Home » Surepalli vijaya » ష్.....మాట్లాడొద్దు

    నేరపరిశోధన యిన్ని కోణాలనుంచి జరుగుతుందా అనిపించింది.
    "రైట్ సార్...మీరు చెప్పింది కరెక్టే...నాకు తెలిసి ఇలాంటి  సైకాలజి కూడా వుంటుంది. ఈదీ అమిన్ గురించి మీరు వినే వుంటారు" అంది అపూర్వ.
    అతని మెదడు కంప్యూటర్ లా  పనిచేయడం ప్రారంభించింది.
    "ఈదీ అమిన్.. ఓ దేశాధ్యక్షుడు...నిరంకుశుడు.. శాడిస్ట్..అతని గురించి కథలు కథలుగా విని వున్నాడు.
    చాలా సంవత్సరల క్రితం ఓ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనంగా కూడా ప్రచురించిన జ్ఞాపకం.
    అతను మనిషి శరీరంలోని కొన్ని భాగాలను తినేవాడట.  శవాలను తినే వ్యక్తిగా అతనికి పేరు. గుండె లాంటి భాగాలను ప్రై చేసుకొని తినేవాడని కూడా ఎక్కడో చదివిన గుర్తు.
    ఎప్పుడో నరమాసం భక్షకులు మనుషులు అవయవాలు తింటారంటే  ఒళ్ళు గగుర్పొడిచేలా శరీరం జలదరిస్తుంది."
    "అవునవును..గుర్తొచ్చింది.." అన్నాడు.
    "అతను గుండె లాంటి భాగాలు వేపుకు తినేవాడట.  అతని ఫ్రిజ్ లో  మనిషి శరీరం అవయవాలు వుండేవట..  అదో మానసికపరమైన వ్యాధి. ఇలాంటి వ్యాధి అరుదుగా వుంటుంది. పరిస్దితులో, సమాజమో...లేదా..ఒక విధమైన ఇన్ ఫీరియారిటి కాంప్లెక్సో ఇలా తయారుచేస్తూ వుండవచ్చు. యితమిద్దమైన కారణం నాకు తెలియదు. కానీ, యిలా అవ్వడానికి అవకాశముంది"  అంది అపూర్వ.
    కృపాల్ ఆ కోణంలో ఆలోచించడం మొదలెట్టాడు.  అలా అవ్వడానికీ  అవకాశం వుండొచ్చు.
    అలా అయితే.. డాక్టర్ పార్ధసారధి సాయంతో ' కనబడుటలేదు'  అనే ప్రకటన యిచ్చి మనుష్యులను అట్రాక్ట్ చేసి వాళ్ళని చంపి... ఆ ఆలోవచనే భయంకరంగా వుంది.
    అపూర్వగారూ.. మనమో పని చేద్దాం.   మళ్ళీ ఓసారి మిథిలానగర్ వెళ్ళాలి. అందుకు మీ సాయం కావాలి. మీరొక్కరే ముందుగా  వెళ్ళండి. మీ వెనకే నేను ఫాలో అవుతాను.. ఆ ఇంట్లోనే ఏదో మిష్టరీ జరుగుతుందని నా అనుమానం" అన్నాడు.
    "అలాగే...ఈ అడ్వంచర్ లో నేనూ పార్టిసిపేట్  చేయగలుగుతున్నందుకు  ఆనందంగా వుంది.  నాతండ్రి ని  రక్షించుకునే  ప్రయత్నంలో  నేనూ భాగస్వామినవుతా... ఎప్పుడు వెళ్ళమంటారు?"
    "ఈ  రోజు రాత్రే..ఏ మాత్రం అనుమానం రాకుండా వెళ్ళండి.  మీకు రివాల్వర్ యిస్తాను.  అవసరమనుకుంటే దాన్ని ఉపయోగించడానికి వెనుకాడవద్దు.. బట్..మరోసారి ఆలోచించండి. రిస్క్ అనుకుంటే నేను మరొకరిని పంపిస్తా..."
    "నో నో...నేనే వెళ్తాను."
    "అలాగే సార్ "  అంది అపూర్వ.
    తను డైరెక్ట్ గా పూలి గుహకే వెళ్తూన్నాని అప్పటికే అర్ధమైంది అపూర్వకు.
  అపూర్వ వెళ్ళిపోగానే కృపాల్ రంగంలోకి దిగాడు.  మిథిలానగర్ లోని  యింటి నెంబర్ పదహారు  యింటి చుట్టూ పోలీస్ ఫోర్స్ వుండేలా అరేంజ్ చేయడం మొదలెట్టాడు.
    అతడికి అనుమానం  బలపడింది.  బహుశ యింటి నంబరు పదహరులో నేల మాగిళిలాంటిది  వుండొచ్చనే అనుమానం కలిగింది.
    అలాంటిదేమి లేకపోతే పార్దాసారధి చాందినీ తో కలిసి ఇంటికి వెళ్ళడం సంభవం. నలుగురు కుర్రాళ్ళు ఆ ఇంటి గేటు దూకి  వెళ్ళడం అసాధ్యమే.
    అసలు మిష్టరీ అంతా ఆ ఇంట్లోనే వుంది.   తను ఎటాక్ చేయాల్సింది కూడా ఆ ఇంటినే.
    తను అపూర్వ వెనకే వెళ్తాడు.  ఈసారి తాడో, పేడో తేల్చుకోవాలి.
    అతని కళ్ళముందు నలుగురు కుర్రాళ్ళు,  యాదగిరి కనిపిస్తున్నారు.                        
                                     *    *    *
    బాధగా మెలికలు  తిరిగిపోతోంది  చాందిని.  అర్ధరాత్రి పన్నెండు దాటింది.
    సాయంత్రం నుంచి ఆమె అలా నిస్సహాయంగా బెడ్ మీద వుంది.
    జేమ్స్ డేవిడ్ సాయంత్రం నుంచి తన శారీరక కోరికలు తీర్చుకుంటూ ఆమెను టార్చర్ చేస్తున్నాడు.
    అతని రాక్షస రతి భరించలేకపోతోంది. పొత్తి కడుపు కింద విపరీతమైన  నొప్పి.
    తనే మాత్రం బాధను వ్యక్తం చేసినా మరింత రెచ్చిపోతాడని తెలుసు.
    అప్పటికే వళ్ళంతా పచ్చి పుండులా తయారైంది.  ఆమె శరరిమంతా రక్కుల మయం.
    అయినా అతని పైశాచిక చేష్టలను భరిస్తుంది.  తనకు వూహ తెలిసినప్పట్నుంచీ అతని పైశాచికానందానికి  తను బలి అవుతూనే వుంది. అతనేది చెబితే అది చేయాలి.  పొరపాటున  ఆ పని చేయకపోతే నరకమే.
    అతను ఆమెను ఆక్రమించుకోవడానికి సిద్ధమవుతున్నడు.  ప్రాణం పోతే బావుండనిపిస్తుంది.
    అయినా పళ్ళ బిగువున భరిస్తుంది.   జేమ్స్ డేవిడ్ ఆమె పెదవిని  మరోసారి కొరికాడు.  'ఆమ్మా..' అంది అప్రయత్నంగా చాందిని.
    వెంటనే లేచాడు.  భయంతో  వణికిపోయింది చాందిని.
    టీపాయ్ మీద వున్న బ్రాందిని ఆమె పెదవుల మీదికి ఒంపాడు.
    మంట...ప్రాణం పోయే మంట..అయినా భరించింది.
    అతను ఆమె బాధను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఆమె శరీరంతో వికృత  కేళి మొదలెట్టాడు.
   "డాక్టర్ గారూ...నాకో సాయం చేస్తారా?"  అడిగాడు భార్గవ.
    "చెప్పండి..ఇక్కడ వున్నది మనిద్దరమే.. ఒకరికొకరు తోడు"
    "ఒకవేళ నాకు ఏదైనా అయితే నా భార్యకు నా డెడ్ బాడీని అందజేయండి.  భర్త బ్రతికి వున్నాడో లేడో తెలియక  అనుభవించే బాధకన్నా, చచ్చి పోయాడని తెలియడమే మేలు. కొన్నాళ్ళు ఏడిచి మామూలు అవుతారు" అన్నాడు భార్గవ.
    పార్ధసారధి కళ్ళు తడి అయ్యాయి.
    "డోండ్  వర్రీ..భార్గవ గారు...మనం ఈ నరకంలో నుంచి బయటపడతాం.  నాకా నమ్మకం వుంది. నా కూతురు నా గురించి ఈపాటికి స్టేట్స్ నుంచి వచ్చి వుంటుంది.  తనకు నేనంటే చచ్చే ప్రేమ..చివరి క్షణాల్లో తన ప్రేమను దూరం చేసుకున్నాను. ఓ స్త్రి వ్యామోహంలో పడి"  బాధగా అన్నాడు పార్ధసారధి.
                "బాధపడకండి.. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే తప్పులు జరిగిపోతూ వుంటాయి.  తప్పులు చేయడం మానవ సహజం.  కాకపోతే ఆ తప్పులు మనకు మంచి గుణపాఠం  నేర్పుతాయి.  ఆ తప్పుల  నుంచి గుణపాఠం నేర్చుకుంటే మరోసారి ఆ తప్ప చేయం..."
    "నిజమే" స్వగతంలో  అనుకున్నాడు పార్ధసారధి.
    "ఇక్కడ్నుంచి బయటపడే మార్గం లేదంటారా?"  భార్గవ అడిగాడు.
    "ఎప్పుడు బయటనుంచి తలుపేసి వెళ్తున్నాడు.  మనం తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు."
    "అవును.. కనీసం కరెంట్ కూడా లేదు"  అన్నాడు బార్గవ.
    "అండర్ గ్రౌండ్  వుంది.  అక్కడ ఆపరేషన్ థియేటర్ వుంది. బహుశ జనరేటర్ నుంచి అనుకుంటా..కరెంట్ ఎప్పడూ ఆన్ లోనే  వుంటుంది. నా కళ్ళకు గంతలు కట్టి..మెట్లు దిగమన్నాడు"  పార్ధసారధి చెప్పాడు.
    భార్గవ కు  భార్య గుర్తొస్తోంది.
                                       *    *    *
    అపూర్వ బాత్రూంలో నుంచి బెడ్ రూమ్ లోకి  వచ్చింది.  వార్డ్ రోబ్ లో నుంచి బ్లాక్ జీన్స్,  రెడ్ కలర్ టీ షర్ట్ తీసింది.
    బ్లాక్ జీన్స్ మీదికి రెడ్ కలర్ టి షర్ట్ టక్ చేసింది.  వెంట్రుకలను అలాగే గాలికి వదిలేసింది.
    అద్దం ముందు నిలబడి పది నిమిషాల్లో లైట్ మేకప్ తో  తయారైంది. డ్రెస్సింగ్ మిర్రర్ పక్కనే తండ్రి ఫోటో. ఆమె మనసు ఒక్క క్షణం ద్రవించి పోయింది.
    చిన్నప్పడే అమ్మ చనిపోయినా తన కోసం పెళ్ళి చేసుకోకుండా వున్న నాన్న.. తనే ప్రపంచంగా బ్రతికి తన కిష్టమని తెలిసి,  తనని స్టేట్స్ లో చదివించిన నాన్న.
    తనేది అడిగినా క్షణాల్లో అమర్చి పెట్టే నాన్న..ఆమె కళ్ళు అశ్రు పూరితాలయ్యాయి.  కన్నీళ్ళు తుడుచుకుంటూ లేచింది.
    తన తండ్రి తను రక్షించుకోవాలి.  రక్షించుకుంటుంది కూడా.  అది తన బాధ్యత.  అది తను తండ్రి కోసం నిర్వర్తించాల్సిన పని.
    తన కోసం ఎదురు చూడొద్దని  కంగారు పడొద్దని చెప్పింది.  రివాల్వర్ ని ఓసారి తడిమి చూసుకుంది. జీన్స్ లో  దాచింది ఆ రివాల్వర్ ని.
    అవసరమైతే  రివాల్వర్ ని  ఉపయోగించమని కృపాల్ చెప్పిన విషయం గుర్తొచ్చింది..
    బయటకు నడిచి గ్యారేజీలో నుంచి కారు బయటకు తీసింది.
    గుర్ఖా గేటు తెరిచి సెల్యూట్ చేశాడు. అర్ధరాత్రి పన్నెండు దాటుతుండగా,  కారు రోడ్డు మీదకి వచ్చింది.
    మిథిలానగర్ వైపు బయల్దేరింది ఆ కారు.  సరాసరి ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్తోంది ఆమె.
                                          *    *    *
    తలుపు తీసి ఇంట్లోకి అడుగు పెట్టాడు కృపాల్.    ఇల్లంతా చీకటిగా వుంది.
    మామూలుగాతను బెడ్  లైట్  వేసే వెళ్తాడు. కరెంటు లేదు కాబోలు అనుకున్నాడు.
    కానీ,  వెంటనే అతని దృష్టి ఎదురు ఇంటి వైపు మళ్ళింది.  ఆ ఇంట్లో కరెంట్ వుంది.  పక్కింట్లో కూడా వుంది.
    అంటే అతనింట్లోనే.
    ప్యూజు పోయి వుంటుందా? తను లైట్ ఆన్ చేయడం మరచిపోయి వుంటాడా?  ఆలోచిస్తూ జేబులో నుంచి పెన్ టార్చి తీసి ఆన్ చేశాడు.
    సన్నటి కాంతి.
    స్విచ్ వైపు చూసి స్దాణువయ్యాడు.  పైన  వున్న స్విచ్ లు  తొలగించి వ్తెర్లు బయటకు వేలాడుతున్నాయి.
    అంటే కావాలనే ఎవరో ఆ పని చేసినట్టు సృష్టంగా అర్ధమవుతుంది.
    అగ్గిపెట్టె వెతికి క్యాండిల్ ముట్టించాడు.  అన్ని స్విచ్ లూ  తొలగించి, వైర్లు బయటకు వదిలేశారు.  తను చీకట్లో స్విచ్ వేయడానికి చేయి పెడితే, షాక్ కొట్టడం గ్యారంటి.
    కిటికీలో నుంచి గాలి వీచింది.  క్యాండిల్ ఆరిపోయింది.  అగ్గిపెట్టెలో పుల్లలు లేవు.  కిచెన్ లోకి  వెళ్ళి మరో అగ్గిపెట్టె తెచ్చుకుందామనుకున్నాడు.
    కిచెన్ తలుపు మూసివుంది.  తను ఓపెన్ చేసే వుంచుతాడు.
    మెల్లగా తలుపు  ఓపెన్ చేస్తుండగా  అతని నాసికాపుటాలను తాకింది గ్యాస్ వాసన్.
    గ్యాస్ లీకవుతోంది. కాదు...ఎవరో గ్యాస్ లీక్ చేశారు...కావాలనే చేసారు.
    తను కంగారులో అగ్గిపుల్ల గీస్తే...అలాగే చీకట్లో తడుముకుంటూ వెళ్లి గ్యాస్ ఆఫ్ చేసాడు.  కిటికీలు తెరిచాడు డోర్స్ ఓపెన్ చేసాడు.
    అన్నీ క్లోజ్ చేసి వెళ్లారు.
    ఇదంతా జేమ్స్ డేవిడ్ పనే అని అర్ధమైంది.  సరిగ్గా అప్పడే ఫోన్ మోగింది.
    "హలో మైడియర్  ఎనిమి"  అటువైపు నుంచి జేమ్స్ డేవిడ్ గొంతు వినిపించింది.
    "నీకు కౌంట్ డౌన్ మొదలైంది మిస్టర్ జేమ్స్ డేవిడ్."
    ఒక్క క్షణం అటువైపు నుంచి  నిశ్శబ్దం.
    "ఏంటి...నేను నీ పేరు ఎలా తెలుసుకున్నావా?  అని ఆశ్చర్యపోతున్నావా?  నీ జాతకం కూడా తెలుసుకున్నాను.
    మరో పన్నెండు గంటల్లో నీ చాప్టర్ క్లోజ్...లెటజ్ వెయిట్ అండ్ సీ..."
    అచ్చా...నువ్వు ముందా యింట్లో నుంచి బయటపడితేకదా...అయినా నువ్వీపాటికి షాక్ కొట్టో, గ్యాస్ లిక్ తోనో చావాలే...గట్టివాడివే...ఎనిహౌ ఇప్పటివరకు తప్పించుకున్నందుకు కంగ్రాట్స్. యింకా నీకా చాన్స్ యివ్వను".
    "చూద్దాం" అంటూ ఈసారి తనే ఫోన్ డిస్ కనెక్టు చేసాడు కృపాల్.
    తన వూహ నిజమే.
    అతను జేమ్స్ డేవిడ్...పత్రికలో కనబడుటలేదు అన్న వ్యక్తే ఈ నేరాలన్నింటికీ మూలకారకుడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra