రాహువు మహాదశ నడుస్తోందా..ఈ పరిహారాలు మీ కోసమే..!
రాహువు మహాదశ నడుస్తోందా..ఈ పరిహారాలు మీ కోసమే..!
జ్యోతిష్య శాస్త్రంలో రాహువు ఒక శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడుతుంది. మనిషిలో కోరికలు, రహస్యం , ఆకస్మిక మార్పులు మొదలైనవాటికి రాహువు ప్రబావమే కారణమని చెబుతుంటారు. రాహువు మహాదశలో ఉంటే వ్యక్తి జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి, కానీ అశుభ స్థానంలో ఉంటే శారీరక , మానసిక సమస్యలకు దారితీయవచ్చట. రాహువు మహాదశ కారణంగా ఎదురయ్యే సమస్యలకు కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు. దీని వల్ల చాలా వరకు మంచి ఉపశమనం ఉంటుంది. అసలు రాహువు మహాదశ ఎంతకాలం ఉంటుంది? ఆ సమయంలో కలిగే సమస్యలు ఏంటి? రాహువు మహాదశలో పాటించాల్సిన పరిహారాలేంటి? తెలుసుకుంటే..
రాహువు మహాదశ..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు మహాదశ 18 సంవత్సరాల పాటు ఉంటుంది. జాతకంలో రాహువు బలహీనంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి , పనిపై ఆసక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
.రాహువు మహాదశలో ఎదురయ్యే సమస్యలు..
మానసిక ఒత్తిడి..
జీవితంలో భయం లేదా మానసిక ఒత్తిడిని అనుభవిస్తుంటే, అది రాహు మహాదశకు సంకేతంగా పరిగణించబడుతుంది . రాహు మహాదశలో, ఒక వ్యక్తి యొక్క నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది.
ఆకస్మిక ధన నష్టం:..
రాహువు మహాదశలో ఉన్నవారు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవచ్చు. అప్పుల సమస్యలు తలెత్తుతాయి. అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి.
సంబంధాలు చెడిపోవడం..
కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదం ఉన్నా లేదా సంబంధం చెడిపోయినా, ఇది రాహు మహాదశకు సంకేతంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా, రాహు మహాదశ సమయంలో వ్యక్తి చెడు స్నేహాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇది వారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
రాహువు మహాదశ ప్రభావానికి పరిహారాలు..
శివుడిని పూజించడం రాహువు ప్రతికూల ప్రభావాలను నివారించడంలో సహాయపడుతుంది. సోమవారాలు , శనివారాలలో రుద్రాభిషేకం చేయాలి. పూజ సమయంలో, "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల రాహువు ప్రబావం తగ్గి మంచి ఫలితాలు ఉంటాయని, ఇది ఆనందం, శ్రేయస్సును పెంచుతుందని చెబుతారు.
ఇది కాకుండా రాహువు యొక్క దుష్ప్రభావాలను తొలగించడానికి, ప్రతిరోజూ చేసే పూజలో 'ఓం భ్రాం భ్రైం భ్రౌం సహ రాహవే నమః' అనే రాహు బీజ మంత్రాన్ని జపించాలి. అయితే మొక్కబడిగా చేయకూడదు, పూర్తీ భక్తి, ఏకాగ్రతతో చేయాలి.
*రూపశ్రీ.