• Prev
  • Next
  • ప్రేమికుల గిలిగింతలు

    ప్రేమికుల గిలిగింతలు


    అమ్మాయిలకైన అబ్బాయిలకైనా ప్రేమించడం, ప్రేమించబడటం ఈ రెండు గొప్పే! కాకపొతే

    వీళ్ళు ఆ ప్రేమలో ఎంతవరకు సఫలీకృతం అవుతారన్నది వాళ్ళకే కాదు చూస్తున్నవాళ్ళకి

    కూడా అర్థం కాదు. ప్రేమ బాధితులల్లో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు.

    సరదాగా అమ్మాయిల మీద అబ్బాయిలు, అబ్బాయిల మీద అమ్మాయిలు చేసుకునే

    కామెంట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం ! 



    * " చూసే పత్రి అమ్మాయి నవ్వదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు, ప్రేమించే ప్రతి

    అమ్మాయి పెళ్లి చేసుకోదు, విశ్వదాభిరామ అమ్మాయిల్ని నమ్మకురా మామ " ఒక ప్రేమ

    బాధితుడు.



    * " డబ్బులేని అబ్బాయిలను చూడకు, డబ్బులేని అబ్బాయిలతో మాట్లాడకు, వాళ్ళు

    ఏమి చెప్పినా వినకు ! డబ్బున్న అబ్బాయిని పట్టుకో దర్జాగా లైఫ్ ని ఎంజాయ్ చేసుకో "

    ఒక ప్రేమ బాధితురాలు.



    * " గొడుగుతో ఉంటే అది వానాకాలం, కూలర్ తో ఉంటే అది ఎండాకాలం, స్వెటర్ తో ఉంటే

    అది చలికాలం, లవర్ తో ఉంటే అది పోయే కాలం! " ఒక ప్రేమ బాధితుడు.



    * " అబ్బాయిలు ప్రేమించే మనసును చూడరు, ఆకర్షించే అందాన్నే చూస్తారు..ఛీ ఛీ...ఈ

    అబ్బాయిలు ఎప్పుడు మారుతారో ఏమో " ఒక ప్రేమ బాధితురాలు.



    * " అమ్మాయిలు కూడా అంతే ! ప్రేమించే మనసును చూడరు, నిండుగా ఉండే పర్స్ నే

    చూస్తారు " ఒక ప్రేమ బాధితుడు.



    * " అమ్మాయిలు చదవరు, అబ్బాయిల్ని చదవనీయరు, కాని బాగా చదువుకున్న

    మొగుడు కావాలి...ఏంటో ఈ అమ్మాయిలు ! " ఒక ప్రేమ బాధితుడు.



    * " అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుకురారు. పెళ్లి చేసుకునేటప్పుడు

    ప్రేమించినవాడు గుర్తుకు రాడు. అందుకేరా బాబు అమ్మాయిలను నమ్మకూడదు "

    మరొక ప్రేమ బాధితుడు.



    * " ప్రేయసి కోసం ఒక ప్రియుడు తాజ్ మహల్ కట్టాడు కాని ప్రియుడి కోసం ఒక ప్రేయసి

    చిన్నగుడిసె అయినా కట్టిందా ! " ఒక ప్రేమ బాధితుడు.


  • Prev
  • Next