Home » Suryadevara rammohan rao » మోడల్


    షూటింగ్ కి  పేకప్ చెప్పి రూపాను హాస్పిటల్ లో చేర్పించే ఏర్పాట్లు చేశాడు నిముషాలమీద మనోహర్. ఆ రోజు రోమాకౌర్ తో  తీయాల్సిన బాలన్స్ వర్క్ ని కూడా పోస్ట్ పోన్ చేశాడు. ప్రాణంలేని శవంలా అస్తవ్యస్తంగా పడివున్న రూపాచక్రవర్తి మనోహర్ హృదయాన్ని కలచి వేసింది. ఆ కలత అతనిలో ఆలోచనలకు బదులు ఆవేశాన్ని. చాలెంజ్ ని రెచ్చగొట్టింది.

   
                                *    *    *


    లేక్ లో ఒడ్డునుంచి ఎంత దూరంలో షూటింగ్ బోట్  వుందో, అక్కడ సరస్సు లోతెంతో లాంటి అంశాల్ని ఎంతో పకడ్బందీగా తెల్సుకోని వేసుకున్న ప్లాన్ ప్లాప్ అయింది. ప్రదీప్ అహం దెబ్బతింది. అతనిలో కోపం పడగవిప్పి బుసలు కొట్టింది. అండే......మరో గంటకు అరడుగుల స్విమ్మర్ బాడీ శవంలా తేలింది. గండిపేట చెరువులో ఈతకుపోయి చాతకాక చనిపోయాడని పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. రాసుకొని ఫైల్ క్లోజ్  చేసారు ఒక గజ ఈతగాడి గురించి.


                                *    *    *


    రూపాపై జరిగిన హత్యాప్రయత్నాన్ని బయటకు పొక్కకుండా కఠినమైన అంక్షలు పెట్టాడు మనోహర్. హాస్పిటల్ లో కోలుకొంటున్న రూపా దగ్గర చందూని కాపలాపెట్టి, ఊళ్ళోనే వున్న రూపా  బంధువులకి ఫోన్ చేశాడు ఆమెను భద్రంగా ఢిల్లీ చేర్పించమని.


                                *    *    *


    ఢిల్లీ  ఎయిర్ పోర్ట్ లో టిక్కెట్  చెక్  చేస్తూ అన్నాడు  ఆఫీసర్  "యు ఆర్ మిష్టర్  అవినాష్?"

    "యస్" అంటూ ప్రక్కన చూసి అదిరిపడ్డాడు మధు.  పక్కనే  ఇండియాన్ సొసైటీ ఆఫ్ అడ్వర్ టైజర్స్ చైర్ మన్  సుచంద్ర. ఓ క్షణం కలవరపడ్డాడు. తను అతనికి బాగా తెలుసు. తన పేరుకూడా  తెలుసు.

    "హలో మధు! హౌ ఆర్యూ?"

    "ఫైన్ సార్."

    "ఏమిటి నీ పేరు  మధు కదా అవినాష్  అంటున్నాడు ఆఫీసర్" హడావుడిలో వున్న ఆఫీసర్ అది వినలేదు. మధు వూపిరి పీల్చుకున్నాడు.

    "పేరు పొరపాటున మారిపోయింది సార్!"

    అతన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదనిపించింది మధుకి.

    "అలాంటివన్ని మాకు చెప్పడు సార్  మా బాస్, వస్తాను సార్." అంటూ ఎవరో తరుముతున్నట్లుగా సెక్యూరిటీ చెక్ వైపు నడిచాడు.

    తన బాస్ ఎవరికీ తెలియకుండా వుంచమన్నాడు ఈ ప్రయాణాన్ని. కరక్టుగా అదే టైమ్ కి రావాలా సుచంద్ర. మధు ఆలోచస్తుండగానే సుచంద్ర తన చిరకాల మిత్రుడు ప్రదీప్ కి ఫోన్ చేయటానికి టెలిఫోన్ బూత్ వైపు నడిచాడు.

   
                             *    *    *


    మనోహర్ ఇంటికి వచ్చేసరికి కమలిని వచ్చి వుంది. ఉదయం మనోహర్ షూటింగ్ కి వెళ్ళగానే కమలిని ఆహ్వానంపై ఆమె ఇంటికి వెళ్ళింది మంగళ. డ్రైవింగ్ పై ఇంట్రస్ట్ వున్న మంగళ కమలిని కారులో పెరేడ్ గ్రౌండ్స్ కి వెళ్ళి మధ్యాహ్నం వరకు డ్రైవింగ్ నేర్చుకొని ఆమెను తీసుకొని వచ్చింది.

    "మంగళ, నేనూ సరదాగా షాపింగ్ కి వెళదామనుకుంటున్నాం. వెళ్ళమా?" అడిగింది కమలిని. మంగళ వైపు చూశాడు మనోహర్. ఆమెలో అదే ఉత్సాహం కనిపించింది. "ఓ.కే" అన్నాడు మనోహర్  మొహం అంతగా ఎందుకు వాడిపోయిందో ఇద్దరికీ తెల్సుకోవాలని వున్నా ధైర్యంచేసి అడగలేకపోయారు. రూపాకి జరిగిన ప్రమాదాన్ని కావాలనే మంగళ, కమలిని దగ్గర దాచాడు.

    కమలిని కారులో ఇద్దరూ షాపింగ్ కి వెళ్ళిపోయారు.

    సాయంత్రం ఆరవుతుండగా ఎయిర్ పోర్టు నుంచి సరాసరి మనోహర్  ఇంటికి. మధు. షాపింగ్ కి వెళ్ళిన మంగళ, కమలిని ఇంకా రాలేదు. మధు ఢిల్లీ  నుండి ఎప్పుడొస్తాడా? ఎప్పుడు వ్యాస్ దగ్గరకు వెళదామా అని కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న మనోహర్ మధును చూడగానే హడావుడి ఎదురెళ్ళి "తెచ్చావా?" అన్నాడు.

    "తెచ్చాను సార్."

    "వెరీగుడ్. ఎన్ని ఫోటోలు తెచ్చావ్?"

    "మూడు సార్" అని తాను రూపా ఇంట్లో దొంగిలించిన  సోఫియా ఫోటోలు తీసి ఇచ్చాడు. అవి చూసుకొని సంతృప్తిపడి కోరమాండల్  ఫైల్ తీసుకొని హడావుడిగా బయల్దేరుతుండగా బయటనుండి మంగళ, ఉండగలరా?" కమలినిని అడిగాడు. కమలిని తలూపింది.

    మనోహర్, మధు హడావుడిగా బయటకు వెళ్ళిపోయారు. తాను కొనుక్కొచ్చుకున్న వస్తువుల్ని, మనోహర్ కు కొనుక్కొచ్చిన వులన్ కోటు మనోహర్ కి చూపించాలని ఎంతగానో ఆశపడింది మంగళ. కాని ఆ అవకాశమే దొరకలేదు.  మనోహర్  ఇదే వృత్తిలో కొనసాగితే తనకు మనోహర్ తో పంచుకోవాలనుకుంటున్న చాలా కోర్కెలు తీరకపోవచ్చు. ఎలాగైనా మనోహర్ ని ఈ వృత్తినుంచి ఎడంగా తీసుకెళ్ళాలని, డానికి అవసరమైతే కమలిని సహాయం కూడా తీసుకోవాలనుకుంది మంగళ.

    మనోహర్ కారు రివ్వున బాణంలా దూసుకుపోతోంది కోరమాండల్ ఆఫీసువైపు ఎలాగైనా సోఫియానే మోడల్ గా  వ్యాస్ తో అంగీకరింపచేయాలి అని ఆలోచిస్తున్నాడు మనోహర్. సవ్యంగాజరిగిపోతుందనుకుంటున్న తన ప్రాజెక్టుకి అనుకోని ఈ ఫోటోలు  తారుమారు, అవాంతరం, చిరాకు కలిగిస్తోంది. కీచుమంటూ శబ్దం చేస్తూ కారు కోరమాండల్ ఆపీసు మెయిన్ గేట్ ముందు ఆగింది. రెండు రెండు మెట్లు ఒకే అంగలో ఎక్కేస్తున్నాడు మనోహర్. ఆందోళనగా వుంది. ఎలా అంగీకరింప చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తూనే వ్యాస్ రూమ్ లోకి దూసుకు పోయాడు.

    మధు కారు తలుపులన్నీ వేసి, లాక్ చేసి వచ్చి వ్యాస్ గది ఎదురుగా వున్న  సోఫాలో కూర్చున్నాడు.

    నిమిషాలు లేక్కబెడుతూ కూర్చున్న మధుకి లోపల ఏం జరుగుతుందోనని ఆతృతగా వుంది. వ్యాస్ సోఫియానే అంగీకరిస్తాడా లేక తరంగిణి కావాలని మడతపేచీ పెడతాడా? ఆ ఉత్కంఠ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కూర్చోలేక లేచి పచార్లు చేయటం మొదలెట్టాడు.


                                                                      *    *    *


    "హలో....ఎవరూ.....ప్రదీప్ సక్సేనా?"

    "హలో......గుడ్ ఈవెనింగ్ సుచంద్రాజీ. హౌ ఆర్యూ?" ప్రదీప్ కంఠం గరుకుగా కఠినంగా వుంది.

    "అరె ఎలా కనిపెట్టారు?"

    "ఆమాత్రం కనుక్కోలేకపోతే ఈ వృత్తిలో వుండటం అనవసరం. యామైరైట్?" స్పష్టంగా, హుందాగా అన్నాడు ప్రదీప్.

    "అఫ్ కోర్స్. ఇప్పటికి రెండుసార్లు ఫోన్ చేసాను మీకు. ఇప్పటికైనా దొరికారు"
   
    "ఎనీ అర్జంట్?" ఫోన్ లో మాట్లాడుతూనే ఇండియాన్ మోడల్ వరల్డ్ అనే ఆల్బమ్ తిరగేస్తున్నాడు. అతని చేతిలో వున్న  రెడ్ ఇన్ స్టెంట్  మార్కర్  తో కొందరి ఫోటోలపై మార్కు పెడుతున్నాడు.

    "అర్జంట్ కాకపోయినా కొన్ని విషయాలు తెల్సుకుందామని, ఒక విషయం చెబుదామని."

    "ముందు మీరు చెప్పదల్చుకున్నది చెప్పండి" ఇతరులు మాట్లాడే  ప్రతి మాటలో, చేసే ప్రతి పనిలో తనకు లాభించే దానికోసం కొండచిలువలా ఆశగా, ఆకలిగా చూస్తుంటాడు ప్రదీప్.

    "ఈ రోజు మధుచక్రవర్తి____అదే మనోహర్ అసిస్టెంట్ ఢిల్లీ  వచ్చాడు."

    "రావచ్చు, అందులో ఆశ్చర్యమేముంది?"

    "కాని అతను అవినాష్ అనే పేరుమీద ప్రయాణం చేసాడు."

    "ప్రదీప్ కర్కశమైన నవ్వు తెరలు తెరలుగా వినబడింది ఫోన్ లో సుచంద్రకు హఠాత్తుగా ప్రదీప్ నవ్వు ఆగిపోయింది.

    "ప్రయాణాన్ని రహస్యంగా వుంచాలనే ప్రయత్నమన్నమాట. థాంక్యూ ఫర్ యువర్ లిటిల్ బిట్ యూజ్ ఫుల్ ఇన్ ఫర్ మేషన్. ఇపుడు మీరు అడగదల్చుకుంది అడగండి."

    ఎలాంటి షాక్ న్యూస్ నైనా నింపాదిగా రిసీవ్ చేసుకోవడం ప్రదీప్ కు వృత్తి నేర్పిన అలవాటు.

    "నీకు, మనోహర్ కు గొడవలొచ్చాయని తెలిసింది. చాలెంజ్ కూడా చేసుకున్నారట. మన యాడ్ వరల్డ్ లో అందరూ దీని గురించే తర్కించుకుంటున్నారు. అసలేం జరిగింది?"

    "ఈ చాలెంజ్ లో ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం?"

    "చాలెంజ్ ఏమిటో, దేని గురించో పూర్తిగా తెలియకుండా ఎవరు గెలుస్తారని చెప్పటం? అయినా నువ్వే  గెలుస్తావన్న నమ్మకం వుంది నాకు."

    "నాకు తెలుసు. నా గురించి తెలిసినవారెవరైనా నేనే గెలుస్తానని భావిస్తారు. దటీజ్ సక్సేనా. మీకు చాలెంజ్ వివరాలు కావాలి. అవునా? ఎవరికి చెప్పటం ఇష్టంలేదు. కానీ మీరు నా బ్రెస్ట్ ఫ్రెండ్. అయినా పందెం  వివరాలలో థ్రిల్లింగ్ ఏంలేదు. మనోహర్ ని ఈ చాలెంజ్ లో గెలవకుండా ఎలా  పరిగెత్తిస్తావో తెలుసుకుంటేనే థ్రిల్లింగ్. స్టూడియోల్లో షూటింగ్ లో వుండల్సిన మనోహర్ తన కాలాన్ని  వృధాచేసుకుంటూ, రోడ్లెంట పరిగెత్తాలి. ఒకదెబ్బకు మూడుపిల్లలు కథ గురించి చెబుతాను. కాని ఇలా  ఫోన్ లోకాదు. అది అంత మంచిదికూడా కాదు. చూస్తుండండి సుఅచంద్రాజీ ఈ యాడ్ వరల్డ్ లో అల్లకల్లోలం సృష్టించి, ప్రతివాడి గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తాను. ప్రదీప్  అంటే పచ్చకామెర్ల రోగికి కూడా  లోకం ఎర్రగా   కనిపించాలి. మీలాంటివారి  సహకరంతో, నా తెలివితేటలతో ఇండియన్ యాడ్ వరల్డ్ కి కింగ్ ను కావాలి. ఇప్పుడున్న నా నాల్గుబ్రాంచీలకు తోడు రెండు నెలల్లో మరో పదిబ్రాంచీలు ఓపెన్ చేయబోతున్నాను. చాలా విషయాలు ఫోన్ లోనే  చెప్పేస్తున్నాను. మీకు ఖాళీ వుంటే ఓసారి హైద్రాబాద్ రండి. రెండురోజులు ఎంజాయ్ చేసినట్టుంటుంది. అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నట్లు వుంటుంది. ఏమంటారు?"

    ప్రదీప్ సక్సేనా ఆఫర్ చేసే ఎంజాయ్ మెంటంటే సుచంద్రకి సుఖాల అంచుల్ని కదిలించినట్లే. తనకు కావల్సింది తన నరాలు సేద తీరటమే. అదీ గొప్ప అందగత్తెలైన మోడల్స్ తో. ప్రదీప్ కి కావాల్సింది తన  పలుకుబాడితో అసోసియేషన్ ఆప్ నేషనల్ ఎడ్వర్ టైజర్స్ లో పనులు సవ్యంగా జరిగేలా చూడటం. అందుకే పట్టుబట్టి. సుచంద్రాని ఇండియాన్ సొసైటీ ఆఫ్  ఎడ్వర్  టైజర్సుకి చైర్మన్ గా గెలిపించాడు.

    "రేపే ఉదయం ప్లయిట్ కి వస్తున్నాను" అన్నాడు గతంలో తను ప్రదీప్ ద్వారా  పొందిన అమర సుఖాల్ని నెమరువేసుకుంటూ.

    ప్రదీప్ ఫోన్ పెట్టేస్తుండగా  ఐదడుగుల ఎనిమిదంగుళాల ఎత్తులో బలిష్టంగా ఉన్న ఓ యువకుడు లోనకు వచ్చాడు. అతనే విక్రమ్. ప్రదీప్ తో సరికొత్త డీల్  పెట్టుకున్న తను, అందుకు పాతిక లక్షలు ఇవ్వటానికి సిద్ధపడ్డతను అతనికి తెలియదు ప్రదీప్ తనతో డబుల్ గేమ్ ఆడుతున్నాన్నాడని.


                                *    *    *


    వెళ్ళిన అరగంటకు బయటకు వచ్చాడు మనోహర్ వ్యాస్ గది లోంచి. మొఖం మామూలుగా వుంది, మనోహర్ చేతిలోని ఫైల్ తీసుకుని అతన్ని అనుసరించాడు మధు. మొత్తానికి వ్యాస్ ఒప్పుకొని వుంటాడు. తరంగిణి కావాలనే పేచీ పెట్టుంటే చాలా ఇబ్బంది పడాల్సివచ్చేది. కాని తెలివితేటలకు పదును పెట్టుకుంటూ ఊరు, జాడ తెలియని తరంగిణిని కనుక్కునే ఛాన్స్ పోయింది. ఆలోచిస్తూనే మనోహర్ తో పాటు కారు ఎక్కాడు మధు. కారు రోడ్డుమీద సర్రున  దూసుకుపోతుంది. అంతకుముందే కుంభవృష్టి కురిస్తుండటంతో రోడ్డంతా తడితడిగా వుంది. తల్లని ఈదురుగాలి చెవులను కోస్తోంది. మనోహర్ ఏం మాట్లాడకుండా డ్రైవింగ్ మేడే దృష్టిని కేంద్రీకరించాడు. కొన్ని సందర్భాలలో హఠాత్తుగా మనోహర్ మౌనం వహిస్తాడు. ఆ మౌనం అంటే మధుకి భయం.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra