Home » Yandamuri veerendranath » చెంగల్వ పూదండ


    చీకట్లోకే చూస్తూ మొహం తిప్పకుండా అన్నాను, "గంటల్లెక్కనికాదు, మొత్తంగా చెప్పు. హైమను పూర్తిగా ఒప్పజెప్పటానికి యెంత కావాలి నీకు?"

    ఆమె మొహంలో ఆశ్చర్యం గమనించటం కోసం వెనక్కీ తిరగనక్కరలేదు. అయిదు నిమిషాలు ఆమెని ఆలోచించుకోనిచ్చి వెనుదిరిగాను. మా మాటలకు బైటకొచ్చిన హైమ గుమ్మం దగ్గర నిలబడి వుంది. నిద్రలోంచి లేవటంవల్ల కళ్ళు కొద్దిగా  ఉబ్బి మరింత అందంగా తీర్చిదిద్దినట్టు కనపడుతున్నాయి. నలిగిన చీరెలో సడలిన గులాబిపువ్వులా వుంది! నన్ను చూసి పలకరింపు నవ్వింది.

    "చెప్పు ఏం కావాలి?" అడిగాను.

    కాంతమ్మ యింకా ఆశ్చర్యం నుంచి తేరుకోనట్టు మాట్లాడలేదు. జేబులోంచి రెండు నోట్ల కట్టలు తీశాను.

    "ఇదిగో, రెండువేలు  తీసుకొని హైమను నాకు వదిలిపెట్టు". కాంతమ్మ నన్నూ, నోట్లకట్టనీ మార్చి మర్చి చూసింది. హైమ మమ్మల్ని ఆశ్చర్యంగా గమనిస్తోంది.

    "తీసుకో" అన్నాను. కాంతమ్మ తీసుకోకుండా తల అడ్డంగా వూపి "ఇంకో వెయ్యి కావాలి" అంది.

    వంగి డబ్బుతీసి జేబులో పెట్టుకోకుండా తల అడ్డంగా వూపి "ఇంకో వెయ్యి కావాలి" అంది.

    వంగి డబ్బుతీసి జేబులో పెట్టుకొన్నాను. "అమ్మాయిల ఖరీదు గురించి నీకు నేను చెప్పక్కర్లేదు. నీకు హైమవల్ల ఇంతకన్నా ఎక్కువ లాభం వస్తుందనుకొంటే నువ్వే వుంచుకో, నా  కవసరం లేదు" అన్నాను వెనుదిరుగుతూ.

    గుమ్మం దగ్గరకు వచ్చేసరికి వెనుకనుంచి కాంతమ్మ కంఠం "ఆగండి" అని  వినబడింది. ఆగేను. దగ్గరకొచ్చి "సరే, మీరు అన్నట్టే కానివ్వండి. ఆ డబ్బు యిలా యివ్వండి" అంది.

    డబ్బుతీసి యిచ్చేను.

    ఏదో నాటకం చూస్తున్నట్టు హైమ కళ్ళప్పగించి చూస్తోంది. "రా  పోదాం" అన్నాను. హైమ కదల్లేదు.

    "పోవే" అంది కాంతమ్మ. దగ్గరగా వెళ్ళి భుజంచుట్టూ చెయ్యివేసి అనునయంగా, "పోదాం పద" అన్నాను. కలలోంచి తెరుకొన్నదానిలా నెమ్మదిగా కదుల్తూ "నా బట్టలు" అంది.

    "డోన్టు బీ సిల్లీ, పద" అన్నాను.

    ఇద్దరం బైటకొచ్చేం అరుగుమీద జగ్గడు ఇంకా ముసుగు పెట్టి నిద్రపోతున్నాడు. కారు ఫ్రంట్ డోరు తెరిచేను. హైమ కూర్చొంది నేనూ కూర్చొని స్టార్టు చేసేను. గుమ్మం దగ్గర కాంతమ్మ నిలబడి చూస్తోంది.

    కారు నెమ్మదిగా కదిలింది.

    గాలి అలలుగా వీస్తోంది. సీటు వెనక్కి జారగిలబడి, నుదుటిమీద అరచెయ్యి వేసుకుని, కళ్ళు మూసుకుంది హైమ. శబ్దం లేకుండా కారు వెళ్తోంది.

    "ఆరోజు హాస్పిటల్ నుంచి వచ్చేక గొడవ ఏమన్నా జరిగిందా?" నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగేను. ఆమె మాట్లాడలేదు. క్షణం గడిచింది.

    "చెప్పు" అన్నాను.

    హైమ కళ్ళు తెరిచింది. కనురెప్పల మధ్య అస్పష్టంగా కదిలిన నీటి పోరని గమనించి చకితుణ్నయ్యేను. నాతో చావు  దెబ్బలు తిన్న జగ్గడికి తన పరాక్రమం ప్రదర్శించుకోవటానికి ఈ నిర్భాగ్యురాలే దొరికి వుంటుంది. కసి అంతా తీర్చుకుని వుంటాడు.

    ఈ ఆలోచన రాగానే నా మనసంతా ఆమె పట్ల జాలితో నిండిపోయింది. ఆమె చేతిమీద చెయ్యి వేసేను.

    "ఇంక నీ జీవితంలో బాధ అంటే ఏమిటో తెలియనివ్వను హైమా.నువ్వు నాకు చేసిన సాయానికి ప్రతిఫలంగా నిన్ను జీవితం అంతా సుఖపడేలా చేస్తాను."



                                                 10


    కాలింగ్ బెల్ ని నొక్కి మెట్లమీద నిలబడ్డాను. అర నిముషం తరువాత తలుపు తీసిన శబ్దం వినిపించింది. లక్ష్మీనారాయణ భార్య.

    "లేరా?" అడిగేను.

    "లేరు. ఇప్పుడే బయటకువెళ్ళేరు."

    "సర్లెండి, తర్వాత వస్తాను" అన్నాను ఓ మెట్టు క్రిందకి దిగి.

    "అదేమిటి- ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతారా- రండి రండి" అని లోపలికి దారి తీసింది.

    నేనూ ఆమెని అనుసరించేను.

    ఆమెకి నలభై అయిదేళ్ళు వుండొచ్చు. ఎర్రరంగు పట్టుచీరె కట్టుకొంది. జాకెట్ క్రింద వీపుమీద రెండు కండరాలు జారి, అర్థ చంద్రాకారంగా వున్నాయి. కొంచెం లావుగా, పొట్టిగా వుంది. తలకి కొప్పు కొత్తరకం స్టెయిల్లో వుంది. మెడకు వేసిన పౌడర్ కొద్దిగా కనబడుతూంది. వయసు కనబడకుండా చేసిన ప్రయత్నాల్లో చాలావరకూ సక్సెస్ అయిందనే చెప్పవచ్చు.

    "కూర్చోండి" అని సోఫా చూపించి, గబగబా లోపలికి వెళ్ళి పనివాడికి ఏదో పురమాయించింది. ఆమె హడావుడి చూస్తోంటే నవ్వొచ్చింది. దేశపు అధ్యక్షుడు అకస్మాత్తుగా వచ్చి తలుపు తడితే పడే కంగారు ఆమె ప్రవర్తనలో కనబడుతోంది.

    అయిదు నిముషాలయ్యేక చుట్టూ పరికిస్తూ-

    "మీరే యీ గది అలంకరించారా?" అన్నాను.

    "అవును, ఏం?"

    "చాలా అద్భుతంగా వుంది. మీకు కలర్ మ్యాచింగ్ బాగా తెలుసులా వుందే-"

    గర్వపడుతున్నట్టు నవ్వింది.

    తరువాత చాలాసేపు మా మధ్య మాటలు లేవు. ఏం మాట్లాడాలో తెలియనట్టు చేతి వేళ్ళవంక చూస్తూ వుండిపోయేను.

    "ఏమిటలా మౌనంగా వుండిపోయారు".

    నేను నవ్వి, అమ్మాయిల్తో మాట్లాడటం రాదు నాకు" అన్నాను నెమ్మదిగా.

    ఆమె నుంచి బిగ్గరగా నవ్వు ఆశించేను. ఆ అంచనా తప్పయింది.

    "నేను అమ్మాయిలా కనబడ్తున్నానా ఏమిటి మీ కళ్ళకి?" అంది. నవ్వి ఊరుకున్నాను.

    "నావయసెంత అనుకొంటున్నారు మీరు?" అంది కొంచెం తటపటాయించి.

    "ఇరవై తొమ్మిదో - ముప్పయ్యో ఉండవూ?" అన్నాను.

    "ఉహూఁ కాదు, ముప్ఫయ్ రెండు".

    ఆమెని పరిశీలనగా చూసి, "అంతవున్నట్టు కనబడదు" అన్నాను. ఆమెని అలా చూస్తున్నప్పుడు మామూలుకన్నా కొద్దిగా ఎక్కువసేపు ఆమె వక్షోజాల మీద  నాచూపు నిలవటం ఆమె గమనించిందని నాకు తెలుసని  ఆమెకి తెలిసిందని నాకు తెలుసు. చాలాసేపు ఏవీఁ మాట్లాడలేదు నేను.

    "ఏవఁన్నా మాట్లాడండి" అంది.

    "-చెప్పానుగా - అమ్మాయి లెదురుగా వుంటే...." నసిగేను.

    "తొందరగా  పెళ్ళి చేసుకోండి. అమ్మాయిలంటే భయంపోతుంది".

    నవ్వేను - "నాకు వెతుక్కోవటానికి టైంలేదు, చూసి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఎలా?"

    "మేం చూసి పెడతాం. ఎలాంటి అమ్మాయి కావాలి?" అని ఆమె అంటుందని తెలుసు నాకు. అంది.

    "ఎలా వున్నా పర్లేదు - కానీ కళ్ళు మాత్రం.....ఆగేను.

    "ఊఁ.... కళ్ళు మాత్రం.......?" అర్థం కానట్టు అడిగింది. చెప్పలేదు నేను.

    "భయంగా వుంది చెప్పటానికి" అన్నాను.

    "ఫర్లేదు- చెప్పండి" అంది ముందుకు వంగి.

    "మీరేవీఁ అనుకోకూడదు!"

    "అనుకోను చెప్పండి-"

    ".....మీ కళ్ళలా వుండాలి" భయపడుతూ ఆమె వైపు చూసేను. ఇంతలో లక్ష్మీనారాయణ 'మారిన్; చప్పుడు వినిపించింది.

    అతడు లోపలికి వస్తూ, "అరె, ఎంత - సేపయింది- మీరు వచ్చి?" అన్నాడు.

    నేను సమాధానం ఇచ్చేలోపులోనే "ఇప్పుడే! ఇంకా రెండు నిముషాలన్నా కాలేదు" అంది ఆమె నిజానికి నేను వచ్చి పావుగంట అయింది.

    అతడు వచ్చి నా ప్రక్కన కూర్చొంటూ, "చెప్పండి" అన్నాడు.

    నవ్వి - "వెంటనే బిజినెస్ మాట్లాడమంటారా?" అన్నాను.

    "బిజినెస్ ఏమిటి?"

    ఇద్దరివైపు చూసి గొంతు సవరించుకొన్నాను. "ఈ ప్రాంతాల్లో కొబ్బరిపీచు బాగా దొరుకుతుందని మీకు బాగా తెలుసు."

    "దాన్ని ఇక్కణ్నుంచి బొంబాయి కొంతమంది పంపుతున్నారు. బొంబాయి ఏజంట్లు దాన్ని ఎక్స్ పోర్టు చేసి విపరీతమైన లాభాలు గడిస్తున్నారన్నది మాత్రం చాలామందికి బహుశా తెలియకపోవచ్చు!"

    "అయితే......"

    "ఆ దిగుమతి ఏదో మనమే చేసి ఎందుకు లాభాలు సంపాదించకూడదు?"

    "అదంతా కష్టమైన ప్రొసీజరు అనుకుంటా కదా" అన్నాడు లక్ష్మీనారాయణ.

    "దూరంనుంచి అలానే కనిపిస్తుంది. నాకు ఆ ఫార్మాలిటీస్ అన్నీ తెలుసు" అన్నాను ముందుకు వంగి. లక్ష్మీనారాయణ మాట్లాడలేదు.

    రహస్యంగా చెబుతున్నట్టు నెమ్మదిగా "నేను ఊహిస్తున్నదే కరెక్ట్ అవుతే- ఈ బిజినెస్ రెండు లక్షల పెట్టుబడితో సంవత్సరం తిరిగే సరికల్లా లక్ష లాభం కళ్ళ చూడవచ్చు" అన్నాను.

    "మీరు ఆ బిజినెస్ పెడదామనుకొంటున్నారా?" అడిగాడు.

    నవ్వి, "అనుకోవటం ఎప్పుడో జరిగిపోయింది. నాలుగు లక్షల కన్ సైన్ మెంట్స్ కి అగ్రిమెంటు జరిగిపోయింది కూడా."

    లక్ష్మీనారాయణ ఊపిరి బిగించి, "నాలుగు లక్షలా?" అన్నాడు.

    "అవును" తలూపేను- 'కానీ ఇక్కడో చిన్న ఇబ్బంది వచ్చింది'.

    "ఏమిటి-"

    కొంచెంసేపు మౌనంగా వుండి నెమ్మదిగా అన్నాను 'ఈ ఊరికి కొత్తగా వచ్చాను నేను. ఈ బిజినెస్ లో విపరీతమైన లాభాలు సంపాదిస్తే- అందరికీ శత్రువుని అవుతాను. ఇక్కడి సంపదని కొల్లగొట్టుకు పోతున్నానన్న భావం కల్గుతుంది వాళ్ళకు. ఇక్కడివాళ్ళ నెవరినైనా భాగస్వామిగా తీసుకోవాలి. అందుకు తగిన వాళ్ళెవరా అని ఆలోచిస్తే....మీకన్నా తగిన వాళ్ళు ఎవరూ కనబడలేదు".

    లక్ష్మీనారాయణ మాట్లాడలేదు. అతడి భార్య ఇద్దరివైపూ మార్చి మార్చి చూస్తోంది.

    "పెద్ద పెట్టుబడి కూడా అక్కర్లేదు. నాక్కావలసింది మీలో ఎవరో ఒకరు నాతో కలవాలి."

    "నేనెంత పెట్టుబడి పెట్టాలి?"

    "ఇరవై వేలు పెట్టండి, మూడులక్షల యెనభైవేలు నేను పెడతాను. లాభాల్లో నాలుగోవంతు ఇస్తాను."

    అతడు అచేతనంగా నావైపే చూస్తూ వుండిపోయేడు. జీవితంలో ఇంత మంచి బర్గెయిన్ చూసి వుండడు అతడు.

    అతడికన్నా అతడి భార్యే ముందు తేరుకొంది. నా వైపు చూసి "అందులో ఇరవైవేలలో పదివేలు మీరు ఆ రోజు డిన్నర్ లో గెల్చుకొన్నవేగా" అంది.

    నేను నవ్వేను.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra