TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Wife and Husband Jokes in Telugu
భార్యతో విపరీతంగా గొడవ పెట్టుకున్న భర్త, పూజగదిలోకి వచ్చి దేవుడితో
మొరపెట్టుకున్నాడు.
" దేవుడా....నేను ఈ బాధలు భరించలేను. నన్ను తీసుకెళ్ళిపో.... " అని.
ఆ తరువాత నెమ్మదిగా భార్య కూడా పూజగదిలోకి వచ్చి, దేవుడి ముందు
నిలబడి " స్వామీ...నన్ను కూడా తీసుకుపో..." అని కోరుకుంది.
వెంటనే భర్త కొంచం తెలివిగా ఆలోచించి " పోనీలే స్వామీ...నన్నోద్దు...నా భార్యనే
తీసుకుపో..." అని కోరుకున్నాడు.
అది విని " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది భార్య.
**************
బెడ్ రూములో ఉన్న భర్త, తన భార్యను " కాంచన....కాంచన...కాంచన...." అని
మూడుసార్లు పిలిచిన, కాంచన పలకపోవడంతో కంగారుగా హాల్లోకి వచ్చి
చూస్తాడు.
కాంచన సోఫాలో కూర్చుని హాయిగా నవల చదువుతూ ఉంటుంది. " పిలిచినా
పలకకుండా అంత తీక్షణంగా చదువుతున్నావు ఏమిటే అది " అని కొంచం
కోపంగా అన్నాడు భర్త.
" అబ్బా....నన్ను కదిలించకండి...అసలే నేను " వర్షం కురిసిన రాత్రి "
చదువుతున్నాను " అని చెప్పి మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టింది ఆ భార్య.
" అదేగా నా కొంప ముంచింది " అని గబుక్కున అక్కడి నుండి
పారిపోయాడు భర్త.
" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆ భార్య.
*****************
ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్త, తన భార్యతో గర్వంగా తను చేసిన
ఘనకార్యం గురించి చెప్పాడు.
" ఏమే...నేనివాళ పదిరూపాయలు ఆదా చేశానే తెలుసా " అని.
కొంచం ఆశ్చర్యంగా " ఎలా...?" అని అడిగింది భార్య.
" ఆఫీసు నుండి వచ్చి బస్టాండ్ లో నుంచున్నా ! బస్ వచ్చింది. వరుసగా
అందరంఎక్కుతున్నాం !నా వద్దకు వచ్చేసరికి బస్ నిండిపోయింది.
వెళ్ళిపోయింది.నాకుకోపంవచ్చిదాని వెనకాలే పరుగెత్తుకొచ్చాను.
తెలియకుండానే ఇంటికి వచ్చేశాను! చూశావా నా తెలివి " అని గర్వంగా
కాలర్ ఎగిరేశాడు ఆ భర్త.
" ఏడిచినట్టు వుంది నీ తెలివి " అని వెటకారంగా అంది భార్య.
" అదేంటే ?" అని బుర్ర గీక్కున్నాడు.
" మరి లేకపోతే ఏంటండి...ఆ పరుగేదో ఏ టాక్సీ వెనుకో పరుగెడితే
వందరూపాయలు మిగులునుగా ! " అని కిచెన్ లోకి వెళ్ళింది భార్య.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు భర్త.