Home » Yandamuri veerendranath » గ్రాఫాలజీ

     - చాలామందికి ఇంధ్రదనస్సు అంటే ఇష్టం. అది కనిపిస్తే కేరింతలు కొడతారు.  కొంతమంది చిత్రకారులు దానిని అద్బుతంగా గీస్తారు. ప్రకృతి ఆరాధకులు వాటి కోసం ఆకాశం కేసి చూస్తారు. కానీ, మీరు మాత్రం నివశించేదే ఇంద్రధనుస్సు మీద.

     - మీకు లోకం ఆనందంగానూ, రంగురంగుల ఊయల గానూ కన్పిస్తుంది.

    - వేరొకరికి జోలికి వెళ్లకుండా మీ జీవితం మీరే జీవించాలనేదే మీ తిరుగులేని అభిప్రాయం.

    - తమాషా ఏంటంటే మీరు పూర్తిగా భావుకులు కారు. ప్రపంచంలోని మంచి చెడ్డలు మీకు బాగా తెలుసు. ఒక విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవటంలో మీకన్నా సమర్దులైన వారు లేరని చెప్పొచ్చు.

    - సాంప్రదాయాలకు అనుగుణంగా నడవటానికి  మీరు ఇష్టపడరు.

    - సాంప్రదాయవాదులైన, పెద్దలను మీ అతినాగరికపు పనులతో ఆశ్చర్యపరచటం మీకెంతో సరదా.

     - మీ చుట్టు పక్కల వాళ్లందరినీ మీరు స్నేహితులుగానే భావిస్తారు.

    - మీరు ఎంత ప్రాక్టికల్  అంటే,  మీ ప్రేయసి / ప్రియుడు నుండి శాశ్వతంగా విడిపోయే సమయంలో కూడా  'మనం స్నేహంగా వుండలేమా' అని అడిగే మనస్తత్వం మీది.

     - మీ ప్రేమ ఫలించకపోతే అతి నిజాయితీ పరులుగా పార్వతో / దేవదాసులైపోరు. మీ పరిశోధనా జిజ్ఞాసను ఆకట్టుకొనే అమ్మాయి లేదా అబ్బాయి కనిపించగానే, పాతవిషయాలను  మరిచిపోయి, మళ్లీ (నిజాయితీగా!) ప్రేమలోపడతారు.

    - మీ ప్రేయసికి  ఒక విషయంలో మీపై కోపం రావచ్చు. ఎందుకంటే మీరు ఆవిడపట్ల ఎంత ఆసక్తి చూపుతారో అంతే ఆసక్తిని మీ ఇంటికి న్యూస్ పేపర్ తెచ్చే అబ్బాయిపైన, ధర్మం చెయ్యమని వచ్చే పేదరాలిపైన కూడా చూపుతారు.

     - ఇష్టమైన అభిరుచి అంటూ ఏమీ వుండదు. రాజకీయాలు మిమ్మల్నెంతగా ఆకట్టుకుంటాయో, ఆటలు కూడా అంతే ఇష్టపడతారు. ర్యాకెట్లో చంద్రమండలానికి వెళ్లేవారు. గుర్రం నడిపేవాడు,  ఒకనటుడు, సంగీతం వాయించేవాడు -ఒకటేమిటి ప్రపంచంలో అన్ని విషయాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మిమ్మల్ని ఇష్టపడేవారు సాధారణంగా మిమ్మల్ని అర్దచేసుకోడానికి చాలా  కష్టపడతారు. మీకు ఏ అభిరుచిలో అయినా ఇమడ గలిగే శక్తి వుంది.

     - కొద్ది మందికి చెడిపోవడం బాగా చేతనవుతుంది. కొందరికి బాగుపడటం తెలుస్తుంది. కానీ, మీకు చెడిపోవటం ఎంత బాగా  తెలుసో బాగుపడడం కూడా అంతే బాగా తెలుసు.

     - అపురూపమైన ఏదో ఒక గొప్పతనం మీ ప్రతి చర్యలోనూ ఏదో రూపంలో చోటుచేసుకుంటు వుంటుంది. (మీకు నచ్చిన విషయాలన్నిట్లో మీరు ప్రవేశించి, ఎందులో మీ ప్రజ్ఞను నిరూపించుకోగలరో  నిర్దారించుకుని ముందడుగు వేస్తే జీవితంలో మీరు కోరుకున్న  సుఖాలు, సౌఖ్యాలు  మీ ముంగిట నిలుస్తాయి. మీరు చేయవలసిందల్లా మొహమాటం లేకుండా ప్రవేశించటమే)

    - మీరు కాస్త పిరికివారే అయినా,  దాన్ని ఎక్కడా బైటపడనివ్వరు.  కాబట్టి వీలైనంతగా అదే రకమైన జీవితం గడపడం మంచిది.

     - మీకు జ్ఞాపకశక్తి  ఎక్కువగా వుంటుంది.

    - విమర్శలని ఏమాత్రం సహించలేరు. ఉదాహరణకి ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కి  జెండా పాతబోయే సమయంలో "ఇంట్లో భార్యకు చీరకొనివ్వలేడుగాని, ఇక్కడకొచ్చి ఎవరెస్ట్ మీద జెండా పాతుతున్నాడురా" అని మీ పోటీదారుడెవరైనా వెక్కిరిస్తే  వెంటనే  ఆ పర్వతం దిగడం ప్రారంభించేస్తారు.  మీ విజయానికి గుర్తుగా జెండా పాతాలనే ఉత్సాహం అప్పుడే చచ్చిపోతుంది.  మీరు ఆడవారైతే మీ స్నేహితురాలు ' ఈ చీరె నీకు బాగోలేదే' అంటే ఈ చీరె పెట్టే అడుక్కి వెళ్లి పోవల్సిందే.

    - వింత వింత కలలు కంటూ నిద్రపోవడం, వాటి గురించి దిగులు పెట్టుకోవటం కూడా మీ ప్రవర్తనలో సర్వసాధారణం.

    - ఏదో జరగబోతుంది అనిమీరు  అనుకున్నారంటే, సర్వసాదారణంగా నూటికి ఏభైసార్లు అది జరుగుతుంది. ఉదాహరణకి మీ అబ్బాయి బైక్ మీద బైటకు వెళ్తున్నప్పుడు మీరు వెళ్లొద్దు అని చెప్తే వెళ్లకపోవటమే మంచిది. ఎందుకంటే ముందే చెప్పినట్లు ఆక్సిడెంట్ అయ్యే ఛాన్సస్ ఏభై శాతం.

    - మృదు సంభాషణలు  కొనసాగించడానికి ఇష్టపడేమీరు,  అపారమైన జ్ఞాన సంపదని మీ స్వంతం చేసుకోడానికి కృషి చేస్తారు.

    - మీ న్యాయ నిర్ణయాలు తిరుగులేనివి. పక్షపాతం చూపెట్టైనా సరే ఇతరులకు అన్యాయం చేయలేరు.

    - మీలో ఎంత విశ్లేషణా పటిమ వున్నప్పటికీ ,పరిస్థితులకు వెంటనే స్పందించడం మీ మంచి తనానికి నిదర్శనం.

    - ప్రతీ విషయాన్నీ విశ్లేషించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి అనే గుణం కాదు మీది.

     - ఒక్కొసారి దగ్గర వాళ్లకి కూడా మీకు సంబంధించిన విషయాలు తెలియకుండా మీరు జాగ్రత్తపడతారు. మరోసారి మీకెవరో తెలియని వ్యక్తుల దగ్గరకూడా  మీరు చేసిన తప్పులని నిజాయితీగా ఒప్పుకుంటారు.

    రెండవరకం: అక్షరాల వెడల్పుగాను తేలికగానూ వ్రాసేవారు తమమీద తమకి నమ్మకం ఎక్కువైన వాళ్లయి వుంటారు. సాధారణంగా ఒక సీట్లోంచి మరోసీట్లోకి  మారుతూ అందరిలోలూ కలివిడిగా మాట్లాడే వారై వుంటాపు.

     పేక ముక్కలతో సరదాగా పది అంతస్థులు కట్టి, చివర్లో  చిటికెవేసి కూలదోసి ఆనందించాలనే మనస్తత్వం వీరిది. తమమీద తమకి అంత నమ్మకం అన్నమాట.  మీరు జీవితాన్ని  చాలా తేలికగా తీసుకుంటారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra