Home » Vasundhara » ఒక తీయని మాట

    "అదంతా నీభ్రమ!" అన్నాడు సాగర్ "ఆమె తన అసహాయస్ధితి నుండి బయటపడాలని ఎంతగానో కోరుకుంటోంది. తన కష్టాలకు  విముక్తి కలిగించమని భగవంతుణ్ణి ప్రార్ధించుకుంటోంది. ఆమెలో ఆశాలూ ఉన్నాయి. కోర్కెలూ వున్నాయి..."
    "అవేమి నాకు తెలియదేందుకు?"
    "ఎందుకంటే  ఆమె తెలివైనది మొదటి చూపులోనే నీ దురద్దేశ్యన్నామే అర్ధంచేసుకుంది. నిన్ను దూరంగావుంచడమే  తన ధ్యేయంగా పెట్టుకుని- నీ ముందు తన ఆలిచనలేమి బయట పడనివ్వలేదు."
    "ఎలాతేలుసు నీకు?"
    "నువ్వు చెప్పిందాన్నిబట్టే నేనూహించాను...."
    "అదే -ఎలా ఊహించావో చెప్ప!"
    "చేబుతానువిను నీవామే శరీరంపై మోజును పెంచుకుంటూ మనసును నిర్లక్ష్యంచేశావు. ఆమె మనసునరదంచేసుకుని వుంటే నువ్వింతగా భంగపడి వుండేవాడివి కాదు. నువ్వామేను  పెళ్ళిచేసుకుంటానన్నావు. పెద్దలతో మాట్లడమందామే నువ్వామే. శారిఅరాన్ని కోరావు. అప్పడామే నీకు తనకున్న పెళ్ళి  ప్రమాదం గురించి చెప్పుకుంది ఎందుకు? నీ నుంచి సానుభూతిని సహాయన్నీ సహకారాన్ని ఆశించిదామె! అప్పడూ నీవామే శరీరాన్నే కోరావు. నీకామె మనసుతో నిమిత్తంలేదని ఆమెగ్రహించింది నీపరిచయంలో ఒక్కసారికూడా నీవామే అందచందాల్ని , గుణగణాల్ని పొగిడినట్లులేదు  ఎంత సేపూ నీగురించే చెప్పుకుని  ఆమె నాకర్షించాలని చూశావు. ఆమె నీగురించి ఆలోచించడంలేదు. తనగురించి ఆలోచించుకుంటుంది. నువ్వూ ఆమెగురించె ఆలోచించివుంటే...."
    "ఇంతకి నేనేంతప్ప చేశానంటావు?"    
    "అమ్మ మంచిది నన్ను హింసించదు..." అంది నిర్మల చటుక్కున.
    "నేనూ మా అమ్మగురించి అందరికి అలాగే  చెప్పుకునేవాణ్ణి అయినా తనగురించి నేరాలుచెబుతున్నానేమోనని అమ్మకు  అనుమానం. నాన్నకు చెప్పి బాగా కొట్టిస్తూండేది చెప్పకునెందుకు ఎవ్వరూ లేక ఒక్కణ్ణి ఓమూలకూర్చుని ఎడుస్తూండేవాడిని..."
    "ఇంక చెప్పొద్దు..."అంది నిర్మల వింటూంటే ఆమె కేడుపోచ్చేసింది.
    సాగర్ తనూ కళ్ళనీళ్ళు తుడుచుకుని  "ఒంటరితనంలోని బాధనాకు  తెలుసు. మిమ్మల్ని చూడగానే నా ఆత్మీయులనిపించింది. మీకోసం ఏమైనా చేయాలనిపించింది. మీ గురించి తెలియగానే -మీకు రవ్వంత సానుభూతినిచ్చి మీనుంచి కొంత సానుభూతినీ పొందితే మనసుకు తృప్తిగా వుంటుందని పించింది" అన్నాడు.
    "నాకు పనులున్నాయి..."అంది నిర్మల చటుక్కున.
    "ఒకరిద్దరు తోడ్తెతే  ఎన్ని పనులైనా క్షణాలమీద అయిపోతాయి. ఒంటరిగా పనిచేయడంలోని బాధ నాకు తెలుసు. మీకు సాయపడే అవకాశాన్ని నాకూ యివ్వండి" అన్నాడు  సాగర్.
