• Prev
  • Next
  • నాకు BP...


     

    నాకు BP...

     

     

    తండ్రి : బాబు ఒక కూల్ డ్రింక్ తీసుకురా
    బాబు : పెప్సీనా స్ప్రైటా
    తండ్రి : పెప్సీ
    బాబు : ప్లాస్టిక్ బాటిల్ లోనా గ్లాస్ బాటిలా
    తండ్రి : ప్లాస్టిక్
    బాబు : చిన్నదా పెద్దదా
    తండ్రి : వద్దులేరా కొన్ని నీళ్ళు తీసుకురా చాలు

    బాబు : మామూలు వాటరా మినరల్ వాటరా
    తండ్రి : మామూలే
    బాబు : చల్లగానా వేడిగానా
    తండ్రి : ఒరేయ్ వెళ్ళిపో ముందు  లేకపోతె కొడతాను
    బాబు : చెప్పుతోనా కర్రతోనా
    తండ్రి : ఛి ఛి .జంతువు లా తయారయ్యావు

    బాబు : కుక్క లానా కోతిలా నా
    తండ్రి : నా ముందునుండి వెళ్ళిపో
    బాబు : మేల్లిగానా ఫాస్ట్ గానా
    తండ్రి :నా చేతుల్లో చస్తావు
    బాబు : కత్తితోనా గన్నుతోనా
    తండ్రి : కత్తితో
    బాబు : బాగా హింసించి చంపుతావా డైరెక్ట్ గా చంపుతావా
    తండ్రి : ఒరేయ్ నాకు BP పెరిగిపోతుంది ఇక్కడ
    బాబు : డాక్టర్ ని పిలవమంటావా మనమే డాక్టర్ దగ్గరికి వెళ్దామా

    *తండ్రి మూర్చపోయాడు*

    బాబు : పాపం నాన్నఅలిగాడెమో
    😂😂😂😂😂👏👏

  • Prev
  • Next