• Prev
  • Next
  • న్యూ ఇయర్ జోక్స్ 2018

    న్యూ ఇయర్ జోక్స్ 2018

     

    మనసులో మాట

    బాలు: 2018లో గూగుల్‌ నుంచి ఓ కొత్త గాడ్జెట్ వస్తోందట?

    హరి: ఏంటది?

    బాలు: ఆ గాడ్జెట్‌ని మన గొంతుకి తగిలిస్తే, మన మనసులో ఏమనుకుంటున్నామో అంతా బయటకి చెప్పేస్తామట!

    హరి: పిచ్చోడా ఆ గాడ్జెట్‌ని నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. ఇదిగో ఈ మందు బాటిల్ ఉంది చూశావా... దీన్ని కనుక నా గొంతులోకి పోసుకుంటే నా మనసులో ఉన్న మాటలన్నీ బయటకి వచ్చేస్తాయి!

     

    కోరిక

    భర్త: డార్లింగ్! ఈ ఏడాది నువ్వు కనీసం పాతిక కేజీలు పెరగాలని కోరుకుంటున్నాను.

    భార్య: ఎందుకు?

    భర్త: ఈ ఏడాది నేను నీకంటే కనీసం పాతిక కిలోలు తగ్గాలనుకుంటున్నాను. అదెలాగూ జరగదు కాబట్టి, నువ్వే బరువు పెరిగితే మంచిదేమో!

     

    ఏంటా సౌండు

    తండ్రి: నేను జనవరి 1కి క్రాకర్స్ ఏమీ కాల్చొద్దని చెప్పాను కదా! అయినా నీ గదిలో ఆ చప్పుడేంటి?

    కొడుకు: నీ ఐఫోను చార్జింగ్‌ పెట్టి మర్చిపోయాను డాడీ! హ్యాపీ న్యూ ఇయర్!!!

  • Prev
  • Next