    "వద్దు ...." అంది నిర్మల.
    "ప్లీజ్....కాదనకండి...."
    సాగర్ ఆమెకు పనుల్లోసాయపడ్డాడు పనులుచకచకాఅయిపోయాయి.
    "కాసేపు మగదిలో కూర్చుందాం రండి!" అన్నాడు సాగర్.
    గది అనగానే నిర్మల ముఖంలో భయం కనబడింది.
    "మీయిష్టం మిరేక్కడంటే అక్కడే కూర్చుందాం!" అన్నాడు సాగర్ వెంటనే.
    అప్పుడు నిర్మల చపాతిపిండి ఆమె ఆపని చేస్తుంటే సాగర్ బంగాళాదుంపలకు చెక్కుతీశాడు. ఉల్లిపాయలు వలిచాడు.
    "మీకూ నాకూ ఒకతేడావుండి. ఇంటిలోనేను చాలా పని చేసేవాడిని కానీ మీకున్న ఒర్పులేదు ఏదోసమయంలో ప్రతిరోజూ అమ్మనేదిరించేవాణ్ణి దెబ్బలు తినేవాడిని...."
    "దెబ్బలు  తినడానికి అమ్మనేదిరించడమే అవసరంలేదు..."అంది నిర్మల.
    "అవును...." అన్నాడు సాగర్ తర్వాత నెమ్మదిగా- "చపాతిలంటే మీకిష్టమేనా?" అన్నాడు.
    నిర్మల తల అడ్డంగా వూపింది.
    "నేననుకున్నాను...."అన్నాడు సాగర్- "మాఅమ్మకూడా ఇంట్లో నాకేమైతే ఇష్టంకావో అవేచేసేది...."
    "చేసి వూరుకొదు మిగిలివన్ని నేననే తినమంటుంది. ఆరోజు ఉప్మా విషయంలోనూ అంతేజరిగింది సమయానికి దేవుడిలా మిరోచ్చి రక్షించారు" అంటూ నిర్మల అతడికి జరిగింది చెప్పింది.
    సాగర్మనసులో తన్నుతానే మెచ్చుకున్నాడు. సంభాషణసరైనదారి లోనే నడుస్తోంది. కానీ  అతడు  చపాలపిండి కేది భయంగా చూసి  "ఇవి ఎన్ని చపాతిలవుతాయి?" అన్నాడు.
    నిర్మల అర్ధంచేసుకుని "ఎన్నాయితేమాత్రం మీకేమినష్టం? రాత్రిభోజనం మీరు బయటచేస్తారుగా" అంది.
    "అదిసరే" అని "ఈరాత్రికి మీరు నా అతిధికావాలి- ఒప్పుకుంటారా?" అన్నాడు సాగర్.
    రాత్రికి అతిధి అన్నమాట ఎబ్బెట్టుగా తోచింది నిర్మలకి- "మీరనే దేమిటో నా కర్ధంకావడంలేదు...."అందామె.
    "అన్ని చెబుతాను ముందు మీకేమిష్టమో చెప్పండి...."అన్నాడు సాగర్ .
    "అంటే?"
    "అదే -ఇడ్లిలా, దోసేలా , పెసరట్లా, వడలా? ఏమిటో చెప్పండి" అన్నాడు సాగర్.
    "ఎందుకు?"
    "మీరు ఏమిటో  చెప్పండి నేను ఎందుకో చెబుతాను..."
    "ఇడ్లి కారప్పొడితో నాకెంతో యిష్టం..."అంది నిర్మల
    "అయితే ఈ రాత్రికి మీరు తినగలనాన్ని యిడ్లిలు నాగదిలో ఏర్పాటు చేస్తాను...." అన్నాడు సాగర్.
    "రాత్రేమిటి? మిగదేమిటి? ఏమిటి మీరనేది?" అంది నిర్మల
    "అయం సారి!" అన్నాడు  సాగర్- "కంగారులో అనుకున్నది సరిగ్గా చెప్పలేకపోయాను నేను మీవాళ్ళందరిభోజనాలూ అయ్యకనేకదా మీ భోజనం ఈ రోజుకు మీ యింట్లో చపాతీలు అవి మీకు సహించవు. రాత్రి  ఎనిమిదింటికి మీవల్ల భోజనాల్తేపోతాయి. ఆ సమయానికి నాగదిలో ఇడ్లీలు సిద్దంగా ఉంటాయి. వేడివేడి ఇడ్లీలు- మంచినేయ్యి కారప్పొడి- కొబ్బరి చట్ని! నేనేమో గదిలోంచి బయటకువచ్చి అత్తయ్యతో గదికాస్త శుభ్రంగా తుడిపించమని చెబుతాను మిరోచ్చేవరకూ అత్తయ్యను కబుర్లలో పడేస్తాను. అది సంగతి!"
    "అయంసారి!" అంది నిర్మల వెంటనే.
    "ఏం- నా ఆతిధ్యం మీకొష్టంముండదా?"
    "అదికాదు నేను మిమ్మల్ని తప్పగా అర్ధంచేసుకున్నాను..."
    "ఓహ్-అదా!" అని సాగర్ నిట్టూర్చాడు- "ఇందులో మితప్పేమీ లేదు. తప్పంతా నాదే! ఒంటరిగా మిమ్మల్ని  లాకలుసుకుని  మాట్లాడడం మనకు మంచిదికాదు మనసు  మంచిద్తేనా వయసు చెడ్డదన్న సామెతవుంది...."
    "మీ సాయంతో పనులన్నీ ఇట్టే  అయిపోయాయి. చాలా చాలా థ్యాంక్స్ "అంది నిర్మల మాటమారుస్తూ.
    "మీరు అనుమతిస్తే రోజూఇలాగే మీకుసాయపడగలను...." అన్నాడు సాగర్ ఆశగా ఆమెవ్తెపే చూస్తూ.
    "ఈరోజు నేను అనుమతించానా?" అంది నిర్మల.
    "మీ ప్రశ్నలోనే నాకు సమాధానం దొరికింది. ఇక మీవద్ద శెలవు తీసుకుంటాను. రాత్రికి ఇడ్లీల విషయం మరిచిపోకండి. నేను తెచ్చిన వాటిలో ఒక్కటికూడా  మరిచిపోకూడదు...." అన్నాడు సాగర్.    
మంటే శరీరాన్ని కాంక్షించడంకాదు. మనసును  జయించాలి. మనసూ, మనసూ కలిసేక ఇక శరీరాన్ని వశపరచుకోవడమన్నది- చితికేళ మీద పని ....."అన్నాడు సాగర్.
    "అది చూస్తానుగా-" అన్నాడు చంచల్రావు.
    "చూద్దువుగాని మంగళవారం సాయంత్రం నా ఆఫీసుగదిలో నిర్మాలని! తప్పకుండా రా...." అన్నాడు సాగర్.  
                                                                                    9
    నిర్మల బట్టలుతుకుతోంది. ఉన్నట్లుండి "ఈరోజు బుధవారం కదూ?" అన్న గొంతువిని తలెత్తిచూసింది నిర్మల.
    ఎదురుగా సాగర్!
    ఆమె చటుక్కున తనపరికిణినీ మోకాళ్ళకిందకూ లాక్కుని వోణి సరిచేసుకుంది మనసులో "విళ్ళిద్దరూ తోడుదొంగల్లా వున్నారు. ఒకడయ్యాక ఇంకొకడు"అనుకుంది.
    "ఈరోజు బుదవారం కదండి!" అన్నాడు సాగర్.
    "అవును" అంది నిర్మల
    "ఒక్కసారి లేచి ఇలావస్తారా?" అన్నాడు సాగర్.
    నిర్మల తటపటాయించింది. కానీ అతడి పిలుపులోని మృదుత్వానికి  చలిస్తూ లేచినిలబడింది.
    "నాపేరు సాగర్!" అన్నాడతడు.
    "నాకు తెలుసు...." అందామె.
    సాగర్ ఒక్కక్షణం  తటపటయించి- "మీతో ఒకముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను...." అన్నాడు.
    "ఏమిటి?" అంది నిర్మల.
    "నా స్నేహితుడు వెళ్ళిపోయాడు...." అన్నాడు సాగర్.
    నిర్మల ఆశ్చర్యంగా "ఎందుకని?" అంది.
    "మీతో జరిగినదంతా వాడు నాకుచెప్పాడు. నేను వాడిని బాగామందలించాను వాడికి తనతప్ప తెలిసింది. తానిక మీ ముఖం  చూపలేనని  వెళ్ళి పోయాడు..."అని "వాడసలు ఈ యింటిలో గది అద్దెకు తీసుకునేటందు క్కూడా మీరే కారణమాట! "అన్నాడు.
    "అంటే!" అంది నిర్మల.
    "మీకు తల్లిలేదు. తండ్రి ఉండి లేనట్టే! ఈ  యింటిలో మీకు గౌరవస్దానంలేదు. ఇలాంటి మిమ్మల్ని  వశపర్చుకోడం చాలాసులభమని భావించి వాడిక్కడకువచ్చాడు ఒక్కడూ మాకాం పెడితే అన్నివైపుల్నుంచి అనుమానానికి దారితీస్తుందని భయపడి నన్ను తోడురమ్మనాడు. అసలు సంగతి తెలియక నేనోప్పకున్నాను నిన్ననే అసలువిషయం తెలిసింది!"
    "మరిమిరూ వెళ్ళిపోలేదేం?అంది నిర్మల నిర్మోహమాటంగా.
    "నేను వెళ్ళలేను ఇక్కడింకా కొంతకాలం ముంటాను...."
    "ఎందుకు?"
    సవతితల్లి బాధ నాకుబాగాతెలుసు. నాలుగైదెల్ల క్రితంవరకూ నేనూ ఆ నరకం అనుభవించాను "అన్నాడు సాగర్.
    నిర్మల ప్రశ్నార్ధకంగా అతడివంక చూసింది.
    "నావల్ల మంచి జరిగితే అది చెడయ్యది తప్పుజరిగితే అది దుర్మార్గమయ్యేది. ఇంట్లో నేనుభావించిన నరకయతన ఇంతా  అంతకాదు క్లాసులో ఫస్టుగా వచ్చినా యూనివర్శిటికి వెళ్ళి చదువుకునే అవకాశం లేకపోయింది నాకు. ఇలా గ్రాడ్యుయేట్ అవగానే అలా వుద్యోగం రాలేదని సవతితల్లి నన్ను సాధిస్తూంటే భరించలేక ఉద్యోగం దొరికిందని  అబద్దమాడి ఈఊరోచ్చాను. ఉద్యోగం   దొరకదని నాకుతెలుసు. అందుకే  ముందు వేరుశనక్కాయలమ్మడంలో ప్రారంభించానువ్యాపారం దురలవాట్లు లేకపోతే, పట్టుదల వుంటే  ఎందులోనైనా పైకిరావచ్చు. ఏడాదిలో నేను పిన్నిసులు, సబ్బులు, ప్లాస్టిక్ సామన్లు వగైరాలమ్మే బండియజమానియ్యను. మరో ఏడాదిలో అదేప్యాన్సిషాపయ్యింది. ఏడాదిక్రితం  ఒమేడికల్  షాపుకూడా తెరిచాను  ఇప్పుడు మా వాళ్ళంతా  నన్ను నెత్తిమీద పెట్టుకుంటున్నారు. ఎక్కడలేని ఆ పెక్షా ఒలకపోస్తూ న్నారు. కానీ అందులో కృత్రిమంవుంది అందుకే నాకదిసంతోషాన్ని కలిగించదు...."అన్నాడు సాగర్
    నిర్మలకు కళ్ళలో నీళ్ళుతిరిగాయి నెమ్మదిగా "దానికి మిరిక్కడుండదానికి సంబంధమేమిటి?" అంది.
    "చాలావుంది-" అన్నాడు సాగర్ "మిమ్మల్ని చూడగానే నా గుండె నేవ్వరో పిండినట్లయింది. నేను పడ్డబాధాలు పగవాడిక్కూడా వద్దని దేవుణ్ణి కోరుకునేవాణ్ణి అలాంటిది మిరిలాంటి కష్టాలుపడుతూంటే నేను భరించలేక పోయాను. మిమ్మల్ని కసాయివాడు కూడా పగవాడిలా భావించలేడు. మీ ముఖంలో  ఏదో తేజస్సుంది. మాణిక్యాంబ మిమ్మల్నేందుకు హింసిస్తుందో తెలియడంలేదు...."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra