శక్తి స్వరూపిణి సమగ్ర కథనం!!

 

ఉమ, కాత్యాయని, గౌరి, కాళి, హైమవతి, ఈశ్వరి, శివా, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అసర్గ, దుర్గ మృదాని చండిక, అంబిక, ఆర్య, దాక్షాయాని, గిరిజ, మేనకాత్మజ, చాముండి. భైరవి అనునవి పార్వతికున్న వివిధ జన్మలలో గల పేర్లు.

 సతి జన్మవృత్తాంతం : బ్రహ్మ దైత్యుల సృష్టిగావించగా వారు బ్రహ్మనుండి వరములు పొంది ముల్లోకాలను బాధించగా శివుడు, విష్ణువుకూడా వారితో యుద్ధం చేసి అలసిపోగా బ్రహ్మ పుత్రులైన దక్షుడు ఇతరులు  బ్రహ్మను వేడుకోగా నేను శివుడు విష్ణువు చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. మీరు మహామాయను గూర్చి తపస్సుచేస్తే ఆమె అంశవల్ల భూమిపై సుఖశాంతులు కల్గుతాయని చెప్పగా ప్రజాపతులు మహామాయను గూర్చి 10వేల ఏళ్లు తపస్సు చేయగా 3 కన్నులు 4 చేతులతో దేవత ప్రత్యక్షమై దక్షుని కుమార్తెగా జన్మిస్తానని వరమిచ్చింది. ఆమె దక్షుని కుమార్తె సతిగా జన్మించింది. ప్రజాపతులందరూ కలసి శివుని వద్దకు వెళ్లి సతిని వివాహమాడమని కోరగా అతడు వివాహమాడారు. జగదాంబిక వల్ల పొందిన దైవహారాన్ని దుర్వాసుడు దక్షునికి బహుమతిగా ఇవ్వగా దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల స్వచ్ఛత కోల్పోయి ఆ సువాసనలకు దక్షునికి సతిని ద్వేషించేట్లు చేసింది. అందువల్ల కుమార్తెను అల్లుడిని తూలనాడి అతడు చేయు యజ్ఞానికి శివుని గాని, తన కుమార్తె సతిని గాని ఆహ్వానించలేదు. పిలవని యజ్ఞానికి వెళ్లి దక్షుడు అపహాస్యం చేయగా సతి ఆ యజ్ఞగుండంలో దూకి మరణించగా, శివుడు ఆగ్రహంతో దక్షుని యజ్ఞాన్ని భగ్నం చేయడమేగాక సతీ....సతీ సతీ అని దుఃఖంతో లోకమంతా తిరిగారు.

సతి/పార్వతి/కాళి : ఇదే సమయంలో కశ్యపునికి దితి వల్ల వజ్రాంగుడు జన్మించాడు. ఈ రాక్షసుడు 1000 సంవత్సరాలు తపస్సుచేసి తర్వాత తన భార్యకు ఇంద్రుని వల్ల జరిగిన అవమానం విని కోపంతో ఇంద్రుడ్ని జయించడానికి మరల తపస్సు చేయబోగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా దేవతలను ఇంద్రుడిని చంపగల పుత్రుడిని ప్రసాదించమనగా వారికి తారకాసురుడు జన్మించెను. తారకాసురుడు పంచాగ్నుల మధ్య కూర్చొని బ్రహ్మను గూర్చి తపస్సు చేసి మరణం లేనట్లు, ఒకవేళ మరణమే సంభవిస్తే ఏడు రోజుల వయసుగల పాపవల్ల మాత్రమే మరణం కల్గునట్లు వరం కోరుకున్నాడు. ఈ వరాలతో ఇతర రాక్షసులతో కలసి ముల్లోకాలను బాధించాడు. ఈ సమయంలోనే శివుడు తన భార్య సతికోసం విలపిస్తూ తిరుగుతున్నాడు.

ఇంద్రుని నాయకత్వంలో తారకాసురుడి బాధను విముక్తం చేయమని బ్రహ్మను కోరగా శివుని వీర్యం వల్ల జన్మించిన వాడు మాత్రమే ఇతణ్ణి చంపగలడు. కనుక శివుడి వివాహం చేసుకొనే ప్రయత్నం చేయ మని సలహా ఇచ్చాడు. ఆ సమయంలో శివుడు సతిని తలచుకుంటూ ఒకసారి కాళింది నదిలో స్నానం చేయగా ఆ నది నీరంతా నల్లబడి పోయింది. ఇంద్రుడు ఇతర దేవతలు బృహస్పతి సలహా కోరగా హిమవంతుడు సంతానం కొరకు ప్రార్ధిస్తున్నాడు. అప్పుడే అతడు శివుని వరంవల్ల సతి హిమవంతుని కుమార్తెగా జన్మించిందని చెప్తాడు. హిమమంతుడు మేనలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించారు. కుమార్తెలు రాగిణి, కుటిల, కాళి, వీరి ముగ్గురిని ఇంద్రుడు. బ్రహ్మవద్దకు తీసుకువెళ్లగా రాగిణి, కుటిల శివునిశక్తిని భరించ లేరనగా వారు బ్రహ్మను దూషించగా బ్రహ్మ వారిని శపించాడు. హిమవంతుని భార్య భయంతో కాళిని ఉమను తపస్సుమాని వెళ్లిపొమ్మని (ఉమ అనగా విడిచో అని అర్థం) అని కేకవేసింది. అందుకని ఆమెకు ఉమ అనేపేరు. పర్వతుని (హిమవంతుడు) కుమార్తె కనుక పార్వతి అనే పేరు వచ్చాయి. శివుడు సతిని వెతుకుతూ ఒకరోజు హిమవంతుని నివాసమునకు వెళ్లగా అతని కుమార్తె కాళీ శివుని గూర్చి తపమాచరించుచున్నదని తెలిసి ఆమె వద్దకు వెళ్లగా ఆమె నేత్రములు తెరచి చూడగనే అతడు అదృశ్యుడయ్యెను. ఆమె నిరాశతో తిరిగి తపము కొనసాగించగా బ్రాహ్మణ కుర్రవాడి రూపమున శివుడు ప్రత్యక్షమై కారణము అడుగుతాడు. నేను శివుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఆమె శివుడితో చెప్పగా,  ఎద్దు పై తిరుగు ఆ ముసలివాడు నీకెందుకు అని శివుడు అడగగానే కాళి ఉగ్రరూపము దాల్చుతుంది. తరువాత శివుడు నిజ రూపం ధరించి  కాళి (ఉమ)ని వివాహం చేసుకుంటాడు. 

వివాహం తరువాత శివుడు, కాళీ ఇద్దరూ ఒకసారి ఒక అడవిలో సరదాగా దాగుడుమూతలు ఆడుతుంటే శివుడు ఆమె కనబడక  కాళి, కాళి, కాళి అని పదేపదే పిలుస్తాడు. తన నలుపు రంగు వల్ల శివుడు ఎగతాళి చేస్తున్నాడని అనుకుని అదృశ్యురాలై వేరే అడవికి వెళ్లి తపస్సుచేసి  బ్రహ్మతో తన బాధను వివరించగా బ్రహ్మ తన నల్లని శరీరము ధవళకాంత వర్ణ శరీరము అవుతుందని వరమిచ్చెను. ఆమెనే గౌరి, 

రంభుడు : అగ్నిదేవుని వరమువల్ల ఘోర రాక్షసుడైన మహి షాసురునికి జన్మనిచ్చెను. ఇతని ఘోరకృత్యాలకు దేవతలు బెదరిపోయారు. శివుడు, విష్ణువు బ్రహ్మ ఒకరినొకరు సంభాషించుకొని వారి శక్తి రూపమున కాత్యాయన మహర్షి ఆశ్రమమునకు వెళ్లి అతని శక్తితోనూ కలసి కాళి వదలిన చర్మములో ప్రవేశించగా చర్మము కాత్యాయని రూపముదాల్చెను. ఆమెకు శివుడు, విష్ణువు ఇతర దేవగణం ఆయుధాలు సమకూర్చగా ఆమె రాక్షసుల పని పడుతుంది. చివరకు మహిషాసురునితో పోరాడింది. అప్పుడే ఆమె చాలా కోప స్వభావంలోకి మారిపోయి వేలాడుతున్న  తన జడను నేలకు విసరికొట్టగా సప్తమాతృలు జన్మించారు. వారు చాముండి, బ్రహ్మణి, మహేశ్వరి, వైష్ణవి, వారాహి, నారసింహి, వీరంతా కాత్యాయని వివిధ రూపాలు. సప్త మాతృలు ఘర్జిస్తూ అసురులను చివరకు మహిషాసురుడిని వధించారు.

పార్వతి అంటే శక్తి స్వరూపిణి. ఆ అమ్మతో అన్ని శక్తి రూపాలు ఉన్నాయి. అవతారాలు వేరు కానీ ఆ శక్తి మాత్రం ఒకటే.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories