Home » Yandamuri veerendranath » క్షమించు సుప్రియా!


    అంతకు కొద్దిరోజుల క్రితమే రాజు దగ్గర శిష్యరికం పొందాడు పాపారావు. రాజు పూర్తిపేరు సత్యనారాయణరాజు!
   
    "సలహాల్రాజు" అని అందరూ అంటూ వుంటారు కూడా. చిన్న సలహా అయితే కాఫీ, టిఫిన్ పెద్ద సలహా అయితే ఒక్క "హల్లో".....రాజు ఫీజు! రాజుకి ప్రతి విషయంలోనూ ప్రవేశముంది (అని తను నుకుంటూ వుంటాడు.) "రెండు హల్లోలు" సమర్పించి రాజు దగ్గర తను మొదటిరోజు చెప్పవలసిన డైలాగులన్నీ పాఠంలా బట్టీపట్టి, ఎందుకైనా మంచిదని కాపీ రాసుకుని జేబులో పెట్టుకున్నాడు.
   
    తాయారు లోపలికి వచ్చింది. బయటవున్న ఆడంగులతో "గడియ బయట పెట్టుకోండి. లోపల గడియ సరిగ్గా పడదు" అని చెప్పి తలుపు వేసింది. పాపారావుని చూసి నవ్వి చుట్టూ కిటికీలనీ, బొందుల్నీ పరీక్షించసాగింది. పాపారావు మూర్చపోబోయి తమాయించుకున్నాడు. సలహార్రాజు చెప్పిన పాఠంలో ఇంకోలా వుంది. ఆ అమ్మాయి గడప దగగ్రే బొటన వేలితో పిచ్చిగీతలు గీస్తూ నిలబడి వుంటుందని సలహార్రాజు చెప్పిన పాఠంలో మొదటిపేరానుంచీ కంటిన్యూ చేద్దామనుకున్నాడు పాపారావు.
   
    జూలియెట్ లాగా తాయారు నిలబడి వుందనుకొని, ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులూ పూర్తిగా చాపి "తాయారూ నా జీవనరంగానికి సితారూ" అని, తరువాత డైలాగు మర్చిపోయి లేచి నిలబడి సీరియస్ గా జేబులో కాగితం కోసం వెతుక్కోసాగాడు. దిండు క్రింద పరుపు, దుప్పటి దులిపి అన్నీ గాలించాడు. లాభంలేకపోయింది. తాయారు అతణ్ణి చూసి జాలిపడి నవ్వింది. ఇంక ఆ కాగితంతో లాభం లేదనుకొని పాపారావు ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. తాయారు అతని మెడచుట్టూ రెండు చేతులూ వేసి చెవి దగ్గిరగా నోరుపెట్టి ఆనందంగా ఈల వేసింది. పాపారావు అదిరిపోయాడు. దయ్యమేమో అని క్షణం బెంగపడ్డాడు. ధైర్యం చేసి అదే అడిగాడు. తాయారు కోపగించుకొని బయటికి పోబోయింది. పాపారావుకి తొలిరాత్రి ఆ విధంగా పాడవటం ఇష్టంలేక, సత్యనారాయణరాజు చెప్పిన చివరిదీ - ఆఖరుదీ అయిన సలహా జ్ఞాపకం వచ్చి తాయారుని లాలించాడు.
   
    శోభనం గది బయట వున్నా పేరంటాళ్ళకి మాత్రం గదిలోంచి ఈల పాటలు వినిపించాయి. తాయారు సంగతి తెలియని పేరంటాళ్ళు మాత్రం. "పెళ్ళికొడుకు చాలా హుషారుగా వున్నాడు" అనుకున్నారు -
   
    ఇలా మొదలయింది పాపారావు ఈల బాధ.
   
    పొగడ చెట్టుక్రింద విరాగిలా కూర్చునివున్న పాపారావు క్రిందటి ఆటలో అకౌంటెంట్ ఇచ్చి, ఈ ఆటలో రాంగ్ షో చూపించి దొరికిపోయిన వాడిలా దిగులుగా వున్నాడు. మొన్న సినిమాలో జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చి అతడికి ఉబికి ఉబికి దుఃఖం రాబోతోంది. అసలేం జరిగిందంటే-
   
    ఉద్యోగం రానిక్రితం పాపారావు ఎప్పుడూ సినిమాకి బెంచీకే వెళ్ళేవాడు. పెళ్లయ్యేక భార్యను తీసుకొని సినిమాకి వెళ్ళడం అదే ప్రథమం. "కల్పనా"లో ఒక తెలుగు సినిమా అడుతూంది. ఆ సినిమా కాకినాడ ఏ పదోసారో రావడం. తాయారుకు స్టంటు సినిమాలంటే మహా ఇష్టం. పాత సినిమా అయినా దానికే వెళదామంది. పాపం పాపారావుకేమి తెలుసు? ఎప్పుడూ శ్రీరామ పట్టాభిషేకం లాంటివి చూస్తుంటాడు. "సరే" అంటూ సినిమాకి బయలుదేరదీశాడు భార్యని.
   
    రిక్షా దిగి అలవాటు ప్రకారం ఎనభై పైసల టిక్కెట్టువైపు దారితీయబోయి ప్రక్కనే భార్య వుందని గ్రహించి, కుర్చీ టిక్కెట్టు తీసుకుంటే భార్య దృష్టిలో చులకన అయిపోతానని అభిమానపడి, సత్యనారాయణరాజు సలహా ప్రకారం రెండు రిజర్వుడు టిక్కెట్లు తీసుకున్నాడు.
   
    తాయారు, పాపారావు కంటే నాలుగంగుళాలు పొడవు. ఇద్దరూ హాల్లోకి ప్రవేశించగానే అందరికళ్ళూ వాళ్ళ,మీదే నిలిచాయి. రిజర్వుడు క్లాసులో అమ్మాయిలూ, అబ్బాయిలూ చాలా మంది వున్నారు. పాత స్టంటు సినిమాలంటే ఈ మధ్య అబ్బాయిలూ, అమ్మాయిలూ ఎందుకో తెగ ఇష్టపడుతున్నారు. అబ్బాయిల అల్లరి మామూలేగా.
   
    పాపారావుకి క్లాసులో ఎక్కడా రెండు సీట్లు పక్కపక్కగా కనిపించలేదు. తాయారుకి అమ్మాయిల మధ్య ఓ సీటు ఖాళీగా దొరికితే అందులో వెళ్ళి కూర్చుంది. ఆ వెనక వరసలో తాయారు సీటు వెనక కుర్చీలో పాపారావు కూలబడ్డాడు.
   
    సినిమా మొదలయింది. ఒకచోట హీరో, కొండదొంగ ఒకడూ తీవ్రంగా దెబ్బలాడుకుంటున్నారు. అబ్బాయిలలోంచి (రిజర్వుడు క్లాసుల్లోంచి) ఎవరో గట్టిగా ఈలవేశారు. వెంటనే ఆ ఈలకి మంచి "రెస్పాన్స్" వచ్చింది. హాలంతా విజిల్స్ తో నిండిపోయింది.
   
    అమ్మాయిలిదంతా చూస్తున్నారు. అందులో ఒక అమ్మాయి వుండబట్టలేక అనేసింది. "మనం మగవాళ్ళతో సమానమే కాని, ఈల మాత్రం వేయలేకపోతున్నాం" అని. అంతా చాలా సీరియస్ గా బాధపడ్డారు. అంతలో హాల్మతా నిశ్శబ్దం అయిపోయింది. కొండచివర హీరో, విలన్ లు పోరాడుతున్నారు. విలన్ క్రింద పడిపోయాడు. అంతే, నోట్లో వేలుపెట్టి నాలుక మడతవేసి హాలు దద్దరిల్లేలా ఈల కొట్టింది తాయారు.
   
    చాలా సీరియస్ గా సినిమా చూస్తున్న పాపారావు పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయాడు. అమ్మాయిలంతా తాయారువైపూ, తమలో తామూ చూసుకున్నారు. చప్పట్లు కొట్టి తాయారుకి 'కంగ్రాట్స్' చెప్పారు. అమనాథం సినిమా ఆగిపోయింది. లైట్లు వెలిగాయి. తాయారు విజయగర్వంతో అమ్మాయిలవైపు చూసింది.
   
    పాపారావు అధఃపాతాళం ఎక్కడన్నా కనబడుతుందేమోనని వెతుక్కుంటూ ఉన్నాడు.
   
    "మీ ఇల్లెక్కడండి?" ఒక అమ్మాయి అడిగింది.
   
    "రామారావుపేట- ఈశ్వరా లైబ్రరీ దగ్గర" అని చెబుతోంది తాయారు. పాపారావు తాయారు చెప్పేవన్నీ వింటున్నాడు. వాళ్ళంతా ఈల నేర్చుకోవడానికి ఇంటికి వస్తారట. అలాగే రమ్మంటూంది తాయారు. "ఔరా!" అని ముక్కుమీద వేలు వేసుకున్నాడు పాపారావు. అంతలో రీలు తెగిపోయిన సినిమా మళ్ళీ మొదలయింది.
   
    మళ్ళీ యుద్ధం సీను వచ్చేసరికి తాయారు ఈల వెంబడి ఈల వేయటం మొదలుపెట్టింది. దానికి అమ్మాయిలంతా సపోర్టు.
   
    హాల్లో పొగ త్రాగిన వారిని శిక్షించే నిమిత్తం వారిని హాలు బయటకు తీసుకుపోయి, వారి దగ్గర కొద్దో గొప్పో స్వీకరించి వదిలేసే పోలీసులిద్దరికీ, అబ్బాయి ఎవరైనా అమ్మాయిల మధ్యలో ఈల కొడుతూ పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడేమోనని అనుమానం వచ్చింది. తాయారు దగ్గరికి వచ్చి పరిశీలనగా చూడసాగారు.
   
    పాపారావు ఇంక సహించలేకపోయాడు. వెంటనే చివాల్న కుర్చీలోంచి లేచి, "తాయారూ, తల నొప్పిగా వుంది నేను వెళుతున్నాను" అంటూ బయలుదేరాడు. తాయారు తన కుర్చీలోంచి లేచి, పతి ననుసరించింది. విషయం అర్ధమయిన పోలీసు లిద్దరూ బీడీలు వెలిగించి దమ్ములాగి అక్కడే సర్దుకున్నారు.
   
    పాపారావు తాయరుతో సహా రిక్షా ఎక్కి ఇంటికి చేరాడు. తాయారు లోపలికి రాగానే, "తాయారూ, నువ్వలా ఈల వేయచ్చా?" అంటూ సన్నగా చివాట్లు వేశాడు. "మీ మగవాళ్ళు వేయవచ్చా!" అంటూ మళ్ళీ వేయబోయింది. "నాకు కోపం తెప్పించకు" అన్నాడు భయపడుతూనే. ఎందుకంటే, తాయారు బరువూ, ఎత్తూ పాపారావు కంటే ఎక్కువే.
   
                                                              *    *    *
   
    పాపారావు బాధపడుతూ సిమ్మెంటు బెంచీమీద నించి లేచి పార్కులోంచి బయటకి వచ్చాడు. చతుర్ముఖ పారాయణంవైపు దారితీయబోయి, అది నెలాఖరు ఆదివారమనీ, అందువల్ల జేబులో డబ్బులు లేవనీ గుర్తుకొచ్చి ఇంటికి బయలుదేరాడు.
   
    భోజనం చేసి పడకగదిలో తీరికగా కూర్చుని ఉండగా ఇంటిముందు రెండు రిక్షాలు ఆగి, నాలుగు సీతాకోక చిలుకలు దిగినాయి. పాపారావు కిటికీలోంచి చూస్తూండగానే, తాయారుగారి ఇల్లు యిదేనా, అని వాళ్ళు అడగడం, తాయారు లోపలనుంచి వచ్చి ఎవరు కావాలండీ అని అడగడం జరిగినాయి. పాపారావు ఆశ్చర్యపడుతూ ఉండగానే వాళ్ళలో ఒక అమ్మాయి "మీరే కావాలండీ, ఆ రోజు సినిమాహాల్లో సంగతి మరిచిపోయినట్టున్నారు" అని అంది.
   
    తాయారు హుషారుగా ఒక్కసారి ఈలవేసి- "రండి రండి. మరిచిపోయాను సుమండీ" అంటూ ఆహ్వానించింది.
   
    పాపారావు కుక్కిన పేనులా మంచంమీద పడుకొని, నెలకి సరిపడా తెచ్చిన ద్రాక్ష, జీడిపప్పు మళ్ళా తెచ్చుకోవలసిన అవసరం గురించి ఆలోచించసాగాడు.
   
    హాల్లో అమ్మాయిలు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. పాపారావుకి వాళ్ళ మాటలు అస్పష్టంగా విన్పిస్తున్నాయి.
   
    "ఇవన్నీ ఎందుకండీ?"
   
    "మరేం ఫర్వాలేదు. నేను మీ ఇంటి కెప్పుడయినా వస్తే ఏమీ పెట్టనవసరం లేదులెండి" అని, "సమయానికి మావారు ఇంట్లో లేరు. ఉంటే ఎంతో సంతోషిద్దురు" అని పడక గది దగ్గరకు వెళ్ళి బయట గొళ్ళెం పెట్టేసింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra