Home » Kommuri venugopala rao » Mahaapravaaham

   
    ఆ రోజుల్లోనే ఆమె చీట్లు మొదలుపెట్టింది. ఇతరుల దగ్గరా చీట్లు  కలిసేది. తాను స్వయంగా చీట్లు కలిపేది.


    భూలోకమ్మలో ఒక గొప్ప సుగుణం  వుండేది. తాను పుచ్చుకొనేవోచోట డబ్బు మొహమాటం, కానికారం లేకుండా  వసూలుచేసేది. ఇచ్చేచోట అంత కరెక్టుగా యిచ్చేది. ఆమె దగ్గర కలిసిన చీట్లు ఒక్క పైసా పొల్లుపోకుండా విజయవంతంగానిర్వహించబడేవి.చీటిపాడిడబ్బులెగ్గొట్టటానికి ఎవరికీ దమ్ములుండేవికావు. పరిస్థితులవ ప్రాబల్యంవల్ల ఎవరన్నా  అలాచేసి పారిపోతే ఇండియాలో ఎక్కడున్నా వెతికి పట్టుకొని జుట్టు పట్టుకొని యీడ్చుకొచ్చేది.


    మొదట అయిదువేలు, పదివేలతో సాగిన చీట్లు క్రమక్రమంగా లక్షరూపాయాల చీట్లుదాకా ఎదిగి, ఆమె రెండు చేతుల్తో డబ్బు సంపాదించి  పారేసింది.


    ఆమె రోజుకు పది పన్నెండు జరదా కిల్లీలు నమిలేది. రాత్రుళ్ళు పడుకునే ముందు తప్పనిసరిగా రెండు మూడు పెగ్గులు బ్రాందీ సేవించేది.


    మధ్య మధ్య బుద్ధి పుట్టినప్పుడు కొంత డబ్బు దానధర్మాలకి కూడా ఖర్చుపెడూతూ వుండేది.


    ఆమెలో యింకో సుగుణం కూడా వుండేది. తనమిదకీ ఎవరైనా అనవసరంగా వచ్చారని అనిపించనప్పుడు ,తన కన్యాయం జరిగిందని అనిపించినప్పుడు వాళ్ళమిద దాడి జరిపేది కాని, తనకు తాను ఎవరిమిదకూ దూసుకు వెళ్ళేది కాదు.


    అంతేకాదు. తనంతట తాను ఏ ఆడపిల్లనూ బలవంతంగా పాడుచేసేది కాదు. కాకపోతే ఆర్థిక యిబ్బందుల్లో వున్న  .యిష్టానికి వ్యతిరేకంగా బలం ఉపయోగించి ఎప్పుడూ పాడుచేసేది కాదు.

    
    కొన్నాళ్ళకు   యీ  జీవితంకూడా  ఆమెకు సరిపోలేదు. బంగారు బిస్కెట్ల వ్యాపారంలో కాలుపెట్టింది. కొన్ని లక్షల పెట్టుబడిపెట్టి క్యారియర్స్ ను బొంబాయి పంపించటం, అక్కడ్నుంచి గోల్డ్ బిస్కెట్స్ తెప్పించటం, జ్యూయలరీ షాపులవాళ్ళకు విక్రయిచటం- నాలుగయిదేళ్ళలో విపరీతంగా డబ్బుసంపాదించింది. మధ్యలో రెండు మూడు సార్లు విరీతంగా డబ్బు సంపాదించింది. మధ్యలో రెండు మూడుసార్లు  పట్టుబడి నప్పుడు కొనుగోలుచేసిన బిస్కెట్స్ కోల్పోవటంతో బాటు, తడవకు ఒకటి రెండు లక్షల చొప్పున లంచాలు గుమ్మరించేది. జీవితంలో ఆక్రమమార్గంలో డబ్బు సంపాదించాలంటే  లంచాలు విరజిమ్మాలన్న సత్యం ఆమె ఎప్పుడో గుర్తించింది.తర్వాత తర్వాత సెంట్రల్ ఎక్చేజ్, బొంబాయిలో నకిలీ ఆఫీసర్ల, గూండాల గొడవ ఎక్కువయేసరికి బిస్కెట్ల వ్యాపారం ఎక్కువుగా కుదరక దానికి తిలోద కాలిచ్చింది.


    అప్పటికామె చాలావరకూ సంపాదించి వుంది. ఇహనిలకడగా సంపాదించాలని పెద్ద హోటల్ ,రెండు షాపింగ్ కాంప్లెక్సులూ కట్టించి వాటిమిద వచ్చే భారీ ఆదాయంతో కాలక్షేపం చేస్తోంది. తాను  నిర్వహించే హోటల్ లో కస్టమర్స్ వాళ్ళంతట వాళ్లు తెచ్చుకొంటే చూసీ చూడనట్లు వూరుకొనేదిగాని, తనకు తానుప్రోత్సాహించటం మానేసింది.


    అయితే ఎప్పుడూ ఏవో కేసులూ, గొడవలూ వుంటూనే వుండేవి. కార్పొరేషన్ మిదో, బ్యాంకిల దగ్గర తీసుకొన్న రుణాలకు సంబంధించిన లావాదేవీల వల్లో లాయర్లను పెట్టుకొని , కోర్టులచుట్టూ తిరగాల్సి వస్తూ వుండేది


                          *    *    *    *

    
    ఒకరోజు రాత్రి పదిగంటలవేళ భూలోకమ్మ హోటల్ పని పూర్తి చేసుకొని వెడదామనిసిద్ధపడుతోంటే యిద్దరు పిల్లలతో , చేతిలో చిన్న సంచీలో నడిచి వెడుతోన్న ఓ స్త్ర్రీ కనిపించింది. ఆమె దృష్టిని ఆకర్షించిన సంగతి అది కాదు. చాలా నీరసంగా , వొంట్లో ఓపిక లేనట్లు కబడుతోన్న ఆ స్త్రీ సరిగ్గా హోటల్ ముందుకు వచ్చేసరికి కళ్ళు చీకట్లు క్రిమ్మినట్లయి కళ్లు తిరిగి క్రిందపడిపోయింది.

    
     "అరె! వొరేసుబ్బరాజా! ఇక్కడెవరోఅమ్మాయి పడిపోయింది చూడరా" అనికెకపెట్టింది.


     " సుబ్బరాజు సాయంతో లోపలికి తీసుకెళ్ళింది."


    మొహంమిద నీళ్లూ అవీ చల్లాక శకుంతల కళ్లు విప్పింది.


    ..నువ్వు తిండిలేక నీరసంవల్ల పడిపోయావని తెలుస్తూనే వుంది. ఈ పూట నువ్వూ, పిల్లలూ యిక్కడ భోజనం చెయ్యండి. తర్వాత రాత్రికి యిక్కడే రెస్ట్ తీసుకోండి. రేప్పొద్దుట మిగతా విషయాలు మాట్లాడుదాం"అని ఓ కుర్రాడ్ని పిలిచి, ఆపన్లు పురమాయించి. తాను బయటకెళ్ళి పోయింది.

    
    శకుంతల ఆకలి బాధయితే తీరిందిగాని కొత్తచోటు కావటంవల్ల భయంవల్ల రాత్రంతా నిద్రపట్టలేదు. ఆలసి పోయిన శరీరాలతో పిల్లలు ఆదమరచి నిద్రపోతున్నారు.


    కాకినాడనుంచి ఆమె  తన పుట్టింటికి వెడదామని బయల్దేరింది. విజయపడా వరకూ  వచ్చాక ఆమె దగ్గర డబ్బులయి పోయినాయి. తమ ఊరికిపోవాలంటే అక్కడ్నుంచి బస్సులో యింకో ఇరవామైళ్లు ప్రయాణం చెయ్యాలి. అమ్మాటానికి వొంటిమిద యింకేవస్తువులూ మిగిలిలేవు. ఏం చెయ్యాలో తెలీని నిస్సహాయస్థితిలో యీ దుర్ఘటన జరిగింది.


    బయట ఏవోవో శబ్దాలు ఆవుతోంటే తలుపు ఓరగదా తెరిచి తొంగిచూసింది. ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు. సర్వర్లు సోడాసీసాలూ, బ్రాందిబుడ్లూ తీసుకొని అటూ ఇటూ పరుగులిడతున్నారు. అవటానికి రాత్రి సమయమే అయినా రూములన్నిటిలో లైట్లు వెలుగుతూ కోలాహలంగా వుంది. మధ్య మధ్య రకరకాల మొగాళ్లుఎవరెవరో అమ్మాయిలతో నిలబడి  అలాగే చూస్తోంది. ఎవరో  అయిదుగురు మొగాళ్లు ఓ అమ్మాయిని తీసుకొని  ఓ గదిలోకి వెళ్ళటం కనబడింది.  ఇంతమందీ ఒక అమ్మాయితో వొళ్లు జలదరించింది.


    తలుపు గడియ వేసేసుకొని భయంతో వొణికిపోతూ నిద్ర పోవటానికి ప్రయత్నించింది. ఎంతకీ నిద్ర పట్టలేదు.


    అర్ధరాత్రి రెండు గంటలవేళ బాగా దాహమేసింది. గదులోవున్న కూజాలోని నీళ్లు అయిపోయినాయి. చాలాసేపు ఓర్చుకుందామని చూసింది. గాని అరగంట దాటాక ఆమెవల్ల కాలేదు.


    మెల్లగా లేచి తలుపుతీసి బయటకు తొంగి చూసింది.


    "అదే సమయానికి ఎదురుగా వున్న రూమ్ తలుపు తెరుచుకొని ఒక నడివయసు మనిషి యివతల కొస్తున్నాడు. పీకలదాకా తాగినట్లు తెగ తూలుతున్నాడు.


    అతన్ని చూసి హడిలిపోయి శకుంతల గభాల్న తలుపు  వేసేసుకొంది. కాని అప్పటికే అతను తళుక్కుమన్న ఆ వెలుగు రేఖని చూసేశాడు. అంత వొళ్లు తెలీని స్థితిలోనూ అతన్లో ని స్త్ర్రీ వ్యసనం పురులువిప్పి నాట్యం చేసినట్లయ్యింది.


    ఆగది దగ్గరకొచ్చి తలుపు తట్టసాగాడు.


    " ఇదిగో పిల్లా తలుపు తియ్యి !"


    ఆమె గుండె గబగబ కొట్టుకుంటోంది.


    " నిన్నే నే ఒక్కడ్నేలే. నువ్వు పసందుగా వున్నావు. నాకు నచ్చావు."


    ఒళ్ళంతా చెమటలు పడుతోంది. తలుపు కానుకుని నిల్చుని గుండెమిద చెయ్యివేసి పొదుపుకుంటూ ఏడుపు నాపుకుంటోంది.    


    "  లోలపింకా ఎవరైనా వున్నారా? ఇందాక నాకోసమే ఎదురు చూస్తున్నట్లు నిలబడి వున్నావుగా. తియ్యమంటే తియ్యవేమిటి?

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra