"కానీ, అర్చనా..."
    "వేణూ! ప్లీజ్ లీవ్ మీ అలోన్."
    ఆమె స్వరంలోని శాసింపుకి వేణు ఏం మాట్లాడలేదు. సరే, అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ, ఆమెకి తెలియకుండా ఆమెని అనుసరించాడు.  అర్చన యూనివర్శిటీ వైపు కాకుండా పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళడం గమనించి, తాను కూడా అటే వెళ్ళాడు.
    అర్చన నేరుగా స్టేషన్ లోపలికి వెళ్ళి ఇన్ స్పెక్టర్ తో దెబ్బ్లలాడింది. నాగరాజుని ఎందుకు అరెస్ట్ చేయలేదని అతడిని బెదిరించింది. "అతను చాలా పవర్ ఫుల్ మేడమ్. అతని మీద యాక్షన్ తీసుకుంటే మా ఉద్యోగాలు ఊడతాయి. ప్లీజ్ జరిగింది మర్చిపోండి. కావాలంటే మీకు అతనినుంచి నష్టపరిహారం ఇప్పిస్తాం" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    అర్చన మండిపడింది. "డబ్బుతో అన్నీ కొనచ్చు అని భ్రమపడకండి. నాకు తెలుసు. అతనికి శిక్ష పడేలా ఏం చేయాలో, ఎలా చేయాలో?" అంటూ బైటికి వచ్చేసింది.
    అక్కడినుంచి యూనివర్శిటీకి వెళ్ళింది. వేణు మాత్రం నేరుగా తన రూముకి వెళ్ళిపోయాడు.
    చక్రవర్తి ఏవో అప్లికేషన్ లు రాస్తున్నాడు.
    "ఏంటిరా అవి?" అడిగాడు వేణు.
    "బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. నా పెళ్ళి మాధవితో సెటిల్ అయింది" అన్నాడు చక్రవర్తి.
    "బ్యాంక్ ఎగ్జామ్సా?"
    "అవును పెళ్ళి చేసుకుంటున్నాగా. ఉద్యోగం ఉండాలి కదా! పురుషలక్షణం" అంటూ నవ్వాడు.
    వేణు నవ్వలేదు. సీరియస్ గా అడిగాడు. "ఎప్పుడు ఎగ్జామ్స్?"
    రెండు నెలల్లో ఉంటాయి. "ఏం నువ్వూ రాస్తావా?" అడిగాడు చక్రవర్తి.
    వేణు చక్రవర్తి దగ్గరగా వచ్చి అప్లికేషన్ చూస్తూ "ఒక్కటే తెచ్చావా?" అడిగాడు.
    "లేదు. రెండు తెచ్చాను. ఫిలప్ చేయడంలో ఏదన్నా పొరపాటు జరిగితే ఇంకోటి ఉంటుంది కదా అని."
    "అయితే ఇది నాకిచ్చేయ్."
    "నీకెందుకురా?"
    "కావాలి. నేనూ రాస్తాను."
    "నీ తలకాయ. డోంట్ బీ సిల్లీ. నీకేం అవసరం ఇప్పుడు? చక్కగా చదువుకో. సివిల్స్ కి ప్రిపేర్ అవు."
    "నో చక్రవర్తీ! నేను కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాను."
    "ఎందుకురా? నీకెందుకు?"
    'ఎందుకంటే... నేను అర్చనని పెళ్ళిచేసుకుంటాను. అందుకు నాకు ఉద్యోగం కావాలి కదా!"
    "వాట్?" దిగ్ర్భాంతిగా చూశాడు చక్రవర్తి. "నీకేం మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు?"
    వేణు స్థిరంగా అన్నాడు. "నేను అర్చనని పెళ్ళిచేసుకుంటాను చక్రవర్తీ! తనకి చాలా ద్రోహం జరిగింది. అదే ఆలోచిస్తూ తను పిచ్చిదవుతోంది. ఆ సంఘటన మర్చిపోయి తను మామూలు మనిషవాలంటే తనని నేను అర్జెంటుగా పెళ్ళిచేసుకోవాలి అంతే!"
    "వేణూ! పిచ్చి ఆలోచనలు చేయకు. ఆవిడ కోసం నీ కెరియర్ పాడు చేసుకుంటావా? అయినా నీకిదేం పిచ్సిరా? నిన్ను జోకర్ లా భావిస్తుంది అర్చన. గడ్డిపోచ విలువివ్వదు. అలాంటిది ఆమె మీద నీకెందుకింత వ్యామోహం?"
    "వ్యామోహం కాదు చక్రవర్తీ! పిచ్చి ప్రేమ, వెర్రి ఏదైనా అను. నాకు ఆమె కావాలి. అంతే! ఇలా ఇవ్వు ఆ అప్లికేషన్. టేబుల్ మీద ఉన్న అప్లికేషన్ లాక్కున్నాడు.
    "వేణూ! నీ మీద మీ పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నార్రా. వాళ్ళ ఆశలు వమ్ము ఛేయడం ధర్మం కాదు. అది కూడా ఆఫ్ట్రాల్ ఒకమ్మాయి కోసం. నీకు తెలీదు వేణూ! అర్చన నిన్ను పెళ్ళిచేసుకోడానికి ఒప్పుకోదు. ఆడది తన వెంట పడే మగాడిని ఒక క్రీచర్ గా చూస్తుంది. అందులో నువ్వంటే మరీ చిన్నచూపు ఆమెకి. నువ్వంటే అటు ప్రేమా, ఇటు గౌరవం లేని ఆమెని పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనే కరెక్ట్ కాదు నా మాట విను."
    వేణు శాంతంగా చక్రవర్తి మొహంలోకి చూస్తూ అన్నాడు. "ఆమె నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. చక్రవర్తీ తెరిచి ఉన్న తలుపుల్లోంచి లోపలికి వెళ్ళడంలో థ్రిల్ లేదు. తలుపులు తెరుచుకుని వెళ్ళడంలోనే థ్రిల్ ఉంది. నేను తప్పకుండా అనుకున్నది సాధిస్తాను. ఇంక కెరియర్ అంటావా? ఒక ఐఏయస్ ఆఫీసర్, ఒక బ్యాంక్ ఆఫీసర్ జీతంలో పెద్ద తేడా ఉండదు. అయినా నా పర్సనాలిటీ ఐఏయస్ లకీ, ఐపీఎస్ లకీ సరిపోదులే. అర్చనని చదివిస్తాను."
    "వెర్రి కుదిరింది. రోకలి తలకి చుట్టమన్నాట్ట నీలాంటివాడే వెనకటికి."
    వేణు మాట్లాడలేదు. మౌనంగా అప్లికేషన్ ఫిలప్ చేయడం ప్రారంభించాడు.
    వేణు వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి.
    అర్చనకి పీజీలో సీటు రాలేదు. ఆమె గురించి యూనివర్శిటీలో కూడా చెడ్డగా ప్రచారం జరిగింది. దానికి కారణం చాలా మందికి తెలిసినా ఎవరూ నోరెత్తలేదు.
    వేణు చాలా బాధపడ్డాడు.
    వేణూ, చక్రవర్తీ బ్యాంక్ ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికీ పోస్టింగ్ వచ్చింది. వేణుకి హైదరాబాద్ లో, చక్రవర్తికి వరంగల్లులో.
    వేణు ఆనందానికి హద్దుల్లేవు. ఆ విషయం చెప్పి ఆనందరావు, సావిత్రిల అంగీకారం తీసుకోడానికి నిర్ణయించుకున్నాడు.
    గుడికి వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకుని అర్చన ఇంటివైపు వెళ్ళాడు.

                                                                                            * * * * *

    అర్చన బాగా చిక్కిపోయింది. తనకి ఎవరూ సపోర్ట్ గా నిలవకపోవడంతో ఆమె బాగా కృంగిపోయింది. ప్రాణస్నేహితురాళ్ళు అనుకున్నవాళ్ళు, తోబుట్టువు అందరూ వెలేసినట్టు చూస్తున్నారు. నాగరాజుని వలలో వేసుకుని ఆడుకుందని, అతని ఆస్తి మీద కన్నేసిందని, అది తెలిసిన నాగరాజు ఆమెని వదిలించుకునేందుకు చాలా తిప్పలు పడ్డాడనీ రకరకాలుగా అనుకోసాగారు. అర్చన ముందు ఆవేశంతో రగిలిపోయింది. తరువాత విరక్తిగా నవ్వుకుంది. ఆ తరువాత తీవ్రంగా ఒక స్థిరనిశ్చయానికి వచ్చింది. ముందు కొన్నాళ్ళు ఈ ఊరినుంచి దూరంగా వెళ్ళాలి. ఆ తరువాత భవిష్యత్తు నిర్ణయించుకుని మళ్ళీ వచ్చి తన ఆశయం నెరవేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగరాజుని వదిలేది లేదు. అలా అనుకున్నాక ఆమెకి కొంచెం శాంతిగా అనిపించింది. అర్చన ఆలోచిస్తూ ఉండగానే వేణు వచ్చాడు. ఈ మధ్య వేణు రాక కొంచెం బాగానే అనిపిస్తోంది. అందరూ వెలేసినా అతను మాత్రం తను అవమానించినా, వద్దన్నా ఏదో సాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే నిజాయితీ ఉన్న మనిషి అని అతని పైన ఒక మంచి అభిప్రాయం కలిగింది,

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra