TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Young Politicians
యువరాజకీయ నాయకుల ధర్నా
" ఏమిట్రా దూరంగా జనం గుమిగూడి హడావుడి చేస్తున్నారు ? ఏమిటి విషయం ?"
అని సుధీర్ ను అడిగాడు చందు.
" వాళ్ళా...మన యువరాజకీయ నాయకులు. సినిమాలోను, వాల్ పోస్టర్ల పైన అర్థనగ్న
దృశ్యాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు " అని చెప్పాడు సుధీర్.
" అబ్బో...మన యువరాజకీయ నాయకులంటే ఏమిటో అనుకున్నా. పరువాలేదు
ఇలాంటి మంచి పనులు కూడా చేస్తున్నారన్నమాట " మెచ్చుకోలుగా అన్నాడు చందు.
" నీ బొంద...వాళ్ళు అర్థనగ్న దృశ్యాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారంటే దానిఅర్థం
పూర్తినగ్న దృశ్యాలు కావాలని " అని అసలు విషయం చెప్పాడు సుధీర్.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు చందు.