"ఏమిటమ్మడూ సణుగుతున్నావ్? హెల్ప్ చేసినందుకు తిట్టుకుంటున్నావా?"
"లేదు, లేదు." అంటూ తలెత్తి చూసింది. శృతి చిలిపిగా తన్నే చూడటం చూసి సిగ్గుతో తల టకీమని వంచుకుంది శ్రీదేవి.
ఇస్సురుస్సు రంటూ సీతమ్మ ఇంట్లో అడుగు పెట్టింది.
"అప్పుడే వచ్చేశావేమమ్మా!" శృతి అడిగింది.
"రాకేం చేయనే నాతల్లీ! చిన్న ఆప్రేమను చేసి కాన్పుచేశారు. తల్లీ బిడ్డా కులాసాయే, ఒక్క మనిషి తప్ప ఆస్పత్రిలో మరెవరూ వుండకూడడుట. ఇదేం చోద్యమో, బాలింతరాలి దగ్గర మనుషు లుండకూడాదుట. "మేం లేమూ, మీరంతా వుండి ఏం చేస్తారు!" అంటూ నర్సులు పకటే కేకలు. సరే వెళ్ళిన అందరం తిరిగొచ్చాం" అని శృతితో చెప్పి శ్రీదేవి వైపు తిరిగి "నువ్వొచ్చి ఎంతసేపయింది శ్రీదేవి ! అంది సీతమ్మ.
"కొద్దిసేపయింది" వచ్చిన తల ఎత్తకుండానే అంది శ్రీదేవి!
"మీరు మాట్లాడుతూ వుండండి. ఆస్పత్రి గుడ్డలు తడిపేసి స్నానం చేసివస్తాను." అంటూ సీతమ్మ దొడ్లోకి వెళ్ళింది.
"కూర్చోమ్మా సిగ్గుల పెళ్ళికూతురా!" అంది శృతి.
పెదవి కదపకుండా కుర్చీలో కూర్చుండిపోయింది శ్రీదేవి.
"అమ్మ.....అమ్మ.....ఇద్దరూ ఇద్దరే. ఎంత అమాయికంగా, నోట్లో నాలుక లేనట్టు మెలిగేవారు? రెండో కంటికి తెలియకుండా సినిమాలు, షి కార్లు..... మీ ఇద్దరి మాటలు చాటుగా వినడం తప్పే కానీ మీ ఇద్ద రేమిటి, ఈ చనువేమిటి అని ఆశ్చర్యపోతూ అలా నుంచుండిపోయాను. మరీ గట్టిగా మాట్లాడు కుంటిరి, వినపడక చస్తుందా? నే కాబట్టి సరిపోయింది. అదే అమ్మో, మరెవరన్నా వింటే?"
శ్రీదేవి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
"అదేమిటి శ్రీ! ఏడిపించటానికి తమాషా చేస్తుంటే నిజంగా ఏడుస్తున్నావా! ఛా.....ఛా....నీవు మా వదినవి కావడం నా కెంత ఇష్టమో తెలుసా? ఇదే మాట ఎప్పుడన్నా అంటే ముపై ఆరు మెలికలు తిరిగి పోతాడు అన్నయ్య. నాకేం తెలుసు అన్నయ్య ఇంత ముందడుగేశాడని. అమ్మతో నీ మాటంటే శ్రీదేవి కేమిటే బంగారం బొమ్మ బుద్దిమంతురాలూను, మనం మగ పెళ్ళివారం. వాళ్ళడిగితే అలాగే అందాం. మీ అన్నయ్య కూడా ఇష్ట పడాలికదా అంది లైన్ క్లియరయిపోయింది వదినమ్మా! ఇహ పెళ్ళే ఆలస్యం. ఇందాక నా బదులు అమ్మే వచ్చివుంటే ఈ సరికి మీ పెళ్ళి చేస్తూ వుండేది."
"ఎవరి పెళ్ళే!" అంటూ సీతమ్మ లోపలి నుంచి వచ్చింది. పెళ్ళి అన్న రెండు ముక్కలే ఆవిడ చెవిన పడ్డాయి.
"తెలిసిన ఓ స్నేహితురాలికి పెళ్ళి కుదిరిందట. శ్రీ చెపుతుంటే వింటున్నాను." సమయస్పూర్తిగా అంది శృతి.
"తెలిసిన అందరి పెళ్ళిళ్ళూ అవుతున్నాయి. మీ ఇద్దరి పెళ్ళి ఎప్పుడవుతుందో ఏమో?" అంటూ నిట్టూర్పు విడిచింది సీతమ్మ.
కర్రకాలు, చంకలో ఊతకర్ర ఆధారంతో నుంచున్న మురారిదేముడు. కాలు పోయినందుకు కుంగిపోయి ఏమీలేదు. ఆ నుంచున్న తీరులో పొగరు కొట్టొచ్చినట్లు కనబడుతున్నది.
మురారిదేముణ్ణి ఎగాదిగాచూస్తూ "ఊ.....మార్పేమీ లేదు" అంది శృతి. మురారిదేముడు ప్జక్కున నవ్వాడు. "బాగా చూడు. మార్పేమీలేదూ, ఓ కాలు స్థానంలో కర్రకాలు వచ్చిందా! కనపడలా? అందుకే అన్నారు పెద్దలు____కళ్ళున్న వాళ్ళే మొదటి "అంధులని....."
"పోగారేం తగ్గలేదు. భగవంతుడు తగిన శాస్తే చేశాడు."
"శృతీ!"
"ఎందుకరుస్తావ్! రోజులన్నీ మనవి కావు."
"నీలాంటి వాళ్ళకి కాదేమో, నువ్వే అంటున్నావుగా, రోజులన్నీ మనవి కావని. నన్ను చూసి నవ్వుతున్నావ్. రేపు నిన్ను చూసి నవ్వేరోజు నా కొస్తుందేమో!"
"చూడు కుంటీ! నీలాగా అందరు అడ్డమైన......" శృతి మాట సాంతం పూర్తి కాకుండానే "శృతీ!" అని అరుస్తూ శృతిని కొట్టడానికి ఊత కర్రని పై కెత్తాడు మురారిదేముడు.
శృతి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పక్కకు దూకింది.
"ఈరోజు నా చేతిలో నీ కాలు విరగాల్సిందే. నన్ను.....నన్ను కుంటీ అంటావా!" మురారిదేముడు కొయ్యకాలుతో టక్ టక్ మని వేగంగా ముందుకొస్తు అన్నాడు.
శృతి పరుగు తీసింది.
మురారిదేముడు వెంటపడ్డాడు.
ఎదురుగా రాయి తగిలి బోర్లపడింది శృతి.
కర్ర పై కెత్తి కాలరుద్రుడిలా నుంచున్నాడు మురారిదేముడు.
కెవ్వు మంది శృతి.
"ఏమయిందే శృతీ! నిద్దట్లో అంత పెద్దగా కేకెశావు? పీడకలగాని రాలేదుకదా!" అంటూ శృతిని కుదిపి లేపింది సీతమ్మ.
కళ్ళు విప్పి అయోమయంగా అటూ ఇటూ చూసి "కళా?" అంది శృతి.
"పీడకల ఏదో వచ్చి వుంటుంది. ముఖాన ఎంత చెమట పోసిందో చూడు. లేచి కాళ్ళు కడుక్కో, పీడకల దోషం పోతుంది. తెల్లార వచ్చింది. ఇంకా పడుకునే దేముంది. లేచి ముఖం కడుక్కురా!" అంది సీతమ్మ.
పడకమీదనుంచి లేచి బాత్ రూమ్ కి బయలుదేరింది.
"ఓహ్, ఇదంతా కలా!" తేలికపడ్డ మనసుతో అనుకుంది. ఇలాంటి కళ రావడానికి కారణమేమిటో గుర్తొచ్చింది శృతికి.
మురారిదేముడు వెళ్ళిపోయింతర్వాత బజారులోఎదురుపడే ఏ కొయ్యకాలు మనిషిని చూసినా అతనే గుర్తొచ్చేవాడు, ప్రతి రోజూ డెయిలీ పేపరు అక్షరం వదలకుండా మొదటి నుంచీ చివరిదాకా చదివేది దొంగలను గాని, ఖూనీకోర్లను గాని పోలీసులు పట్టుకున్నట్లు వేసేవారు కాదు. భారీ దొంగతనాలు చేసి తప్పించుకున్న దొంగలని పట్టుకోటానికి పోలీసులు వారి విశ్వ ప్రయత్నం, హత్య చేసి పారిపోయిన ఖూనీకోర్లు, బస్సు ప్రమాదాలు, పార్టీ మార్చిన ప్రముఖ నాయకుల కొత్త వాగ్దానాలు, అల్లర్లు, అగాలు సమ్మెలు వీటితో పేపరు నిండిపోయేది. ఈరోజు పేపరు తీసినా ఏమున్నది గర్వకారణం? అదేగోల. అవే వార్తలు అనుకునేది శృతి అతను పట్టుబడినట్లుయితే పేపరులో వచ్చేదే, రాలేదు కాబట్టి పట్టుబడలేదు. కాలికి తగిలిన గాయం సయమయిందో లేదో. కాలు కొట్టేశారేమో సెప్ టిక్ అయి..... మురారి దేముడు గుర్తొచ్చినప్పుడల్లా శృతి ఆలోచనలు అలా సాగేవి.
రాత్రి పది గంటల సమయంలో ఓ బిచ్చగాడు అడుక్కోవటానికి వచ్చాడు. పొద్దుటి కూర ఉంటే అదీ కాస్త అన్నమూ బిచ్చగాడికి వెయ్యటానికి వాకిట్లోకి వచ్చింది శృతి.
వాకిట్లో జోలి పట్టుకొని కొయ్యకాలు బిచ్చగాడు నుంచునినున్నాడు.
చటుక్కున చూడడంతో వాడి ఎత్తు లావూ సరిగా మురిరాదేముడంత వుండటంతో ఆ బిచ్చగాడు మురారిదేముడేమో అనుకుంది రాత్రంతా ఆ బిచ్చగాడి ధర్మమా అని మురారిదేముడు గుర్తుకొస్తూనే వున్నాడు. రెండో కంటికి తెలియకుండా ఓ హంతకుడిని తను దాచగలిగింది. దెబ్బ తగిలి వుండడంవల్ల పెద్ద హంతకుడైనా అతను తన్నే మీ చేయలేదు. ఇది తన అదృష్టం. ఇది తన జీవితంలో ఓ పరమ రహస్యం.
"రాత్రంతా మురారిదేముణ్ణి గురించే ఆలోచించాను, కలవచ్చింది. భగవంతుడా! జీవితంలో మళ్ళీ ఆ హంతకుడి మొహం నాకు కాన రాకుండా చెయ్యి." అనుకుంటూ ముఖం కడుక్కుని బాత్ రూమ్ నుంచి బైటికొచ్చింది శృతి.
కమ్మని సువాసనాలు వెదజల్లే పొగలుకక్కే కాఫీ శృతి కందించింది సీతమ్మ.
"ఓహ్, అద్భుతం, అమృత రుచి, అమోఘ పరిమళం మా అమ్మచేతి ఓ కప్పు కాఫీ వెయ్యేనుగుల బలం. టింగ్, టింగ్, టింగ్," ఓ గుక్క కాఫీ తాగి కళ్ళు పెద్దవి చేసి యాక్షన్ చేస్తూ అంది శృతి.
"ఉత్త చిన్న పిల్ల చేష్టలు." మరిపెంగా చూస్తూ అంది సీతమ్మ.
"అమ్మా! నే నెప్పుడూ నీకు చిన్నపిల్లనే కదా! అమ్మ ముందేకదా నేను అల్లరి చేయగలిగేది? అంతేకదా? అవునుకదా?"
"ముందు కాఫీ తాగవే చల్లారి పోతున్నది." నవ్వాపుకుంటూ అంది సీతమ్మ.
సరిగా అప్పుడే తలుపు చప్పుడయింది.
సీతమ్మ వెళ్ళి తలుపు చప్పుడయింది.
సీతమ్మ వెళ్ళి తళు తీసింది.
పోర్టర్ ఏసుపాదం బిక్కముఖం వేసుకుని గుమ్మం అవతల నుంచుని వున్నాడు.
సిద్దార్థ పార్సిల్ ఆఫీసులో క్లార్క్ అక్కడే వుంటాడు ఏసుపాదంకూడా. ఇటు ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు.