Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 16

 

    "ఎవరతను?"
    "రత్నారావ్"
    "అబ్బో ! అయితే ఇంక మా కెక్కడ దొరుకుతారు? హీరోల విమానాల ప్రయాణాలు, శేక్రటరీ లు, ఫోటో గ్రాఫర్లు, పత్రికల్లో ఇంటర్వ్యూలు."
    ఆమె నవ్వేసింది.
    "ఇప్పుడెక్కడ? ఆ డైరెక్టర్ ముందు మ్రదాసోచ్చి ఆరునెలలు సినిమా యాంగిల్స్ ప్రాక్టీస్ చేయమన్నాడు. మాకెవరికీ అర్ధం కాలేదు సినిమా యాంగిల్స్ అంటే ఏమిటో? నీకేమయినా తెలుసా?"
    "అంటే అనే -- మనం లోపల ఊహించుకునేది బయటకు ప్రదర్శించడం...."
    'ఛీ! పాడు!"
    "అమ్మా! నాగాలక్ష్మీ ! త్వరగా వచ్చి డ్రస్ చేసుకో! స్టిల్ ఫోటో గ్రాఫర్ వస్తున్నానని ఫోన్ చేశాడు. " వాళ్ళమ్మ పైకోస్తూ అంది.
    "నమస్కారమండీ!"
    "నమస్తే సురేష్! నాగాలక్ష్మికి సినిమా చాన్స్ వచ్చింది! నీకు చెప్పిందా?"
    ఇప్పుడే చెపుతోందండీ!"
    "ఒక్క చాన్స్ దొరికితే చాలు...... టాప్ కెళ్ళి పోతుంది ఇప్పుడు పాత హీరోయిన్స్ కంటే ఎందులో తక్కువ?"
    "అవునండీ! ఒక్క అంగుళం కూడా తక్కువలేదు."
    ఇద్దరూ వెళ్ళిపోతుంటే కుమిదిని బట్టలారేయడానికి పైకొచ్చింది. తనను చూసి చూడనట్లు ఓ పక్క కెళ్ళి అరేస్తోంది.
    "హలో.....రాత్రి బిరియానీ పాకెట్ తెచ్చింది నువ్వే కదూ?"
    ఆమె మాట్లాడలేదు.
    "మాట్లాడవేమిటి? కోపమా?"
    ఆమె వినిపించుకోనట్లు తన పని తను చేసుకు పోతోంది.
    "బాగానే ఉంది! రాక్షసుడిని చూసినట్లు బెదిరి గావుకేక లేసి నా దొంగస్నానం బయట పెట్టింది నువ్వు! పైగా నామీదే కోపమా?"
    "నువ్వలా అర్ధరాత్రి నగ్న ప్రదర్శన నిస్తావని నాకేం తెలుసు? సడెన్ గా చూసేసరికి భయం వేసి అరిచాను.
    "ఇప్పుడు చూడు! నీవల్ల శ్రీదేవి మూడో వార్నింగ్ చ్చింది నాకు...."
    "నువ్వేం తక్కువేంటి? ఏవో గిల్లికజ్జాలు పెట్టి మొగుడూ పెళ్ళాల మధ్య ఇంత అగ్గి రాజేసి పబ్బం గడుపుకున్తావ్."
    "గిల్లికజ్జాలు తప్పు పదం! వాళ్ళిద్దరి మధ్య ఎట్రాక్షన్ పెంచడానికి ట్రై చేస్తున్నాను."
    "నిన్న రాత్రి ఇద్దరూ దేబ్బలాడుకోవటం నువ్ విన్లేదు.....అదేనా ఎట్రాక్షనంటే?" టీజింగ్ గా అడిగింది.
    "అందులోనే వుంది .......ఉదాహరణకు మనిద్దరం భార్యా భర్తలనుకో! నేనింకా ఎవరయినా అమ్మాయికి సైట్ కొడుతున్నానని నీకు అనుమానంగా వుందనుకో! అప్పుడు నువ్వేం చేస్తావ్? ఓ సిఐ.డి ని పెట్టి అరా తీయిస్తావ్ / అవునా ?"
    "నాకేం పట్టింది? ఎంత మంది కావాలంటే అంత మందికి లైన్ వేసుకో."
    "నీకు ఈర్ష్యా ఉండదా?"
    "ఎందుకుండాలి !"
    'అంటే నన్నలా గాలి కోదిలేస్తావా?"
    "అది తప్పని ఒకటి రెండు సార్లు చెప్తాను...."
    "అక్కడికి నేను వినిపించుకోకపోతే?"
    మంగళ సూత్రం విసిరికొట్టి "నేనూ ఇంకెవడినయినా చూసుకుంటాను ...." నవ్వాపుకుంటూ అంది.
    సురేష్ అదిరిపడ్డాడు.
    "ఓర్నీ! అంతకు తెగించావా?"
    "నీకు తెలీదేమో! ఆడపిల్ల తల్చుకుంటే ఎంతకయినా తెగిస్తుంది  .
    మరి సినిమాల్లో అలా చూపిస్తారేమిటి? భర్త ఎన్ని వెధవ్వేషాలేసినా భరత స్త్రీ అతని కాళ్ళు కళ్ళ కద్దుకుని పూజలు చేస్తుంటుందని."
    "ఆ సీనులు ఆడాళ్ళ కోసం కాదు, మగాళ్ళను భ్రమలో ఉంచటానికి!"
    "సిక్త్స్ సెన్స్ -"
    "ఇంత అభిమానం చూపుతున్నందుకు నీ ఋణం తీర్చుకోవాలనుంది నాకు! ఎప్పుడు చాన్సిస్తావ్?"
    ఆమె కలవరపడింది.
    "ఏం ఛాన్స్?"
    "అదే నీ రుణం తీర్చుకునే ఛాన్స్......మన దగ్గిర ఎలాగూ కాష్ లేదు.... ఇక మిగిలింది మాటలూ, చేతలూ --- ఛాయిస్ నీది!"
    "అలా సిల్లీగా మాట్లాడ్డానికి సిగ్గుండక్కర్లేదూ?"
    "సిగ్గుండబట్టే కె. హైమావతి కి పిల్లలు పుట్టలేదు.
    "కె. హైమావతి ఎవరు?"
    "సి. రాజేశ్వరి ఫ్రెండ్! ఇద్దరికీ పిల్లల్లేరు. చాలాకాలానికి సి. రాజేశ్వరికి పాపాయి పుట్టింది. కె. హైమావతి పరుగుతో వెళ్ళి ఎలా పుట్టిందని అడిగింది. ఫలానా స్వామీజీ దగ్గర కెళ్ళానని చెప్పింది సి. రాజేశ్వరి.  కె. హైమవతి కూడా స్వామీజీ దగ్గర కెళ్ళింది గానీ ఉపయోగం లేకపోయింది. మళ్ళీ సి. రాజేశ్వరి ని కలుసుకుంది దిగులుగా. స్వామీజీ దగ్గర కెళ్ళారా?" అడిగిందామె.
    "నేనూ , మా వారూ ఆరు నెలల పాటు వెళ్లాం!"
    "ఏడ్చినట్లుంది . మీ వారినెందుకు తీసుకెళ్ళావ్?"
    "ఒక్కర్తెనూ వెళ్ళాలంటే సిగ్గు వేసింది.
    "పిచ్చిదానా! ఒక్కర్తేనే వెళ్ళాలే!"
    కుమిదిని మొఖం ఎర్రబడింది.
    "నాకు ముందే అనుమానం వచ్చింది! మీ జోక్ స్టాండర్ద్ ఇలాగే వుంటుందని ' అంటూ బొడ్లో దోపుకున్న చీరకొంగు విప్పి ఇరవై నోల్టు మూడు తీసి అతనికిచ్చింది.
    సురేష్ ఆశ్చర్యపోయాడు.
    "ఏమిటిది?"
    "నీ బెడ్ పక్కనే పేపర్ కటింగ్ చూశాను. ఆ ఉద్యోగానికి అప్లయ్ చేయాలంటే డబ్బు కావాలి గదా! అందుకని మేరీ మేడమ్ నడిగి తీసుకున్నాను."
    సురేష్ కి నోటమాట రాలేదు.
    "నువ్ ఇంగ్లీష్ మీడియం పనిమనిషివా?"
    ఆమె నవ్వేసింది.
    "ఏ మీడియం\కయినా ఎడ్జస్టవగలను ."
    "ఆమె వెళ్ళిపోతుంటే వెంటే పరుగెత్తాడు.
    "నువ్వేం అనుకోనంటే నీకో మాట చెప్పాలి" తన టెక్నిక్ ఉపయోగించబోతూ అన్నాడు.
    "నాకు తెలుసు -- నువ్వేం చెప్పాబోతున్నావో?' టీజింగ్ గా అంది.
    "ఏం చెప్పబోతున్నాను?"
    "నువ్ చాలా అందంగా ఉన్నావ్. అని -- నేనలాంటి మాటలకి పొంగిపోనులే "
    సురేష్ షాక్ తిన్నాడు.
    ఆమె మెట్లు దిగిపోయింది తేరుకునేలోపలే.
    ఆమె ఇచ్చిన డబ్బుతో ఒకేసారి మూడు ఉద్యోగాలకు అప్లయ్ చేస్తుంటే కాళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్.
    తల్లి గుర్తుకొచ్చింది.
    ఆమె మనసులోని కోరిక ఎప్పటికైనా తను తీర్చగలడా/ ఆమె ఆశలన్నీ తన మీదే ఉంచుకుంది.
    తను డబ్బు సంపాదించాక అప్పుడు ఆమె మనసులోని కోరిక ఏమిటో చెపుతుంది.  

 Previous Page Next Page