    ఆమె సమాధానం ఇవ్వలేదు. అతడు దగ్గిరగా వచ్చి రెండు భుజాలమీద చేతుల వేశాడు. ఆమె అప్రయత్నంలో అతడికి దగ్గిరగా వెళ్ళింది. అతడు ఆమె  మొహంలోకి చూస్తూ "ప్రపంచంలో ఎవరికీ దొరకని అవకాశం నీకు దొరికింది. మానవజాతి తరపున రాయబారం వెళ్తున్న ప్రధమ మహిళవి నువ్వు. అంత గొప్ప అవకాశాన్ని నా స్వార్థంకోసం బలిపెట్టలేను. నీ శరీరం నా చేతులమధ్య బంధింపబడటం కన్నా  నీ కీర్తి దిగంతాల పరిధి దాటి విస్తరించటం నాకు సంతోషాన్నిస్తుంది. నా ప్రేమకోసం నీ కీర్తిని బలిపెట్టలేను-" అన్నాడు.

    "కానీ నాకే ఈ ప్రయాణం యిష్టం లేకపోతే?"

    "నీకింకా ఏమైనా వేరే ఇతర కారణాలుంటే ప్రయాణం మానుకో, కానీ కేవలం మన గురించే అయితే వద్దు."

    ఆమె సమాధానం చెప్పలేదు.

    "నా వాదన నీకు అర్ధమవుతూందా? లేక తప్పగా అర్థం చేసుకున్నావా?"

    ఆమె దానికికూడా సమాధానం చెప్పలేదు. అసలామె  దాని గురించి ఆలోచించటమే లేదు. విధి గురించి ఆలోచిస్తూంది. ఈ 'ఫేట్' అన్నది ఎంత చిత్రమైనది! ముందునుంచీ తనని వెంటాడుతూనే వున్నది! ముందు యశ్వంత్ ని కలిపి విడగొట్టింది. తరువాత వాయుపుత్రని కలిపింది. ఇప్పుడు శూన్యంలోకి పంపిస్తూంది.

    ఉండవలసినంత బాధ లేకపోవటమే విషాదంగా వుంది.

 Previous Page Next Page