Home » Dr jandhyala papayya sastry » Karunasri Sahityam - 4 - Balasahiti - 2


    "ఔరా! మానసింహుఁ డెంత ఘనుఁడైనాఁడు. సిగ్గువదలి మొగలు భూపతులతో సంబంధములు చేసికొనినది చాలక మాకు పిరికిమందు పోయునంతటివాఁడా"యని ప్రతాపుఁడు తల పంకించుచున్నంతలో నొక వార్తాహరుఁడరుదెంచి "మహాప్రభూ! అఖండ సేనాసమేతుఁడై శక్తి సింహుఁడు మనపై దండెత్తి వచ్చుచున్నాఁడు" అని పల్కెను.
    ప్రతాపసింహుఁడొక నిట్టూర్పు పుచ్చి 'యనుకొనినంత యయినది. కడకు మహారాణా సోదరుఁడే మాతృభూమిని నాశనము గావింపఁదలఁచినాఁ'డని యనుచుండఁగనే 'భారతి' తండ్రిమాటల కడ్డువచ్చి 'ఏమిటి నాన్నగారు! మీ సోదరుఁడేమి - మీపై దండెత్తుటేమి?'యనెను.
    "అమ్మా! వాఁడు నా సోదరుఁడే. జీర్ణమైపోవుచున్న చిత్తూరు స్వాతంత్ర్యలక్ష్మిని - కన్నీరుమున్నీరుగా నేడ్చుచున్న మేవాడ దేశమాతను చూడలేని యంధుఁడు నా సోదరుఁడే! మీ పినతండ్రి శక్తిసింహుఁడు సేనాసమేతుఁడై మేవాడపై దండెత్తి వచ్చుచున్నాఁడఁట."
    "అదేమిటి నాన్నగారూ! కన్నతల్లిపై కత్తిగట్టుటా! పినతండ్రిగారి కీమాత్రము తెలివిలేకపోయెనా!"
    అని భారతి పల్కుచుండ తల్లి పాటేశ్వరీదేవి "అమ్మా! నీకును రాజకీయములేనా! రమ్ము. రొట్టె సిద్ధమైనది" అని పుత్రికను లోనికిఁ గొనిపోయెను.
    ప్రతాపసింహుడు కర్తవ్యము నాలోచింపసాగెను.


                              4


    అది కాళరాత్రి. యవనసైనికుల పటకుటీరములలో దీపములు మినుకు మినుకు మనుచుండెను. సైనికులందఱును గాఢ నిద్రాపరవశులై యుండిరి. శక్తిసింహునకు మాత్రము నిదురపట్టలేదు. అతని హృదయమంతయు వ్యాకులముగా నుండెను. ఇంతలో నతనికొక పాట వినిపించెను. అతఁడు గుడారము ద్వారమునొద్దకు వచ్చి చూచెను. శక్తిసింహున కనతి దూరమున పదునాలుగేండ్ల పిన్నఫకీరొకఁడు కాన్పించెను.
    'నీ వెవరవు? ఇచట కెందుల కేతెంచితి?' వని శక్తిసింహుఁడతనిని ప్రశ్నించెను.
    అంత ఫకీరు నవ్వుచు శక్తిసింహుని సమీపించి 'నీతో మాటలాడి పోఁదలఁచి వచ్చితి' ననెను.
    'నాతో నీకేమిపని?' యని శక్తిసింహుఁడు సగర్వముగా మరలఁ బ్రశ్నించెను.
    ఫకీరు తన మాయగడ్డమును దీసివేసెను. దొంగ దుస్తులు తొలగించెను. చిరునవ్వు నవ్వుచు నిలబడెను.
    "ఆఁ! ఏమీ! భారతీ! నీవేల వచ్చితివమ్మా? ఈ వేషమేమి?"
    భారతి శక్తిసింహున కభివాదన మొనర్చి యుచ్చై స్వరమున మాటాడఁ దొడఁగెను.
    "నాయనా! మిమ్ముఁ బ్రతిబంధములు లేకుండఁ గలిసి కొనఁదలచి యీ వేషముతో నేతెంచితిని. సరే, మీరిప్పుడిచట కెందులకు వచ్చితిరి?"
    "యుద్ధమునకు"
    "యుద్ధమునకా! అమ్మో? ఇవి యన్నియు నెవరి సైన్యములు?"
    "మొగలు చక్రవర్తివి"
    "చక్రవర్తివి! ఎవరితో నీ యుద్ధము?"
    "ప్రతాపసింహునితో"
    "నీ కతఁడు సోదరుఁడు కాఁడా? నాయనా? నీ జన్మభూమి యేది?"
    "నా జన్మభూమియా! మే...వా...డ"
    శక్తిసింహుని కంఠము గద్గదమయ్యెను. కన్నులు చెమ్మగిల్లెను. శరీరమంతయు కంపితమయ్యెను.
    "తండ్రీ! ఇప్పుడు నీవు చేయఁబోవు యుద్ధము నీ మాతృభూమి మీఁదనే కదా! ఇంత యత్యాచారమా! నీ శౌర్యధైర్యములను మాతృదేశవినాశనార్థము వినియోగింపఁదలంచితివా! నీ చేతితో నీ దేశమాతకు దాస్యబంధములఁ దగిలింప నుంటివా? మేవాడరాజ్య మిప్పటికే యరణ్యమై పోయినదే! చిత్తూరు కోట శిథిలమై పోయినదే! ఇంకను వానిని నామరూపములు లేకుండ నాశనము చేయఁదలఁచితివా! ప్రతాపసింహునిపైఁ బగయున్న మేవాడ స్వాతంత్ర్యము - రాజపుత్రుల గౌరవమును గంగలోఁ గలిపెదవా! 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' యను నభియుక్తోక్తిని విస్మరించితివా? 'శిశోదియా' వంశగౌరవమునకుఁ దిలోదకము లిచ్చెదవా? అష్టకష్టములనుభవించుచు నీ రాజపుత్రులు స్వాతంత్ర్యమును ఆత్మగౌరవమును గోలుపోయి జీవచ్చవమువలె నుండ నీకు సంతుష్టి గలుగునా! నీకు శాంతి లభించునా! తమ సర్వస్వమును ద్యాగమొనర్చి నేఁటివరకు మేవాడ స్వాతంత్ర్యమును రక్షించిన మనపూర్వుల నొకసారి స్మరింపుము. వారు తమరక్తమును ధారవోసి మాతృభూమిని గాపాడినారే! నీవు నేఁడిట్లు బుద్ధిచెడి 'మాతృదేశము'నకు ద్రోహమొనరింప నెంచితివా? విశాల హృదయముతో నొకసారి సర్వవిషయముల యోచించి విధ్యుక్తధర్మమును నిర్వహింపుము. ఇఁక నేఁబోయివచ్చెద. నాకు సెలవిమ్ము" అని పలికి బయలుదేరెను.
    శక్తిసింహుఁడా ప్రసంగము విని నిర్విణ్ణఁడై ప్రత్యుత్తర మొసంగ లేక అట్లే నిలఁబడిపోయెను. భారతి పినతండ్రికి నమస్కరించి మరల ఫకీరువేషము ధరించి వెడలిపోయెను.
    శక్తిసింహుని గంభీర మానసమున నెన్నియో భావతరంగము లొక్కుమ్మడి విజృంభించెను. వెంటనే యాతని కనులు మూతపడెను. అతని కనులముందు మేవాడ దేశమాత రక్తసిక్తశరీరముతో విలపించుచు దీనవదనయై తూలిపోవుచున్నట్లు - మేవాడ ప్రజలెల్లరు తన్ను దూషించి దుమ్మెత్తి పోయుచున్నట్లు తోఁచెను.
    అంత శక్తిసింహుఁడు చింతాక్రాంతుఁడై కూలఁబడి పోయెను.


                             5


    అదియొక కనుమప్రక్కనున్న కొండకాలువ. కాలువ యొడ్డున ప్రతాపుఁడు తన యశ్వముపై మూర్చితుఁడై పడి యుండెను. దూరమున సైనిక కోలాహలము వినవచ్చు చుండెను.
    కొంతసేపటికి ప్రతాపసింహుఁడు కనులు దెఱచెను. తనముందు ప్రాణములఁ బాసి పడియున్న చేతకాశ్వమాయనకుఁ గన్పించెను. ప్రతాపునకు దుఃఖమాగలేదు. "అయ్యో చేతకమా! ఈ కొండకాల్వదుమికి నా ప్రాణములు గాపాడి నీవు మరణించితివా! ఎంతగా కళ్లెము తగిలించినను వినక నేఁడు రణరంగము వీడి యిట్లు వచ్చితివేమి! హయరాజమా! అనేక యుద్ధములలో నాకు విజయము చేకూర్చి నా ప్రాణరక్షణము గావించితివిగదా! స్వాతంత్ర్య రక్షణార్థము రాజపుత్ర వీరులేకాక వారి యశ్వములుగూడ ప్రాణముల నర్పించు నన్న కీర్తిసంపాదించితివి. ఎవరో 'ఆగుము - ఆగు' మని వచ్చుచున్నారే? చేతకమా! రాణా ప్రతాపుఁడు వెన్నిచ్చి రణరంగమునుండి పారిపోవుచున్నాఁడని వైరిసేనలు తలఁచుచున్నవా! నన్నిట కేల తెచ్చితివి! సంగరరంగమున నిరువురము సంతోషముగాఁ బ్రాణత్యాగ మొనరించి యుందుమే - అయిపోయినది. సర్వనాశనమయి పోయినది. హా! రసపుత్రవీరులారా! కర్మభూమికై కర్తవ్య నిర్వహణ మొనరించుచు వీరస్వర్గ మలంకరించితిరా!"
    అని ప్రతాపుఁడు గుఱ్ఱముపై తలనాన్చు నంతలో నిరువురు వీరులు కత్తులెత్తి ప్రతాపునిపై దుముకఁబోయిరి.
    సరిగానదే క్షణములో వెనుక నుండి మరియొక వీరుఁడరు దెంచి యా యిరువురు వీరుల కత్తులు తుత్తునియ లొనర్చి వారి శిరము లెగురఁగొట్టెను. ప్రతాపుఁడు కనులు దెఱచి చూచెను. ఎదుట కత్తిదూసిన శక్తిసింహుఁడు నిలచియుండెను. ప్రతాపసింహుఁడు విస్మితుఁడయ్యెను.    
    "సోదరా! వచ్చితివా! ఇఁక బ్రతీకారము తీర్చుకొనుము. నేను పూర్వపు ప్రతాపుఁడనుగాను - సైన్యము నంతయుఁ గోల్పోయి నిస్సహాయుఁడనైయున్న ప్రతాపుఁడను. శరీరము రక్తసిక్తమయినది. గాయములు బాధించు చున్నవి. కానిమ్ము సోదరా! ఒక్కపోటున నన్నీలోకము నుండి దూరముసేయుము. నీవు నా సోదరుఁడ వయినందులకు నా కోరిక నెఱవేర్పుము - నన్ను బంధితు నొనర్పకుము. 'మహారాణా' మొగలు చక్రవర్తి ముందు వినమ్రుడై యుండఁజాలఁడు. ఇదియే నాయభ్యర్థనము. మన్నింపుము." ప్రతాపుఁ డిట్లు పలికినంతనే శక్తిసింహుని నేత్రములనుండి యశ్రుబిందువులు జలజల రాలఁ జొచ్చెను.
    అంత శక్తిసింహుఁడు గద్గదకంఠముతో "అన్నా! క్షమింపుము. నేను ప్రతీకారము సేయఁదలఁచి రాలేదు. ఇదిగో! ఈ మొగలు వీరు లిరువురు మిమ్ముఁ జంప నుంకించు చున్నయెడ వారి యుక్కడగించితిని. నా వంటి ద్రోహి - వంచకుఁడు వేఱొకఁ డుండఁబోఁడు. అన్నా౧ కష్టసమయమునఁగూడ నీ స్వాతంత్ర్యదీక్షను శ్లాఘనీయముగఁ బ్రకటించితివి. మీ రాదర్శ పురుషులు - భారత వీర కేసరులు. నేను 'మాతృదేశము' మీఁద నెత్తివచ్చిన క్షుద్రుఁడను. నన్ను క్షమింపుఁ"డనుచు ప్రతాపసింహుని పాదములపైఁ బడెను.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra