• Prev
  • Next
  • Telugu Jokes

    Telugu Jokes


    “ పతియే ప్రత్యక్ష దైవం " అంది కమల.

    “ ఎలా చెప్పగలవు ?” అడిగింది విమల.

    “ నిన్న నా బాయ్ ప్రెండ్ తో రూంలో వుండగా ఠక్కున ప్రత్యక్షమయ్యాడు ! ”

    అని నవ్వుతూ చెప్పింది కమల.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది విమల.

    **********************

    “ డార్లింగ్..పెళ్ళయ్యాక ఇలాగే ప్రేమిస్తావా ? ” అడిగింది స్రవంతి.

    “ తప్పకుండా డియర్. నాకు పెళ్ళయిన ఆడవాళ్లంటే తగని ఇష్టం” అని

    గబుక్కున నాలిక్కరుచుకున్నాడు మురళి.

    కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది స్రవంతి.

    ******************

    “ ఆర్టీసీలో ఏం ఉద్యోగం చేస్తున్నావురా ? ” అడిగాడు శంకరం.

    “ అడుక్కునే ఉద్యోగం. మరి నీవో ? ” అడిగాడు గోపాలం.

    “ అడుక్కునే వాడి దగ్గర గీక్కునే ఉద్యోగం" అని చెప్పాడు శంకరం.

    " అదేమి ఉద్యోగంరా " తెలియనట్టుగా అడిగాడు గోపాలం.

    " అదేరా డ్రైవర్ ఉద్యోగం !” అని జవాబిచ్చాడు శంకరం.

    " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు గోపాలం.

    *****************

    “ అందరికి నమస్కారం ! నా కుడి పక్కనున్న సర్పంచ్ గారు పొతే...పార్టీ పెద్దలు

    పరంధామయ్య గారు పొతే...హెడ్ మాస్టర్ గోపాలరావు గారు పొతే...మేడమ్

    పార్వతమ్మ గారు పొతే...” అని ఒక సభలో ఒక పెద్ద మనిషి ఉపన్యాసం

    యిస్తున్నాడు.

    ఈ పొతే...పొతే...అనే పదం వినీ వినీ అసహనంగా లేచిన ఒక వ్యక్తీ

    " అయ్యా !పొతే...పొతే.. అంటూ అందరిని పంపించి, వారితో పాటు మీరు

    పొతే...మేం కాస్త ఊపిరి పీల్చుకుంటాము " అంటూ అరిచాడు.

    అది విని అక్కడున్న వాళ్ళందరూ పకపక నవ్వతుంటే బిక్కమొహం

    వేసుకుని వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి.

    ******************

    “ కాస్త బువ్వెయ్యమ్మా!వచ్చే జన్మలో చచ్చి నీ కడుపున పుడ్తాను "

    అన్నాడు ముష్టివాడు.

    “ అంటే...వచ్చే జన్మలో నేను కూడా ముష్టిదాన్లా పుట్టాలనా నీ ఉద్దేశం !”

    కోపంగా అంటూ ముష్టి వేయడానికి వచ్చిన ఆ పెద్దావిడ, ముష్టి వేయకుండానే

    లోపలికి  వెళ్ళిపోయింది.

    దాంతో ఆ ముష్టివాడు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.


  • Prev
  • Next