Home » Chalam » శశిరేఖ

కృష్ణుని ప్రేమించు తాను యీ తలపులన్తేన రానిచ్చుట  మంచిదేనా?  న్యాయమా? పాపముకాదా? కాని తన  మానస్సుంతయును సుంధరరావువ్తేపు లాగుచున్నది!  ఈతని ప్రేమలేక ఎట్లుండకలదు? ఇతని ప్రేమను తృణికరించి కృష్ణునితో  పూర్వమువలె నుందగలదా? నిర్జివముగా దినముల నెట్లుగడపగలదు? సూర్యుని ముద్దుల రుచి చూచినా కమలము,ఇక చంద్రుని వెన్నెలతో నెట్లు  తృప్తినమ్ధగలదు? కాని కృష్ణుని ప్రేమించి తా నితనిని కూడా ఎట్లు ప్రేమించుట?  తాను వీరిద్దరి నొక్కసారే  ప్రేమించుచుండేనా?  మానవ  హృదయ మెంత  నిగూఢమో!  కృష్ణుడు తనను ప్రేమించెను; గాని అతని తన చూపులతోడనే యితనివలె తన శక్తినంతను  లాగివ్తేచి తన హృదయమును తనది గాకుండచేయలేదు. వలయందు తగుల్కొని శక్తియంతము  బోగోట్టుకోనిన చిలుకవలె నామెయుండెను, కాని యేంత తాను వలచిననుకృష్ణుని  మాత్రము తాను మోసపుచ్చ  కూడదని నిశ్చయించుకొని,వెంటనేకృష్ణునికి  తన నింటికి తిసికోనిపోమ్మని యుత్తరము వ్రాసెను. ఆ సాయంకాలము తరవాత  దానచట  నుండుట కిష్టము లేదనియేను. అరగంట లోపుననే ఆస్పత్రి నౌకరు ప్రత్యుత్తరము తెచ్చెను.
శశి,
అమ్మకు జబ్బు ఎక్కువ్తేనది. ఇచట కిస్దితిలో నీవు వచ్చుట కేంతమాత్రము వీలులేదు? నా కామెనువదలి
ఒక్క క్షనమ్తెనను తీరుబడియగుతలేదు. ఒక్క వారము వఱకచ్చటనే యుండుము. నానుండిఎడబాటు నీ కెంత బాధ కలిగించునో  తెలియును. కాని ఒక్క వారము రోజులే కదా! ముద్దులు. ఇట్లేల్లప్పడునీకృష్ణుడు.
అనుభవ  మేరుంగని  నూతన యవ్వనమునకృష్ణుని ప్రేమనుగ్తెకొన్న  శశిరేఖ యిప్పుడు యిరువదియేళ్ళ స్త్రి అయినది. కృష్ణుడు  ఆమె మనసును ఆటలలో  దోంగిలించెను. సుందరరావు ఆమెని స్త్రివలె సన్మానించి ఆమె ప్రేమను కోరెను. ఇప్పుడు ప్రౌడఅయిన శశిరేఖ  హృదయము ప్రేమవికాసము పొంది, గాదముగ, గంభీరముగ, తన సర్వశక్తులను పిల్చివేయు బలముగల భయంకర మొహమునుంచి కళ్ళు తిప్పకోనలేక పోయినది.  తీవ్రమగు ఉద్రేకములతో పెనగిన మహాయోధుల రక్తమామె  నాళముల ప్రవహించుచుండెను. ఆమె పాదములకు నమస్కరించి, తాకిన ఆమెదేహ మెక్కడ కందునో,అని ఆమెను దేవతగ  పూజించి భక్తులతో ఆమె కవసరము తీరినది. ఆమెను నలిపి జీవన రసమును   పిండి, తాగి,మూర్ఛనందింపగలప్రేమ నామె వాంచించెను. అగ్నివలె తాపమున దహించు తృష్ణకు  ఉపసమనముగ  మహాప్రళయ, మేఘముల  గర్జించు చందవర్షమే కావలెను.
                                                6
ఆరు రోజులు గడచినవి. సుందరరా వాదినము నుండియు శశిరేఖ దేహస్దితిని కనుగోనుటయే గాని, ఆమె గదివ్తేపున క్తెనను వచ్చుటలేదు. శశిరేఖ యతడేందుకట్లు మారేనాయని యాశ్చర్యపడేను. అతనికి తన పైకోపమువచ్చును కాబోలు! కోపము వచ్చిన తనకేమి! పోనీ ఇబ్బంది  తోలగేనుకదాయని  సంతోషమేకదా! కానిమనసు వ్యాకులపడుచున్నది. తానింటికి బోవులోపల తనకు  కోపము రాలేదని  అతనికి తెలియ  చేయవలయును. కృష్ణుని  చూచుటతోడనే సుందరరావు విషయ మాతనితో  చెప్పవలయునుకదా? అతడింక  సుంధరరావుతో  తన కేమియును, కోపము లేదనియు, కాని  అతడట్లు తనను ప్రేమించుట తప్పనియును,  చెప్పగలిగిన  ఎంత బాగుండును.ప్రొద్దుననే  తాను తన ఇంటికి వెళ్ళుచుండెనే!   ఇంక  సమయమేది?        
ఇంతలో నౌకరొక చిటి తేచ్చియిచ్చెను. గుండెలు  కొట్టుకొనెను, సుందరరావు దస్తూరి, వణకు వేళ్ళతో    చిటి  విప్పిచదివేను.
అమ్మ,
మీ  అత్తగారికి  స్వస్ధతగా నున్నది.  మీరు రేపు యింటికి పోవుచున్నారు. నా తెలివి తక్కువను క్షమించి యుంటిరేని, యీసాయంత్రము నాయింతికోక్కసారి  భోజనమునకు వచ్చి, నన్నానందింపచేసేదరా? ఇంక నేన్నడును అట్లు చేయను. నా తప్పిదమునకు  నే  నెంత  బాధ్యుడనో మీ  అందమును  అంత బాధ్యత  గలదే.
                                                                                                  ఇట్లు పశ్చాత్తాపతప్తహృదయుడు,
                                                                                                       సుం ద ర రా వు         "సరే " నని  చెప్పమని ఆమె ప్రత్యుత్తరము పంపెను. తానే సమయము కోఱకు  వేచియుండేనో  యది తనంతట  యదే  తటస్దించుటచే ఆమె హృదయము  సంతోషముతో నిందిపోయెను. వెంటనే దుస్తులు మార్పుకొని, దినముకన్న భద్రముగ శృంగారించుకోనేను.  ఎందుకంత  కాలము ఆ అద్దము ముందు?  తానా సుందరరావున కెట్లు కనబడిననేమి? ఏమో    ఆమెకే  తెలియదు. పాపము, ఎంత పశ్చాత్తాప  పడనాడో కదా! తన అందమతనినట్లు  చేయునట్లు చేసియుండును. తనకంత అందము  కలదా?పాపమాతడింక వంటరిగా నుండవలయుగదా?  తననేగాక తన స్నేహితునిగూడ కోల్పోయి ఎంత చింతించునో?ఈ వక్క సాయంత్రమేకదా?
సుందరరావు బంగళా,  ఆస్పత్రి  ఆవరణలోనే  యుండెను. శశిరేఖ ఇదివఱకేన్నడును ఆచతకుబోయి యుంద - లేదు.  చక్కని బంగళాయు చుట్టును సుందరమగు  చిన్ని పూవుల చెట్ల  తోటయు గలదు. తోట తలుపు దగ్గరకు   వచ్చున-ప్పటికే సంతోషము తోల్కాడు  ముఖముతో  సుందరరా వేదురువచ్చి ఆమెను తోట లోనికి  తిసికోనిపోయెను. శశిరేఖ చుట్టును  చూచినది. చామంతి విరివిగా పెరిగి మంచి వాసన నిచ్చుచుండెను. పూర్ణముగ విచ్చిన గూలాభి  పువ్వులు ఆకసము  వైపు   రచుకోనియుండెను. అస్తమయ సూర్యడు  తోటనే రక్త వర్ణముతో  కప్పెను. చంద్రకాంతమనేక   రంగులతో నవ్వుచుండినది . తడకల పై   జూకామల్లె   పాకియుండెను.                                                                           శశి- ఎంత అందంగా వుంది!  యింత  అందంగా ఎవరు చేశారు?
సుంద - నేనే.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra