Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 17


    " తీసుకో అక్కా. పొద్దుట్నుంచూ  నువ్వేమి తిన్నట్లూ లేదు. డబ్బులు లేకపోతే రేపిద్దువుగానిలే" అన్నాడు బార్ వాలా.


    " డబ్బులుకోసం కాదు అహ్మద్. నాకే తాగాలని లేదు."


    బార్ వాలా వెళ్ళిపోయాడు.

    
                          *    *    *    *

    
    నాలుగు దాటింది.ఉన్నట్లుండి ముఖంలో కాంతికిరణం తళుక్కుమన్నట్లయింది.


    కారులో సూర్యచంద్ర వస్తున్నాడు. అతని మొహమంతా  అవలసిపోయినట్లు, వ్యాకులపాటుతో వున్నట్లు- ఎలాగో వున్నాడు.


    ఆమెవంక చూసి అప్రయత్నంగా కారు స్లో చేశాడు.


    పాపచేతిలో గులాబీపువ్వు పట్టుకుని నిలబడి వుంది.


    కారాపు చేశాడు.


    " బాబుగారు" అని పిలిచింది."పువ్వు"


    చెయ్యిజాపి అందుకున్నాడు.


    "వాడిపోయింది బాబుగారూ . మికోసం చూసి చూసి."


    " ఇవేళ.... పొద్దుట కుదరలేదు...." అన్నాడు .ఆమె మాట్లాడకుండా నిలబడింది ఉన్నట్లుండి అతని తల్లో ఓ ఆలోచన మెరిసింది.


    " పాప" అన్నాడు.


    " బాబుగారూ!"


    " కారులో అలా పోయి వద్దాం రా."


    ఆమె ఆలోచించలేదు. "ఒక్క  నిమిషం బాబుగారూ!  ఈ సామాను" అంటూ చకచక తడబండిమిద వున్న స్టాక్, బండి రోజూ పెట్టేచోట అమర్చి వచ్చేసింది.


    సూర్యచంద్ర ఫ్రంట్ డోర్ తీశాడు. ఆమె భయం భయంగా లోపలకు ఎక్కి కూర్చుంది.


    కారు ముందుకు కదిలింది.

    
                          *    *    *    *

    
    ఆ రోజు సూర్య చంద్ర కు మనసు బాగా లేదు.


    రాత్రి  పొద్దుపోయాక తల్లి యింటికి రావటం చూశాడు. ఆమె మామూలుగా లేదు. తూలుతూ నడుస్తోంది.


    ఏమిటి? డ్రింక్ చేసిందా?"


    లోపలకొచ్చి సోఫా తగిలి క్రింద పడబోతూంటే  వచ్చి పడకుండా పట్టుకొన్నాడు. నవ్వుతూ అతనివంకత చూసి "థ్యాంక్యూ... మై బోయ్." అన్నది.


    ఆమె మాట స్వాభైవికంగా లేదు. నవ్వులో వెకిలితనం  కళ్లు మత్తుగా  మెరుస్తున్నాయి.


    అతని కర్దమయింది.ఆమె డ్రింక్ చెయ్యలేదు. నార్కోటిక్స్ వాడింది.


    మత్తు మందులకు అలవాటు కపడితోందన్న మాట.


    ఆ రోజుల్లో చాలామంది ఆల్కహాల్ , జరదాకిల్లీలతో బాటు మత్తుమందుల కలవాటు పడుతూన్న సంగతి అతనికి తెలుసు. కావాలని చేసుకుంటుందో, పరిస్థితుల్నిబట్టి చేసుకుంటారో అతని కర్థం కాని సంగతి. ఇరవై యిరవైరెండేళ్ళ వాళ్ళకి , తలిదండ్రుల పోషణలో వున్నావారికి అంత భయం కరమైన పరిస్థులులేమి వుంటాయి. మొదట సరదాకో, ఫ్యాషన్ కోసమో మొదలుపెడతారు. తర్వాత తర్వాత  ఆ అలవాటుకు బానిస  అయిపోతారు ఒక్కోక్కరూ ఒక్కో తరహామందులు, కొందరు డైజిపాం,  మేన్ డ్రాల్స్ ఎన్నో రకాల ట్రాన్ కిల్  లైజర్స్, ఆ స్టేజి దాటిపోతే ఇంజక్షన్స్. పెథిడిసి, మార్ఫియా, ఫోర్ట్ విన్, రోజుకి ఒకటి, రెండు , మూడు , నాలుగు....


    " అమ్మా!" అనిపిలిచాడు ఆమెను ప్రక్కమిదకు తీసుకెళ్ళి పడుకోబెడుతూ.


    సునందనాదేవి మూతలు పడుతోన్న కళ్ళని బలవంతాన తెరిచింది.


    " యస్. మైబాయ్"


    " ఇలా ఎందుకు చేస్తున్నావు?"


    "ఎలా?"


    "సెడెటిప్స్ కలవాటు పడుతున్నావు?"


    ఒక్క నిమిషం నిశ్శబ్దం.


    " చెప్పవా?"


    "ఒకప్పుడు... జివితంలో వేగాన్ని కోరుకున్నాను. ఇప్పుడా వేగాన్ని భరించలేకపోతున్నాను."


    అతని గుండె కళుక్కుమంది.


    "చంద్రా"  అంది.  "జీవితం ఎప్పడూ... ఓ విధంగానూ సుఖంగా వుండదని తెలుసుకున్నాను. మనం అందుకోవాలనుకున్నాది   అందుకున్నా సరే... యి వెల్తి .... తరుముతూనే వుంటుంది... ఒకానొకప్పుడు.... మంచి స్నేహితుడికోసం.... తపించాయి.... తర్వాత మంచి హజ్బెండ్ కోసం... ఆ  తర్వాత... నిండైన సొసైటీకోసం....  నా బలహీనతేమో తెలీదూ...నాకందరిలో లోపాలే కనిపిస్తూ వుంటాయి. . నీలో  కూడా..... ఇవన్నీ ఆలోచించుకూడదని  వేగంగా పరిగెత్తటం మొదలుపెట్టాను. ఆ  వేగంలో వికృతమైన అనుభవాలు....  ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి కొత్త గూడెం దగ్గర ఫారెస్ట్ లోకి ఎన్ టర్ టెయిన్ మెంట్ కోసం వెళ్ళాం గెస్ట్ హౌస్ లో దిగాం. ఆ రాత్రేం జరిగిందో తెలుసా...?"


    " అమ్మా! వొద్దు" అన్నాడు సూర్యచంద్ర వేదనంగా " నీ పర్సనల్ అనుభవాలు చెప్పొద్దు. నేను నీ కొడుకుని . విని భరించలేను.


    "అదికాదు"


    " ప్లీజ్! వొద్దు."


    " ఆల్  రైట్ " అంటూ మూతలు పడుతోన్న కళ్ళని యిహ కంట్రోల్ చేసుకోలేక " నాకు... నిద్ర వొస్తోంది.... గుడ్ నైట్.. అంది.


    ఆమె పడుకున్నాక బీరువా తెరిచి వెదికాడు. ఫోర్ట్ లిన్ యాంప్యూల్స్ డజన్లకొద్దీ కనిపించాయి. అతని మనసంతా ఆ వేదనతో నిండిపోయింది.


    ఈరకం యింజక్షన్లకు  అలవాటుపడి, ఆరోగ్యం సర్వనాశనం చేసుకొని , క్షీణించి, క్షీణించి, చిదికి చిదికి చచ్చి పోయిన వాళ్ళని కొంతమందిని చూశాడు. ఆచావులుకూడా భయంకరంగా , హృదయ విదారకంగా వున్నాయి.

 Previous Page Next Page