'లేదులే తల్లీ. నేను రాజుతో మాట్లాడాను. అతను నయం చేస్తానన్నాడు.'

    ఆమె ముందు యధాలాపంగా  విన్నది. ఆ తరువాత అతడు చెప్పింది. అర్థమై ఒక్కసారిగా వేయి పిసుగులు తల మీద పడినట్టు కంపించి, "ఏ.....ఏమిటీ?" అంది.

    "అవునమ్మా. మొన్న అతడి క్లినిక్ లో వుండగానే ఈ విషయం తెలిసింది! అప్పుడే అతనికి ఈ విషయం చెప్పాను. శరీరంలో ఏ భాగాన్నయినా శాసించేది మెదడేనని, గొప్ప గొప్ప బుషులందరూ తమ మనోశక్తివలనే దేన్నయినా తమ అధీనంలో వుంచుకోగలరనీ చెప్పాడు. నాకు నిజమే అనిపించింది. "నాకే బాధాలేదు......బాధాలేదు" అని మనసుని వశీకరణ శక్తితో వశపర్చుకోగలిగినప్పుడు అది శరీరంమీద కూడా పని చేస్తుందన్నాడు. ఉబ్బసం నుంచి కేన్సర్  వరకూ దేన్నయినా మనోశక్తి వలన తగ్గించుకోవచ్చునట. ఎవరో  అంతర్జాతీయ పూట్ బాల్ ఆటగాడు కేవలం మనోనిబ్బరం వలనే తన కేన్సర్ తగ్గించుకున్నాడట. మరో క్రీడాకారుడు అదే విధంగా నయం చేసుకుని తిరిగి ఒలింపిక్స్ పాల్గొన్నాడట. రాత్రిళ్ళు నిద్రపట్టకపోవడం. చనిపోయిన వారిమీద బెంగతో  బాధపడటం, తాగుడు మాన్పించటం - మెదడు తల్చుకుంటే చేయలేనిదేముంది." అతడు చెప్పుకుపోతున్నాడు. అతడి భాష చూస్తూంటే ఒక బీదరైతు మాట్లాడుతున్నట్టు లేదు. అవతలివారి మాటల వలన హిప్నటైజ్ అయి, ఆ ట్రాన్స్  లో తిరిగి ఆ మాటల్నే ఒప్పచెపుతున్నట్టు వుంది. అంతగా ప్రభావితమైనట్టు తోస్తూంది ఆ మాటలు వింటూంటే.....

    ఆమె వినటం లేదు. భరించలేనంత నిస్సహాయతతో, ఉక్రోషంతో ఆమె కళ్ళనిండా నీరు నిండుకుంది. అది కోపం కూడా కాదు. జాలి వలన వచ్చిన ఆక్రోశం. ఆమెకి ఏం మాట్లాడాలో తోచలేదు. ఎలాగో నోరు పెగల్చుకుని. '..... ఇదంతా.....ఇదంతా ఎలా నమ్మేవు మామయ్యా?" అని అడిగింది.

    "నమ్మకతప్పదమ్మా. అన్ని దార్లూ మూసుకుపోయినవాడు దేవుడిని ప్రార్థిస్తాడు. చిన్నదారి కనపడితే అటు ఆశగా చూస్తాడు. నేను కూడా సామాన్య మనిషేనమ్మా. అలా చూడటంలో తప్పులేదుగా....."

    "కానీ  ఈ చూడటం వల్ల....." అంటూ ఏదో స్ఫూరించినట్టు ఆగి, ".....దీనికి ఎంత ఫీజు తీసుకుంటున్నాడు అతను?" అడిగింది.

    "మొత్తం ఆరునెలలకీ పాతికవేల దాకా అవుతుందన్నాడు."

    "అంతే. ఒక తెల్లవారుఝామున నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ ఫెళఫెళా రావాల్తో భూమి కదిలి పెద్ద పెద్ద భవంతుల్ని తనలో కలిపేసుకుంటున్నప్పటి దిగ్భ్రాంతితో.....భయంతో .....'అంత డబ్బు.... అంత డబ్బు నీకెక్కడిది మామయ్యా ?" అని అడిగింది.

    "పొలం అమ్మేసాను?"

    "ఏమిటీ?" ఆమె గొంతు కీచుమంది. "పో...లం అమ్మేసావా?"

    "అవునమ్మా. నాలుగెకరాలూ అమ్మేశాను"

    "మరి మీకు.... ఆ తరువాత..... ?"

    "మీ అత్తమ్మకన్నా ఆ భూమి మాకెక్కువ కాదు. ఆవిడ బ్రతికేవుంటే కూలి చేసుకోనైనా బ్రతుకుతాం....."

    మధుహ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మనిషి నిలువెల్ల కంపించిపోయింది. దేశం కాని  దేశంలో స్థిరపడి.....ఎంతో కష్టంతో జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన ఆ కాస్త భూమినీ.....ఒక బీదరైతు అంత అమాయకత్వంతో అమ్మేస్తే..... ఆ  తప్పెవరిది? మోసం చేసేవాడి తెలివిదా? మోసపోయేవాడి మూర్ఖత్వానిదా?

    ..... సరిగ్గా పది నిముషాల తరువాత ఆమె రాజు క్లినిక్ ప్రవేశించింది.

    ఆమె లోపలికి వెళ్ళేసరికి రాజు ఎవరితోనే మాట్లాడుతున్నాడు.  గాలిలా వచ్చిన ఆమెనీ, ఆమె ఆకారాన్నీ చూసీ రాజు ఆశ్చర్యపోయాడు.

    ఆ వ్యక్తి నల్లగా, మొహంమీద స్ఫోటకం మచ్చలతో, లావుగా - వికృతంగా  వున్నాడు.

    తలుపుకూడా కొట్టకుండా సరాసరి లోపలికి వచ్చేసిన మధూహని చూసి రాజు మొహం చిట్టించాడు.

    మధూహ వహ్చ్సిన తీరుచూసి స్ఫోటకం మనిషి కుర్చీలోంచిలేచి "నేను తరువాత కలుస్తాను" అంటూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

    అంత ఆవేశంలో కూడా మధూహ అతడిని గమనించి ఆశ్చర్యపడింది. నాలుగు అడుగులకన్నా ఎక్కువ లేడు అతడు. దానికి తోడు లావుగా వున్నాడు. వెయ్యిమందిలోవున్నా స్పష్టంగా గుర్తుపట్టగలిగేట్టు వుందా బంతిలాంటి ఆకారం దేవుడు అన్ని వైకల్యాలు అతడికే ఇచ్చినట్టూ మొహంమీద స్ఫోటకం మచ్చలు. పైగా నలుపు.

    ఇవన్నీ చూస్తే అతడిమీద జాలి వెయ్యాలి. లేదా అతడి ఆకారాన్ని చూసి నవ్వురావాలి. కానీ ఆమెకు ఇవేమీ కలుగలేదు. భయం వేసింది. అవును భ....యం.

    అతడి కళ్ళల్లో అదోలాటి క్రూరత్వం వుంది. పైకి మామూలుగానే వున్నాయి గానీ, ఎందుకో తరచిచూస్తే అవి మామూలు కళ్ళలాగా కనపడవు.

    అతడు  కూడా  మైండ్ మాగ్నెట్ పెట్టుకుని తన మొహాన్ని అందంగా మార్చుకోవటం కోసం వచ్చాడేమో అనుకుంది. ఇంతలో రాజు "ఏమిటిలా చెప్పాపెట్టకుండా వచ్చావ్?" అని అడగటంతో ఆలోచన్లనుంచి తేరుకుని, "నీతో మాట్లాడటానికి" అంది. ఆమెలో పూర్వపు ఆవేశమూ, కోపమూ చోటుచేసుకున్నాయి.

    రాజు విసుగ్గా "దానికి సాయంత్రం కలిసినప్పుడు బోలెడు టైముంటుందిగా అంత అర్జెంటేముంది?" అన్నాడు.

    "నీ కర్జెంటు కాకపోవచ్చు. కానీ మాలాటి వాళ్ళకి జీవన్మరణ సమస్య....." సూటిగా అంది.

    ఆ మాటలకి రాజు ఆమెవైపు అదోలాచూసి, "ఏమిటి ఏదో నాటకంలోలా మాట్లాడుతున్నావ్?" అని అడిగాడు.

    "నువ్వాడే నాటకాన్ని చూస్తూ ఇక  సహించలేక...."

    రాజు తెల్లబోయినట్టు కనిపించాడు. "నేనాడే నాటకమా? ఏమిటది?"

    "బ్లడ్ కాన్సర్ ని తగ్గిస్తాననే నాటకం."

    అప్పటికి విషయం అర్థమైంది అతడికి. "నువ్వు చెప్పేది మీ మామయ్య సంగతా." అన్నాడు.

    "మా మామయ్యాలాటి వేలాదిమంది అమాయకుల సంగతి....."

    రాజు అనునయంగా అన్నాడు...... "చూడు మధూ. మేమొక థియరీ నమ్ముతున్నాం. ప్రతీ రుగ్మతా మెదడుమీదా, మనోశక్తి మీదా ఆధారపడి వుంటుందన్న థియరీ! అది కర్టేవుతే కేన్సర్ ని కూడా వశీకరణ శక్తిద్వారా నయం చెయ్యవచ్చు. ఈ వాదనలో అబద్ధమేముంది?"

    "వాదనలో అబద్ధంలేదు. కానీ ప్రాక్టీసులోనే తప్పుంది. ఈ వాదనని మీలాటి మేధావులందరూ కలిసి చాలా జాగ్రత్తగా నిర్మించుకున్నారు. నీకు దేవుడు అద్భుతమైన తెలివితేటలు ఇచ్చాడు రాజూ! ఏ విషయాన్నైనా నీకు కన్వీనెంటుగా మార్చుకుని వాదించగలవు. వందలమంది మానసిక రోగుల్తో మాట్లాడి మాట్లాడి బహుశా నీకీ కళ అబ్బివుంటుంది. ఆ వాదనని దయచేసి నా మీద ప్రయోగించకు" కసిగా అంది.

    "నేను అనుకున్నది చెప్పాను. ఇక నీ ఇష్టం" క్లుప్తంగా అన్నాడు.

    "ఏమిటి నువ్వు అనుకున్నది? వశీకరణ శక్తిద్వారా అన్ని రుగ్మతల్నీ నయం చేయవచ్చుననే థియేరీ కరెక్టవుతే కేన్సర్ ని కూడా నయం చేయవచ్చునని! అంతేగా"

    "అంతే"

    "ఆ థియరీ కరెక్టు కాకపోతే ఏ చిన్న రోగాన్నీ నయం చేయలేవు అంతేగా....."

    "అంతే" అనబోయి ఆగి, ఏదో అర్థమై దెబ్బతిన్నట్టు చూసాడు.  ఇటీవలి కాలంలో అదే మొట్టమొదటిసారి అతను అలా దెబ్బతినటం.....! అయితే వ్యవహార జ్ఞానం వున్నవాడవటంచేత వెంటనే తేరుకుని మొహంమీద నవ్వు తెచ్చుకుని, ".....ఏ విషయాన్నయినా అనుగుణంగా మార్చి వాదించే తెలివితేటలు దేవుడు నాక్కాదు మధూ! నీకిచ్చాడు" అన్నాడు నవ్వుతూ.

    "నా ప్రశ్నకి సమాధానం అది కాదు"

    "దేనికయినా ప్రయత్నం అవసరం. ప్రయత్నించటంలో తప్పులేదుగా....." పాతికవేలు ఇవ్వటం కోసం మా మామయ్య తన సర్వస్వం అమ్ముకున్నాడు. తెలుసా?"

    "అంత ఖర్చు అవుతుందని అతడికి నేను చెప్పాను. అన్నీ వివరించాను కూడా."

    "అన్నీ వివరిస్తావు. నీ తప్పు ఎక్కడా లేకుండా జాగ్రత్తపడతావు. ఎవరైనా పేషెంట్ నత్తి తగ్గలేదేమంటే నీ మెదడుమీద నా శక్తి పనిచేయలేదంటావు. సిగరెట్ మానె అలవాటు తగ్గలేదేమంటే.....నీకు సెల్ఫ్ కంట్రోలు లేదంటావు. ఆ సెల్ఫ్ మానే అలవాటు తగ్గలేదేమంటే...... నీకు సెల్ఫ్ కంట్రోలు లేదంటావు. ఆ సెల్ఫ్ కంట్రోలేగానీ పేషెంట్కుంటే నీ దగ్గరకెందుకు వస్తాడని ఎవరూ అడగరు అంతేగా."

    రాజు మొహం ఎర్రబడింది. కష్టంమ్మీద తనని తాను సంబాళించుకుంటూ, "నువ్వు  అనవసరంగా అప్ సెట్  అవుతున్నావు మధూ! మీ మామయ్య ఎటూతోచని పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చాడు. అటువంటివాడికి నాకు చేతనైనంతలో కొద్దిగా ఆశారేఖ చూపించటంలో తప్పులేదు. దానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తున్నాను అన్నాడు.

    "నువ్వు ప్రయత్నించడం లేదు రాజూ! ఎందుకంటే ప్రతి ప్రయత్నంలోనూ ఓటమికీ విజయానికి  ఫిప్టీ.... ఫిప్టీ ఛాన్సు వుంటుంది. కానీ నీ ప్రయత్నంలో అసలు విజయానికి ఛాన్సేలేదు..... ఎటూతోచని పరిస్థితుల్లో..... అన్నావే. చాలా కరెక్టయిన మాట అది! రాత్రిళ్ళు నిద్రపట్టని వాళ్ళు, డిప్రెషన్ కి గురి అయినవాళ్ళూ,

    మానసిక సమస్యల్తో బాధపడేవాళ్ళూ, కేన్సర్ పేషెంట్లూ, జ్ఞాపకశక్తిలేక కృంగిపోతున్న వాళ్ళూ.....వీరందరి రోగాలకి సరిఅయిన మందులు లేవు. లేవని నీకూ తెలుసు. డాక్టర్లందరూ..... వీరందరి రోగాలకి సరిఅయిన మందులు లేవు. లేవని నీకూ తెలుసు. డాక్టర్లందరూ.... వీరికి చికిత్స నూరుశాతం కష్టమని నిజాయితీగా చెపుతారు. పేషెంట్ నిరాశలో కూరుకుపోతాడు. ఏ చిన్న ఆధారం దొరికినా పట్టుకుందామని ఆశగా చూస్తుంటాడు. అప్పుడు రంగంలోకి మీరు ప్రవేశిస్తారు. మీ వాక్చాతుర్యంతో, ప్రకటనలతో వారిని ఆకట్టుకుంటారు. 'ఈ ప్రయత్నం కూడా చేసి చూస్తే తప్పేముంది?' అన్న భావాన్ని వారిలో కలిగిస్తారు. నిరాశతో కృంగిపోతున్న మనిషి దేవుళ్ళకీ మొక్కుకునేది అందుకే. బాబాల్నీ, వాస్తు శాస్త్రజ్ఞుల్నీ ఆశ్రయించేది అందుకే. బాధతో విలవిలలాడిపోతున్నవాడు, తమ బాధని అర్థంచేసుకుని దానికి ఎవరైనా పరిష్కారం చూపుతానంటే, అలాటి పరిష్కారాలకోసం ఎంతైనా ఇచ్చుకుంటారు. మా మామయ్య పరిస్థితీ అదే. అందుకే భార్యకోసం వున్నదంతా అమ్మేసాడు...."

    "నువ్వు చెప్పిందంతా నిజమైతే ప్రజలు ఎప్పుడో తిరగబడి వుండేవారు. పోలీసులు అరెస్టుచేసి వుండేవారు. నా ప్రాక్టీసు ఇలా  వుండేది కాదు. ప్రజలు సంతృప్తులవుతున్నారు కాబట్టే ఇదంతా జరుగుతూంది....."

    "అబద్ధం" అరిచింది మధూహ. ".....నీ పేషెంట్లలో ఒక్కరు.....కానీసం ఒక్కరు బాగుపడ్డారని నిరూపించు చూద్దాం! ఎవరికివారు తామొక్కరిదే నయంకాని జబ్బు అనుకుని వెళ్ళిపోతున్నారు. తమ ఫ్రిజిడిటీ తగ్గకపోతే తమలోనే ఏదో లోపం వుందనుకుంటున్నారు. తాము సిగరెట్టు మానలేకపోతే తమకే కంట్రోలు లేదనుకుంతున్నారు. తమ మెదడు నీ వశీకరణ శక్తికి లోబడటం లేదని తృప్తి చెందుతున్నారు....."

    "నా హిప్నాటిక్ శక్తికి నిద్రపోని వారు ఎవరూ లేరు...."

    "అది నీ శక్తికాదు. నీ క్లోరోఫాం శక్తి....."

    రాజు దిగ్భ్రాంతుడై చూసాడు. అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. క్రమక్రమంగా వారి రూపు మారింది. అంత వికృతంగా వుండటం ఆమె ఎప్పుడూ చూడలేదు. మనుష్యులసలు అంత కుత్సితత్వాన్ని మనసులో దాచుకుని పైకి మామూలుగా కనపడగలరని ఆమె ఊహించలేదు. అందునా అతడు తన స్నేహితుడు. త్వరలో వివాహం చేసుకోబోయేవాడు. ఆమె అతడిలో మార్పుని నిశ్చేష్టురాలిలా చూసింది. అతడి పెదవుల మీద వంకర నవ్వు వెలిసింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra