ఇలలో దేవదూతలు!!

చాలా అరుదైనవి, మానవ సంచారానికి దూరంగా ఉండేవి హంసలు. హంస సరస్వతీదేవి వాహనం. హంసలు ఎంతో పవిత్రమైనవి. పాలు, నీళ్లను వేరు చేసే అద్భుతమైన గుణం ఈ హంసల సొంతం. ఇవి ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన పక్షులు. అయితే పురాణాల ప్రకారం దేవలోకపు హంస గురించి  ఆసక్తికరమైన, గమ్మత్తైన విషయం.

అరయాణం:  అరయాణం అనేది దేవలోకంలోని హంస పేరు. నిజానికి హంసలు దేవలోకపు పక్షులు. ఇవి సాదారణంగా ఎక్కడంటే అక్కడ కనిపించవు. హిమాలయాలలోని మానస సరోవరం వీటి నివాస ప్రాంతం. అయితే వీటికి వర్షాకాలం అంటే చాలా చిరాకు అట. . హిమాలయాల్లో వర్షం పడితే  నేలమీదకు వెళ్లిపోతాయి. నేలమీద వర్షం రాగానే మళ్ళీ మానస సరోవరానికి వెళ్తాయి. ఈ హంస పుట్టుక వెనుక ఒక పురాణ కథ ఉంది మరి.

దక్ష ప్రజాపతికి పదహారు మంది కూతుళ్లు. ఈ పదహారు మందిలో షేని కూడా ఒకరు. ఈ షేనికి  అయిదు పక్షి జాతులు కలుతాయి. ఆ అయిదు పక్షి జాతులలో హంస కూడా ఒకటి. 

అయితే ఈ హంస జాతిలో ఒక పక్షి ఒకసారి విహారం కు వెళ్లగా అటుగా వచ్చిన నలమహారాజు ఆ హంసను చూసి ముచ్చటపడతాడు. వెంటనే ఆ హంసను పట్టుకుని తనతో తీసుకెళ్లాలని అనుకుంటాడు. అయితే నలమహారాజు చేతిలో చిక్కిన హంస కొట్టుమిట్టాడుతూ తప్పించుకోవాలని చూస్తూంది. మంచి మనసున్న నలమహారాజు ఆ హంస మానసికంగా అలా అరుస్తుండటం పసిగట్టి దాన్ని వదిలేసాడు. అతను అలా వదిలేయడం ఊహించని హంస సంతోషంతో అక్కడి నుండి కదలలేకపోతుంది. తరువాత నలమహారాజు తరపున దమయంతి దేవెజ్ దగ్గరకు రాయబారం మోసుకెళ్లి వాళ్ళిద్దరూ దంపతులుగా మారడానికి సహాయపడుతుంది. 

అందరికీ హంస అనగానే తెల్లటి తెలుపు గుర్తుకొస్తుంది. కానీ హంస మొదటి రంగు తెలుపుకాదని తదుపరి ఒక సంఘటన వల్ల నలుపు తెలుపుల కలయిక నుండి పూర్తి తెలుపుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.  ఒకరోజు మరుత్తుడు అనే రాజు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ హోమంలో ఎగసిపడే అగ్నిజ్వాలలను ( హవిస్సు) గ్రహించడానికి ఇంద్రుడు, వరుణుడు మరియు ఇతర దేవతలు వచ్చారు. అదే సమయంలో రావణుడు అక్కడకు వస్తున్నట్టు తెలిసింది. అతని రాక్షసత్వానికి భయపడి దేవతలు అంతా  ఒక్కొక్కరు ఒకో పక్షి రూపములోకి మారిపోయారు. అలా వాళ్ళు పక్షుల్లా మారిపోయాక అక్కడికి వచ్చిన రావణుడు అక్కడ దేవతలు కనిపించకపోయే సరికి వెనక్కు వెళ్ళిపోతాడు. 

రావణుడు అలా వెళ్లిపోగానే పక్షుల రూపాల్లో ఉన్న దేవతలు తిరిగి మళ్ళీ వారి రూపాల్లోకి మారిపోయి, రావణుడి నుండి మేము ఇలా కాపాడబడ్డాం అంటే దానికి కారణం మీ పక్షి రూపాలు ధరించడమే కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి అని దీవించారు పక్షులను. అప్పుడే హంస రూపంలోకి మారి రావణుడి నుండి తప్పించుకున్న వరుణదేవుడు హంసతో నువ్వు ఈ నలుపు తెలుపుల కంటే తెలుపులోనే బాగుంటావు. ఇకమీదట తెలుపుగానే ఉండు అని దీవించి మాయమైపోయాడట.

అలా అప్పటి నుండి హంస తెలుపు రంగులోకి మారిపోయి ఆక్షరణగా, అరుదుగా, అపురూపమైనదిగా నిలిచింది.  

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories