Home » Suryadevara rammohan rao » సూపర్ స్టార్


    `అతను సమాధానం చెప్పలేదు. దాదాకి జయధీర్ ఎప్పుడూ ఓ పజిల్.... చూట్టానికి ఎంతో సాప్ట్ గా, జెంటిల్ మన్ గా కనిపిస్తాడు.

    గట్టిగా అరవగా కూడా చూడలేదు. ఏది చెప్పినా చాలా తాపీగా చెబుతుంటాడు. ప్రభుత్వాలకు ప్రభుత్వాల్నే కూల్చివేసిన కొన్ని అంతర్జాతీయ కుట్రల వెనుక జయధీర్ అదృశ్య హస్తముందని చెబితే ఎవరూ నమ్మరు నమ్మలేరు.

    అతని కళ్ళంత ప్రశాంతంగా ఉంటాయి. అతని మాటలంత పొలైట్ గా  ఉంటాయి.

    అతని కదలికలు, బిహేవియర్, డ్రెస్సింగ్ అంతా జెంటిల్ గా ఉంటాయి.

    కనీసం మనిషెలా ఉంటాడో కూడా  తెలీకుండా పది సంవత్సరాలుగా పాదరసంలా ఒకచోట నుంచి మరో చోటుకి, వివిధ దేశాల పోలీసు యంత్రాంగం కళ్ళు కప్పి జారుకుంటున్న వైట్ కాలర్ క్రిమినల్. కోల్డ్  బ్లడెడ్ మర్డరర్..... ఏ భయంకరమైన పథకం.....ఎవరి చుట్టూ పన్నినా అందులో అతను ప్రత్యక్షంగా కనిపించడు.

    కేవలం అతని మేధస్సు, వాయిస్ మాత్రమే ప్రస్పుటమవుతుంటాయి.

    "నేనున్నంతవరకు ఎడిట్ చేసి ఇవ్వమను. నాకు పెళ్ళయింది. చాటుగా నా గర్ల్ ఫ్రెండ్ తో అనఫిషియల్ హనీమూన్ లో ఉండగా అనుకోకుండా ఆమె  కెమేరా ఫీల్డ్ లోకి వచ్చాను. అది టీవీ లో టెలీకాస్ట్ అయితే నా సంసారం నాశనమవుతుంది. ఇలా నువ్వు ప్రొసీడ్ అవ్వాలి." కళ్ళు మూసుకునే  చెప్పాడు జయధీర్.

    కారు హొటల్ ముందాగింది.

    అప్పటికే వేరే పేరు మీద ఆ హొటల్ లో రూమ్ బుక్ అయింది.  రూమ్ నెంబర్ 906.


                        *    *    *


    "మిస్టర్ ప్రశాంత్! మీరు గోడ దగ్గర నిలబడి ఎగిరెగిరి హీరోయిన్ కేసి చూస్తుండాలి. ఓ.కే"

    'ఓ.కే.' అన్నాడు ప్రశాంత్.

    'విల్సన్! ముందు బయట నుంచి తీశాకా లోపల వేపునుంచి టూ షాట్స్ తీస్తే మిక్స్ చేసుకోవచ్చు. కమాన్ టేక్......' అంది.

    ప్రశాంత్ దృష్టి మాత్రం హంపీ మీదనే ఉంది.

    ప్రశాంత్ ఓ సారి ఎగిరాడు.

    హంపీకది నచ్చలేదు.

    "నో..... నో..... మిస్టర్ ప్రశాంత్...... హీరోయిన్ ను దొంగచాటుగా చూడాలన్న క్యూరియాసిటీ మీ మూమెంట్ లో సయితం కనిపించాలి. పోనీ రెండు మూడుసార్లు ప్రాక్టీస్ చేయండి." అంది హంపి.

    అలాగేనన్నట్లు మౌనంగా తలూపుతూ హంపీకేసే  చూసాడు ప్రశాంత్. నిజానికి అతను మంచినటుడే. కానతని దృష్టి వేరే చోట ఉండటంతో ఆ మూడ్ లోకి రాలేకపోతున్నాడు.

    అందమైన గుండ్రటి మొఖం.

    చీకటి మేఘంలా కప్పేసే పట్టుకుచ్చులాంటి పొడవైన జుత్తు..... చూపులు చురుగ్గా ఉన్న  గుండ్రటి కళ్లు.

    ఆ కళ్ళల్లో నిండైన వెలుగు.....

    కళ్ళని ముద్దెట్టుకునే వెలుగు......

    ఆ కళ్ళల్లో ఆ వెలుగు ఎప్పుడూ సజీవమై నిలుస్తుంది. ఆ వెలుగు ఆమె మానసిక పరిణతికి ప్రతిబింబమా? బంగారపు పోగులు, దిద్దులు లేకుండా బోసిగా కనిపించే ఆమె చెవుల ముందుగా వంపులు తిరిగి జాలువారిన పల్చటి కురులు..... ఏమిటి ఆమెలోని ప్రత్యేకత...... ఆమె నవ్వితే అలా నవ్వుతూనే ఉండాలనిపిస్తుంది. ఆమె శాసిస్తే శాసిస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంతాజేసి ఆమె తెల్లగా వుండదు నలుపు. డైరెక్ట్ చేస్తున్నప్పుడు, కెమేరాను హేండిల్ చేస్తున్నప్పుడు ఆమెలో కన్పించే ఏకాగ్రత.....అప్పుడప్పుడు తను స్త్రీనని మర్చిపోయి ప్రవర్తించే ఆమె తీరు..... ఏమిటి ఆమెలో అంతటి ఆకర్షణ!ఎక్కడుంది అంత అందం? ఆమె వ్యక్తిత్వంలోనా? చూడగానే మామూలు యువతే అనిపిస్తుంది.....కాని....కొద్ది సేపు ఆమెతో మాట్లాడినా...... ఆమె వేపే చూసినా మరిక మనస్సు మరల్చుకోలేని ఆకర్షణ  ఆమెలో నిభిదీకృతమై ఎదుటివార్ని ఫ్రీజ్ చేస్తుంది. అన్నిటికీ మించి ఆమె నడకలో అదో ప్రత్యేకత. అది  అచ్చం ఆడపిల్లల నడకలా ఉండదు. వయ్యారంగా నడవదు... నడిచే ప్రయత్నం చేయదు..... వగలుపోదు. అంతులేని అగాధాల్ని..... అంతర్భూతమైన సమస్యల్ని ఛేదించేందుకు దూసుకుపోతున్నట్లనిపించే నడక..... ఆ నడకలో కొంత మగతనం, నిర్లక్ష్యం.....సన్నగా.....పొడవుగా.....నల్లగా....ఆమె నవ్వుతుంది. ఆ నవ్వు ఎదుటిమనిషి కనురెప్పల మధ్య అడ్డుగోడై అలాగే చూసేలా  చేస్తుంది. వృత్తిరీత్యా ఎంతోమంది మగవాళ్ళు..... ఎంతో అందంగా ఉండే మగవాళ్ళు...... కనిపిస్తారు. తారసపడతారు...... ప్రక్క ప్రక్కనే వృత్తిలో కొనసాగుతుంటారు. కాని ఎప్పుడూ ఆమె చూపుల్లో తను ఒక ఆడదైన భావం కనిపించడు...... మగవాణ్ని చూస్తున్న భావం అంతకంటే కనిపించదు....... ఒక  నల్లపిల్ల కూడా  ఇంతగా ఆకర్షించగలదా?: ఆకర్షించ గలదనే తన పట్ల రుజువయింది.

    "వాట్ మిస్టర్ ప్రశాంత్. ఎక్కడున్నారు?" ఆమె పెద్దగా అడిగే సరికి ఉలికిపాటుగా ఆమె తాలూకు ఆలోచనల నుంచి తేరుకున్నాడు.

    ఓకె ఐ యామ్ రడీ...... టేక్" అన్నాడు ఆమె నుంచి  చూపులు  మరల్చుకుంటూ.

    "రడీ విల్సన్...... టేక్" అంది పెద్దగా. క్షణాల్లో అక్కడ  నిశ్శబ్దం అలుముకుంది. హంపీ ఆశించిన విధంగానే అతనెగిరాడు. ఫలితం  లేక  పోయింది.

    షాట్ ఓకే కాలేదు.

    "మీరొక పని చేస్తారా?" హంపీకి దగ్గరగా వస్తూ అన్నాడు.

    "చెప్పండి" అందామె ప్రశాంతంగా.

    "మీరు గోడ అవతలకు వెళ్ళి నిల్చోండి. ఒక్కసారి ప్లీజ్" అర్ధిస్తున్నట్లుగా అన్నాడు. ఆమె తలూపుతూ వెళ్ళిపోయింది.

    సరీగ్గా నిమిషం తర్వాత ఆమె గోడకవతల వుంది.

    "ఓకేనా?" గోడకు ఆవేపు నుంచి ఆమె మాట  వినిపించింది.

    "ఓ.కే....." అన్నాడు ప్రశాంత్.

    గోడకు ఈవల రోడ్ మీద యూనిట్ అంతా  ఉంది. గోడ దగ్గరగా ప్రశాంత్ ఉన్నాడు. రోడ్ కి చివర   కెమెరా స్టార్ట్ అయింది.

    ప్రశాంత్ ఎగిరాడు.....మరలా ఎగిరాడు...... అవసరం లేకున్నా  ఇంకోసారి  ఎగిరాడు...... ఇప్పుడతనికి సారైనా మూడ్ ఉంది. ఆ వేపున ఉన్న  హంపీని చూడాలన్న అతనిలోని బలమైన కోరికే అతనిలో ఆ ఉత్సాహాన్ని,  ఉద్వేగాన్ని పురికొల్పింది.

    విల్సన్ ఓకె అన్నా ఇంకా ఎగురుతూనే ఉన్నాడు. ఎగిరినప్పుడల్లా హంపీని చూస్తూనే ఉన్నాడు.

    "షాట్...... ఫెంటాస్టిక్" విల్సన్ అరిచాడు.

    హంపీ ఇక్కడ ఉన్నంతవరకు ఆమెని సూటిగా చూడలేక......చూసేందుకు అవకాశం లేక ఎగరలేని ప్రశాంత్ ఆమెను ఆబ్ జెక్ట్ గా పెట్టుకోబట్టే ఆ షాట్ బాగా చేయగలిగాడని అక్కడున్న ఎవరికీ తెలీదు ఒక్క నందినికి తప్ప.

    హంపీ తిరిగివచ్చి మానిటర్ లో షాట్ చూసుకుని హేపీగా ఫీలయి నెక్ట్సుషాట్  అంది.

    "చూడు మిష్టర్ వర్థన్.....మీరిప్పుడు సడన్ గా ఫ్రేములోకి రావాలి......వస్తూనే ఓ క్షణం ఆశ్చర్యపోతున్నట్లు ఫీలయి..... అప్పుడు డైలాగ్ చెప్పాలి. మీ డైలాగ్ గుర్తుందా?"

    "గుర్తుందండి" అన్నాడు వర్ధన్ అనే ఆర్టిస్ట్.

    "రడీ.....టేక్" అంది హంపీ విల్సన్ కి సంజ్ఞ చేస్తూ......కెమేరా స్టార్ట్  అయ్యింది.

    అతను పరుగు పరుగున వచ్చి ఫ్రేమ్ లోకి ఎంటరయి, ఆశ్చర్యపోయి "బాయ్యా....." అన్నాడు.

    "కట్" పెద్దగా అరిచింది హంపీ.

    ఆమె ఎందుకలా అరిచిందో ఎవరికీ అర్థం కాలేదు.

    హంపీ విస విసా  వర్థన్ దగ్గరకు వచ్చి అతని వేపోసారి సీరియస్గా చూస్తూ "లక్షసార్లు" చెప్పాను నీకు భాషను ఖూనీ చేయొద్దని, బావా.....అనలేవా? పోనీ బావయ్యా అనైనా అనవచ్చుగదా? బాయ్యా ఏమిటి అసహ్యంగా.....?ఆ మాట వింటుంటే ఒంటిమీద తేళ్ళు జర్రులు పాకినట్లు ఉంది. మరోసారి అలా  అన్నావంటే నిన్ను ఇటు నుంచి ఇటే ఎలిమెంటరీ స్కూల్ కి పంపించాల్సి వస్తుంది. తెలుగుభాష నేర్చుకొమ్మని ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేకపోతోంది....." ఆమెకి కంపరంగా ఉంది ఆ మాటను తలుచుకుంటుంటే.

    "సారీ మేడమ్......" అన్నాడతను చిన్నప్పటి నుంచి అలవడిన ఆ మాటను వదిలిపెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తూ.

    నెక్ట్స్ షాట్ ఓకే అయింది.

    సరిగ్గా ఒంటిగంటకు లంచ్ బ్రేక్ ఇవ్వటంతో అందరూ హడావిడిగా ఆ ఏర్పాట్లు చేసిన వేపుకు సాగిపోయారు.

    "ఆమెకు రోజురోజుకు పొగరు ఎక్కువవుతోంది......భాషా అందంగా ఉండాలా? ఎలా ఉంటే ఏం? అర్థమైతే చాలదా? మీరు లుచ్చాలయితే పిల్లలూ లుచ్చాలవుతారు అనే టైటిల్ సాంగ్ తో ఏకంగా ఏ సీరియలే వస్తోంది టీవీలో లుచ్చా అనే మాటనే వదిలేంత ఔదార్యం, అభిరుచి టీవీ వాళ్ళకున్నప్పుడు దానిముందు ఇదెంత.....? పొగరు కాకపోతే" నందిని వర్ధన్ అనే ఆర్టిస్టుని ఎగదోసింది.

    "లేదు మేడమ్...... నేనన్న పదం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక టీవీవాళ్ళ సంగతంటారా?అందులో ఉన్నవాళ్ళకు తెలుగుభాషే సరిగ్గా తెలీదు. వాళ్ళకు తిట్టు ఏదో, ఏది కాదో ఇంకెలా తెలుస్తుంది? వాళ్ళను ప్రమాణికంగా తీసుకుంటే మనం కొన్నాళ్ళకు ఏ భాషకు చెందినవాళ్ళమో తెలీకుండా పోతుంది. అయినా అది తిట్టని, అలాంటి సంస్కార హీనమైన అసభ్య పదజాలాన్ని  ఎందుకు యాక్సెప్ట్ చేశారని ప్రేక్షకులు తిట్టేసరికి ఈ మధ్య ఆ పాటను కట్  చేశారు. పాపం ఆ టీవీ వాళ్ళు........మటుకు ఏంచేస్తారు?"

    అతను హంపీని సమర్థించే సరికి ఆమెకా క్షణం పిచ్చికోపం  వచ్చింది చేతిలోని ప్లేట్ ని విసిరికొట్టి హీరో ప్రశాంత్ వేపుకు సాగిపోయింది.


                       *    *    *
   
    ఉదయం ఆరుగంటల సమయం.

    అప్పుడే తెల తెల వారుతోంది.

    ఆ ప్రాతఃకాలపు నిశ్శబ్దం ఒక్కసారి బ్రద్దలయింది. ఏదో  పెద్ద శబ్దం.... అతను ఉలికిపాటుగా లేచి కూర్చున్నాడు. అంతా చీకటి......కళ్ళు నులుముకొని కళ్ళకు చీకటి అలవాటుపడేదాకా చూస్తూ కూర్చున్నాడు.

    మరలా వినిపించింది.

    అనిల్ కంగారుగా లేచి పరుగున డోర్ దగ్గరకు వచ్చి టార్పలిన్ ఎత్తి చూశాడు.

    ఆమె అలా నవ్వుతూనె ఉంది.

    "ఈ రోజు ఖాయంగా ఏదో శుభం జరుగుతుంది..... గుడ్ మార్నింగ్......" అన్నాడు.

    "వెరీగుడ్ మార్నింగ్...... ఇంకా లేవలేదా?" శిరీష నవ్వుతూనే అడిగింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra