నీలవేణి వెక్కుతూ అంది "నేను రావచ్చా మళ్ళీ ఈ ఇంటికి?"
    "అదేంటి వేణీ! ఎవరు రావద్దంటారు నిన్ను? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. రావాలి కూడా."
    నీలవేణి కి ఆ మాటలు గుండెల మీద పన్నీరు చిలికినట్టు అనిపించాయి. హాయిగా నిట్టూర్చింది.
    "పద కిందికెళదాం. నిన్ను తయారుచేస్తాను రిసెప్షన్ కి" అంది మాధవి.
    "వస్తాను. మొహం కడుక్కుని వస్తాను" అంది నీలవేణి.
    "సరే, నేను వెళ్తాను. వచ్చెయ్" అంటూ మాధవి కిందికెళ్ళిపోయింది.
    నీలవేణి మొహం కడుక్కుని జడవేసుకుని తయారై కిందికి వచ్చింది.
    నెమలికంఠం రంగు పట్టుచీర ఇచ్చి "వెళ్ళి ఇది కట్టుకురా! కల్యాణం బొట్టు పెడతాను" అంది మాధవి.
    నీలవేణి మౌనంగా ఆ చీర అందుకుని తిరిగి పైకి వెళ్ళి చీర కట్టుకుని వచ్చింది.
    మాధవి, తాయారమ్మ బొమ్మలా వచ్చి ఎదురుగా నిలబడ్డ నీలవేణిని ముగ్ధులైనట్టుగా చూడసాగారు. 'ఎంత బాగుంది ఈ అమ్మాయి, ఈమెకి పరాయి సంబంధం చూసి పొరపాటు చేశామా? అనవసరంగా ఈమెని ఈ ఇంటినుంచి పంపిస్తున్నామా? కులగోత్రాల గురించి పక్కన పెడితే వేణుకి ఇంతకన్నా మంచి అమ్మాయి లభిస్తుందా? అయ్యో! ఎంత పొరపాటు జరిగింది.'
    "అమ్మగారూ! దీవించండి" నీలవేణి పాదాలు తాకడంతో ఉలిక్కిపడిన తాయారమ్మ మనసులోనే చెంపలు వాయించుకుంటూ "దీర్ఘసుమంగళీభవ" అంటూ దీవించింది.
    ఆవిడ అలా అనగానే నీలవేణి బావురుమంది.
    "అమ్మగారూ నేనేదన్నా తప్పు చేస్తే క్షమించండి."
    "అదేంటే నువ్వేం తప్పు చేశావు? పిచ్చిదానా! లే ఏడవకు. ఆడపిల్లలన్నాక అత్తగారింటికి వెళ్ళక తప్పదు. ఏడవకు" అంటూ ఓదార్చబోయినా ఆవిడక్కూడా దుఃఖం ఆగలేదు. 'ఏ జన్మబంధమో ఎంత సేవ చేసింది ఈ పిల్ల!' అనుకుంది. 
    మాధవి కూడా దుఃఖంతో మూగబోయిన స్వరంతో ఏం మాట్లాడలేక నీలవేణిని దగ్గరకు తీసుకుని ఆమె వీపు మీద ఓదార్పుగా రాస్తూ బలవంతంగా గొంతు పెకిలించుకుని అంది, "ఏడవకు... అతిథులు వస్తున్నారు బాగుండదు."
    నీలవేణి బలవంతంగా తనను తాను నిగ్రహించుకుని అక్కడే ఉన్న టవల్ తో మొహం తుడుచుకుంది.
    "మరోసారి మొహం కడుక్కురా! తయారుచేస్తాను" అంది మాధవి.
    నీలవేణి లోపలికి వెళ్ళింది.
    రిసెప్షన్ కి వేణు తనకి ముఖ్యమైన కొలీగ్స్ ని, స్నేహితులని పిలిచాడు. శ్రావణకుమార్ తరఫున పాతికమంది వచ్చారు. అంతా కలిపి యాభైమంది.
    లాన్ లో ఓ పక్కగా ఏర్పాటు చేసిన టెంట్ మధ్యలో కుర్చీలు, మూలగా వేసిన డయాస్, దాని మీద నూతన వధూవరులు.
    సరదాగా, ఉత్సాహంగా పూర్తి అయింది రిసెప్షన్.
    మర్నాడు కన్నీటి వీడ్కోలు తీసుకుని భర్త, అత్తగారు, మావగార్లతో నీలవేణి వెళ్ళిపోతుంటే రిత్విక్ బావురుమన్నాడు. అప్పటిదాకా "నీలవేణి పెళ్ళి, నీలవేణి పెళ్ళి" అంటూ గంతులేస్తూ తిరిగిన రిత్విక్ అకస్మాత్తుగా అలా ఏడవడంతో అందరూ కంగారుపడ్డారు. నీలవేణి అయితే కన్నీటి చెరువైంది. వాడిని దగ్గరకు తీసుకుని ఏడుస్తుంటే మాధవి బలవంతంగా వాళ్ళిద్దరినీ విడదీసి నీలవేణిని పంపించి రిత్విక్ ని దగ్గరకు తీసుకుని, నీలవేణి అలా ఎందుకు వెళ్ళిందో చెబుతూ వాడిని నిద్రపుచ్చింది.

                                                                        * * * * *

    అర్చనకి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది.
    అర్చన కల నెరవేరింది. అర్చన.....ఐ.ఏ.యస్.
    "వావ్..సాధించాను... సాధించాను."
    గట్టిగా అరవాలనిపించింది. ఆ అరుపు ఎంత దూరంలో ఉన్నారో తెలియని అమ్మా, నాన్నలకి అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్యకి వినబడేలా గట్టిగా అరవాలి.
    "నేను కలెక్టర్ ని.... అర్చన కలెక్టర్."
    మళ్ళీ చాలా కాలానికి విశాఖపట్నం వెళ్ళాలి.
    ఆనందం చిన్న కెరటంలా కదిలి నిలువెల్లా తాకినట్లైంది.
    తను పుట్టి పెరిగిన ఊరు, తనని అవమానాల పాలు చేసిన ఊరు, తనని తరిమేసిన ఊరు, తనకి మనోబలం ఇచ్చి జీవితంలో నిలబెట్టిన ఊరు. విశాఖపట్నానికీ తనకీ అవినాభావ సంబంధం ఉంది.
    అదే ఊరుకి తను కలెక్టర్ గా వెళ్తోంది.
    ఎంత గొప్ప అవకాశం. అక్కడ తను కలవాల్సినవాళ్ళు కొందరున్నారు. ముందుగా నళిని. తనకెంతో సాయం చేసి, మరెంతో మనోధైర్యం ఇచ్చిన నళిని.
    పాత డైరీలు వెతికి, నళిని అడ్రస్ కోసం చూసింది. కానీ, ఎక్కడా కనిపించలేదు.
    అక్కడినుంచి వచ్చాక కొత్తల్లో మాత్రం రెండో మూడో ఉత్తరాలు రాసింది తను. ఆ తరువాత నళిని సంగతే మర్చిపోయింది. అలా మర్చిపోడంలో అహంకారం కానీ, నిర్లక్ష్యం కానీ లేదు, పనుల వత్తిడి తప్ప ఒక్కోసారి తన భోజనం సంగతి కూడా మర్చిపోయింది.
    ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళి కలిస్తే నళిని ఎలా రియాక్ట్ అవుతుందో?
    అసలు తను వెళ్ళగలదా?
    నళిని అదే ఇంట్లో ఉందో, ఎక్కడ ఉందో?
    ఆవిడ తనకి ఆశ్రయం ఇచ్చి ఆదిరించిన తల్లి. ఆవిడ పేరు... ఆవిడ పేరు... ఏం పేరు గుర్తురావడం లేదు. ఇల్లు గుర్తుందిగా! ఆవిడ ఆ రోజు తనని సాగనంపుతూ అంది కూడా "కలెక్టర్ కాబోతున్నావు. మమ్మల్ని మర్చిపోతావా?" అని మర్చిపోలేదని అవిడకి కనిపించి చెప్పాలి. కరెక్ట్, ఆవిడ పేరు పూర్ణమ్మగారు. మాట పెడసరంగా ఉన్నా మనసెంతో మంచిది.
    అర్చన ఆలోచిస్తుండగానే ఫేర్ వెల్ పార్టీలు, మళ్ళీ పుష్పగుచ్చాలు, స్వీట్లు, అభినందనల పరంపరలు మొదలైనాయి.
    అక్షయ్ నుంచి బొకే వచ్చింది "కంగ్రాట్స్" అంటూ.
    అది చాలా అపురూపంగా దాచుకుంది అర్చన.
    ఖమ్మం జిల్లా కలెక్టర్ తనకెంతో సన్నిహితంగా వచ్చిన స్నేహమయి కలెక్టర్ హరిణిని కలిసింది.
    ఆమె చాలాసేపు అర్చనకి కలెక్టర్ గా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలో, ఎలాంటి ఒత్తిళ్ళు వస్తాయో అన్నీ విపులంగా చెప్పింది. చివరికి "ఏం జరిగినా మీరు మాత్రం చలించకండి. మనం ఎంత గంభీరంగా ఉంటే ఎదుటివాళ్ళు అంత భయపడతారు. మీఉర్ భయపడినట్టు వాళ్ళు  గుర్తించారంటే చెవులకి తాటాకులు కడతారు బి కేర్ ఫుల్. ఆల్ ద బెస్ట్" అంటూ అభినందించింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra