"ఏంటే, అతణ్ణి చూసి మనసు పారేసుకున్నావా?" సరదాగా నవ్వింది అమల. అర్చన మొహం ఎర్రబడింది.
    "ఏంటి అదంతా సిగ్గే! ఏంటే బాబూ! అంత నచ్చాడా అతను. నేను సరిగా చూడలేదు. పద వెనక్కి ఓసారి పరిశీలనగా చూసి, పేరు, ఊరు వివరాలు తెలుసుకుందాం."
    "ఇంకా నయం. చాల్లే తెలివి పద పోదాం" అర్చన పార్క్ చేసిన తన బండివైపు నడిచింది.
    దారి పొడుగునా, ఇంటికి వెళ్ళాక కూడా అనుక్షణం అతనే గుర్తుకొస్తూ అర్చనకి మనశ్శాంతి కరువైంది.
    అతన్నెక్కడో చూసినట్టుంది. ఎవరతను? బాబోయ్! ఎంత పదునైన చూపులు? సూటిగా గుండెల్లోకి దూసుకెళ్ళి అలజడి రేపాయి. ఎన్నడూ లేని అనుభూతులేవో ఈనాడూ గుండెల్లో సందడి చేస్తున్నాయి. పదే పదే అతణ్ణి చూడాలనిపిస్తోంది.
    ఎక్కడో చూసింది. చాలా పరిచితంగా, ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నాడు.
    ఎంత బాగుంది అతని నవ్వు? మన్మధబాణంలా మరులు రేపుతూ మగవాడి స్పర్శ చూపులతో తగిలినా భరించలేకపోయే తను ఇవాళ అతని చూపుల జల్లుల్లో ఇంతలా తడిసిందేంటి? ఎందుకీ కలవరం? ఏమిటీ పులకరం?
    "ఏంటమ్మా! అన్నం సరిగా తినడం లేదేం?" సావిత్రి పశ్నకి "ఆకలి లేదమ్మా..." అంటూ చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయింది అర్చన. మంచం మీద వాలగానే హఠాత్తుగా గుర్తొచ్చింది. అతనే ఇతను, ఇతను అతనే. నిత్యం తనని వెంటాడే కలలోని రాజకుమారుడు. అవును అదే నవ్వు. అదే చూపు. అంటే ఇతను...
    అమ్మో మరి ఆ రాక్షసుడు ఎవరు? తామిద్దరూ ఏకమయే సమయంలో తన చేయి విరగ్గొట్టినవాడు. ఇవాళ మళ్ళీ ఆ కల వస్తే తెలిసిపోతుంది. 'అమ్మో మళ్ళీ కలా?" వణికిపోయింది అర్చన.
    ఆ రాత్రి అవే ఆలోచనలతో ఆమెకి శివరాత్రి అయింది.
    ఆ తరువాత మళ్ళీ అతను ఒక సినిమా థియేటర్ లో కలిశాడు. సినిమాకి వెళ్ళారు అమలా, అర్చనా. ఇంటర్వెల్ లో కాఫీ తాగడానికి వెడితే అక్కడ జనం మధ్య అతను. అవే చూపులు. అవే కళ్ళు. అదే నవ్వు.
    ఆ తరువాత సినిమా చూడలేకపోయింది. మధ్యలో వెళ్ళిపోదామనుకుని కూడా చివరిదాకా ఉంటే మళ్ళీ ఓసారి అతను కనిపిస్తాడన్న ఆశతో ఉండిపోయింది. కానీ, అతను కనిపించలేదు.
    అర్చన మూడ్ మారిపోడం చూసి అడిగింది అమల "ఏమైందే సడన్ గా?"
    అర్చన చెప్పాలనుకుంది. కానీ, పెదవి దాటి మాట పెగల్లేదు. "ఏం లేదు. ఏంటో డల్ గా ఉంది" అంది.
    అలా నాలుగైదు సార్లు అతను కనిపించాడు. ప్రతిసారీ అర్చన మనసులో అలజడి రేపుతూ మాయమైపోతున్నాడు. ఒక్కసారి అతనితో మాట్లాడాలి అనుకుంది. కనీసం అతనన్నా ఒక్కసారి పలకరించవచ్చుగా. తను ఆడపిల్ల. తనకి సిగ్గు, మొహమాటం. కానీ, అతనికేం? మగాడు మాట్లాడచ్చుగా. పరిచయం అయితే, తన కల గురించి చెప్పి, నా కల్లో కనిపించే రాజకుమారుడివి నువ్వే అని చెప్పచ్చు. ఆ కలకి అర్ధం ఏమిటో అతన్నే అడగచ్చు.
    ప్రతిసారి జనం మధ్యలో కలవడం, తిరిగి చూసేలోగా మాయమవడం.
    ప్రశాంతంగా ఉన్న అర్చన మనసు కల్లోల సముద్రం అయింది.
    ప్రణయ జ్వాలలు రేగిన దండకారణ్యంలా, వలపు ప్రభంజనంలా శాంతినీ, ప్రశాంతినీ భగ్నం చేస్తూ, అలజడినీ, అశాంతినీ ఆహ్వానిస్తూ.
    ప్రేమ గురించే ఆలోచించని ఆమె మనసులో ప్రేమ ఓ వాయుతరంగంలా ప్రవేశించింది. ఇప్పుడెందుకో ఆమె కంటికి అంతా అందంగా, అందరూ మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు. అతనెవరో తెలుసుకోవాలి. అతనితో స్నేహం చేయాలి. కబుర్లు చెప్పాలి. తన కలలన్నీ చెప్పాలి. ఆశయాలు చెప్పాలి. ఆశలు చెప్పాలి. కలుసుకోవాలి. పేరైనా అడగలేదు. ఊరైనా అడగలేదు. మనసేమో అతన్ని విడిచి మరలిరాదాయే. పెదాల మీద పాత ప్రేమపాట లిపి దిద్దింది.
    అర్చన కోరుకున్నట్టు అతడిని కలుసుకోలేదు. కాలం విషసర్పమై బుసకొట్టకపోయి ఉంటే కలుసుకునేదేమో! కానీ అర్చన వెక్కిళ్ళు అణచుకోడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. రైలు శబ్దంలో కలిసిపోయి పైకి రాలేక గుండెల్లో మెలి చుట్టుకుని గింగరాలు తిరుగుతోంటే అలాగే బెర్తుమీదకి వాలిపోయింది.
    వేణుతో కలిసి హైదరాబాదులో మల్కాజిగిరిలో ఒక ఇండిపెండెంట్ పోర్షన్ లో అర్చన కొత్త జీవితం ప్రారంభమైంది. వేణు హైదరాబాదు వచ్చిన నెలకే చక్రవర్తి ఇన్ ఫ్లుయన్స్ చేసి వరంగల్ నుంచి హైదరాబాదు వచ్చేశాడు. అప్పటికే అతనికి మాధవితో వివాహం అయింది. మాధవి స్నేహం అర్చనకి కొంచెం ఊరటనీ, ఆనందాన్ని కలగచేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కూడా మల్కాజ్ గిరిలోనే ముందు అద్దెకి, మరో రెండు నెలల్లోనే స్వంత అపార్ట్ మెంట్ కి మారిపోయినా అర్చనకీ, వేణుకీ మాత్రం దగ్గరగానే ఉన్నారు.
    వేణు అర్చన చేత ఉస్మానియా యూనివర్శిటీ లో పిజికి అప్లై చేయించేలోగా మాధవి సరదాకి పనిచేస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీలోనే అర్చ్నకి కూడా సెక్రటరీ పోస్ట్ లభించడంతో ఆమె ఉద్యోగంలో చేరిపోయింది. అర్చన తఃన ఆశయం ప్రకారం చదువు కొనసాగించే ఆలోచన కొద్దికాలం వాయిదా వేసుకుంది. అందుకు తగినట్టుగా తాను మానసికంగా సిద్ధం కావాలి. రెండు, వేణు మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్ధికంగా ఆధారపడకూడదు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి చాలా గంధరగోళంగా ఉంది. హఠాత్తుగా సంభవించిన ప్రళయంలో సర్వస్వం కోల్పోయిన అభాగ్యురాలిలా సూన్యంలో నిలబడి దిక్కులు చూస్తున్నట్టు అనిపిస్తోంది. అందుకే తాత్కాలికంగా కొంత డైవర్షన్ ఉంటుందని మాధవి అడగగానే అంగీకారం తెలిపి వెళ్ళి జాయిన్ అయిపోయింది. అచ్న ఉద్యోగంలో చేరడం ఎంతమాత్రం తనకిష్టం లేకపోయినా ముందు ఆమె మానసికంగా సెటిల్ అవాలని వేణు కూడా వారించలేదు. తప్పకుండా అర్చన కొద్ది కాలంలోనే అన్నీ మరిచిపోయి తనతో అన్యోన్యంగా ఉంటుందని ఆశించాడు.
    కానీ, అతను ఆశించినట్టు అర్చన అంతా మర్చిపోయి భర్తగా అంగీకరించలేదు. నేలలు గడుస్తున్నా వేణుని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అడుగు కూడా ముందుకు వేయనీయలేదు. అతనికి ప్రతిరోజూ ఒక గండంలా అనిపిస్తోంది. సహనం నెమ్మదిగా నశించిపోతోంది. ఎంతకాలం ఇలా ఉంటుంది ఈమె? ఏ ఆడదానికైనా ఇంతకన్నా ఏం కావాలి? దారి తప్పబోతున్న జీవితాన్ని తను అందుకుని సరైన దారిలో నడిపిస్తున్నందుకు ఆమెకి కనీసం కృతజ్ఞత కూడా లేదు. ఏమిటి ఈమె ఉద్దేశం? అనేక ప్రశ్నలు అతని మనసులో సంఘర్షణ కలగచేస్తుంటే తన మనసులో భావాలు, తన ఆవేదన మధ్య మధ్యలో చెప్పీ చెప్పకుండా చక్రవర్తికి చెబుతూ కొద్దిగా మనసు తేలిక పరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
    కాలం గడుస్తూనే ఉంది. అర్చన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. వేణుతో పగలంతా సరదాగా ఉంటోంది. అందులో చక్రవర్తి, మాధవి కలిసిన రోజు ఆమె ఆనంధానికి అడ్డే ఉండదు. వేణు చాలాసార్లు సన్నిహితంగా రావడానికి, ఆమెని బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోడానికి ప్రయత్నించాడు. పక్కన వెళ్ళి పడుకోగానే పెద్ద తాచుపామును చూసినట్టు చూసి, దిండూ, దుప్పటీ తీసుకుని వెళ్ళిపోయి సోఫాలో పడుకుంటుంది. ఒకరోజు చాలా సీరియస్ అయాడు. "ఏంటి? నేనేం దెయ్యాన్నా, భూతాన్నా? ఎందుకలా దూరంగా ఉంటావు? నేను నీ భర్తను అర్చనా!" అన్నాడు కోపంగా.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra