• Prev
  • Next
  • రహస్యాలు బయటపడ్డాయి

    రహస్యాలు బయటపడ్డాయి

    గోవిందం మీద ఆవేశంతో ఊగిపోతున్నాడు రాజశేఖరం.

    "అసలేమిటి మీ ఉద్దేశ్యం? నేను ఒట్టి అవినీతిపరుడినని, ముండల ముఠాకోరునని,

    రేసులాడతానని, తాగుతానని, తాగొచ్చి పెళ్లన్ని తంతానని నా మీద ఉన్నవి లేనివి

    ఊరందరికీ చెబుతున్నారట!" అని.

    " క్షమించండి సార్.... ఇవన్నీ రహస్యాలని నాకు ఇంతవరకూ తెలియదు " అని

    అమాయకంగా అన్నాడు గోవిందం.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు రాజశేఖరం.

  • Prev
  • Next