Home » Yandamuri veerendranath » గ్రాఫాలజీ

    మీ చేతివ్రాత  ఏ విభాగానికి చెందుతుందో తెలుసుకొని దాన్ని బట్టి మీ మనస్తత్వాన్ని అంచనా వేసుకోండి.

    1. అన్ని విభాగాల్లోనూ సమంగా, చిన్నప్పుడు కాపీ పుస్తకాలను వ్రాసే విధంగా వ్రాసేవాళ్లు సాదారణంగా నెమ్మదస్తులై వుంటారు. తమని తాము తక్కువ చేసుకొనే అభిప్రాయం కూడా కొంత వుంటుంది.

    2. తలకట్లకి, ఒత్తులకి ప్రాముఖ్యత ఇవ్వకుండా మధ్య అక్షరాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే వాళ్లు  సాదారణంగా తర్కానికే ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చే వాళ్లై వుంటారు. వీళ్ళు ఎక్కువ వర్తమానం, భద్రత,  వాస్తవం,  కృషి, పట్టుదల మొదలైన మంచి గుణాలను ఆపాదించుకున్న వాళ్ళై వుంటారు. వీళ్ళకి మిగతా వాళ్లని డామినేట్ చెయ్యాలనే గుణం వుంటుంది. విమర్శలను సాధారణంగా ఎదుర్కోలేరు.  తాము నమ్మినదే మంచిదనే సిద్దాంతం కలిగి వుంటారు. వీళ్ల దృష్టి సామాన్యంగా నాలుగువేపులకు సాగకుండా తాము చేసే  పనిమీదే నిలిచివుంటుంది. ఒత్తులకు, తలకట్లకు ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వుకుండా మధ్య అక్షరాలను మాత్రం ఎక్కువ గుండ్రంగా వ్రాసేవాళ్లు ఎమోషనల్  గానూ, కొంత ద్వైదీ భావం గల వాళ్లగానూ వుంటారు.  ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్లందరూ సాదారణంగా ఈ విబాగానికే చెందినవాళ్లు.

     3. అక్షరం వ్రాసి దానికింద ఒత్తులు తలకట్లు  బాగా పొడవుగా ఇచ్చేవారు న్యాయానికి, సమాజానికి, మంచికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లై వుంటారు. వీరికి కాసింత వేదాంత దృక్పదం కూడా వుంటుంది. దానికి తోడు తమమీద తమకి అవసరమైన   దానికన్నా  ఎక్కువ నమ్మకం కూడా వుంటుంది.  ఎప్పుడూ తమని తాము ఆత్మ విమర్శ చేసుకుంటూ గడపటానికి ఇష్టపడతారు.  కొద్దికొద్దిగా  వేదంవైపు  మొగ్గుచూపుతారు. తలకట్లు గుండ్రంగా తిప్పడం అలవాటుగా వున్న వాళ్లు ఎక్కువ కల్పనాశక్తి కలిగినవాళ్లై వుంటారు. తలకట్టుని కొంచెం కుడివైపుకి వ్రాసేవాళ్లు ఒక ధృఢమైన  గమ్యం వైపు సాగడానికి తగిన మానసిక శక్తి  వున్న వాళ్లై వుంటారు.  అలాకాకుండా  తలకట్టు పైకివెళ్లి కాస్త ఎడమచేతికి తిరిగితే, తమని ఎప్పుడూ ఎవరో  ఒకరు ప్రేమించాలని వారికే తమ ప్రేమనంతా సమర్పించుకోవాలనే సున్నిత మనస్కులైవుంటారు.

    తలకట్లకీ మధ్య అక్షరాలకి ప్రాముఖ్య నివ్వకుండా కేవలం ఒత్తులకి మాత్రమే ప్రాముఖ్యత నిచ్చేవాళ్లు సాధారణంగా ఎంత సాధించినా సంతృప్తి చెందనివాళ్లు, ఇంకా సాధించాలనే కుతూహలం కలవాళ్లు అయివుంటారు.

    

     వీరు ఎక్కువగా మెటీరియలిస్టులై వుంటారు. శృంగార పరమైన కోర్కెలు మనసులో ఎన్నివున్నా బైటపెట్టక తమలో తామే మధనపడుతూ వుంటారు. వీరు అక్షరాలకి పెట్టే ఒత్తులు ఎక్కువ ఎడమమైపుకు వంగితే,  గత కాల జీవితపు ప్రభావం నుంచీ ఇంకా బైటపడని వారై వుంటారు.  తమ గతాన్ని ఆధారం చేసుకొని భవిష్యత్తు నిర్మించటానికి కుతూహలం చూపిస్తారు.

     (మీ చేతి వ్రాత పై మూడు విభాగాల్లో దేనికి చెందుతుందో తెలుసుకోవాలనుకుంటే,ఇంతకు ముందెప్పుడో  వ్రాసిన మీ చేతివ్రాత కాగితం  తీసుకొని పెన్సిల్ తో మూడు గీతలు గీయండి. మధ్య  అక్షరం మధ్యలో వుండేటట్లు, తలకట్టుపైన వుండేటట్లు, ఒత్తు క్రింద వుండేటట్లు మీజోన్స్ నిర్మించుకోవాలి. దాన్ని బట్టి మీరు ఏకేటగిరికీ చెందుతారో నిర్ణయించుకోవాలి)
               
                4. అక్షరాల వెడల్పు:

           

    పై రెండు చేతివ్రాతలను గమనించండి. కొందరు దగ్గరదగ్గరగా తక్కువ స్థలంలో ఎక్కువ మేటర్ పట్టేవిధంగా అక్షరాలను వ్రాస్తారు. మరికొందరు అక్షరాలని సాగదీసి వ్రాస్తారు. మీరు ఈ రెండిట్లో ఏ విభాగానికి చెందుతారో నిర్ణయించుకోండి.

     మొదటి రకం:

    అక్షరాలను దగ్గర దగ్గరగా ముఖ్యంగా "పొడవుగా" వ్రాసేవారు క్రమశిక్షణగా వున్నావాళ్లు, సిగ్గు ఎక్కువగా  వున్నవాళ్లు, డబ్బు విషయంలో పొదుపరిగానూ అయి వుంటారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra