మళ్ళీ తనను తానే మందలించుకుంది. ఎందుకేడవాలి? ఎవడో వాడి అహాన్ని సంతృప్తి పరుచుకోడానికి తనని కిడ్నాప్ చేసి నవ్వులపాలు చేసినందుకు వాడి మీద పగ తీర్చుకోవాలి. అదే తన స్వభావం. ఏడుస్తూ కూర్చోడానికి తాను ఒక మామూలు అమ్మాయి కాదు. కానీ, ఇదేంటి? అమ్మా, నాన్నా నన్నిలా చెరసాల పాలు చేశారు. ఎలా? ఎలా ఇక్కడినుంచి బైటపడాలి? వీళ్ళకి ఎలా నచ్చచెప్పాలి? తనకేం జరగలేదని, ఏం చేయలేక ఇలా పగ తీర్చుకున్నాడా వెధవ అని చెప్పి ఎలా ఒప్పించాలి?
    మాట మాట్లాడుతుండగానే, "తల్లీ! నీకు కోటి నమస్కారాలు. మమల్నిట్లా బతకనీ" అంటూ పెద్ద శబ్దంతో నమస్కారం పెడుతూ అమ్మ నోరే ఎత్తనివ్వడం లేదు. అర్చనకి పిచ్చెక్కిపోతోంది. ఏదన్నా జరగాలి. ఇంతకాలం తన నోట్స్ కోసం, తన స్నేహం కోసం నీడలా అంటిపెట్టుకు తిరిగిన నీలిమకి ఏమైంది? పక్కనే ఉంటూ కూడా ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు. "నీకేం కాలేదు అర్చనా! ధైర్యంగా ఉండు" అంటూ ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇదేనా స్నేహానికున్న విలువ? నీలిమ తండ్రి చాలా నారో మైండెడ్. నీలిమని తన ఇంటివైపు కూడా రానివ్వడం లేదేమో! అయితే దాని వ్యక్తిత్వం ఏమైంది? దానికి తెలియదా ఈ అర్చన సంగతి. ఆ నాగరాజుగాడి సంగతి కూడా తెలుసు. వాడి ప్రేమనుకాదన్నందుకేగా వాడు పగపట్టాడు. ఛీ అయినా ఆ నాగరాజుని ఏ అమ్మాయి అయినా ఎలా ప్రేమించగలదు? వాడికి చదువు లేదు, సంస్కారం అసలే లేదు. జులాయి. డబ్బుందని అహంకారం. సిగరెట్టు కంపుకొడుతూ వాడు నడిచి వస్తుంటే పెద్ద సిగరెట్ పాకెట్ నడిచి వస్తున్నట్టే అనిపించేది. పక్కనుంచి వెళుతుంటే సిగరెట్టు వాసన, మందు వాసన. వాడు కోరుకున్న ఆడపిల్ల వాడి ఒళ్ళో వాలాలి. అర్చన పళ్ళు పటపటలాడాయి. ఆడపిల్లంటే ఎంత చులకన? పోవాలి. ఈ చులకన భావం పోవాలి. ఆడదంటే ఏంటో, ఏం చేయగలదో నిరూపించాలి. అర్చనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. కానీ, కానీ ఎలా? ఇక్కడనుంచి బైటపడితే చాలు. కనీసం అమల కూడా ఇంటికి రావడం లేదు. ఎంత కఠినం వాళ్ళ మనసులు! ఎంతైనా తల్లితండ్రుల చాటు పిల్లలు. పోనీలే... నిట్టూర్చింది.

                                                                                                       * * * * *

    గేటు శబ్దం "నమస్కారమండీ" అనే స్వరం వినిపించి, అర్చన గదిలోంచి బైటికి వచ్చింది. హాల్లోంచి వాకిట్లోకి తొంగిచూసింది.
    "ఎవరు బాబూ నువ్వు?"
    "నే... నేను అర్చన క్లాస్ మేట్ ని."
    ఆనందరావు స్వరంలో ఆవేశం. "ఏం పని నీకు? ఎందుకొచ్చావు?"
    తడబడుతున్న స్వ్రరంతో వేణు "అదీ.... నేను.... అర్చన ఫస్ట్ క్లాసులో పాసైంది అని చెప్పి వెళ్దామని వచ్చాను."
    "ఓ అలాగా. మంచిది. థాంక్స్ చెప్పావుగా" గంభీరంగా అన్నాడాయన.
    "ఒక్కసారి తనని కలవవచ్చా?"
    అర్చన వేణుస్వరం గుర్తించింది. గుమ్మం దగ్గరకు వచ్చింది. వేణు వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమెని చూడగానే అతనికి ధైర్యం వచ్చింది. "హలో అర్చనా! నువ్వు ఫస్ట్ క్లాసులో పాసయావు. కంగ్రాట్స్" అన్నాడు.
    అర్చన గంభీరంగా "థాంక్యూ" అంది.
    వేణు వికసించిన మొహంతో ఆనందరావు వైపు చూశాడు.
    అది గమనించిన అర్చన తండ్రితో అంది "నాన్నా! వేణు....నా స్నేహితుడు, నా శ్రేయోభిలాషి."
    ఆయన ఒక్కసారి వేణుని ఎగాదిగా చూసి, సన్నగా నిట్టూర్చి వెళ్ళు అన్నట్టు చేత్తో సైగ చేశాడు.
    వేణు ఆయనవైపు కృతజ్ఞతగా చూసి లోపలికి వెళ్ళాడు. అర్చన తన గదిలోకి దారితీసింది. ఆమెని అనుసరించాడు వేణు. ఆమె క్లాస్ పుస్తకాలు రెండు అరల్లో, ఒక అరలో ఇంగ్లీషు, తెలుగు నవలలు ఉన్నాయి. ఆ రాక్ మీద చిన్న టూ ఇన్ వన్ ఉంది. పక్కనే ఒక టేబుల్, దానిమీద టేబుల్ లైట్, రెండు గాద్రెజ్ కుర్చీలు. మంచానికి వెనకవైపు కిటికీ ఉంది. దానికి దోమలు రాకుండా మెష్ అమర్చి ఉంది. దోమతెర పైకి మడిచి ఉంది. మంచం మీద ఉన్న తలగడ మీద ఏదో ఇంగ్లీషు పుస్తకం సగం చదివి మూసినట్లుగా, చదివింతవరకూ పేజీలకి చిన్న కాగితం గుర్తుగా పెట్టి ఉంది.
    నిశితంగా గదిని గమనిస్తూ నిల్చున్న వేణుకి కుర్చీ చూపించి "కూర్చో" అంది అర్చన.
    వేణు కుర్చీలో కూర్చున్నాడు. అర్చన విరబోసుకున్న జుట్టు ముడివేసుకుంటూ మంచం మీద ఓ పక్కగా కూర్చుంది. కొద్ది క్షణాలు ఒద్దరి మధ్యా మౌనం రాజ్యం చేసింది.
    అతనెందుకు వచ్చాడో ఊహించడానికి ప్రయత్నిస్తోంది అర్చన. వేణు పరీక్షలవగానే ఊరెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు తనని కలిశాడు. ఆ రోజు గుర్తొచ్చింది.
    ఆ రోజు వేణుని అలా అవమానించినందుకేనా తనకి భగవంతుడు ఇంతటి ఘోరమైన శిక్ష వేశాడు అనిపించింది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే చప్పున కింద పడిన కాగితం తీసే నెపంతో వంగి చెంగుతో కళ్ళు తుడుచుకుని, సరిగా కూర్చుంది. పోనీ కనీసం ఇతనైనా వచ్చాడు. ప్రాణస్నేహితురాళ్ళనుకున్నవాళ్ళు తన మొహం కూడా చూడడం లేదు. వేణు ఏ ఉద్దేశంతో వచ్చినా ప్రస్తుతం అతని రక ఆమెకి కొంచెం ఊరటని కలిగించింది, కాలేజీ సంగతులు తెలుసుకోవచ్చు అనుకుంది. ఆ రిజల్ట్స్ కూడా చూసుకోవాలన్న ధ్యాస లేదు. ఆ విషయమే మర్చిపోయింది. పాపం ప్రత్యేకంగా వచ్చి శుభవార్త వినిపించాడు.
    "ఎలా ఉన్నావు వేణూ! మీ పేరెంట్స్ బాగున్నారా?" అడిగింది మృదువుగా.
    "ఆ... అందరూ బాగున్నారు అర్చనా! నేను కూడా ఫస్ట్ క్లాస్ లో పాసయాను."
    "కంగ్రాట్స్ వేణూ!"
    "థాంక్యూ" కొంచెంసేపు మళ్ళీ మౌనం.
    "ఊరినుంచి వస్తూనే జరిగిన దారుణం తెలిసింది అర్చనా! చాలా దారుణం" అన్నాడు బాధగా.
    అర్చన మాట్లాడలేదు. పరామర్శించడానికి వచ్చాడన్నమాట!
    వేణుకి ఆమె ఏదన్నా మాట్లాడితే బాగుండు అనిపించింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra