అర్చన నెత్తిమీద నిప్పుల వాన కురిపించి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది.
    అర్చన కళ్ళముందు తన పరువు, ప్రతిష్ఠ తగలబడుతున్నట్టు, తననెవరో ఆ మంటల్లోకి తోసేస్తున్నట్టుగా కంపించిపోయింది.
    సుడిగాలిలా వచ్చి ప్రళయం సృష్టించి వెళ్ళిపోతూ ఆమె అన్న మాటలు అర్చన గుండెల్లో గునపాల్లా దిగబడసాగాయి.    
    చదువూ సంధ్యాలేని పల్లెటూరి మొద్దులా తను భావించిన అమ్మాయా ఇన్ని మాటలు మాట్లాడగలదా? ఇంత నిర్మొహమాటంగా జీవితాన్ని, జీవితపు కృత్రిమ విలువలనీ కాచి వడపోసినదానిలా, ఖచ్చితంగా, నిస్సిగ్గుగా....ఇప్పుడర్దమైంది ఆమెకి ఎందుకు ఆడవాళ్ళ  జీవితలిలా బానిసత్వం నుంచి మారడం లేదో బాగా అర్ధమైనట్టు అనిపించింది.
    ఎంతధైర్యం ఆ అమ్మాయికి? ఎంత పొగరు? ఏమంటోంది? తనకీ..... ఛీ ఛీ ఎంత నికృష్టపు మాట అంది.
    అక్షయ్ కుమార్...
    తనకీ, అతనికీ నొ...నొ.. దేవుడా ఏమిటీ అపనింద? నిజమేనా? ఆ అమ్మాయి అన్నమాట నిజమేనా? తనతో నమ్రతగా, అణకువగా ఉంటూ వెనకనుంచి తన గురించి ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఈ అభాండాలు వేసేది. ఎవరు ఈ పుకార్లు లేవదీసేది? ఎవరు తనని ఇంత చులకనగా కామెంట్ చేసేది? ఎవరు? తహసీల్దారా? రెవెన్యూ ఇన్ స్పెక్ట్రరా? ప్రస్తుతం వాళ్లిద్దరే తన శత్రువులు. లేక లేక నాగరాజా? తనమీద పగ ఇలా తీర్చుకుంటున్నాడా? నీచుడు, తుచ్చుడు.
    అర్చనకి ఆ క్షణంలోనే అలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని, వాళ్ళమీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అనిపించింది.
    అప్పుడు సమయం రాత్రి ఎనిమిదింపావు.
    ఇప్పుడు ఎవరు దొరుకుతారు? అందరూ వారి వారి కుటుంబాలతో హాయిగా ఉంటారు.
    తను ఫోన్ చేసి ఎవరిలా అన్నారట అంటే ఏం సమాధానం చెప్తారు?    
    అర్చనకి ఏడుపొచ్చింది.
    
                * * * * *

    నీలవేణికి సంబంధం కుదిరింది. తాంబూలాలు పుచ్చుకోడానికి ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి.
    మాధవికి ఆ విషయం కబురు చేసి వెంటనే రమ్మని చెప్పమంది వేణుతో తాయారమ్మ. మాధవి అదే రోజు మధ్యాహ్నానికల్లా వచ్చేసింది. వస్తూనే నీలవేణిని సంతోషంగా కౌగలించుకుని అభినందించింది. "కంగ్రాచ్యులేషన్స్ నీలవేణీ!" అంటూ.
    "వచ్చావా మాధవీ! పెళ్ళిచూపులు అనుకోకుండా ఏర్పాటు చేశాడు వేణు. నీకు కబురు చేసే సమయం కూడా దక్కలేదు. అమ్మాయి అదృష్టవంతురాలు. మంచి సంబంధం దొరికింది. ఇక ఆ పిల్ల పెళ్ళి చేసి అత్తారింటికి పంపించేదాకా నీదే బాధ్యత" అంది తాయారమ్మ మనస్ఫూర్తిగా మాధవిని ఆహ్వానిస్తూ.
    "అలాగే పిన్నిగారూ! అంతా నేను చూసుకుంటాగా" అంటూ నీలవేణితో అంది "నువ్విప్పటినుంచీ నేను చెప్పినట్టు వినాలి. "నీలవేణి నవ్వింది.
    బాగా కొబ్బరి నూనె రాసుకుని బిగించి వేసుకున్న జడ చూస్తూ నవ్వుతూ అడిగింది మాధవి "పెళ్ళిచూపులకి ఇలాగే కూర్చున్నావా?"
    లేదన్నట్టు తల ఊపింది నీలవేణి. నెమ్మదిగా అంది "వాళ్ళు శుక్రవారం వచ్చారు."
    "ఓ... శుక్రవారం అని తలంతుకున్నావా? పోనీలే బతికిపోయారు. ఇంత నూనె రాసుకుంటేగానీ నీ జుట్టు నిలవదా? చూడు మొహం నిండా జిడ్డుగా ఎలా కారుతోందో?" చెంపలమీదికి అంటిన జిడ్డు వేలితో రాసి చూపిస్తూ అంది మాధవి.
    నీలవేణి మాట్లాడలేదు. "ఉండండి మీకు కాఫీ తెస్తాను" అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది.
    మాధవి తాయారమ్మ దగ్గర కూర్చుని "చెప్పండి పిన్నిగారూ! నీలవేణికి చీరలు కొనడానికి షాపింగ్ కి ఎప్పుడు వెడదాం? తాంబూలాల రోజు ఎంతమందికి వంట చేయాలి?" అని వివరాలన్నీ అడిగి తెలుసుకుంది.
    ఆవిడ చెపుతున్నవన్నీ జాగ్రత్తగా వింటూ ఎంతో ఆనందించింది మాధవి.
    "మీరేం బెంగపెట్టుకోకండి. ఆ పిల్ల పెళ్ళి చేసి పంపించిందాకా నేను మీతోటే ఉంటాను సరేనా?' అంది.
    "నాకు  తెలుసు తల్లీ! నువ్వు ఉంటే నాకు పదిమంది పెట్టు. నిశ్చింతగా ఉంటాను" అందావిడ.
    నీలవేణి సన్నగా నిట్టూర్చింది వాళ్ళ మాటలకి.
    ఆ తరువాత నుంచీ మాధవి ప్రతిరోజూ కౌశిక్ నీ, చక్రవర్తినీ పంపించేశాక బయల్దేరి తాయారమ్మ దగ్గరకు వచ్చేసి పెళ్ళి పనులు ఏమున్నాయో చూసుకోడం, ఏం కావాలో లిస్టు రాసివ్వడం వగైరా పనులన్నీ చేయసాగింది.
    తాంబూలలు మర్నాడనగా మాధవి, నీలవేణి షాపింగ్ కి వెళ్ళారు. అనుటెక్స్ కి తీసుకెళ్ళింది మాధవి.
    అప్పుడప్పుడూ అలవాటుగా తాయారమ్మకి చీరలిచ్చే మూటలవాడి దగ్గర ఒకటి, రెండూ చీరలు కొనివ్వడం తప్ప ఏనాడూ బైటకి వెళ్ళి చీరలు కొనుక్కున్నది లేదు. అలాంటిది ఇవాళ అంత పెద్ద షోరూములోకి అడుగుపెడుతుంటే నీలవేణికి ముందు కాళ్ళు వణికాయి. తరువాత కళ్ళు విశాలం చేసుకుని ఆశ్చర్యంగా చూసింది అద్దాల్లో ఉన్న చీరలన్నీ ఎంత బాగున్నాయి చీరలు! ఇన్ని రకాల చీరలుంటాయా అనుకుంది.
    మాధవి పట్టుచీర కౌంటర్ దగ్గరకు వెళ్ళి చీరలు చూపించమంది.
    ఎంతో మర్యాదగా, అణకువగా చీరలు తీసి చూపిస్తుంటే ఆ కుర్రాడు బాగా తెలిసినవాడు కాబోలనుకుంది.
    "మీకితను తెలుసా?" అడిగింది నెమ్మదిగా.
    "లేదే ఏం?" ఆశ్చర్యంగా అడిగింది మాధవి.
    "ఏం లేదు. ఇన్ని చీరలు ఇంత ఓపిగ్గా చూపిస్తుంటేనూ!"
    ఫక్కున నవ్వింది మాధవి. "మనం కొనడానికి వచ్చాం కదా! మంచిది సెలెక్ట్ చేసుకోవాలంటే అతను చూపించి తీరాలి. అది అతని డ్యూటీ."
    నీలవేణి తన తెలివితక్కువకి సిగ్గుపడ్డది.
    "చెప్పు. ఏ చీర బాగుంది? రేపొక చీర కట్టుకోవాలి నువ్వు. పెళ్ళికి రెండు పట్టుచీరలు. రెండు ఫ్యాన్సీ చీరలు కొనమన్నారు. నీకేది నచ్చిందో చెబితే అవి తీసి పక్కన పెట్టించి వాటిలో ఇంకా బాగున్నది సెలక్ట్ చేద్దాం. ఇదిగో ఈ నీలం చీర చూడు. పసుపు పచ్చ బార్డర్ మంచి కలర్ కాంబినేషన్" అంటూ ఒక్కోచీర చూపిస్తూ నీలవేణి మొహంలో భావాల కోసం చూడసాగింది మాధవి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra