కొంగు బంగారం మైసగండి


మహబూబ్ నగర్ జిల్లాలోని, అమనగల్లు మండలం,హైదరాబాద్ నుండి సుమారు 50కి.మీ దూరంలో కర్నూలు వెళ్లే రహదారిలో మైసిగండి అనే ప్రాతంలో ఉన్న ఒక  వేపచెట్టు క్రింద బురుజు గోడలో స్వయంభూవుగా మైసమ్మ తల్లి వెలిసింది.ఈమె కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసినట్లు తెలియచున్నది.ఈ మైసమ్మ తల్లి ఇచట గ్రామదేవతగా భక్తులు పూజలనందుకొంటుంది.మైసిగండి మైసమ్మ దేవత మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో పరిసరాల ప్రజలకు ఆరాధ్యదేవత. కల్వకుర్తి. అచ్చంపేట.శ్రీ శైలం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ ఆలయం ముందునుండి వెళుతూ ఇక్కడ అగుతాయి. భక్తుల పాలిట కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా ఈమెను కొలుస్తారు. సృష్టి స్థితి లయకారుణియై కాళికాదేవి స్వరూపంతో పుపజలందుకొంటుంది ఈమె.మైసమ్మను అర్చించినవవారు సుఖసంతోషాలతో,సౌభాగ్యాలతో వర్ధిల్లుతారనే గొప్ప నమ్మకం ఈప్రాంత ప్రజలలో బలంగా ఉన్నది.మైసమ్మ విగ్రహం ప్రతిష్టించక ముందు ఇక్కడ చిన్న శిలావిగ్రహం ఉండేది.కొంతకాలం తరువాత ఒక భక్తుడు ఈమైసమ్మ విగేఆహాన్ని ప్రతిష్టించునట్లు తెలుస్తుంది.


మైసమ్మ దేవాలయానికి అరకిలోమీటరు దూరంలో శివాలయం,రామాలయం,అన్నపూర్ణేశ్వరి ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అతి ప్రాచీనమైనవి.వీటిని గోల్కొండను పాలించిన తనిషా వద్ద మంత్రులుగా పనిచేసే అక్కన్న,మాదన్నలు ఒక కోనేరు ఉంది.ఈ గుడికి ఎదురుగ మైసమ్మ ఉన్నందున ఈ ప్రాంతానికి  మైసిగండి అని పేరు స్థిరపడినట్లు తెలియుచిన్నది.ప్రతి ఆఫీ, గురు వారాలలో వేల సంఖ్యలో భక్తులు ఈ మైసమ్మను దర్శిస్తుంటారు. అన్నివర్గాల ప్రజలచే నిత్యం పుజలందుకునే ఈ దేవత మాత సామరస్యానికి ప్రతికిగా నిలుస్తుంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే జాతరకు భక్తులు విశేషంగా వస్తారు.  మహబూబ్ నగర్ జిల్లాల నుండి కూడా వస్తారు.ఇక్కడ ఉన్న ఆలయాల్లో నిత్యపూజలతోపాటు,విశేష పూజలు జరుగుతున్నాయి.ఇక్కడ అమ్మవారికి దసరా నవరాత్రలు, శివాలయంలో శివరాత్రికిబ్రహ్మోత్సవాలు, రామాలయంలో శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలు గొప్పగా జరుగుతాయి.

◆ వెంకటేష్ పువ్వాడ

 


More Purana Patralu - Mythological Stories