Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 17

    అంతే.

    ఎర్రపెట్టెలో వున్న దానిని చూసి కెవ్వుమని విరుచుకు పడిపోయింది వెంకుమాంబ.

    అప్పుడు సమయం రెండు నిమిషాలు తక్కువ రెండు.

    పక్క భాగాలలో వున్న వాళ్ళు గాఢనిద్రలో వున్నారు. లేకపోతే లేచి చూసేవారే ఈ అర్దరాత్రి ఆర్తనాదం ఏమిటా అని.....!

    వెంకుమాంబ భయంకరంగా కేకపెట్టి పడిపోవటంతో చలనరహితంగా నుంచున్న కోదండరామయ్య ఉలికిపాటుతో తేరుకున్నాడు.

    ఎర్ర పెట్టెలో వున్నది....

    ఓ అందమైన స్త్రీ తల, రెండుచేతులు, మొండెము, కాళ్ళు మటుకులేవు. తల చేతులు కుళ్ళి వుండాల్సింది. అలా కుళ్ళిలేవు. ఫ్రెష్ గానే వున్నాయి. శవాలుకూడా పాడు కాకుండా నీరుకారకుండా, వాసన రాకుండా మార్పులేకుండా వుంచే ప్రక్రియ ఏదోచేసి ఉంటారు. అందువల్ల అలా వుండి వుంటుంది. స్త్రీ తలకి ఒక కన్ను పెరికి వేసివుంది. ఓ పక్క చెవి చీలికలుచేసి వుంది. చేతులమీద మేకులు కొట్టి కొన్ని వేళ్ళు తీసేసి వున్నాయి.

    బహుశా

    హంతకుడు లేక హంతకులు ఆమెని దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపినట్లు తెలుస్తున్నది. ఆమె మొండానికి, కాళ్ళకి కూడా చిత్రహింసలు చిత్రాతి చిత్రంగా జరిగేవుంటాయి. అవి ఏ పెట్టెలో వున్నాయో మరి!

    ఎర్రపెట్టెలో తలని, చేతులనిపెట్టి చుట్టూతా బరువైన చెక్కలను పేర్చి, రైలులో పెట్టింది ఎవరన్నది తర్వాత విషయం పెట్టెలోనుంచి కుళ్ళిన శవం తాలూకా వాసన రాకుండా కొద్దిపాటి ఏదువాసన మాత్రమే వస్తున్నది. కొంతలో కొంత మేలు అది.

    తల పక్కనే చిన్న మూటవుంది. ఆ మూటవిప్పి చూడలేదు కోదండరామయ్య. మూట విప్పీ చూసినట్లయితే ఆయన అక్కడే పడిపోయేవాడు. ఆమె తాలూకా స్త్రీత్వం పుణికిపుచ్చు అందమయిన అవయవాలు అవి. ఆమె నుంచి పెరికి మూట గట్టి పెట్టడం జరిగింది.

    ఇదంతా అలా వుంచి పెట్టెలో ఒక బెదిరింపు లేఖకూడా వుంది.

    ఆ లేఖ ఇలా వుంది.

    బద్మాష్

    విషయం బైటికి పొక్కిందా నీ పేగులు తోడేసి నామెడలో వేసుకుంటాను. నీ శరీరంలో ఏదో ఒక భాగంలో రోజుకి రెండంగుళాళ ముక్క కోసి నీచేతనే తినిపిస్తాను. నిన్ను నీవే రోజురోజు కాస్త కాస్తగ నీ చావు నువ్వే చచ్చేలా చేస్తాను.

    ఎన్. ఆర్. ఆర్.

    కోదండరామయ్య ఆ మూట విప్పలేదు. ఆ లేఖా చదవలేదు. వెంకుమాంబ పడిపోయేసరికి గబుక్కున పెట్టె మూతవేసి ఆమె దగ్గరకు వచ్చాడు.

    వెంకుమాంబకి తెలివి రాలేదు.

    భార్యకి ఉపచర్యలు చేస్తూ తెలివి తెప్పించే ప్రయత్నంలో పడ్డాడు కోదండరామయ్య.

                                  10

    ఉదయం పదకొండు పది నిమిషాలు.

    కనకదుర్గగుడికి దూరంగా ఖాళీగావున్న ఆవరణలో కూర్చున్నారు కోదండరామయ్య, వెంకుమాంబ.

    ఉదయం పదిగంటలవేళ తెలిసిన వాళ్ళింటికి వెళ్ళి వస్తామని కోదండరామయ్య, వెంకుమాంబ బైలుదేరారు. మనోరమకి, పంకజానికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంటివాళ్ళ దగ్గర వాళ్ళకి బాగా చనువు వుంది. వాళ్ళెక్కడికన్నా వెళితే ఫలానా నిమిత్తం ఫలానా వాళ్ళింటికి అని చెప్పి వెళతారు. అలా కాకుండా తెలిసిన వాళ్ళింటికి అన్నారు. వెళ్ళారు.

    కోదండరామయ్య డల్ గా వున్నాడు. వెంకుమాంబ ముఖం నూరు లంఖణాలు చేసినట్లు పీక్కుపోయి వుంది. నిన్న రాత్రిదాకా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడినవాళ్ళు ఇలా అయిపోయారేమిటి?  

 Previous Page Next Page