అతనన్నాడు -" నా మనసులో మాట మీకు చెప్పాక, మనం కలిసే మొదటి కలయిక అద్భుతమైన అనుభవంగా మిలిగిపోవాలనుకున్నాను. కానీ మీ దగ్గర్నుంచి ఏ రెస్పాన్సూ లేదు. దాదాపు  పిచ్చెక్కేస్థితిలో వుండగా అదృష్టవశాత్తూ ఒక జర్నలిస్టు మీ నెంబరు చెప్పింది. నాకు స్వర్గద్వారాలు తెరుచుకున్నట్టు అనిపించింది. కానీ  మిమ్మల్ని వెంటనే కలుసుకోవాలన్న అతికష్టంమీద  అణుచుకున్నాను" అతను ఆగి అన్నాడు.

    ".....మీ అడ్రసు తెలిసిన వెంటనే నేను మిమ్మల్ని కలుసుకోకపోవటానికి కారణం వుంది. చెప్పానుగా....మన మొదటి కలయిక....ఆ తరువాత ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలని! దాన్ని ఆ తరువాత్తరువాత తలుచుకునే కొద్దీ మన మనసులో తీయటి అనుభూతిగా మిగలాలని....! అందుకే ఆలోచించాను. చాలా మంది ఎక్స్ పీరియన్స్ ని మామూలుగా అనుభవించి వదిలేస్తారు. నాకు ప్రతి మంచి అనుభవాన్ని  జాగ్రత్తగా తీర్చిదిద్దుకొని, ఒక మంచి అనుభూతిగా మలచుకుని దాచుకోవటం ఇష్టం. అందుకే మనం మొదటిసారి ఎలా కలుసుకుంటే బావుంటుందా అని ఆలోచించాను. మీకు  తెలియకుండా ఒక ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు తీయించాను. టెలిలెన్స్ తో.....వివిధ భంగిమల్లో...."

    ఆమె మొహం ఎర్రబడింది. అతడు దాన్ని గమనించలేదు. ఒక రకమైన ఉద్వేగంతో అన్నాడు. "మీ  ఫోటోలు అందాక, దేశపు నలుమూలల్నుంచీ పోట్రేట్ పెయింటర్స్ ని  పిలిపించాను. దిబెస్ట్ పెయింటర్స్! ఎంత ఖర్చయినా ఫర్వాలేదు..... నాకు మాత్రం ఒక్కొకరి దగ్గర్నుంచి వారం రోజుల్లో రెండు చిత్రాలు కావాలని చెప్పాను. వారు  నన్ను చూసి నవ్వుకోలేదు. కళాకారులూ, క్రీడాకారులూ ఒకేజాతికి చెందినవారు! వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు కుంచెలు కదిపారు. నిద్రాహారాలు మాని ఈ చిత్రాల్ని తయారు చేసారు. కేవలం వారం రోజుల్లో ఇన్ని చిత్రాలు పూర్తి చేసారంటే, దాన్ని బట్టి ఎంత కష్టపడి వుంటారో అర్థం చేసుకోవచ్చు. నేనిచ్చిన డబ్బు కాదు దానికి కారణం. వాళ్ళు ఈ దేశపు ప్రఖ్యాత చిత్రకారులు. దీన్ని ఒక యజ్ఞంలా తీసుకుని చేసారు. చూడండి చుట్టూ చూడండి. ఒక్కొక్క దానిలోనూ జీవకళ ఉట్టిపడటం లేదూ?"

    ఆమె చుట్టూ చూడలేదు. అతడివైపు చూస్తోంది. కళాకారుల్లాగే క్రీడాకారులూ పిచ్చివాళ్ళేనా? వాళ్ళ వాళ్ళ రంగాల్లో అత్యున్నత స్థానానికి వచ్చిన వాళ్ళందరూ తమ ప్రపంచంలోనే నిరంతరం వుండిపోయిన మాట నిజమేగానీ, ప్రహసిత్ పట్ల ఈ సత్యం నిజం కాదనిపిస్తోంది. క్రీడాకారుల్లో ప్రకృతిపట్ల ఇంత ఆకర్షణ వుండటం అరుదు. దూసుకువస్తున్న టెన్నీస్ బంతిని ప్రత్యర్థికి ఎలా తిప్పికొట్టాలా అని తీక్షణంగా చూసే అతడి కళ్ళు ప్రస్తుతం ఏ స్వప్న లోకాల్లోనే విహరిస్తున్నట్టున్నాయి.

    కానీ.....ఆమెకెందుకో అమితమైన దుఃఖం కలిగింది. అది అకారణ దుఃఖం కూడా కాదు.  ఆమె మౌనాన్ని అతడు మరోలా అర్థం చేసుకున్నాడు.

    "మీపట్ల నేను నా ప్రేమని ఈ విధంగా ప్రకటించటం మీకు నాపై తక్కువ భావాన్ని కలుగజేస్తోందా?" అనుమానంగా అడిగాడు. అతడలా ఎందుకడిగాడో ఆమెకి అర్థం కాలేదు. అతడే మళ్ళీ అన్నాడు..... "మీరనుకుంటున్నారు కదూ! డబ్బు ఖర్చుపెడితే ప్రేమ ఉద్భవించినట్లు కాదు. ఏ అమ్మాయి అయినా హృదయానికీ, ప్రేమకీ దాసోహం అంటుందే తప్ప డబ్బు ఖర్చుపెట్టి పటాయించాలనుకుంటే పడదు....అనుకుంటున్నారు కదూ!"

    ఆమెకు నవ్వొచ్చింది. అంత పెద్దవాడూ 'పటాయించటం' అన్నమాట వుపయోగించినందుకు కాదు. కొందరు నిత్యశంకితులు. ప్రేమలో మరీనూ..... అవతలివారి ప్రతిచర్యలోంచీ (అది ప్రియుడుగానీ, ప్రియురాలుగానీ) ఎద్ప్ ఒకటి బయటకు లాగి, దాన్ని తమ అనుమానాలకి అన్వయించుకుని 'నువ్విలా ఎందుకు చేసావ్? అలా ఎందుకు చేయలేదు' అని వేధిస్తూవుంటారు. ప్రతీ  పనికీ  అనుమానం వెలిబుచ్చి అవతలి వారిని సంశయాల్తో వేధిస్తూ వుంటారు.  ప్రహసిత్ నే తీసుకుంటే, ఆ రోజు ఫోన్ చేసి 'మొదటిసారి చూడగానే ప్రేమలో పడటం ఏమిటి? అని అనుమానిస్తున్నారా.....' అంటూ సంశయం వెలిబుచ్చాడు. ఇప్పుడు ఇదంతా ఇష్టపడిచేసి, 'డబ్బుతో నా ప్రేమని ప్రదర్శిస్తున్నానుకుంటున్నారా?' అంటూ మరో అనుమానం లేవనెత్తాడు. అందుకే ప్రేమికులు నిత్య శంకితులు.

    ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుండేసరికి దాన్ని మరోలా అర్థం చేసుకున్నాడు. "ఒకటినుంచి పదిలోపులో మూడు అంకెలు చెప్పండి" అన్నాడు.

    అతడు చప్పున అలా అడిగేసరికి ఆమె బిత్తరపోయి అతడెందుకు అడుగుతున్నాడో తెలియక, "....మూడు....ఏడు....తొమ్మిది" అంది.

    అతడు కళ్ళు మూసుకున్నాడు.

    ఆమెకి అర్థం కాలేదు.

    అతడేం చేయబోతున్నాడో ఏం చెప్పబోతున్నాడో తెలియలేదు. అతడు మాత్రం ఈ లోకంలో లేడు. "డ్యూస్' అయి, అవతలి ప్రత్యర్థి అడ్వంటేజ్ లోకి వచ్చి గేమ్ పాయింట్ లో వున్నప్పుడు.....సర్వీస్ చేయబోయే ముందు వంట్లోవున్న శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకోవటం కోసం ఆటస్థలంలో కళ్ళు మూసుకుని మెదడుని కాన్ సన్ ట్రేట్ చేస్తున్నట్టు వున్నాడు.

    ఆ తరువాత అతడి కంఠం వినపడింది.

    "ఏది నైతికమని ప్రశ్నించుకుంటే, భౌతికమైనదేదీ నైతికంకాదని తెలుస్తుంది. చిరునామా తెలియని తుమ్మెదకోసం పువ్వు విచ్చుకోవటం నైతికమా? రక్షణకోసం భార్యభర్తని పూజించటం నైతికమా? నైతికమూ అనైతికమూ అని రెండు వేర్వేరు లేవు.అనైతికమూ పరిస్థితిని బట్టి స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి నైతికంగా మారుతుంది. అనైతికాన్ని నైతికం చేసేది అవసరం....."

    ఆమె వులిక్కిపడింది. అది తన వాక్యమే. కానీ అతడు దాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాడో అర్థం కాలేదు. ఈలోపులో అతడు రెండోది చెప్పాడు.

    ".....గుండె గుండెకో సన్నాయి వుంటుంది. అదెప్పుడూ విషాదంగా శివరంజనే ఆలపిస్తూ వుంటుంది. ఒక హృదయంనిండా మరొక హృదయం వూపిరి ఊదినప్పుడే అది ఆనందకరమైన కళ్యాణిగా మారుతుంది"

    ఆమెకి అర్థమైంది.

    అర్థమై దిగ్భ్రాంతురాలైంది.

    అతడు తన అధ్యాయాల మొదటి వాక్యాలు చెపుతున్నాడు!

    ఇప్పటికి పత్రికలో పది అధ్యాయాల ప్రచురణ పూర్తయింది. అందుకే ఒకటి నుంచి పదిలోపు  మూడు అంకెలు చెప్పమన్నాడు. తను, 'మూడు, ఏడు, తొమ్మిది' అంటూ నోటికొచ్చిన అంకెలు చెప్పింది. అతడు చెప్పిన మొదటి వాక్యం మూడు అధ్యాయం ప్రారంభంలోది! రెండోది ఏదో అధ్యాయం మొదటిది.

    ఆమె నిశ్చేష్టురాలై కళ్ళప్పగించి చూస్తూండగానే అతడు తొమ్మిదో అధ్యాయపు ప్రారంభాన్ని చెప్పాడు.

 "అర్థరాత్రి..... లోక రహస్యాల్ని విప్పుతూన్న కవిలా... తలవంచుకుని వ్రాసుకుపోతూంటాను. ప్రపంచ నలుమూలల్లోకీ, దిగంతాల శూన్యంలోకీ పయనించి, ఎక్కడెక్కడి నుంచో భావాల్ని ఏర్చి కూర్చి మాలలల్లి తెస్తాను. నువ్వు మాత్రం నా పక్కనే అల్లుకుపోయి, విశ్వ రహస్యాన్ని విప్పుతావు."

    ....ఆమె వ్రాసిన తొమ్మిదో అధ్యాయపు మొదటి పేరా అది!

    ఆమె తన ఉద్విగ్నతని అపుకోవటానికి చాలా కష్టపడవలసి వచ్చింది.

    అతడు మొత్తం తన నవలనంతా కం...ఠ....తా వచ్చేటన్నిసార్లు చదివాడని అర్థమైంది. ఆమె కళ్ళనిండా అప్రయత్నంగా నీళ్ళు నిండాయి.

    అది ప్రేమకానీ కాకపోనీ..... ఒక రచయితకి ఇవ్వగలిగే అతి గొప్ప నీరాజనం అది. ఆ కన్నీళ్ళు ఆమె నుంచి వచ్చినవి కావు. ఆమెలోని రచయిత్రి నుంచి వచ్చినవి!

    క్షణాల్లో ఆమె సర్దుకుని మామూలు మనిషైంది. అతడివైపు సూటిగా చూసింది. వందల సంవత్సరాలు తపస్సుచేసి దేవుడు ప్రత్యక్షమయ్యాక వరమడిగి దాన్ని తీరుస్తాడా లేదా అని చూసే భక్తుడిలా వున్నాడు ప్రహసిత్.

    "మీరు నాయీ ఫోటోలని ఇంతకుముందు చూసారా ప్రహసిత్" అని అడిగింది. ఈసారి ఆశ్చర్యపోవటం అతని వంతయింది. లేదన్నట్టు తలూపాడు.

    "పోనీ ఈ బొమ్మల్ని?"

    "మీతోనే నేనూ ఈగదిలోకి ప్రవేశించటం" అదే మొదటిసారి అన్నట్టు చెప్పాడు. ఆమె వెళ్ళి ఒక నిలువెత్తు చిత్తురువు ముందు నిలబడింది. అ ప్రయత్నంగా అతడూ వెనుకే నడిచాడు. ఆమె దానిని చూస్తూ అన్నది.....

    "మీరు చాలా పొరపాటు చేసారు ప్రహసిత్. ప్రేమలోపడినవారు చిత్తరువుల్నీ, గత జ్ఞాపకాల్నీ ఆశ్రయించి బ్రతుకుతారట. మీరు నాకు చూపించటం కోసం ఇన్ని బొమ్మల్ని తయారు చేయించారు. వీటిముందు ఒక క్షణం గడిపివుంటే....అది ఒయాసిన్ కాదని ఎండమావి అనీ తెలిసివుండేది. ఆ బొమ్మని చూడండి. కాలికి మట్టెలూ, మెడలో సూత్రాలూ కనపడటం లేదూ?"

    అతడు స్తబ్దుడయ్యాడు. సుఖమనే సంపదకన్నా దుఃఖమనే అపదకే శక్తి ఎక్కువ. మధురమైన జ్ఞాపకంకన్నా.....మరపురాని బాధకే వయసు ఎక్కువ.

    అశ్రువుకన్నా విషాదదూతిక ఏమయినా వుంటుందా?

    తన బాధకు ఆ అశ్రువుని రాయబారి చేయకుండా వుండటం కోసం అతను చాలా కష్టపడ్డాడు. ఆనందాన్ని ప్రకటించటానికి కోటిగొంతుల కిన్నెరలు కావాలి. విషాదాన్ని ప్రకటించటానికి ఒక గుండె కంజరి చాలు.

    అనుభవం ఉపాధ్యాయుడై, మనసుకి ఎలా దుఃఖించాలో నేర్పుతోంది.

    ఆ శిథిలాల నుంచి తేరుకుని అతడు కనులేత్తేసరికి ఆమె లేదు.


                                                               *    *    *

    నాలుగు రోజులు గడిచాయి.

    అయిదోరోజు వచ్చిందామెకు ఫోను. ఆమె రిసీవర్ ఎత్తి 'హల్లో' అనగానే 'నేనూ, ప్రహసిత్ ని' అని వినిపించింది.

    అలలు అంచుని పేరుకున్న నిశ్శబ్దం కెరటమై విరిగి - శబ్దమై సముద్రం అడుక్కి వెళ్ళిపోయిన భావన! ఆమె వూపిరి బిగపట్టింది.

    "లక్ష్మీ...." అన్నాడతను అర్థ్రంగా. ".....ఇదే నా ఆఖరి ఫోన్ కాల్. నేనిక  మిమ్మల్ని వేధించను. మీరు నన్ను క్షమించండి. మనసుకు నచ్చింది కనపడగానే స్వంతం చేసుకోవాలనుకోవటం ఎంత తప్పో నాకర్థమైంది."

    "మీరే నన్ను క్షమించాలి. మొదటిసారే చెప్పివుంటే ఇదంతా జరిగివుండేది కాదు"

    "ఎందుకు జరిగివుండేది కాదు?"

    ఆమె నిరుత్తురాలై, "ఏమిటి మీరనేది?" అంది.

    "అవును లక్ష్మీ. నేను మీకు చెప్తోంది నా వాళ్ళ ఇకముందు మీకేమీ డిస్టర్బెన్సు వుండదని. అంతే తప్ప.... నేను మిమ్మల్ని ప్రేమించటం మానేస్తున్నానని కాదు. మీ పట్ల  నా ప్రేమ.....మీరు వివాహితా.....అవివాహితా అన్నదాని మీద  ఆధారపడి ఉద్భవించలేదు. అలాగే అది నశించదు కూడా. మనిద్దరం బాగా ముసలి వాళ్ళమయిన తరువాత బహుశా మరొక్కసారి నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పుడు మన 'కలయిక' లోకానికి' అభ్యంతరం వుండదు కదా!"

    ఆమె పెదవులు బిగపట్టి దుఃఖాన్ని ఆపుకుంటోంది. ఇంత ప్రేమను ఏం చేసుకోవాలో తెలియక ఆమె  ఉక్కిరి బిక్కిరి వుతోంది. ఇప్పటివరకూ తనది ఆకారణ దుఃఖం అనుకుంటోంది. కారణం ఇప్పుడు అర్థమైంది.

    అతనన్నాడు.... "నేను భగ్న ప్రేమికుడినై విషాదంలో మునిగిపోను. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ బరిలోకి దిగబోయే ముందు ట్రైయినింగ్ లో మాకు మానసిక శాస్త్రవేత్తలు 'పోజిటివ్ థింకింగ్.' గురించి చెప్తారు. పోజిటివ్ థింకింగ్ కన్నా పై మెట్టు 'ప్రో.....ఆక్టివ్ థింకింగ్' దాన్ని నా ఊపిరిగా చేసుకుంటాను. నా ప్రేమని స్ఫూర్తిగా తీసుకుని దేశంకోసం ఈ క్షణం నుంచీ ఆడతాను. నా ప్రతి గెలుపూ మీకు అంకితం. అది చెప్పటానికే ఫోన్ చేసాను లక్ష్మీగారూ! నేనేమయిపోతానో అని దిగులు చెందకండి."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra