Home » Kurumaddali vijayalakshmi » అశోకవనంలో సీత


    "ఇప్పుడు  జరిగేదేమిటంటే ఈ సీతని సీత లాగా వుంచకూడదు! ద్రౌపతిని చెయ్యాలి." అంది సతీఅనసూయ.
    సీతని ద్రౌపతి చేయటం ఏమిటో ఎవరికీ అంతుబట్టలేదు.
    సీతకి అంతుబట్టి ఉలిక్కిపడింది.
    అంటే- భాగవంతలో..... ఛా, ఛా! భారతంలో ద్రౌపతిని నిండు కొలువులో మగాళ్ళముందు గుడ్డలొలిచి నుంచోబెట్టారే..... అలా ఇప్పుడు మనం  సీతని గుడ్డలూడదీసి......"
    "నుంచోపెట్టాలి." అరుంధతి అందుకుని పూర్తిచేసింది.
    "నీ బొంద...... అలాకాదు. మానమ ఎప్పుడు ఏం చేస్తాం? కొత్త పిల్ల ఏడ్చినా, ఎదురు తిరిగినా ఊరుకోకుండా ఓగట్టి మగాడికి కుదురుస్తాము. వాడికి లొంగకపోతే ఇద్దరిని పంపుతున్నాము గదిలోకి. ఆపిల్ల నాలుగు గోడల మధ్య గప్ చుప్  వ్యవహారం కాదు. కొత్త పద్ధతి. ఏంటంటే..... .....? సీతని యిద్దరు మగాళ్లు పట్టుకుని గుడ్డ లిప్పదీస్తారు. మనమంతా చూస్తూ నుంచుందాము. ఆళ్ళపని ఆళ్ళు కానిచ్చుకుంటే- సీతకి పట్టిన దెయ్యం వదిలిపోతుంది......" అంటూ సతీ అనసూయ ముగించింది.
    "భరే, భలే....." అంటూ అందరూ చప్పట్లు కొట్టారు.
    "దెయ్యమా__" అని అరిచింది సీత.
    "కానీండిరా, నరిసింగులూ! గవర్రాజూ!" అంది సతీఅనసూయ.
    నరిసింగులు, గవర్రాజు సీత జబ్బలు పుచ్చుకుని లేపి నుంచో బెట్టారు. సీత పెనుగులాడింది, తిట్టింది, కరిచింది, అరిచింది.
    సీత ఓ  పట్టాన వాళ్ళకీ అలివి కావటం లేదు.
    చూస్తున్న ఆడాళ్ళకి భలే సరదాగా వుంది. ఎంత సరదాగా వుందంటే- వాళ్లు మగాళ్ళయితే సీత మీదపడి చీర లాగుదామన్నంత సరదాగా వుంది.
    నరిసింగు, గవర్రాజుకి ఇంతసేపు పరీక్ష అయినందుకు మగాడికి రావలసిన కోపం వచ్చింది పట్టుదల వచ్చింది. గవర్రాజు-సీత రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు.
    సీత ముఖం వంచి, గవర్రాజు చేతి మీద వంద గ్రాముల కండ ఊడొచ్చేటట్లు కొరికింది. గవర్రాజు సీత చేతులు వదలలేదు. ఇంకో వంద గ్రాముల కండ సీత నోటికి చిక్కింది. సీత నోరు ఎర్రబడింది ఇంకో వంద గ్రాముల కండ గవర్రాజు శరీరం నుంచి తరిగింది. అయినా సీత చేతులు వదలలేదు గవర్రాజు.
    నరసింగులికి వీలు చిక్కింది సీత జాకిట్టుని మెడ వెనుక భాగంలోది పట్టుకుని లాగాడు.
    జాకిట్టు పాఱున చిరిగి సీత వీపు బయటపడింది.
    'భగవంతుడా! నువ్వంటూ వుంటే నిజంగా రా! వచ్చి నన్నేంటనే వీళ్ళ బారినుండి రక్షంచు! నన్ను నేను రక్షించుకోటం అయిపోయింది.' అనుకుంది సీత. తన చేతులు తన అధీనంలో వుంటే సీత నొక్కుకునే దాన్ని! అనుకుంటూ వుండగా.....
    నరసింగులు జాకిట్టుని మరోసారి లాగబోతూండగా.....
    సీత మొర ఆలకించో, ఆలకించకనో!
    ఆ కాలంలోలా..... తెలుసు సినిమాలోలా...... భగవంతుడు పరుగెత్తుకువచ్చాడు. భగవంతుడంటే దేముడు.
    "పోలీసు వెంకటస్వామి వచ్చాడు, యమర్జంటట." అని చెప్పాడు దేముడు.
    "ఆపండి....."అంది సతీఅనసూయ.
    అందరూ ఆగిపోయారు.
    "నేను కిందకెళ్తున్నాను. రాత్రి ఓ కేసు మన కొచ్చింది. అది బయటపడితే చస్తాం అందరం...... కాబట్టి, అందరూ బయటకిపదండి. దాన్ని గదిలోనే వుంచి బయట గడియవేయండి. తర్వాత చూద్దాం." అంది సతీఅనసూయ.
    నరసింగులు, గవర్రాజు సీత నోదిలేశారు. సీత వంటిమీది గుడ్డలు ఒలవనందుకు ఆడాళ్ళలా సిగ్గుపడి తల వంచుకున్నారు.
    సీత రొప్పుతూ సోఫాలో ఒరిగిపోయింది.
    అందరూ నిరాశగా గదిలోంచి బయటికొచ్చారు.
    గది తలుపులు వేయబడ్డాయి. గడియ బిగించబడింది.
    సీత గదిలో వుండిపోయింది.
                                                                                           29
    పోలీసు వెంకస్వామికి సతీఅనసూయ అంటే మహా గౌరవం. ఎందుకంటే, నెలకి సినిమా భాషలో చెప్పాలంటే ఆ 'మ్యా మ్యాలు ; బాగా ముట్టజెబుతుంది.
    నెలంతా టైమ్ ప్రకారం డ్యూటీ చేస్తే ఫస్టు తారీఖున ముట్టే రాళ్లు ...... సైకిల్ కి లైటు లేకుండా రాత్రి పూట వెళ్తుంటే అప్పుడు పట్టుకుంటే అప్పుడే వదిలిస్తే, ముట్టే గులకరాయి. బుల్లి దొంగతనాన్ని పట్టుకుంటే, వాడిచ్చే బియ్యంలో పలుగురాయి...... నెలంతా సంసారం ఈదటానికి ఏం సరిపోతుంది. ఎన్నిరాళ్లు ఓ చోటచేరితే ఓ ఇల్లు నిండుతుంది? సతీ అనసూయ జీతం రాళ్ళకన్నా, గులక రాళ్ళకన్నా, పలుగురాళ్ళకన్నా ఎక్కువ.....గుండ్రాయంత రాయి, అనగా పెద్దనోట్లకట్ట పోలీసు వెంకట స్వామి చేతిలో ఫస్ట్ కి ముందురోజే- అది ముఫైగావచ్చు, ముఫైఒకటో తారీకు  కావచ్చు ఆ రోజు పెడుతుంది. అయా రోజు  పోలీసు వెంకటస్వామికి పండుగ. ఆ డబ్బు తీసుకెళ్ళి - ముందుగా ఓ నోటు ఏడుకొండల వాడి పటం ముందున్న హుండీలో వేసి, ఆపై అంతా పెళ్ళాం చేతిలో పెడతాడు.
    పోలీసు వెంకటస్వామి చేసే పనికూడా ఏమంత కష్టమైంది కాదు. " ఈ రోజు రెయిడ్ జరుగుతున్నది." "ఈ వీధి వాళ్ళమీద మా వాళ్ళకి అనుమానం  వచ్చింది." "కొత్తగా ట్రాన్స్ పర్  అయి  వచ్చిన ఇన్స్  పెక్టర్ ఉత్త పనికి మాలినవాడు. న్యాయంగా పోవాలని ఊరికే అఘోరిస్తాడు. అందరినీ  పట్టుకోటమే! వాడసలే మంచాడు కాదు, జాగ్రత్త!" ఇలా సతీ అనసూయకి వార్తలు చేరవేయటమే పోలీసు వెంకటస్వామి పని. ఈ కాస్త పనికే సతీ అనసూయ పెద్దమొత్తం ఇస్తున్నది.
    సతీ అనసూయ దృష్టిలో పోలీసు వెంకటస్వామి విశ్వాసం గల జాగిలం.
    పోలీసు వెంకటస్వామి దృష్టిలో సతీఅనసూయ సాక్షాత్తులక్ష్మీదేవి.
    సతీఅనసూయ మేడ దిగి క్రిందికొచ్చి "అదేంటి వెంకటస్వామీ, నుంచునే వున్నావ్? కాళ్లు పీక్కుపోవటం లేదూ? కూర్చోటానికి కూడా నా ఆజ్ఞ కావాలా? నువ్వు నా వాడివి! కూర్చో, కూర్చో......"అంది. పిలీసు వెంకటస్వామి కూర్చున్నాడు.
    "ఏంటీ సంగతి?" అంది సతీఅనసూయ.
    "పనిబడి వచ్చాను." అన్నాడు పోలీసు వెంకటస్వామి.
    "పనేంటి? మీఆవిడ పట్టుచీర కావాలంటున్నదా? డబ్బేమైనా కావాలా?"
    "ఉహూ.....!ఉహూ!......."
    "ఏంటా ఉహుహూలు? చలిజ్వరం వచ్చినవాడిలా? పిల్ల కావాలేంటి?"
    "ఛా...ఛా...నేఅలాంటివాడిని కాదు."
    "అలాంటివాడివి కాకపోతే ఛాఛా అనాలేంటి? సిగ్గుపడబోకు. పెళ్ళాంచచ్చి ఆరునెలలుకాలేదు. పదహారేళ్ళమ్మాయిని పెళ్లిచేసుకోలా? ఎందుకు? అవసరం. డబ్బెందుకు? అవసరం ఇదీ అట్టాగేఅనుకో? పాపం అని  భయపడుతున్నావా?"
    "పాపమా! గీపమా! నాకెందుకు పెళ్లాంవుందిగా అవసరం తీరిపోతున్నది."
    "అవుననుకో, వెరైటీరుచి అంటారు. అదివద్దేమిటి? నీదగ్గర డబ్బు పుచ్చుకోనులే."
    "ఛా.....ఛా.....నువ్వసలు డబ్బుమనిషివికాదు. నాకు తెలియదేమిటీ? నేను ఇప్పుడొచ్చింది నాకోసంకాదు. ఇన్ స్పెక్టరుగారి పనిమీద." అప్పటికి అసలు విషయం చెప్పాడు పోలీసు వెంకటస్వామి.
    సతీఅనసూయగుండె వేగంగా కొట్టుకోడం మొదలుపెట్టింది.
    "ఇన్ స్పెక్టరుగారి పనిమీదనా? అంటే?"
    "ఇన్ స్పెక్టరుగారికి అమ్మాయి కావలసివచ్చింది."
    సతీఅనసూయకి అర్థంకాలేదు, అనుమానం వచ్చింది.
    "ఇప్పుడొచ్చిన కొత్త ఇన్ స్పెక్టర్ కొరగానికొయ్య. లక్షరూపాయల లంచం ఇస్తానన్నా ముట్టుకోడు. ఊర్వశిని తీసుకెళ్ళి "లేలేలే" పాట డాన్స్ తో పాడించినా చలించడు. వెంటనే  అందమైన  ఆడదే, అని జాలి లేకుండా బొక్కలోతోస్తాడు. ఆడదానికీ ఏమాత్రం అన్యాయంజరిగినా చూస్తూఊరుకోడు. వాళ్ళనెత్తురు కళ్ల చూస్తాడు. ఆయనొచ్చింతరువాత సగంమంది ఊరుఖాళీచేశారు. సగంమంది కంపెనీలే ఎత్తేశారు. అలాంటాయనకి అమ్మాయి కావల్సివచ్సిందంటే నమ్మదగ్గమాటేనా? ఎర్రటోపీ వాడికి వెయ్యికళ్ళన్నట్లు. రాత్రి అమ్మాయిలను వెతికిపట్టటానికి ఇదోఎత్తు ఎత్తాడేమో? ఈ పోలీసువెంకటస్వామికి తెలిసిచావలేదా?"
    "ఏంటి వెంకటస్వామీ! కొత్తగావచ్చిన ఇన్ స్పెక్టరుగారు శ్రీరామ చంద్రుడిలాంటివాడుకదా? ఆయనకీ పిల్లెందుకు?" అంది సతీఅనసూయ.
    "అయనకికాదు. ఇప్పుడాయన పేరెత్తకు. నాకసలే మండిపోతుంది. శ్రీరామచంద్రుడిని, సత్యహరిశ్చంద్రుడి, చంపిపుట్టాడు. ఎంతసేపు న్యాయం, ధర్మం ఇదేపాట. ఉత్తకర్కోటకుడు. ఊళ్ళో ఎవరేంతప్పు చేసినా, ఎక్కడ గలాటాఅయినా తప్పు ముందుమంది. మనం స్ట్రిక్టుగా వుంటే నేరం జరగదంటాడు. పిర్రమీదకొడితే మూతిపళ్లు రాలాయట. అలా ఊళ్ళోజరిగేదానికి మనమేంచేస్తాం అంటే  వినడు."
    "సరేలే ఆయనగోల ఇప్పుడెందుకుగాని, నీవొచ్చినపని వివరంగా చెప్పు. ఈ ఇన్ స్పెక్టర్ ఎవరు? ఏంటీకథ?
    "ఈ ఇన్ స్పెక్టర్ పేరు లవంగరాజు."
    "లవంగరాజు! అదేంపేరు కారాకిళ్ళీలాగా?"
    "వినకుండా అడ్డంతగులుతావేమిటి? లవంగరాజు అసలు పేరు ధర్మరాజు. లవంగరాజని ఎవరో పేరుపెట్టారు. అదలా నిలిచిపోయింది.
    లవంగరాజుకి బుడ్డికావాలి, కార్డ్స్ కావాలి, కాంతలు కావాలి. లంచాలుకూడా ఘనంగాయిస్తే నే పుచ్చుకుంటాడు. ఇదీమధ్య బైట పడింది. డ్యూటీలో కష్టపడిపోతున్నావు రిటైర్ కా అని సర్వీసుమధ్యలోనే గెంటేశారు. సంపాదించిన డబ్బు పడిమూల్గుతున్నది. ఏంచేస్తాడు? హాయిగా అనుభవిస్తున్నాడు.
    నిన్నరాత్రి ఈవూరు వచ్చాడు. పిల్లకావాలిట. లవంగానికి నాకు పాతపరిచయంవుంది. నాకు కబురుచేసి చెప్పాడు. ఇప్పుడు  వాడు ఉద్యోగంలో లేడుకాబట్టి మనం ఫ్రీగా అమ్మాయిని తోలక్కరలేదు. ముందే చెప్పిపెట్టాను. "ఇప్పుడొచ్చిన పెద్దినిస్పెక్టరు మాలావుగట్టోడు. ఎక్కడన్యాయంవుంటే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళపుచ్చ లేపుతున్నాడు. రెయిడ్ చేసి అందరినీ పట్టేశాడు. నాకు తెలిసినావిడ పెద్దింట్లో కొద్దిమంది పిల్లలతో చాటుగావుంది. అదింకా వాడికళ్ళల్లో పడలేదు, పడదుకూడాను. కాని.....డబ్బాస ఎక్కువ. మీఇష్టం." అన్నాను. "డబ్బెంత?" అన్నాడు. "ఆ.....పిల్లకి ఒకరాత్రికి ఐదొందలు పుచ్చుకుంటుంది. ఓకే!" అన్నాను. వెంటనే డబ్బుతీసి ఇచ్చాడు. ఎంతా అని ఆడగావేమిటి? ఐదొందలుకాదు. ఆ....రొందలు." పోలీసువెంకటస్వామి నోరంతా తెరిచి 'ఆ.....రొందలని చెప్పాడు.
    "నువ్వెంతపుచ్చుకున్నావు?" సతీఅనసూయ అడిగింది.
    "నాబొంద. నాకెంతుంటుంది. నువ్వంటే పిల్లనిస్తావాయె."
    "దొంగనాకొడుకులు ఎలా నిజంచెప్పరో? పోలీసోడివి. నువ్వూ నిజంచెప్పవు. అద్సరే, ఎలాంటిపిల్ల కావాలట? పద్నాలుగేళ్ళదా? పద్దెనిమిదేళ్ళదా! పాతికేళ్లదా? ఆపైదా?"
    "పద్థానుగేళ్ళ పిల్లకి ఏముంటుంది నాబొంద. పాతికేళ్ల సర్వీసు ముసలిసర్వీసు. పదహరుపైన ఇరవైలోపు పిల్లకావాలట. ఆపిల్ల ఈపానికి కొత్తదై వుండాలట. ఎదురుతిరిగి కరిచి, రక్కి, తిట్టిపోసేరకమే కావాలట. ఓపట్టాన లొంగకూడదట. ఇదేంసరసమో ఏమిటో? దీనిలో ఏం మజావుందో ఏమిటో? కుస్తీపట్టి లొంగదీసుకోవాలట, ఏంటో? దీనిలో ఏం మజావుందో ఏమిటో? కుస్తీపట్టి లొంగదీసుకోవాలటం, అది వద్దువద్దు అంటుంటే మాలావుహుషారుగా వుంటుందట. ఏంటో పిచ్చిబుద్ది, వెధవ కోరిక. అలాంటిపిల్ల ఎలాదొరుకుతుందోగాని.....నువ్వోపనిచెయ్యి, నీవద్ద నున్న పిల్లకి ఇలాఅని చెప్పిపంపు."
    సతీఅనసూయ కళ్ళముందు సీత ప్రత్యక్షమైంది. "చెప్పిపంపక్కరలేదు. అలాంటిపిల్లని నిన్ననే కొత్తగా పట్టాను అది చచ్చినాలొంగటంలేదు. పోలీసోడైతేగాని దానిపని పట్టడు. కానియ్. ఆడబ్బిలా ఇవ్వు." అంది.
    "నిజంగా అలాటిపిల్ల వుందంటావా?"
    "నీ ఎర్రటోపీ అనుమానం తగలెయ్య. ముందాడబ్బియ్యి."
    నోరుమూసుకుని ఆరు  వందకాగితాలు సతీఅనసూయ చేతిలో పెట్టాడు పోలీసువెంకటస్వామి.
    "ఆయన బంగ్లాలో వున్నారు. పిల్లని అక్కడికే పంపాలట. ఇలాటిచోట్లకి ఆయనరారు."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra