యమము, నియమము అనేవి పది ధర్మాలు ఉంటాయి. అవి సామాన్య ధర్మాలు. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ వీటిని పాటించవలసిన విధంగా అవి ఉంటాయి. అలాగే విశేష ధర్మము కూడా ఉంటుంది. ఈ ధర్మాల గురించి భగవద్గీత లో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ ఇలా చెబుతాడు.

【శ్లోకం:- స్వధర్మమనీ చావేక్షకైన వికమితుమర్ష్యసి ధర్మ్యా ద్ధి యుద్ధాల్చేయోన.. స్వత్ క్షత్రియస్య న విద్యతే!!

అర్జునా! నీ స్వధర్మము అయిన క్షాత్రధర్మమును నిర్వర్తించడానికి నీవు భయపడనక్కరలేదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధమును మించినట్టి శ్రేయస్కరమైన ధర్మము మరొకటి లేదు. ఓ అర్జునా ! నీవు క్షత్రియుడవు, యుద్ధం చేయడం నీ ధర్మం నీ ధర్మాన్ని నీవు నిర్వర్తింగానికి వీవు భయపడతావెందుకు. అసలు క్షత్రియుడికి భయం అంటే ఏమిటో తెలియదు. ఈ భయం నీకు ఎక్కడి నుండి దాపురించింది. క్షత్రియుడికి యుద్ధము చేయడమే వరము ధర్మము. యుద్ధం. చేయడం తప్ప మరేదీ, క్షత్రియుడికి శ్రేయస్సును ఇవ్వదు. ఇందాకా ఏదో భిక్షాటన చేస్తాను. అన్నావు అది నీ ధర్మం కాదు. అది బ్రాహ్మణ ధర్మము. కాబట్టి నీ ధర్మం నీవు నెరవేర్చు. విల్లు పట్టు యుద్ధం చెయ్యి అని కృష్ణుడు ఇప్పటి వరకు తాత్విక దృష్టితో చెప్పాడు. 

తరువాత ధర్మము అనేకోణంలో నుండి చెబుతాడు. ఎందుకంటే వేదాంతము అందరికీ అర్థంకాదు. ముందు ప్రిపరేషన్ కావాలి. లేకపోతే వేదాంతాన్ని అపార్ధం చేసుకుంటారు. ఎవరూ నాకు అర్థం కాలేదు అని అనదు. అయితే అర్థం చేసుకుంటాడు లేకపోతే అపార్థం చేసుకుంటాడు. అందుకని ధర్మం గురించి కూడా భగవానుడు చెబుతున్నాడు. స్వధర్మము అనే కోణం నుండి చూచినా నీవు యుద్ధం చేయక తప్పదు అని అర్జునుడికి విశధీకరించారు. ధర్మము రెండు విధాలు. సామాన్య ధర్మము, విశేష ధర్మము, 

సామాన్య ధర్మము

మానవులకు అందరికీ ఒకటే. యూనివర్సల్, ఆడ, మగ, కుల, మత, జాతి, ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ వర్తించేది సామాన్య ధర్మము. మనిషిగా పుట్టి, సమాజంలో జీవిస్తున్న ప్రతివాడు సామాన్య ధర్మాన్ని పాటించాలి. ఈ సామాన్య ధర్మములను 10 గా విభజించారు. వాటిని

యమ, నియమములు అని అంటారు. ఇవి ఏ దేశంలో ఉన్నా ఏకాలంలో ఉన్న ప్రతి జీవి ఆ నియమాలను అనుసరించాలి. ఇవి కేవలం భారతీయులకు హిందువులకు మాత్రమే అనుసరించవలసినవి కావు, అందరూ ఆచరించవలసిన ధర్మములు,

తరువాతది విశేష ధర్మము. అంటే వాడి వర్ణమును బట్టి చేసే పనిని బట్టి ఉండే ప్రదేశాన్ని బట్టి వాడి అర్హతను బట్టి, స్థితిని బట్టి, గుణమును బట్టి ఆచరించేది. అది ప్రతి మనిషికి వేరు వేరుగా ఉంటుంది. ఉదాహరణకు బ్రాహ్మణులు వేదములు శాస్త్రములు చదవాలి. అధ్యయనం చేయాలి. ఇతరుల చేత చదివించాలి. తాను చదివింది ఇతరులకు అర్ధం అయేటట్టు చెప్పాలి. అది బ్రాహ్మణుల ధర్మం, అంతే కాని యుద్ధం చేయడం, వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, ఉద్యోగం చేయడం బ్రాహ్మణ ధర్మం కాదు. అలాగే క్షత్రియులు రాజ్యపాలన చేయాలి, ప్రజలను కాపాడాలి. అవసరమైతే ధర్మయుద్ధం చేయాలి. అంతే కానీ బ్రాహ్మణ ధర్మంపాటించకూడదు. ఇదే విశేష ధర్మము.

యమము, నియమము అనేవి వది ధర్మాలు, ఇది సామాన్య ధర్మాలు. అందరూ పాటించవలసినవి. నియమములు: 

1. అహింస... ఇతరులు నాకు ఏమి చేస్తే నా శరీరానికి, మనసుకు బాధ కలుగుతుందో అది నేను ఇతరుల పట్ల చేయకూడదు.

2. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. పరమాత్మ ఒక్కడే సత్యం అని తెలుసుకోవడం.

3. అస్త్రీయం... ఒకరి వస్తువు తీసుకోకూడదు. తనకు ఉన్నదానితో తృప్తిపడటం.

4. బ్రహ్మచర్యం నిరంతరం పవిత్రమైన జీవితం గడపాలి, త్రికరణములు శుద్ధిగా ఉంచుకోవాలి.

5. అపరిగ్రహం... ఎంత అవసరమో అంతే సంపాదించడం, ఇతరులనుండి తీసుకోవడం.

6, శౌనం, ... శారీరక, మానసిక పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం. శరీరము మాదిరే మనసును కూడా ఎల్లప్పుడు నిర్మలంగా శుభ్రంగా ఉంచుకోవడం. 

7. సంతోషము ఉన్నదానితో తృప్తిపడటం, అసూయ, ద్వేషము ఉండకూడదు.

8. తపస్సు... స్వీయ క్రమశిక్షణ, ప్రతి పనిని శ్రద్దగా ఏకాగ్రతతో, నిష్కామలుద్ధితో, కర్తృత్వ భావన లేకుండా చేయడం.

9. స్వాధ్యాయము..... శాస్త్రములు చదువుతూఉండాలి. అన్నీ కాకపోయినా ఏదో ఒకటి చదవాలి.

చేసే ప్రతి పనీ భగవంతుడికి సమర్పించుకోవాలి. తనను తాను పరమాత్మకు అర్పించుకోవాలి. పరమాత్మకు శరణాగతుడు కావాలి.

విశేషధర్మములు: ఎవరి ధర్మం వారు చేయాలి. ప్రతివారికి ఒక ధర్మం ఉంటుంది. అందరూ అన్ని పనులు చేస్తే ఏ పనీ కాదు. ఆ నాటికాలంలో వర్ణవ్యవస్థ ఉండేది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికే స్వధర్మము, వర్ణాశ్రమ ధర్మము అని పేరు. నీకు కేటాయించిన ధర్మం నీవు చెయ్యాలి.

నీది క్షత్రియ ధర్మము, అధర్మం నుండి ప్రజలను రక్షించేవాడు క్షత్రియుడు. క్షత్రియుడు (ఈనాడు) పోలీసు, సైనికుడు, న్యాయాధికారి, న్యాయమూర్తి) అహింస అంటే కుదరదు. సత్యం అయినా ప్రమాదం పరిస్థితులలో చెప్పకూడదు. హింసతో కూడినది అని నీ ధర్మము అయిన యుద్ధం చేయకపోవడం తప్పు. నీవు క్షత్రియుడివి కాబట్టి నీ స్వధర్మం యుద్ధం కాబట్టి నీపుయుద్ధం చేయక తప్పదు. ఇది హింస కాదు. దీని వలన నీకు పాపం రాదు. ఇది ధర్మయుద్ధం కాబట్టి ఇది మీకు శ్రేయస్కరమైన కార్యము అని కృష్ణుడు అర్జునుడితో చెబుతాడు.

పై విషయాలు గమనిస్తే మనిషి తాను చేయవలసినది, నేర్చుకోవలసినది ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది.

◆ వెంకటేష్ పువ్వాడ
 


More Purana Patralu - Mythological Stories