Home » Mallik » రెడీమేడ్ మొగుడు

    రాజీ అలానే నిలబడేసరికి ఆమెని తోసుకుంటూ లోపలికి వచ్చాడు రాంపండు.

    అతను లోపలి గదిలోకి వెళుతుండగా రాజీ షాక్ నుండి తేరుకుంది.

    "ఏం ఈ వేళ ఇంత త్వరగా ఇంటికి తగలడ్డారు?" కరుకుగా అడిగింది ఆమె.

    ఈసారి వులిక్కిపడటం రాంపండు వంతైంది. ఎందుకంటే రాజీ కూడా రాంపండుతో అంత కరుకుగా ఎప్పుడూ మాట్లాడలేదు.

    మొత్తానికి రాంపండు మీద బ్రహ్మాజీ ప్రభావం, రాజీమీద సత్యవతి ప్రభావం బాగానే పడింది.

    ఆమె అలా అడిగేసరికి అతనికి కోపం వచ్చింది.

    బ్రహ్మాజీ చెప్పింది నిజమే! బ్రతికినన్నాళ్ళు మగాడిలా బ్రతకాలి.

    కాస్త తేరుకున్నాక తీవ్రమైన స్వరంతో అడిగాడు "ఏం....? నేను ఇంటికి వస్తే నీకేమైనా అడ్డా?"

    "నాకెందుకు అడ్డూ? నేనేమైనా తప్పుడు పనులు చేస్తున్నానా? అవేవో అర్ధరాత్రిదాకా తిరిగి ఇంటికొచ్చే నీలాంటి మగాళ్ళకి తెలియాలి!" విసురుగా అంది ఆమె. అతనికి తిక్కరేగింది.

    "ఏంటీ...? నేను అర్దరాత్రిదాకా తిరుగుతున్నానా? నేను ఏనాడైనా తొమ్మిది దాటేదాకా బయట తిరిగానా?" అన్నాడు. తరువాత అతనికే అనిపించింది. తన గొంతులో పవర్ తగ్గిందని. అవునుమరి...తెచ్చి పెట్టుకున్న పవర్ ఎంతసేపటిదాకా వుంటుందీ?

    "ఏనాడైనా తొమ్మిది దాటేదాకా బయట తిరిగానా అని అడుగుతున్నాను?" ఈసారి అరుస్తున్నట్టు కాస్త గట్టిగా అడిగాడు.

    "విన్నాను! నువ్వేం ఒకటికి రెండుసార్లు గొంతు చించుకుని అరవక్కర్లేదు....నాకేం చెవుడు లేదు. అయినా ప్రొద్దున్న నుండీ నీ కోసం ఒంటరిగా ఇంట్లో ఎదురుచూస్తుంటే నువ్వ  తీరుబడిగా తొమ్మిదింటికి వస్తే నాకు అర్దరాత్రి వచ్చినట్టే లెక్క!"

    "నేను ఏదైనా పనుండి ఆలస్యంగా వస్తానుగానీ....అదేపనిగా రోడ్లు సర్వేచేస్తూ ఆలస్యంగా రావడంలేదు కదా. అయినా నేను రోజూ ఆలస్యంగా రావడం లేదుగా....ఎప్పుడో ఒక్కసారి వస్తాను."

    "అవును పాపం...ఎప్పుడో ఒక్కసారి వస్తావ్! వారానికి రెండు మూడుసార్లు ఆలస్యంగా వస్తూనే వున్నావు. అదీ మనం ఎక్కడికైనా ప్రోగ్రాం వేసుకున్నప్పుడే కావాలని ఆలస్యంగా వస్తావు.....నన్ను బయటికి తీస్కెళ్ళడం నీకిష్టం లేదు. నాకర్ధం అయ్యిందిలే" అంది రాజీ వుక్రోషంగా.

    "ఛీ.....ఏంటి ఇంటికి రాగానే మనశ్శాంతి లేకుండా ఈ ఆర్గ్యుమెంట్లు" విసుగ్గా లోపలికి వెళ్ళిపోయాడు రాంపండు.

    అది తెచ్చిపెట్టుకున్న విసుగు కాదు. ఈసారి నిజంగానే విసుక్కున్నాడు.

    రాంపండు మొహం కడుక్కుని టీవీ ముందు కూర్చున్నాడు. రాజీ కాఫీ తెచ్చి అతని ముందున్న టీపాయ్ మీద పెట్టి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది.

    వెళ్ళిపోతున్న రాజీ వంక ఓసారి చూసి దీర్ఘంగా నిట్టూర్చికాఫీ కప్పు అందుకున్నాడు.

    భోజనాల దగ్గరా అంతే....ఇద్దరూ సైలెంట్ గా భోజనం చేశారు.

    నిశ్శబ్దం.....ప్రశాంతత!

    కానీ అది తుఫాన్ వచ్చే ముందు వుండే ప్రశాంతత అని ఆ యిద్దరికీ తెలీదు.

    రాత్రి పది గంటలైంది.

    ఆ గదిలో బెడ్ లైట్ గుడ్డిగా వెలుగుతోంది. రాజీ, రాంపండు ప్రక్క ప్రక్కన పడుకుని వున్నారు.

    అతను మాత్రం వెల్లకిలా పడుకున్నాడు. ఆమె మాత్రం అటువైపుకు తిరిగి పడుకుంది.

    ప్రపంచంలో వుండే కోట్లాది జంటల్లో చాలా మట్టుకు అంతే....మనసులో ఏమున్నా చచ్చినట్టు అలా ప్రక్క ప్రక్కన పడుకుని తీరాలిసిందే.
 
    ఇద్దరూ కళ్ళు మూసుకుని పడుకున్నారు కానీ ఇద్దరూ నిద్రపోవడం లేదు.... ఇద్దరి మనస్సులో ఎన్నో ఆలోచనలు!

    చూడు.... అల ఏమీ పట్టనట్టు పడుకున్నారు. ఏం? మీద చెయ్యేసి ఇటు తిరుగు రాజీ అనొచ్చుగా? జోడి అభిమానం, జోడి పౌరుషం అనుకుంది రాజీ.

    ఇంటికి రాగానే ఏదో విసుక్కుంది, వాదించింది. పోని... కనీసం ఇప్పుడైనా మాట్లాడొచ్చుగా? దీని అలకలతో అన్ని రాత్రూలూ వేస్తాయి పోతున్నాయి దీనికి బుద్దొచ్చి అలగడం మానేసరికి వయసంతా అయిపోయి ముసలి వాడినయిపోతానేమో! అనుకున్నాడు రాంపండు.

    ఇద్దరూ కళ్ళు మూసుకుని పడుకుని వున్నా ఆ ఇద్దరికీ తెలుసు.... ఎదుటివాళ్ళు నిద్రపోకుండా తన గురించే అలోచిస్తున్నారని!

    ఊర్కే అలా వుంటే ఆ పరిస్థితి రాత్రంతా కోనసాగుతుందనీ, రాత్రంతా జాగారంతో గడపాల్సి వస్తుందనీ రాంపండుకితెలుసు.

    అందుకనే ఆమెవైపుకి తిరిగాడు.

    "రాజీ..." మెల్లగా అంటూ ఆమె భుజం మీద చేయ్యేకాడు. "ఇలా తిరుగు."

    కానీ అతను అలా చెయ్యేసి తన వైపు తిరగమంటాడని ఇందాకటి నుండీ ఎదురు చూసీ చూసీ అప్పటికే ఆమెకి సహనం పోయింది. అందుకే అతని చేతిని విసురుగా తోసేసి "నన్ను ముట్టుకోవడానికి సిగ్గులేదూ... నన్ను ముట్టుకోకు" అంది విసురుగా.

    అతని హాహం దెబ్బతింది.

    "సిగ్గెందుకూ...? నేనేం పరాయి ఆడదాని మీద చెయ్యేయ్యలేదు! నేను నీ మొగుడ్ని! చేయ్యేస్తాను, ఇంకా ఏమైనా చేస్తాను. బరువుగా వేస్తూ.

    మళ్ళీ ఆ చేతిని తో సేస్తూ ఆమె చోవాలున లేచి కూర్చుంది.

     "మోగుడట మొగుడు.... పెళ్ళాం ముద్దూ ముచ్చటా తీర్చని వాడు, తీర్చలేని వాడూ అసలు మొగుడే కాడు" అంది మొహం చీట్లించి.

    "అలాగా! భర్తని అర్ధం చేస్కోలేని భార్య అసలు భార్యే కాదు!" అన్నాడు రాంపండు.

    "ఓహొ... ఎంతసేపూ భార్యే భర్తని అర్ధం చేస్కోవలన్నమాట! భర్త భార్యని అర్ధం చేస్కోనక్కర్లేదూ?"

    "ఏం...? నేను నిన్ను అర్ధం చేస్కోడం లేదని ఎందుకు అనుకుంటున్నావు?"

    "అర్ధం చేసుకునే వాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారా.... ఒక్క సినిమా చూద్దామంటే కుదర్దు, ఓషికారుకేల్దామంటే కుదర్దు. మొన్న బెంగుళూరూ, మైసూరు తీస్కేళతనని వూరించి ప్రయాణం కాన్సిల్ చేసేశారు."

    "నేను కాన్సిల్ చేశావా? ఊహించుకుని విధంగా పిన్నీ, చిన్నాన్న వస్తే నేనేం చెయ్యను?"

    "ఏం వాళ్ళతో చెప్పలేవా మేం వూరుకేళుతున్నాం అని? అప్పుడు వాళ్ళదారి వాళ్ళు చూసుకునే వారు."

    "ఎలా చెప్పను! పాపం వాళ్ళు అంతదూరం నుండి అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వస్తే?"

    "నన్ను తీస్కెళ్ళలని నీకు మనస్పూర్తిగా వుంటే తప్పుకుండా చెప్పి వుండేవాడిని! నీకు నాకంటే వల్లే ఎక్కువలే... అందుకే అన్నీ రోజులు శలవు పెట్టి వాళ్ళని వెంటేసుకుని వూరంతా తిప్పావ్" చీర గొంగుతో కళ్ళు వత్తుకుంటూ  అంది రాజీ.

    "నేను శలవు వారి కోసమేం పెట్టలేదు. నీ కోసమే పెట్టాను.... ఈ లోగా వాళ్ళు వచ్చారు " చికగుగా అన్నాడు రాంపండు.

    "సరే! నా కోసం శలవు పెట్టినప్పుడు వాళ్ళు వచ్చాక శలవు కాన్సిల్ చేసుకుని ఆఫీసుకు వెళ్ళిపోవాల్సింది.... వాళ్ళు ఇంట్లో వారం రోజులు వుంది వెళ్ళుండేవాళ్ళు."

    "అంటే ప్రతిపనీ నిన్ను అడిగి నీ ఇష్ట ప్రకారం చెయ్యాలా...? అన్ని సంవత్సరాల తరువాత మా పిన్నీ, చిన్నాన్నా వాళ్ళు వస్తే వాళ్ళని ఎక్కడి కైనా తీస్కోళ్ళాలన్నా నీ పర్మిషన్ కావాలా?"

    "అంతేలే! ఈ ఇంట్లో నాకేం విలువ వుంది గనక.... నా ఇష్టా ఇష్టాలతో మీకు సంభంధంలేదు... మా నాన్న నీ మీద నలుగు లక్షల రూపాయలు వేస్తూ చేశారు."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra